గర్భధారణ సమయంలో వచ్చే ఎక్కిళ్ళను ఆపటానికి సులభ చిట్కాలు

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

ఎక్కిళ్లను నిత్యజీవితంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మనం చాల ఇబ్బందికి లోనవుతాం. తినే సమయంలో ఎక్కిళ్ళు వస్తే ఆ బాధ మాటల్లో చెప్పలేం, ఆ సమయం లో తృప్తిగా తినటం కూడా వీలు అవదు. సాధారణ వ్యక్తుల్లో ఓకే..కానీ గర్భిణీ స్త్రీలలో ఎక్కిళ్ళు వస్తే పరిస్థితి ఏంటి? గర్భిణీలు ఎక్కిళ్ళు నుండి బయట పడటం ఎలా?

మహిళ గర్భవతి అయితే , చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో ఎక్కిళ్ళ గురించి చర్చించుకుంటూ ఉంటే మీకు విచిత్రంగా ఉండవచ్చు. అయితే గర్భధారణ సమయంలో చాలా మందికి మొదటి త్రైమాసికంలో ఎక్కిళ్ళు వస్తాయి. ఈ ఎక్కిళ్ళు రెండొవ మరియు మూడోవ త్రైమాసికంలో కూడా ఉండవచ్చు. మీరు శిశువులో కూడా ఎక్కిళ్ళు రావటాన్ని గమనించవచ్చు.

గర్భిణీ స్త్రీలకు ఎక్కిళ్ళు వస్తాయా? అవును, మహిళ శరీరంలో జరిగే మార్పులు మరియు సహజంగా వచ్చే ఎక్కిళ్ళను ఏమి చేయలేము. ఒక వ్యక్తికి స్వరపేటిక మరియు డయాఫ్రమ్ యొక్క అసంకల్పిత సంకోచం కారణంగా ఎక్కిళ్ళు వస్తాయి. నిజానికి ఎక్కిళ్ళు శరీరంలోకి గాలి తీసుకున్నప్పుడు బ్లాక్ అయితే వస్తాయి. తమ జీవితంలో ప్రతి వ్యక్తి ఎదో ఒక సమయంలో ఎక్కిళ్ళను పొందుతాడు. చాలా సందర్భాలలో ఎక్కిళ్ళు ఒక నిమిషంలో తగ్గిపోతాయి.

గర్బిణీలు పచ్చి ఉల్లిపాయలు తినడం ఎంతవరకు సురక్షితం..?

మీరు ప్రారంభ గర్భంలో ఎక్కిళ్ళు పొందుతున్నారా? అవును, గర్భధారణ సమయంలో ఎక్కిళ్ళను ఎప్పుడైనా పొందవచ్చు. గర్భధారణ సమయంలో ఎక్కిళ్ళ గురించి మరి కొంచెం వివరంగా తెలుసుకుందాం....

1. గర్భధారణ సమయంలో వచ్చే ఎక్కిళ్ళకు అర్ధం ఏమిటి?

1. గర్భధారణ సమయంలో వచ్చే ఎక్కిళ్ళకు అర్ధం ఏమిటి?

ఏమి లేదు. ప్రతి వ్యక్తికి ఎక్కిళ్ళు వస్తాయి. కానీ సాధారణం కంటే ఎక్కువ కావచ్చు. అయితే మీకు గాని శిశువుకి గాని ఎటువంటి ప్రమాదం ఉండదు. శరీరంలో హార్మోన్ల అసమతౌల్యం కారణంగా వచ్చే మార్పు వలన జరగవచ్చని గుర్తుంచుకోండి.

2. గర్భధారణ సమయంలో ఎక్కిళ్ళు సాధారణమేనా?

2. గర్భధారణ సమయంలో ఎక్కిళ్ళు సాధారణమేనా?

ఖచ్చితంగా, చాలా మందికి గర్భధారణ సమయంలో ఎక్కిళ్ళు వస్తాయి. అయితే కొంత మందికి ఎక్కిళ్ళు రావు. అది తల్లిపై ఆధారాపడి ఉంటుంది.

