For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా గర్భం పొందాలంటే 9ఫోలిక్ యాసిడ్ ఫుడ్స్ తీసుకోవాల్సిందే

By Mallikarjuna
|

గర్భవతి అవగానే ఫోలిక్ యాసిడ్ అధికంగా వుండే ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ తల్లికి పుట్టబోయే బిడ్డకు మొదటి త్రైమాసికంలో అత్యవసరం. అసలు ఫోలిక్ యాసిడ్ అంటే ఏమిటి? అని తెలుసుకుంటే, గర్భవతులకు దాని పాత్ర ఎంత అనేది తేలికగా గ్రహించవచ్చు. ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్ బి కాంప్లెక్స్ లో ఒక భాగం. దీనినే విటమిన్ బి 9 అని కూడా అంటారు. శరీరంలో కణాల ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది. పాత కణాలను పునరుజ్జీవిస్తుంది. కనుక ప్రెగ్నెన్సీలో దాని పాత్ర ప్రధానమైంది. ప్రెగ్నెన్సీలో పునరుజ్జీవ కణాలు పది రెట్లుగా వుండాలి. ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాలను పుట్టిస్తుంది. అంతే కాక నరాలకవసరమైన సెరోటోనిన్ కూడా ఇస్తుంది.

ఫోలిక్ ఆమ్లం గర్భిణీ స్త్రీలకు ఒక సూపర్ హీరో వంటిది,ఎందుకంటే బిడ్డ యొక్క మెదడు మరియు వెన్నెముక మరియు పుట్టుకలో వచ్చే లోపాలను నిరోధిస్తుంది.దీనిలో B విటమిన్,బలవర్థకమైన తృణధాన్యాలు ఉంటాయి.ఫోలిక్ ఆమ్లం ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, మరియు మీ శిశువు యొక్క నాడీ నాళిక అభివృద్ధికి సహాయపడుతుంది.ఒక చీలి పెదవి మరియు అంగిలితో పుట్టిన శిశువులకు జన్మనిచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ తప్పనిసరి ఎందుకు?

సాధారణంగా మీరు గర్భం ధరించటానికి ప్లాన్ వేసుకుంటే దానికి ఒక సంవత్సరం ముందు నుంచి ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లను వాడితే నెలలు నిండకుండా పుట్టే పిల్లల శాతం 60%శాతానికి పైగా రిస్క్ తగ్గుతుంది. ఒకవేళ గర్భధారణ ఆకస్మికంగా ఉంటే మీరు గర్భవతి అని తెలిసిన వెంటనే ఫోలిక్ ఆమ్లం మాత్రలను ప్రారంభించండి.గర్భధారణ యొక్క మొదటి 12 వారాల ఫోలిక్ ఆమ్లం మాత్రలు తీసుకోవాలి.ఫోలిక్ ఆమ్లం B విటమిన్ యొక్క ఒక రూపం.ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల గర్భస్రావం జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, మరియు పిల్లలు నాడీ ట్యూబ్ డిజార్డర్ ప్రతి 1000 మందిలో ఒకరికి వచ్చేఅవకాశం ఉంది.

ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకుంటున్నప్పుడే ఫోలిక్‌యాసిడ్‌ తీసుకోవడం మొదలుపెడితే మరీ మంచిదంటారు వైద్యులు. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలంటే తగినంత ఫోలిక్‌యాసిడ్‌ అవసరం. ఆ మాటకొస్తే గర్భిణిలకే కాదు అందరికీ అవసరమే. అయితే మాత్రల రూపంలో కాకుండా న్యాచురల్‌ ఫుడ్‌ను తీసుకోవడం ద్వారా తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ లభించేలా చూసుకోవడం ఉత్తమం.

గర్భిణీ స్త్రీలకు అత్యంత ప్రయోజకారిని..ఫోలిక్ యాసిడ్

19 ఏళ్లు పైబడిన పురుషులు : 400 మైక్రోగ్రామ్స్‌

13 ఏళ్లు పైబడిన స్త్రీలు : 400-600 మైక్రోగ్రామ్స్‌

గర్భిణిలు : 600 మైక్రోగ్రామ్స్‌

1. మార్మీటే

1. మార్మీటే

ఇష్టమున్నా లేకున్నా దీన్ని తీసుకోవడం చాలా అవసరం. లేదా ఈస్ట్ ఎక్స్ ట్రాక్ట్ ను తీసుకోవాలి. ఇందులో ఫోలిక్ యాసిడ్ అధికం. రోజూ రెండు మూడు టీస్పూన్లు మార్మీటే తీసుకుంటే మంచిది.

