కొంత మంది మహిళలకు గర్భం దాల్చడానికి ఎందుకు ఆలస్యమవుతుంది!

By: DEEPTHI
Subscribe to Boldsky

ఇదివరకు తరానికి చెందిన మహిళలు పెద్దకష్టం లేకుండానే గర్భవతులయ్యారన్నది నిజం. ఈ కాలంలో సంతాన సాఫల్య సమస్యలతో బాధపడుతున్న స్త్రీల శాతం పెరుగుతోంది.

ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది. ఇదివరకు తరం కన్నా ఇప్పటి మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఒక అధ్యయనంలో తేలింది.

స్త్రీ-పురుషుల్లో సంతానలేమి సమస్యను నిరోధిండం ఎలా

ఈ వ్యాసంలో, ఈ కాలంలో అమ్మాయిలు గర్భం దాల్చడానికి ఎందుకంత కష్టపడుతున్నారో చర్చిద్దాం. సంతానం కలగకపోటానికి కారణమవుతున్న కొన్ని సాధారణ సమస్యలు ఇవిగో.

గర్భాశయం

గర్భాశయం

సర్విక్స్ గర్భాశయానికి, యోనికి మధ్య దారిలా పనిచేస్తుంది. సంభోగం తర్వాత వీర్యకణాలు సర్విక్స్ ద్వారానే గర్భాశయాన్ని చేరాలి. అందుకని గర్భాసంచిలో ఏదన్నా సమస్యలుంటే అండంతో ఫలదీకరణం జరగటానికి సమయం పడుతుంది.

పిహెచ్ సంతులనం

పిహెచ్ సంతులనం

ఫలదీకరణం చెందటానికి యోని లోపల వాతావరణం అనుకూలంగా ఉండాలి. తక్కువ లేదా మరీ ఎక్కువ పిహెచ్ స్థాయిలు ఫలదీకరణానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి.

సంతానలేమికి గురిచేసే గర్భాశయ వ్యాధులు

హాని

హాని

గర్భాశయ ఫైబ్రాయిడ్లు, చిరిగిన కణజాలం, ఇన్ఫెక్షన్లు, ఫెలోపియన్ ట్యూబుల సమస్యలు, రుతుక్రమం సరిగా లేకపోవటం, పాలిప్స్ వంటి ఇతర వైద్య సమస్యలు సంతానలేమి సమస్యలకి కారణమవుతాయి.

వీర్యకణాన్ని అండం వద్దకు చేరకుండా ఆపే ఏ స్థితి అయినా గర్భాన్ని ఆలస్యం చేస్తుంది. అండం గర్భాశయాన్ని చేరకుండా కదలికను నెమ్మది చేసే ఏదైనా గర్భసమస్యలు తెస్తుంది.

పిసిఓఎస్

పిసిఓఎస్

పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనే స్థితి కూడా అండ విడుదలను పాడుచేసి, గర్భాన్ని ఆలస్యం చేస్తుంది.

చిన్న చిన్న సమస్యలు

చిన్న చిన్న సమస్యలు

సాధారణ విషయాలైన అధిక మద్యం సేవించటం, స్థూలకాయం, రుతుక్రమం సరిగా లేకపోవటం, కణుతులు ఇవన్నీ గర్భసమస్యలకి దారితీస్తుంది.

సంతానలేమి గురించి కొన్ని షాకింగ్ అపోహలు..వాస్తవాలు..

వయస్సు

వయస్సు

35 సంవత్సరాల వయస్సు తర్వాత గర్భవతి కావాలని ప్రయత్నించే మహిళలు, వయస్సు కారణంగా సమస్యలు రావచ్చు.

మొదటగా, అండాల నాణ్యత తగ్గిపోవచ్చు, రెండవది అండాల సంఖ్య తగ్గవచ్చు. మూడవది, అండాలను విడుదల చేసే అండాశయ శక్తి కూడా తగ్గిపోవచ్చు.

ఇతర సమస్యలు

ఇతర సమస్యలు

తక్కువ కొవ్వు శాతం ఉన్న మహిళలు కూడా గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. లైంగిక వ్యాధులైన గనేరియా, క్లామిడియా, పెల్విక్ వాపు వ్యాధి ఉన్నవారిలో కూడా సంతానలేమి కన్పిస్తుంది.

English summary

Why Some Women Take Longer To Get Pregnant

In this post, let us discuss the reason why today's women are finding it difficult to get pregnant. Here are some general issues that are delaying pregnancy in many women.
Story first published: Tuesday, August 8, 2017, 13:00 [IST]
Subscribe Newsletter