గర్భిణీలు బీట్ రూట్ ఖచ్చితంగా తినడానికి ఫర్ఫెక్ట్ రీజన్స్

3. గర్భధారణ సమయంలో వచ్చే ఎక్కిళ్ళను ఆపటానికి 7 మార్గాలు

3. గర్భధారణ సమయంలో వచ్చే ఎక్కిళ్ళను ఆపటానికి 7 మార్గాలు

గర్భధారణ సమయంలో ఎక్కిళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఎక్కిళ్ళు రావటం మంచిది కాదు. శిశువుకి మీ అవసరం చాలా ఉంటుంది. అందువల్ల ఇటువంటి లక్షణాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కిళ్ళు ఆపడానికి కొన్ని మంచి మార్గాలు ఉన్నాయి.

4. పంచదార

4. పంచదార

నోటిలో ఒక స్పూన్ పంచదార వేసుకుంటే ఎక్కిళ్ళు తగ్గటానికి సహాయపడుతుంది. శాస్త్రీయంగా నిరూపణ లేనప్పటికీ, ఈ కణజాలములు ఎసోఫాగస్ "రీసెట్" కు సంకోచాలను ఆపటానికి కారణం అవుతాయి. సగటు వ్యక్తి కంటే ఎక్కువ ఎక్కిళ్ళతో బాధ పడుతూ ఉంటే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

5. ఐస్ కోల్డ్ వాటర్

5. ఐస్ కోల్డ్ వాటర్

మీరు ఐస్ కోల్డ్ వాటర్ ని నిదానంగా సిప్ చేయాలి. నీటి సంకోచాలు విశ్రాంతిని కలిగించేలా చేస్తుంది. అలాగే ఎక్కిళ్ళకు ముగింపు పెట్టటానికి సహాయపడుతుంది.

6. శ్వాసను బిగపెట్టుట

6. శ్వాసను బిగపెట్టుట

సాధారణంగా శ్వాసను 20 నిమిషాల పాటు బిగబట్టి ఉంచాలి. ఈ విధంగా వరుసగా 3 నుంచి 4 సార్లు చేయాలి. ఇది ఎక్కిళ్ళను ఆపటానికి సహాయపడుతుంది. శ్వాసను బిగపెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

7. నిమ్మకాయ

7. నిమ్మకాయ

నిమ్మకాయలో ఉండే పులుపు ఎక్కిళ్ళను ఆపటానికి సహాయపడుతుంది. నిమ్మకాయ ముక్కను నాకితే గర్భధారణ సమయంలో ఎక్కిళ్ల సమస్య ఉండదు.

గర్భధారణ సమయంలో చిటికెడు బెల్లం తింటే పొందే వండలర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్

8. లీన్ ఫార్వర్డ్

8. లీన్ ఫార్వర్డ్

ఛాతీని ముందుకు కుదించటం అనేది ఎక్కిళ్ళు ఆగటానికి మంచి చిట్కా. ఈ పద్ధతి ఎక్కువ సమయం పనిచేస్తున్నప్పుడు చేయాలి. అయితే ప్రయత్నించటానికి మొదటి ఎంపిక మాత్రం కాదు.

9. మింగడం మరియు ఒత్తిడి

9. మింగడం మరియు ఒత్తిడి

మింగడం మరియు మీ ముక్కుపై ఒత్తిడి తేవాలి. ఈ పద్ధతి ఎందుకు పని చేస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఖచ్చితంగా సైన్స్ తెలియదు. కానీ ఈ పద్దతి బాగా పనిచేస్తుంది. ప్రయత్నించి చూడండి.

10. తేనే

10. తేనే

ఒక స్పూన్ తేనే తీసుకోవాలి. ఇది మొదటి చిట్కా పంచదార వలే పనిచేస్తుంది. కానీ తేనే గొంతు అంగిలిని పట్టుకొని ఉంటుంది. మీరు తేనె యొక్క అధిక ప్రయోజనాలను పొందాలని అనుకుంటే మంచి ఆర్గానిక్ తేనెను ఎంచుకోండి.

English summary

Ways to Stop Hiccups During Pregnancy

Sure. Many women find that they hiccup a lot more when they’re pregnant. But some women won’t have hiccups at all, so it’s all dependent on themother. It was cute at first, but now you’re finding that hiccups during pregnancy are no fun at all. You have enough trouble sleeping, and the hiccups aren’t making matters any better. The truth is you want to have your baby already and rid yourself of all these odd symptoms.
Story first published: Tuesday, October 17, 2017, 10:15 [IST]
Subscribe Newsletter