For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దంత ఆరోగ్యం గర్భధారణ పై ప్రభావం చూపిస్తుందా?

|

గర్భధారణ సమయంలో చాలామంది మహిళలు దంతవైద్యనిపుణులను సంప్రదించరు. 40% గర్భిణీ స్త్రీలలో ఎదో ఒక రకమైన దంత సమస్య ఉంటుంది. నోటి ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు మరియు చికిత్సలు గర్భధారణ సమయంలో చేయించుకోవడం సురక్షితమే!

చాలా మంది ఆడవాళ్లు గర్భధారణ కాలంలో సక్రమంగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మరియు విటమిన్ మాత్రలు తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఆ సమయంలో దంత సంరక్షణ కూడా అంతే అవసరం. తల్లి యొక్క నోటి ఆరోగ్యం బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది అని మీకు తెలుసా!

నోటికి వచ్చే ఆరోగ్య సమస్యలు(పళ్లలో లేదా చిగుళ్లలో) మన సంపూర్ణ ఆరోగ్యంను ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టే అవకాశం లేకపోలేదు. దంత సమస్యలు ఉన్నవాళ్ళలో గుండెపోటు, మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశాలు ఎక్కువ.

Can dental health affect pregnancy?

క్రిందటి సంవత్సరం అమెరికాలో సంతానవతులు కాబోతున్న స్త్రీలలో 56% మంది దంతవైద్యనిపుణులను సంప్రదించలేదు. దీని ద్వారా ఎంతో మంది తల్లులు కాబోతున్న స్త్రీలు తమ దంత పరిరక్షణను చేపట్టడం లేదని తేటతెల్లమవుతుంది.

అసలు గర్భం ధరించడం వలన కూడా నోటి ఆరోగ్యంలో స్వల్ప మార్పులు చోటు చేసుకోవచ్చు. ఇదివరకు చెప్పుకున్నట్లు 40 శాతం మహిళల్లో అప్పటికే సమస్యలు ఉండి ఉంటాయి. గర్భిణి స్త్రీల నోటిలో ఆమ్ల గుణాలు అధికంగా ఉండటం వల్ల చిగుళ్లలో రక్తస్రావం మరియు దంతక్షయం సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. పంటిని పట్టి ఉంచే లిగమెంట్లు వదులుగా మారటం వలన పళ్ళు కదిలే అవకాశం ఉంది. వేవిళ్లు ఎక్కువగా ఉండే స్త్రీల నోటిలో ఆమ్ల ఉత్పత్తి అధికంగా జరిగి, దంత ఎనామెల్ దెబ్బ తింటుంది.

వివిధ దంత పరిశోధనలలో తెలినదేమిటంటే దంత ఆరోగ్యానికి, ముందుస్తు ప్రసవానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. నోట్లో నొప్పి ఎక్కువ అవ్వటం మరియు బాక్టీరియా యొక్క ప్రభావం వలన ప్రసవవేదన ముందుగానే మొదలవ్వవచ్చు. దంత సమస్యల పరిష్కారం ముందుస్తు ప్రసవం పై ఈ విధమైన అనుకూల ప్రభావం చూపుతుంది అనే విషయంపై మరీంత కూలంకషమైన అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది.

Can dental health affect pregnancy?

కొంతమంది స్త్రీలలో గర్భధారణ సమయంలో దంతవైద్యనిపుణులను సంప్రదించి ఎటువంటి పరీక్షలయినా లేదా చికిత్సలైనా చేయించుకుంటే, వాటి ప్రతికూల ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతుందనే అపోహ ఉంటుంది. కొంతమంది దంతవైద్యనిపుణులు కూడా గర్భిణి స్త్రీలు తమ దంత వైద్య సమస్యలకు చికిత్సను వాయిదా వేసుకోవడం వలన నష్టం ఉండదనే ఆలోచన కలిగి ఉంటారు. ఇటువంటి ఆలోచన కూడా అనర్థానికి దారితీస్తుంది. గర్భధారణ సమయంలో తీసుకునే దంతసంబంధ చికిత్సల వలన తల్లికి, బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగదు. నోటిని ఎక్సరే తీయడం లేదా పళ్ళ ఫిల్లింగ్ చేయడం పూర్తిగా సురక్షితమైనవి. ఒకవేళ మీకు కాని, మీ దంతవైద్యనిపుణులకు కానీ ఎటువంటి అనుమానాలైనా ఉంటే వాటి నివృత్తికై గైనకాలజిస్ట్ ను సంప్రదించండి. వారు మీకు తగిన సహకారం అందిస్తారు.

గర్భిణి గా ఉన్న సమయంలోనే దంత సమస్యలు పరిష్కరించుకుంటే అవి పుట్టే బిడ్డలు సంక్రమించవు. కొన్ని సందర్భాలలో తల్లులు తమ నోటితో పసిపిల్లలకై వాడే పాలపీకలు, స్పూన్లు శుభ్రం చేస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో, తల్లికి ఒకవేళ నోటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి బిడ్డకు సంక్రమిస్తాయి. కనుక సత్వర చికిత్స ద్వారా గర్భిణి స్త్రీలు తమ దంత సమస్యా నివారణ చర్యలు చేపడితే అది తల్లికి మరియు బిడ్డకు కూడా క్షేమకరం.

English summary

Can dental health affect pregnancy

Interestingly, disorders of the mouth known as dental health conditions (this includes concerns like cavities and also gum disease) can have a far getting to result on an individual’s total health. People with oral health problems have higher rates of heart attack, diabetic issues, Alzheimer’s, as well as lung infections.
Story first published: Tuesday, March 27, 2018, 9:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more