మాటిమాటికీ గర్భస్రావం ఎందుకు జరుగుతుంది?తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి!

Posted By:
Subscribe to Boldsky

కొంత మంది మహిళలకు పెళ్లయి సంవత్సరం , రెండేళ్ళలోనే రెండు మూడు సార్లు గర్భస్రావం జరుగుతుంటుంది. ప్రతిసారీ మూడునెలలలోపు గర్భస్రావం జరుగుతుంటుంది. కొంత మంది డాక్టర్‌ను సంప్రదిస్తే అన్ని పరీక్షలు చేసి అంతా నార్మల్‌ ఉంది అంటుంటారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కాక చాల మంది మహిళలు ఆందోళకు గురి అవుతుంటారు. మళ్లీ గర్భం దాల్చినా అదేవిధంగా అవుతుందేమోనని ఆందోళన పడుతుంటారు.మాటిమాటికీ గర్భస్రావం ఎందుకు జరుగుతుంది?

గర్భస్రావం ప్రారంభ లక్షణాలు తెలుసుకోండి..!

మహిళలో తరచూ గర్భస్రావం అవుతుంటే అది వారిని మానసికంగా దెబ్బతీసి, మరోసారి గర్భం వచ్చినప్పుడు అది నిలుస్తుందా లేదా అన్న ఆందోళనను కలగజేస్తుంది. గర్భం వచ్చిన తర్వాత రెండు లేదా అంతకు ఎక్కువసార్లు గర్భస్రావం జరిగితే దాన్ని 'రికరెంట్‌ ప్రెగ్నెన్సీ లాస్‌' లేదా 'హ్యాబిచ్యువల్‌ అబార్షన్స్‌' అంటారు. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కు కొన్ని సీరియస్ కారణాలు కూడా ఉన్నాయి. అవి..

 క్రోమోజోములు లేదా జన్యువుల అసాధారణత్వం వల్ల

క్రోమోజోములు లేదా జన్యువుల అసాధారణత్వం వల్ల

చాలా సందర్భాల్లో క్రోమోజోములు లేదా జన్యువుల అసాధారణత్వం వల్ల లేదా అండం, శుక్రకణాల్లో వేటిలోనైనా అసాధారణత్వం ఉండటం వల్ల ఇలా తరచూ గర్భస్రావం జరిగే అవకాశాలుంటాయి.

కడుపులోని బిడ్డకు స్కానింగ్ వల్ల కలిగే డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్

గర్భాశయంలో అసాధారణత్వాల వల్ల గర్భస్రావం

గర్భాశయంలో అసాధారణత్వాల వల్ల గర్భస్రావం

గర్భాశయంలో అసాధారణత్వాలు అంటే ఉదాహరణకు రెండు గదులుగా ఉండటం లాంటివి

గర్భాశయంలో కణుతులు, పాలిప్స్‌

గర్భాశయంలో కణుతులు, పాలిప్స్‌

గర్భాశయంలో కణుతులు, పాలిప్స్‌ కారణాల వల్ల గర్భస్రావం జరుగుతుంది

సర్విక్స్‌ బలహీనంగా ఉండటం వల్ల

సర్విక్స్‌ బలహీనంగా ఉండటం వల్ల

సర్విక్స్‌ బలహీనంగా ఉండటం వల్ల గర్భస్రావం జరుగుతుంది

యాంటీఫాస్ఫోలిపిడ్‌ సిండ్రోమ్‌

యాంటీఫాస్ఫోలిపిడ్‌ సిండ్రోమ్‌

యాంటీఫాస్ఫోలిపిడ్‌ సిండ్రోమ్‌ (ఏపీఎస్‌) వంటి వ్యాధులు.

