గర్భిణీ స్త్రీలు పచ్చి మాంసం తినడం, పిల్లులతో ఆడుకోవడాన్ని ఎందుకు మానుకోవాలి ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

గర్భిణీ స్త్రీ లు ఎందుకు పచ్చి మాంసం తినడాన్ని మానుకోవాలి ? వివిధ రకాలైన సూక్ష్మ క్రిములు వాటిలో ఉంటాయి. అవి చాలా మట్టుకు పరాన్నజీవులు అయి ఉంటాయి. అవి మిగతా జంతువులూ లేదా మనుష్యులు పై ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. అవి మనకంటికి కనపడవు. అందుమూలంగానే అవి మనపై ఆధారపడి బ్రతుకుతున్నా మనకు ఆ విషయం తెలీదు.

కానీ మనం తరచూ అనారోగ్యానికి గురౌతుంటే, మన ఆరోగ్యాన్ని పరాన్న జీవులు ప్రభావితం చేస్తున్నాయి అని గ్రహించాలి. మనం అనారోగ్యంపాలైతే, ఆ చిన్న రాక్షసులు మన ఆరోగ్యాన్ని దోచేస్తున్నాయని అర్ధం. అందునా గర్భినిగా ఉన్నప్పుడు ఈ పరాన్న జీవులను దూరం పెట్టడం చాలా ముఖ్యం.

కొంత మంది మహిళలకు గర్భం దాల్చడానికి ఎందుకు ఆలస్యమవుతుంది!

ఒక అధ్యనం ప్రకారం "టాక్సోప్లాస్మా గోండి " అనే పరాన్నజీవులు గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరం. వాటి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పాక్షికంగా ఉడికిన మాంసం గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరం. అంతే కాకుండా వ్యాధి సోకిన పిల్లి విసర్జకాలు ఇంటి చుట్టుప్రక్కల ఉంటే కూడా అస్సలు మంచిది కాదు. ఎందుకంటే

టాక్సోప్లాస్మా గోండి :

టాక్సోప్లాస్మా గోండి :

ఈ టాక్సోప్లాస్మా గోండి అనే పరాన్నజీవి వల్ల పుట్టబోయే బిడ్డ లోపాలతో జన్మించే అవకాశం ఉంది. అంతేకాకుండా అకాల పుట్టుక సంభవించవచ్చు. మహిళలు ఈ రకమైన పరాన్నజీవులు వల్ల ఎలా వ్యాధి భారిన పడతారు ? పాక్షికంగా ఉడికిన మాంసం మరియు, పిల్లి విసర్జకాలు ఇంటి చుట్టుప్రక్కల ఉన్నప్పుడు వ్యాధి భారీన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.

ఈ పరాన్నజీవి ఇంకా ఏమి చేయగలదు :

ఈ పరాన్నజీవి ఇంకా ఏమి చేయగలదు :

ఈ పరాన్నజీవులు వల్ల కలిగే మొదటి ప్రమాదం గర్భస్రావం. మరొక ప్రమాదం ఏమిటంటే, 9 నెలలు నిండక ముందే పిల్లలు జన్మించేస్తారు. మూడవ ప్రమాదం పుట్టబోయే బిడ్డ లోపాలతో పుడతాడు. ఆ లోపాలు మెదడు దెబ్బతినటం లేదా కళ్ళు దెబ్బ తినటం లాంటి విపరీత పరిస్థితులకు దారి తీస్తుంది.

పొట్టలో ట్విన్స్ ఉన్నప్పుడు తినాల్సిన బెస్ట్ ఫుడ్స్..!!

ఈ పరాన్నజీవులు పెద్దలకు హానికరమా ?

ఈ పరాన్నజీవులు పెద్దలకు హానికరమా ?

మాములుగా మీలో రోగ నిరోధక శక్తి బాగుంటే, మిమ్మల్ని ఆ పరాన్నజీవి ఏమి చేయలేదు. కానీ మీరొక గర్భిని స్త్రీ అయ్యి ఉంటే గనుక ఖచ్చితంగా అనారోగ్యం భారిన పడతారు. మిగతా ఆరోగ్యకరమైన మనుష్యులు ఈ పరాన్నజీవి వల్ల ప్రభావితం అయినా వాళ్లకు కొన్ని రోజుల పాటు జలుబు లాంటి చిన్న చిన్న సమస్యలు వేధిస్తాయి.

వ్యాధి లక్షణాలు :

వ్యాధి లక్షణాలు :

ఈ పరాన్నజీవి మన పై ప్రభావం చూపినప్పుడు జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, ఆకలిలేకపోవటం, చెవి నొప్పి, పొత్తికడుపులో నొప్పి మీద పట్టేయడం, కలవర పడటం, దద్దుర్లు మరియు వికారంగా ఉండటం లాంటి లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడతాయి.

గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్ష తినడం వల్ల పొందే గొప్ప ప్రయోజనాలు

ఈ పరాన్నజీవి గురించి మరిన్ని విషయాలు:

ఈ పరాన్నజీవి గురించి మరిన్ని విషయాలు:

టాక్సోప్లాస్మా గోండి అనేది అతి సూక్ష్మ ఏక కణ పరాన్నజీవి. అవి మన కణాల లోపల కూడా జీవించగలవు. ఈ సూక్ష్మ జీవులు ప్రోటోజోవా రకానికి చెందినవి. ఒక అంచనా ప్రకారం, ప్రపంచంలోని సగం మంది ఈ పరాన్న జీవులను మోస్తున్నారు. అవును ఇది నిజం. చివరికి పిల్లులు కూడా వీటిని మోస్తున్నాయంటే ఆశ్చర్య పడనవసరం లేదు.

ఇవి మెదడుకి హాని చేస్తాయా :

ఇవి మెదడుకి హాని చేస్తాయా :

ఈ సూక్ష్మ జీవుల వల్ల కలిగే సంక్రమణ వల్ల , మనిషి స్వభావం మారిపోతుందని నమ్ముతారు

(కొన్ని అధ్యయనాలు దీనిని ద్రువీకరించవలసి ఉంది) . ఇవి మెదడుకు హాని చేయటమే కాకుండా, మనిషిని ఉద్రేకానికి లోను చేస్తాయట.

వీటి వల్ల మనోవైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ విహాయాన్ని వైద్య నిపుణులు ద్రువీకరించ వలసి ఉంది. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం పిల్లులకు దూరం గా ఉండాలి మరియు పాక్షికంగా ఉడికిన మాంసాన్ని తినడం పూర్తిగా నిషేధించాలి.

English summary

Why Avoid Raw Meat And Playing With Cats During Pregnancy?

Why avoid raw meat during pregnancy? There are so many types of microbes and most of them are parasites that live on other animals or human beings.
Subscribe Newsletter