తన బేబీ పుట్టే సమయం దగ్గరపడిందని ఈ తల్లికి తెలియనేలేదు!

Subscribe to Boldsky

అల్లరి పాప సుచికి అదితి మరియు సూర్య రాజ్ తల్లిదండ్రులు, అది కూడా చాలా సంతోషమైన కుటుంబానికి చెందినవారు. సుచి ప్రపంచంలోకి చాలా వేగంగా, తన తల్లికి పురిటినొప్పులు మొదలయ్యాయని కూడా వెంటనే తెలుసుకోలేనంత వేగంగా వచ్చేసింది.

అదితికి సులువైన ప్రెగ్నెన్సీయే గడిచిందని చెప్పాలు. ఆమె తను గర్భవతని 3,4 నెలలు నిండేవరకు అసలు తెలుసుకోలేకపోయింది కూడా. ఇది ఎందుకంటే ఆమె పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోం (లేదా పిసివోఎస్) మరియు దానివల్ల అసాధారణ నెలసరితో బాధపడుతూ ఉండేది.

real life story

నిజ జీవిత ప్రెగ్నెన్సీ గాథ

పొద్దునే వచ్చే వికారాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి, ఆమె చెప్తున్నదాని ప్రకారం మొత్తం కడుపుతో ఉన్న అన్ని నెలల్లో కేవలం ఐదుసార్లు మాత్రమే వాంతి చేసుకుందిట.

అందరికన్నా సులభమైన గర్భసమయం గడపటంతో ఆమె తన గర్భం గురించి ఎప్పుడూ విశ్రాంతిగా, ప్రశాంతంగానే ఉంది. వైద్యులు ఆమె రెగ్యులర్ చెకప్ సమయంలో బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉందని చెప్పేవారు. మరింకేం కావాలి తనకి!

బిడ్డ పుట్టే డెలివరీ సమయం దగ్గరపడింది

బిడ్డ పుట్టే డెలివరీ సమయం దగ్గరపడింది

ఆమె డెలివరీ రోజు ఆగస్టు 20, ఇంకా రెండు వారాలు ఉండి. ఆగస్టు 2 న ఆమె మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే తనకే ఏదో మార్పు అన్పించింది. తన కడుపు పట్టేసి,విడుదల అయి కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ అలానే జరగటం గమనించింది. ఆశ్చర్యపోయిన ఆమె అలా ఎన్నిసార్లు జరిగిందో లెక్కపెట్టి , అవి ఒకే విధంగా రావట్లేదని, 10 నుంచి 20 నిమిషాల తేడాతో వస్తున్నాయని గ్రహించింది.

ఆమె భర్త సూర్య రాజ్ ఆఫీసులో ఉన్నారు. వెంటనే అతనికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని, తనని ఆస్పత్రికి తీసుకెళ్లమని కోరింది. దగ్గర్లోనే పనిచేస్తున్న సూర్య పదినిమిషాల్లో వచ్చేసారు. వెంటనే వారు కార్లో ఆస్పత్రికి బయల్దేరారు.

ఆమెకి నకిలీ పురిటినెప్పులు వచ్చాయి

ఆమెకి నకిలీ పురిటినెప్పులు వచ్చాయి

ఆస్పత్రికి చేరాక, వైద్యులు అదితికి నకిలీ పురుటినొప్పులు లేదా బ్రాక్స్ తన్ హిక్స్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయని చెప్పారు. ఆమె గర్భాశయ ద్వారం ఇంకా మూసుకునే ఉందని, డెలివరీకి ఇంకా సమయం ఉన్నదని తెలిపారు. వైద్యులు ఆమెకి కొంచెం వేడినీరు తాగించి పడుకోమని చెప్పారు. అవి ఎలా వచ్చాయో అలానే పోయాయి.

రెండు రోజుల తర్వాత సూర్య ఆఫీసు పని మీద ముంబై వెళ్ళాల్సి వచ్చింది. అతను బేబీ వచ్చేముందే వచ్చేస్తానని ప్రమాణం చేసాడు. అదితి చెల్లిని పిలిపించి ఎమర్జెన్సీ కోసం తనతో ఉండమని చెప్పి వెళ్ళాడు.

నకిలీ పురిటినొప్పి…మళ్ళీ!

నకిలీ పురిటినొప్పి…మళ్ళీ!