కొన్ని రకాల ఆటోఇమ్యూన్‌ వ్యాధులు

కొన్ని రకాల ఆటోఇమ్యూన్‌ వ్యాధులు

కొన్ని రకాల ఆటోఇమ్యూన్‌ వ్యాధులు (ఉదాహరణకు సిస్టమిక్‌ లూపస్‌ అరిథమెటోసిస్‌)

డయాబెటిస్, థైరాయిడ్‌ సమస్య

డయాబెటిస్, థైరాయిడ్‌ సమస్య

∙కొన్ని రకాల ఎండోక్రైన్‌ వ్యాధులు (ఉదాహరణకు డయాబెటిస్, థైరాయిడ్‌ సమస్య వంటివి)

వైరల్‌ ఇన్ఫెక్షన్లు వల్ల కూడా గర్భస్రావం జరుగుతుంది

వైరల్‌ ఇన్ఫెక్షన్లు వల్ల కూడా గర్భస్రావం జరుగుతుంది

కొన్ని రకాల సాధారణ, వైరల్‌ ఇన్ఫెక్షన్లు వల్ల కూడా గర్భస్రావం జరుగుతుంది

చాలా సందర్భాల్లో ఏ విధమైన కారణం లేకుండా కూడా గర్భస్రావం

చాలా సందర్భాల్లో ఏ విధమైన కారణం లేకుండా కూడా గర్భస్రావం

పైన పేర్కొన్న వైద్యపరమైన సమస్యలతో పాటు మద్యం, పొగతాగడం వంటి అలవాట్ల వల్ల గర్భాస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి.

అయితే చాలా సందర్భాల్లో ఏ విధమైన కారణం లేకుండా కూడా గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయి.

ఆహరం:

ఆహరం:

గర్భస్రావం తరువాత మీరు ఆరోగ్యాన్ని రక్షించుకొవడంలో మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టడం కూడా చాలా అవసరం. మీరు ఒక నిపునుడిని, అన్ని విషయాలు తెలిసిన వైద్యుడిని, అలాగే ఆహార నిపుణుడి సలహా కూడా తీసుకోండి.

విశ్రాంతి తీసుకోవడం:

విశ్రాంతి తీసుకోవడం:

గర్భస్రావం తరువాత మీ శరీరానికి విశ్రాంతి అవసరం కనుక గర్భస్రావం జరిగిన తరువాత 24 గంటల వరకు పూర్తి విశ్రాంతి అవసరం. తరువాతి ఐదు రోజుల వరకు మీ శరీర ఉష్ణోగ్రతను గమనించి, రికార్డ్ చేసుకోండి. ఉష్ణోగ్రత 100 డిగ్రీల F ఉంటె ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. రక్తస్రావం తగ్గేదాకా లేదా ఆగేదాకా మందులు, పాడ్స్ వాడండి. గర్భస్రావం తరువాత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యమైన విషయం.

శారీరిక శ్రమను తగ్గించండి/మానుకోండి:

శారీరిక శ్రమను తగ్గించండి/మానుకోండి:

గర్భస్రావ౦ వల్ల శరీరం, మనసూ రెండు వత్తిడికి గురవుతాయి. ఎక్కువ పనితో మీ శరీరాన్ని మీరు అలసట చేసుకోకండి. దీనివల్ల అధిక రక్తస్రావం, అలాగే ఇతర శారీరిక సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువ బరువులు మోయకండి. తరచుగా ముందుకు వంగడం మానేయండి.

మీ ఆలోచనలను మీ భర్తతో పంచుకోండి:

మీ ఆలోచనలను మీ భర్తతో పంచుకోండి:

గర్భస్రావం అనేది మీకేకాదు మీ భర్తకు కూడా మానసిక వేదనే. మీరు మీ ఆలోచనలను మీ భర్తతో పంచుకుని వత్తిడిని తగ్గించుకోండి. దీనివల్ల చివరగా మీరు మంచి భావనను పొందుతారు. ఎలాంటి పరిస్థితులలో అతనిని వంటరిగా వదలొద్దు. మనసులోని ఆలోచనలను పంచుకోవడం వల్ల మీకు మీ భర్తకు మధ్య మంచి అవగాహన అభివృద్ది చెందుతుంది.

English summary

What is recurrent miscarriage?Reasons for recurrent miscarriage!

If you have three or more miscarriages in a row, doctors call it recurrent miscarriage. If you have experienced recurrent miscarriage, your GP or midwife will refer you to a gynaecologist. Your gynaecologist will try to identify the reason for your losses.Having miscarriage after miscarriage may leave you feeling utterly drained of hope. At times, it may be hard to keep trusting in the future.
Subscribe Newsletter