For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు లేరని బాధపడుతున్నారా..? గర్భధారణకు సరైన సమయం ఏంటో తెలుసుకోండి..!?

|

గర్భధారణకు సరైన సమయం ఏదీ అనే విషయంలో చాలామందికి సందేహం ఉంటుంది. స్వాభావికంగా మహిళల్లో ముప్పయి ఏళ్ల లోపు గర్భధారణ జరిగితే చాలావరకు అన్నీ సజావుగా జరిగిపోతాయి. కాకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ముప్పులు (రిస్క్‌ఫ్యాక్టర్స్‌) పెరుగుతుంటాయి. సాధారణంగా 35 ఏళ్ల తర్వాత జరిగే గర్భధారణల్లో పుట్టబోయే పిల్లల్లో అనేక ఆరోగ్యపరమైన రిస్క్‌లతో పాటు అబార్షన్స్‌కు అవకాశం ఎక్కువ.

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యకరమైన అండం విడుదల సక్రమంగా జరగదు. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ అండం విభజన అంత సక్రమంగా ఉండదు. దాంతో క్రోమోజోముల సంఖ్యలో విభజన సక్రమంగా జరగదు. దాన్ని నాన్‌డిస్‌జంక్షన్‌ అంటారు. దాంతో పెద్దవయసులోని మహిళల సంతానంలో డౌన్స్‌ సిండ్రోమ్‌ వంటివి రావచ్చు. అందుకే 35 ఏళ్లు దాటిన మహిళల్లో గర్భధారణ తర్వాత క్రమం తప్పకుండా డాక్టర్స్‌ను సంప్రదిస్తూ మరింత జాగ్రత్తగా ఉండాలి.

అబార్షన్స్‌ రిస్క్‌ ఎక్కువ...
మామూలుగా ఇరవైలలో ఉన్న మహిళల్లో 20 వారాల తర్వాత జరిగే అబార్షన్స్‌ 12% నుంచి 15% ఉంటాయి. అదే 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న మహిళలకు 20 వారాల తర్వాత అబార్షన్‌ అయ్యే అవకాశాలు 25% ఉంటాయి.

ఇతర సమస్యలు...
మహిళల్లో 30 ఏళ్లు దాటాక అధిక రక్తపోటు, డయాబెటిస్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గర్భధారణపై కూడా ప్రభావం చూపవచ్చు.పెద్ద వయసు మహిళల్లో పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంది. ముప్పయయిదేళ్లు దాటిన మహిళల్లో సహజ ప్రసవం జరిగే అవకాశాలు తగ్గుతాయి. సిజేరియన్‌ చేయాల్సిన సందర్భాలే ఎక్కువ.

కాబట్టి, లేటువయస్సులో పెళ్ళైన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదట సంతానానికి ప్రాధాన్య ఇవ్వండి,. గర్భధారణకు ముందు అది చాలా సులువైన పనిగా అనిపిస్తుంది. కానీ.. ప్రెగ్నెన్సీకి ముందు మగవాళ్లు, ఆడవాళ్లు చాలా ఎఫర్ట్ పెట్టినప్పుడే ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కపుల్స్ లైఫ్ లో ప్రెగ్నెన్సీ అనేది ముఖ్యమైనది. కాబట్టి ఇద్దరూ తమ అలవాట్లలో చాలా మార్పులు తీసుకురావాలి. మహిళలు ఈ బాధ్యతను కాస్త సీరియస్ గా తీసుకోవాలి.

కనీసం కొన్ని నెలల ముందైనా..మైండ్, శరీరాన్ని ప్రెగ్నన్సీకి సిద్ధం చేసుకోవాలి. ప్రెగ్నన్సీ కావడానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను మైండ్ లో పెట్టుకోవాలి, కొన్ని అలవాట్లు అలవరుచుకోవాలి. మరి ప్రెగ్నన్సీకి ముందు.. ఏం చేయాలో తెలుసుకుందాం..

ప్రీనేటల్ చెకప్

ప్రీనేటల్ చెకప్

గర్భం పొందాలి అనుకోవడానికి ముందు.. మీ హెల్త్ కండిషన్ ని ఒకసారి చెక్ చేయించుకోవాలి. మీ మెడికల్ హిస్టరీ గురించి.. డాక్టర్ ని వివరించడం, మెడిసిన్స్ గురించి తెలపడం చాలా అవసరం.

జెనెటిక్ కెరీర్ టెస్ట్

జెనెటిక్ కెరీర్ టెస్ట్

ఒకవేళ మీకు ఏవైనా వ్యాధులు ఉన్నాయా లేదా మీ పేరెంట్స్ లో ఎవరికైనా ఉన్న వ్యాధులు మీకు వచ్చే అవకాశం ఉందా అన్న విషయాన్ని ఈ జెనెటిక్ కెరీర్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ ఈ టెస్ట్ చేయించుకోవడం అవసరం. ఈ టెస్ట్ చేయించుకుంటే.. హెల్తీ బేబీని పొందడానికి అవకాశం ఉంటుంది.

చెడు అలవాట్లు

చెడు అలవాట్లు

స్మోకింగ్, డ్రింకింగ్ వంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని కన్సీవ్ అవడానికి ముందు మానేయడం చాలా అవసరం. అలాంటి అలవాట్లు.. పొట్టలో పెరిగే గర్భస్థ శిశువుకి హాని చేస్తాయి.

ప్రాసెస్డ్ ఫుడ్స్

ప్రాసెస్డ్ ఫుడ్స్

గర్భధారణ సమయంలో అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ హానిచేస్తాయి. అలాగే.. బయట వీధుల్లో, బండ్లపై ఆహారాలు తీసుకోవడం మానేయాలి.

కాఫీ మానేయాలి

కాఫీ మానేయాలి

కొద్ది మోతాదులో కెఫీన్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ.. ఎక్కువ మోతాదులో ప్రెగ్నన్సీ టైంలో, ప్రెగ్నన్సీకి ముందు కాఫీ తీసుకోవడం మంచిది కాదు. అలాగే ప్రెగ్నన్సీ టైంలో కెఫీన్ కి పూర్తీగా దూరంగా ఉండటం మంచిది.

యాక్టివ్ గా ఉండటం

యాక్టివ్ గా ఉండటం

ప్రెగ్నంట్ అవడానికి ముందు.. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకోవాలి. రెగ్యులర్ గా వర్కవుట్ చేయడం చాలా అవసరం.

రిలాక్సేషన్

రిలాక్సేషన్

ప్రెగ్నన్సీ టైంలో.. ఎమోషనల్ గా చాలా హ్యాపీగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువగా ఒత్తిడికి లోనవకూడదు. ఒత్తిడి లేకుండా.. రిలాక్స్ గా ఉండటం వల్ల.. హెల్తీ బేబీని పొందుతారు.

English summary

What Is The Right Age To Get Pregnant?

Just like how there is an age for falling in love and marriage, there is also a best time to conceive. Many women of the older generation state and advice the newly wed to have a baby before 30 as the body is flexible enough and the chances of vaginal pregnancy is more.