Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భధారణ సమయంలో పొట్ట ఉదరంలో నొప్పికి కారణాలు!
మహిళ గర్భం పొందిన తర్వాత రోజులు గడిచే కొద్ది యూట్రస్ పెద్దగా విస్తరించడం ప్రారంభం అవ్వడం వల్ల, అది మలబద్దకం, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది.
మహిళలకు గర్భం పొందడం ఒక వరం. గర్భం పొందిన తర్వాత మహిళ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకు ముఖ్య కారణం హార్మోనుల ప్రభావం. కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా వస్తాయి. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య వచ్చినా డాక్టర్ ను సంప్రదించాలి. పొట్ట ఉదరంలో నొప్పిగా ఉంటే వెంటనే డాక్టర్ ను కలవాలి. గర్భధారణ సమయంలో అజీర్ణం వల్ల లేదా ఎసిడిటి వల్ల పొట్ట ఉదరంలో నొప్పి వస్తే ఎలాంటి సమస్య ఉండదు.
అయితే, నొప్పి తీవ్రత పెరిగితే మాత్రం సీరియస్ గా తీసుకోవాలి. గర్భం పొందిన మొదటి మూడు నెలల్లో కొంత మంది మహిళలు పొట్టలో చిన్న పాటి నొప్పిని కలిగి ఉంటారు.

మహిళ గర్భం పొందిన తర్వాత రోజులు గడిచే కొద్ది యూట్రస్ పెద్దగా విస్తరించడం ప్రారంభం అవ్వడం వల్ల, అది మలబద్దకం, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అయితే రెండు మరియు మూడవ త్రైమాసికంలో ఇలాంటి లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి లేదు..గర్భిణీలలో నిర్లక్ష్యం చేయకూడని కొన్ని అనారోగ్య లక్షణాలు..

తరచూ మూత్ర విసర్జన?
తరచూ మూత్ర విసర్జన చేయడం, దురద, యోనిలో మంటగా అనిపించడం వంటి లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను కలిసి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయిందేమో చెక్ చేయించుకోవాలి.

బ్లీడింగ్ ?
గర్భం పొందిన తర్వాత, పొట్ట ఉదరంలో నొప్పితో పాటు, రక్తస్రావం జరిగితే, పొట్ట ఉదరంలో తిమ్మెర్లుగా అనిపిస్తే , అది అబార్షన్ కు సంకేతంగా గుర్తించి వెంటనే మీ గైనకాలజిస్ట్ ను కలవాలి.

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ(గర్భాశయంలో కాకుండా, ఫెలోపియ్ ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని ఎక్టోపిక్ పెగ్నెన్సీ అని అంటారు)వల్ల పొట్ట ఉదరంలో నొప్పి, 6-10వారాల్లో బ్లీడింగ్ జరుగుతుంది.

యూట్రస్
కొంత మందిలో, యూట్రస్ వాల్స్ యొక్క ప్లాసెంటా చీలడం ప్రారంభమైనప్పుడు, పొట్ట ఉదరంలో నొప్పి క్రమంగా పెరుగుతుంది.

పీటర్మ్ లాబర్?
గర్భదారణ చివరి రోజుల్లో పొట్టనొప్పి ఎక్కువగా ఉంటే అది ప్రసవించడానికి ముందస్తు సంకేతాలుగా గుర్గించాలి.



Click it and Unblock the Notifications