2. పొద్దుతిరుగుడు విత్తనాలు

2. పొద్దుతిరుగుడు విత్తనాలు

గుమ్మడికాయ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశెనగలు వంటి వాటిని తీసుకున్నా తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది. డ్రైఫూట్స్‌ తిన్నా ఫలితం ఉంటుంది.పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ, ఐరన్ అధికంగా ఉండి, సెల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది. వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవాలి. సలాడ్స్ గా కూడా తీసుకోవచ్చు.

3. ఆస్పరాగస్

3. ఆస్పరాగస్

ఆస్పరాగస్ లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ను ఆవిరి మీద ఉడికించి తీసుకోవాలి. ఎక్కువగా ఉడికిస్తే ఫొల్లెట్ తొలగిపోతుంది. తినడానికి అంత రుచిగా ఉండదు.

4. పీనట్స్

4. పీనట్స్

పీనట్స్ లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువా ఉంటుంది. గుప్పెడు వేరుశెనగల్లో 30 గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి, రోజూ కొన్ని వేరుశెనగలు తినడం , పీనట్ బట్టర్ ను డైట్ లో చేర్చుకోవడం మంచిది. అయితే ఉప్పచేర్చని ఫీనట్ బట్టర్ ను ఎంపిక చేసుకోవాలి.

రోజుకు 400మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. గర్భధారణకు ముందు కనీసం 6 నెలల నుండి తీసుకోవడం మంచిది.

5. బీన్స్‌, బఠాణీలు, కాయధాన్యాలు

5. బీన్స్‌, బఠాణీలు, కాయధాన్యాలు

బీన్స్‌, బఠాణీలో ఫోలిక్‌ యాసిడ్‌ అధిక శాతం ఉంటుంది. అంతేకాకుండా చిన్న కప్పు కాయధాన్యాలను తీసుకున్న తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది.

శెనగలను మమూస్ కు ఉపయోగిస్తారు . ఫొల్లెట్ అధికంగా ఉండే కిడ్నీ బీన్స్, పింటో, బ్లాక్ అండ్ గ్రీన్ బీన్స్ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. అలాగే స్ల్పిట్ పీస్ లో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువ. .

6. ఆకుకూరలు

6. ఆకుకూరలు

ఫోలిక్‌యాసిడ్‌ లెవెల్స్‌ త్వరగా పెరగాలంటే పాలకూర, సోయాను డైట్‌లో చేర్చండి. వీటిని ఒక కప్పు తీసుకున్నట్లయితే ఆ రోజు తీసుకోవాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌ మీకు చేరుతుంది.కేల, కొలరాడ్స్, టర్నిప్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. .

7. పండ్లు

7. పండ్లు

బొప్పాయి , ఆరెంజ్, ద్రాక్ష వంటి పండ్లలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. వీటిలో 30 నుండి 40 మైక్రోగ్రాములు ఉంటాయి. 15 నుండి 25 మైక్రోగ్రాములు వరకూ ఒక కప్పు తీసుకోవాలి. వీటితో స్మూతీ తయారుచేసి తీసుకోవాలి.

8. బ్రొకోలీ

8. బ్రొకోలీ

ఈ మ్యాజికల్ బ్రొకోలీలో ఫోలిక్ యాసిడ్, పొల్లెట్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉన్నాయి.

9. అవొకడో

9. అవొకడో

ఒక కప్పు అవొకడో తీసుకుంటే 90 మైక్రోగ్రాముల విటమిన్‌ బి9 లభిస్తుంది. ఇది రోజూ తీసుకోవాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌లో 22 శాతం ఉంటుంది. అంతేకాకుండా విటమిన్‌ ఎ, కె, ఫైబర్‌ పుష్కలంగా లభిస్తాయి.

English summary

Your Folic Acid Hit: 9 Foods Packed With This Trying To Conceive

It’s recommended that you take 400 micrograms of folic acid a day if you’re trying to conceive and right through your first trimester. Ideally, you should start taking it three months before conceiving. Although you can get folic acid from many rich food sources, the levels drop quickly in foods so it’s always a good idea to take a supplement to make sure you’re getting enough.
Story first published: Monday, October 2, 2017, 11:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more