కాకరకాయ చేదుగా ఉన్నా దానిని సరిగ్గా వండితే దాని రుచి అమోఘంగా ఉంటుంది. ఈ చేదులోని రుచి అనేది చాలా మందిని ఆకట్టుకుంటుంది.
బిటర్ మిలన్ అని కాకరకాయను పిలుస్తారు. కాకరకాయను తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. సౌత్ ఈస్ట్ ఆసియాలోని అనేక ప్రాంతాల్లో కాకరకాయను ఎక్కువగా వాడతారు. అయితే, దీనిని ప్రెగ్నెన్సీ డైట్ లో భాగంగా చేసుకోవచ్చా?
మీకున్న ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి బోల్డ్ స్కై తోడ్పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కాకరకాయను తీసుకోవచ్చా లేదా అన్న మీ సందేహాన్ని తీర్చుకోవడం కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.
ప్రెగ్నన్సీ సమయంలో కాకరకాయను తీసుకోవడం సురక్షితమేనా?
మితంగా కాకరకాయను తీసుకోవడం వలన ఇబ్బందులేమీ ఎదురవవు. కొన్ని అధ్యయనాల ప్రకారం కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వలన యుటెరైన్ సిస్టమ్ లో సమస్యలు తలెత్తుతాయి. అవి ప్రీటెర్మ్ లేబర్ కు దారితీయవచ్చు.
అలాగే, కాకరకాయ గింజలలో ఫీవర్, పొత్తి కడుపులో నొప్పి, తలనొప్పి, కోమాల లక్షణాలు కలిగిన అనేమిక్ కండిషన్ ఫెవిజంని ప్రేరేపించే విసైన్ కలదు.
ఒకప్పుడు, కాకరకాయను సహజపద్ధతులలో అబార్షనలకై వాడేవారు. కాకర గింజలలో యాంటీస్పెర్మాటోజెనిక్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. అందువలన, ప్రెగ్నన్సీ సమయంలో కాకరను తీసుకోబోయే ముందు వైద్యుల సలహాను తీసుకోవడం మంచిది. డాక్టర్లు తీసుకోమని మీకు సూచిస్తే మీరు నిస్సందేహంగా కాకరను ఎంజాయ్ చేయవచ్చు.
కాకరకాయ మీకు నచ్చకపోయినా దానివలన కలిగే కొన్ని రకాల ప్రయోజనాల వలన కాకరని మీ డైట్ లో భాగంగా చేర్చుకోవాలి.
ఫెటస్ లోని న్యూరలాజికల్ డెవలప్మెంట్:
కాకరలో ఫోలేట్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది బేబీ యొక్క స్పైనల్ అలాగే న్యూరలాజికల్ డెవెలప్మెంట్ కు అవసరం. ఫోలేట్ అనేది న్యూట్రల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ను తగ్గిస్తుంది.
డైజెషన్ ను మెరుగుపరుస్తుంది:
ప్రెగ్నన్సీలో డైజెషన్ సమస్యలు సాధారణమే. హార్మోన్లలో అసమతుల్యతల వలన అలాగే యుటెరస్ విస్తరణ వలన డైజెషన్ ప్రాబ్లెమ్స్ తలెత్తుతాయి. కాకరకాయలో ఫైబర్ లభిస్తుంది. ఇది డైజెషన్ ను మెరుగుపరుస్తుంది. మలబద్దకం, జీర్ణ సమస్యలు అలాగే డిస్పెప్సియా సమస్యలను తగ్గిస్తుంది.
గెస్టేషనల్ డయాబెటిస్:
యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కలిగిన కాకరకాయలో పోషకవిలువలు కూడా మెండుగా లభిస్తాయి. ఇందులో లభించే కరంటైన్ అలాగే పోలీపెప్టెడ్ అనేవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బాలన్స్ చేస్తాయి.
ఇమ్యూన్ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది: ప్రెగ్నెన్సీ సమయంలో ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా మారుతుంది. కాకరలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలిగి ఉన్న విటమిన్ సి లభిస్తుంది. అందువలన ఇమ్యూన్ సిస్టమ్ వ్యవస్థ మెరుగుపడుతుంది.
పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి: కాకరకాయలో జింక్, ఐరన్, నియాసిన్, పొటాషియం, పాంటోథెనిక్ యాసిడ్, మెగ్నీషియం, మ్యాంగనీజ్ అలాగే పైరిడాక్సిన్ లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఫెటల్ అభివృద్ధికి అవసరం.
బరువును నియంత్రిస్తుంది: కాకరలో లభించే డైటరీ ఫైబర్ అనేది టమ్మీని ఫుల్ గా ఉంచి హంగర్ ఫ్యాన్గ్స్ ను తగ్గిస్తుంది. బరువు నియంత్రణలో ఉంచుతుంది. అనారోగ్యకరమైన స్నాక్స్ ని తినాలనే కోరికను తగ్గిస్తుంది.
కాకరలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే, ప్రెగ్నెన్సీలో దీనిని తీసుకోవడం వలన కొన్ని నష్టాలు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది.
ప్రెగ్నన్సీలో కాకరను తీసుకోవడం వలన కలిగే ప్రమాదాలు:
ప్రెగ్నన్సీలో కాకరకాయను తీసుకోవద్దని డాక్టర్లు మీకు సూచించారా? వారు మీకలా సూచించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
ప్రెగ్నన్సీలో కాకరను తీసుకోవడం వలన కలిగే రిస్క్స్ ను ఇక్కడ వివరించాము:
డైజెస్టివ్ సమస్యలు ఉత్పన్నమవ్వచ్చు: కాకరను అతిగా తీసుకోవడం వలన డయేరియా, బ్లోటింగ్, గ్యాస్ మరియు అబ్డోమినల్ క్రామ్ప్స్ లు తలెత్తవచ్చు. కొంతమందికి కాకరగింజలు పడవు. వీటివలన జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
టాక్సిక్ గా మారుతుంది:
కాకరకాయలో లభించే హెపాటోటాక్సిన్స్ వలన కొంతమందిలో టాక్సిసిటీ తలెత్తుతుంది.
మిస్ క్యారేజ్: లారా షేన్ మెక్ హొర్టార్ రచించిన "గైడ్ టు హెర్బ్స్ అండ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్" ప్రకారం కాకరని అతిగా తీసుకోవడం వలన యుటెరస్ పనితీరుకి ఆటంకం ఏర్పడుతుంది. అందువలన, ప్రసవం ముందుగా జరగవచ్చు లేదా మిస్ క్యారేజ్ ప్రమాదం కూడా తలెత్తవచ్చు. అలాగే కాకర చేదు వలన టమ్మీలో కాస్తంత తేడా రావచ్చు.
అయితే, ఈ వెజిటబుల్ ను మీ డైట్ లోంచి పూర్తిగా ఎలిమినేట్ చేయడం మంచిది కాదు. కాకరలో లభించే పోషకాలను తీసుకోవడం కూడా ముఖ్యం. అయితే, డాక్టర్ల సూచనను అనుసరించి డైట్ ను తీసుకుంటే ప్రెగ్నన్సీ అనేది సజావుగా సాగుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.