For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెర్మ్ కౌంట్ పెంచి పిల్లలు పుట్టేందుకు సహాయపడే ఆహారాలు

By Lekhaka
|

ఇన్ఫెర్టిలిటీ అనేది ఇప్పుడు సాధారణంగా వినిపిస్తున్న సమస్య. దీనికి చాలా కారణాలున్నాయి. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ అని చెప్పవచ్చు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్, ఒత్తిడి, పొగత్రాగడం, పనిలో ఒత్తిడి.. ఇవన్నీ ప్రత్యుత్పత్తి లేకపోవడానికి కారణాలు.

ఇలాంటి కేసులు పెరగడానికి మరో కారణమేంటంటే.. పోషకాహారం తీసుకోకపోవడం. జింక్, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ సరైన మోతాదులో తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ బావుంటుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఎక్కువ వాడటం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తో పాటు క్వాలిటీ తగ్గిపోవడానికి కారనమవుతున్నాయి.

మగవాళ్లు, ఆడవాళ్లలో ఇన్ఫెర్టిలిటీకి నిత్యం తీసుకుంటున్న కెమికల్ ఫుడ్సే కారణమని తెలుస్తోంది. కాబట్టి బయట ఫుడ్ తీసుకోవడం మానేయాలి. అంతేకాదు కూరగాయలు, పండ్లు తినేముందు శుభ్రం చేయడం చాలా అవసరం.

స్పెర్మ్ కౌంట్ పెంచి పిల్లలు పుట్టేందుకు సహాయపడే ఆహారాలు

స్పెర్మ్ కౌంట్ ను తగ్గించడంలో కొన్ని రకాల ఆహారాల నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, ఆహారాలు పండించడానికి ఉపయోగించే మందులు, స్మోకింగ్, ఆల్కహాల్, కొన్ని ప్రత్యేకమైన థెరఫిటిక్ డ్రగ్స్ వంటివి తీవ్రప్రభావాన్ని చూపుతాయి. ఇంాక పోషకాహార లోపం, ఫైబర్ సరిపడా అందకపోవడం కూడా స్పెర్మ్ కౌంట్ ను తగ్గించడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి.

కొన్ని పరిశోధనల ప్రకారం కొన్ని హెల్తీ మైక్రోన్యూట్రీషియన్స్, విటమిన్ సి, ఇ, ఫోలిక్ యాసిడ్ మరియు జింక్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల స్పెర్మ్ డిఎన్ఎ క్వాలిటీని మెరుగుపరుస్తుంది. హెల్తీ డైట్ వల్ల స్పెర్మ్ కౌంట్ వ్రుద్ది చెందుతుంది. అలాగే వీర్యం వాల్యూమ్ కూడా పెరుగుతుంది. మరి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచే హెల్తీ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ....

ఓయిస్ట్రెస్:

ఓయిస్ట్రెస్:

ఇవి ఒక విచిత్రమైన టేస్ట్ ను కలిగి ఉంటాయి. ఇవి చూడటానికి కూడా విచిత్రంగా ఉంటాయి కానీ, ఇందులో ఉండే మోనోసాచురేటెడ్ ఆయిల్స్ ఆరోగ్యానికి, లైంగిక జీవితానికి బాగా సహాయపడుతాయి.ఓయిస్ట్రెస్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఈ జింక్ పురుషుల్లో టెస్టోస్టెరోన్ లెవల్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. దాంతో స్పెర్మ్ ఉత్పత్తి పెరిగి క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ లో ఉల్లాస-ఉత్సహపరిచే పదార్థలు ఉంటాయి. వీటని ఎల్ -ఆర్జినైన్ హెచ్ సిఎల్ అంటారు. ఇది సెమన్ వాల్యూన్ పెంచడానికి సహాయపడుతుంది . డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాపడుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి, స్పెర్మ్ క్వాలిటీని స్ట్రాంగ్ గా మార్చడానికి సహాయపడుతుంది. ఇంకా వెల్లుల్లి ఉండే విటమిన్ బి6, సెలీనియం వంటి కాంపౌంట్స్ సెక్స్ హార్మోనులను తిరిగి ఉత్పత్తి అయ్యేలా క్రమబద్దం చేస్తుంది . మరియు స్పెర్మ్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో బ్రొమైలిన్ అధికంగా ఉంటుంది . ఈ ఎంజైమ్ సెక్స్ హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది. ఇంకా అరటిపండ్లలో విటమిన్ ఎ, బి1 మరియు సిలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ స్పెర్మ్ ప్రొడక్షన్ ను మెరుగుపరచడంతో పాటు స్టామినా పెంచుతుంది. స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

పురుషుల్లో విటమిన్ ఎ లోపిస్తే ఫెర్టిలిటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. విటమిన్ ఎ తక్కువ కాకుండా చూసుకోవాలి. అందుకోసం బ్రొకోలి, రెడ్ పెప్పర్, ఆకుకూరలు, ఆప్రికాట్ స్వీట్ పొటాటో, క్యారెట్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి

ఆస్పరాగస్ :

ఆస్పరాగస్ :

ఆస్పరాగస్ మరో హెల్తీ వెజిటేబుల్, ఇది ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి , స్పెర్మ్ సెల్స్ కు రక్షణ కల్పిస్తుంది. స్పెర్మ్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

వాల్ నట్స్:

వాల్ నట్స్:

వాల్ నట్స్ లో ఆర్గినైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సెమన్ వాల్యూమ్ ను మెరుగుపరచడంలో మరియు స్పెర్మ్ ఉత్పత్తి అవ్వడానికి సహాయపడుతుంది. మరియు ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది పీనిస్ కు బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది .వాల్ నట్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వివిధ రకాల వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి సహాయపడుతుంది.

ఫ్లాక్స్ సీడ్స్,

ఫ్లాక్స్ సీడ్స్,

ఫ్లాక్స్ సీడ్స్, సాల్మన్ ఫిష్, ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పొందవచ్చు. స్పెర్మ్స్ పోషకాలు, ఫ్యాట్స్ ద్వారా తయారవుతాయి. ఫ్యాటీ యాసిడ్ ఆధారంగా స్పెర్మ్ క్వాలిటీ ఉంటుంది. ఫ్యాట్స్ కంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుంది.

English summary

Watch: 8 Fabulous Foods To Boost His Sperm Count And Increase Your Chance Of Conceiving

Watch: 8 Fabulous Foods To Boost His Sperm Count And Increase Your Chance Of Conceiving. Read on to know more about..
Desktop Bottom Promotion