గర్భధారణ సమయంలో ఆముదం తీసుకోవడం అనర్ధం అని తెలిపే ఐదు కారణాలు!

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

శతాబ్దాలుగా మంత్రసానులు గర్భవతుల ప్రసవానికై నొప్పులు రావడానికి ఆముదంని ఉపయోగిస్తున్నారు. కానీ ప్రసూతి నిపుణులు అయిన వైద్యులు మాత్రం ఈ విధంగా చేయటం వలన దుష్పరిణామాలు ఎదురవ్వడమే కాక తల్లి బిడ్డల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అసలు ఆముదాన్ని నొప్పులు రావడానికి ఎందుకు వాడతారంటే- ఆముదం మంచి విరేచనకారి.ఆముదం ప్రేగులను బిగుతుగా చేస్తుంది. దీనివలన గర్భసంచిలో ఉండే కాండరాలలో అసౌకర్యం కలిగి నెప్పులు కలిగించే ప్రోస్టాగ్లాండిన్ స్రావాన్ని పెంచుతుంది. మంత్రసానులు అనవసరమైన ఈ పద్ధతిని పాటిస్తారు.

Reasons Why Using Castor Oil Is Not Safe During Pregnancy

గర్భధారణ సమయంలో ఆముదం వాడకాన్ని గర్భిణిలు ఎందుకు నిరోధించాలంటే:

1. మెకోనియం గోల్ సిండ్రోమ్ ముప్పును పెంచుతుంది:

1. మెకోనియం గోల్ సిండ్రోమ్ ముప్పును పెంచుతుంది:

ప్రసవం కొరకు గర్భిణీ ఆముదం మింగినపుడు, నెప్పులు మొదలై అవి కడుపులో ఉండే బిడ్డను ఉత్తేజ పరుస్తుంది. ప్రసవానంతరం బిడ్డ మొదటి సారి చేసే ముదురు ఆకుపచ్చని జిగురు వంటి మల విసర్జనను మెకోనియం అంటారు. గర్భంలోనే కనుక బిడ్డ మలవిసర్జన చేస్తే అది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ పరిస్థితి ఎదురైతే బిడ్డ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. నవజాత శిశువుల్లో ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఎదురవడానికి ఇది ఒక ముఖ్య కారణం.

2. తల్లికి డీహైడ్రేషన్ కలుగజేస్తుంది:

2. తల్లికి డీహైడ్రేషన్ కలుగజేస్తుంది:

ఆముదం వలన తల్లికి డయేరియా కలుగుతుంది.దీనివలన తలెత్తే డీహైడ్రేషన్ వలన తల్లి శరీరంలో నీరు ఆర్చుకుపోతుంది.తల్లి ఆరోగ్యానికి డీహైడ్రేషన్ అత్యంత ప్రమాదకరం. బిడ్డకు జన్మనిచ్చిన తదనంతరం తల్లి డీహైడ్రేషన్ వలన చాలా నీరసించిపోతుంది. బిడ్డ యెడల సరైన సంరక్షణ తీసుకోలేదు. అంతేకాక ప్రసవానంతరం తల్లి కోలుకోవడం ఆలస్యమవుతుంది.

3. పాల సరఫరాను తగ్గిస్తుంది:

3. పాల సరఫరాను తగ్గిస్తుంది:

తల్లిపాలు బిడ్డకు సరైన పోషణను అందిస్తుంది. డీహైడ్రేషన్ వలన తల్లికి పాలిచ్చే సామర్థ్యం తగ్గిపోతుంది. బిడ్డకు కనుక తగినన్ని తల్లిపాలు అందకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. బిడ్డలో కొత్త రకమైన సమస్యలు మొదలవుతాయి.

4. ప్రసవసమయంలో తీవ్రస్థాయిలో నొప్పులు:

4. ప్రసవసమయంలో తీవ్రస్థాయిలో నొప్పులు:

గర్భిణిలు ఆముదం తీసుకోవడం వలన నొప్పితో కూడిన సంకోచాలు మొదలవుతాయి. ఆముదం తీసుకోని స్త్రీలతో పోలిస్తే తీసుకున్న వారిలో నొప్పులు తీవ్రస్థాయిలో భరించలేనివిగా ఉంటాయి.

5. ముందుస్తు ప్రసవం:

5. ముందుస్తు ప్రసవం:

ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణిలు నలభైయ్యవ వారానికి ముందుగా ఆముదం తాగరాదు. గర్భం యొక్క ముందుస్తు దశల్లో కనుక ఆముదం తాగితే ముందుగా ప్రసవం జరిగే ప్రమాదం ఉంది.ముందుస్తు ప్రసవం జరిగిన బిడ్డలో ఆరోగ్య సమస్యలు అధికం. వారిలో అవయవాలు లేక దేహం యొక్క అభివృద్ధి సంపూర్ణంగా జరగదు. కొన్నిసార్లు ఇది గర్భ విచ్చిత్తికి దారి తీయవచ్చు.

English summary

5 Reasons Why Using Castor Oil Is Not Safe During Pregnancy

Castor oil has been made use of for centuries by midwives to induce labor. However, most obstetricians prevent making use of castor oil for inducing labor as the method requires unfavorable side impacts that are harmful both for the baby and also the mom. The concept behind utilizing castor oil to generate labor is that the strong laxative result of castor oil stimulates tightening of the intestines, which irritates the uterine muscle mass and also raises prostaglandin secretion that aids in inducing labor. Midwives vouch for the efficiency of this approach, it is not an intended method.
Story first published: Tuesday, March 20, 2018, 12:40 [IST]