దీన్ని విధి అంటారేమో తెలీదు కానీ, అదితికి మళ్ళీ ఒక రాత్రి ఈ నొప్పిలాంటి అనుభూతి కలిగింది. భయపడిన అదితి చెల్లెలు అంబులెన్స్ ను పిలిపించటంతో,ఇద్దరూ ఆస్పత్రికి వెళ్ళారు. హాస్పిటల్ లో వారికి ఇవి మళ్ళీ నకిలీ పురిటినొప్పులని చెప్పి ఇంటికి పంపించారు.

ఆ మరునాడు మధ్యాహ్నం అదితికి మళ్ళీ నొప్పి, కాంట్రాక్షన్స్ రావటం మొదలయింది. ఆమె దాన్ని నకిలీ నొప్పిగా భావించి, చెల్లెలు ఆందోళన పడుతుందేమో అని చెప్పలేదు. అవంతట అవే తగ్గేవరకు నిరీక్షించాలనుకుంది. ఎలాగో సూర్య తర్వాత రోజు పొద్దునే వచ్చేస్తాడు.కొంచెం వేడినీరు తాగి, స్నానం చేసింది. అక్కచెల్లెళ్ళు ఇద్దరూ కలిసి సినిమా కూడా చూసారు. కానీ ఆ సమయమంతా అదితి నొప్పితో అసౌకర్యంగా మెలికలు తిరుగుతూనే ఉంది.

ఈ సారి నిజమైన పురిటినొప్పే…

ఈ సారి నిజమైన పురిటినొప్పే…

అదితి చెల్లెలు తనని చూసి ఏమైందని అడిగింది. అదితి తనకి మళ్ళీ నకిలీ నొప్పులు వస్తున్నాయని చెప్పింది. ఎంతసేపటి నుంచి అని అడిగితే అదితి 4-5 గంటలుగా అని సమాధానమివ్వటంతో ఆమె చెల్లెలు షాక్ అయి వెంటనే ఆస్పత్రికి వెళ్దామని చెప్పింది.

అదితి ఒప్పుకోలేదు, క్రితం రోజునే వెళ్ళి తిరిగొచ్చారు కదా మరి. కానీ ఆమె చెల్లెలు ఒప్పుకోలేదు. అదితి ఇంకొక రెండు గంటలు ఆగి అప్పటికి కూడా నొప్పులు తగ్గకపోతే హాస్పిటల్ కి వెళ్దామని చెప్పింది.

అదుగో తన ఆనందాలను తెచ్చే పాపాయి వచ్చేసింది..

అదుగో తన ఆనందాలను తెచ్చే పాపాయి వచ్చేసింది..

ఒక గంట మాత్రమే గడిచింది, ఇక నొప్పులు అదితి అస్సలు తట్టుకోలేకపోయింది. అంబులెన్స్ ను పిలిచి మళ్ళీ ఒకసారి ఆస్పత్రికి పరిగెత్తారు. వైద్యులు అదితిని పరీక్షించి గర్భాశయ ద్వారం అప్పుడే 10 సెం.మీలు తెరుచుకుందని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఆమెను లేబర్ రూంకి తరలించిన వెంటనే ఐదునిమిషాల్లోనే అదితి ఆరోగ్యకరమైన 3 కిలోలున్న పాపాయికి జన్మనిచ్చింది.

సూర్య నేరుగా ఎయిర్ పోర్టునుండి ఆస్పత్రికే తన పాపను చూడటానికి వచ్చేసాడు. ఎంత సంతోషంగా ఉన్నా తమ మొదటిబిడ్డ పుట్టినపుడు తన భార్యతో లేనని పశ్చాత్తాపపడ్డాడు కూడా. వారు తమ పాపకి సుచి అని పేరు పెట్టారు. సుచి ఇప్పుడు 20 నెలల వయస్సున్న అల్లరి పాప. అల్లరి, అసహనం తనకి పుట్టుకతోనే వచ్చాయిగా మరి!

నీతి ; కొన్నిసార్లు, మీ శరీరం చెప్పేది వినటం ముఖ్యం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Pregnancy Real Life Story: She Delivered Within 5 Minutes In The Labour

    Here is a real-life story of a mother who didn't know that she was actually going through the labour pain and later delivered her baby within five minutes into the labour ward.
    Story first published: Friday, December 29, 2017, 12:45 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more