పీరియడ్స్ వచ్చిన తరువాత కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలున్నాయా?

Subscribe to Boldsky

మొదటి పీరియడ్ స్టార్ట్ అయినప్పుడే కంప్లీట్ లేడీగా రూపుదిద్దుకుంటుంది మహిళ. పీరియడ్స్ వచ్చాయని అంటే పిల్లల్ని కనే సామర్థ్యం లభించిందని భారతీయులు నమ్ముతారు. అదే వెస్ట్రన్ వరల్డ్ లో ఈ విషయాన్ని కాస్తంత ముందుగానే గుర్తిస్తారు.

ఒక మహిళ గర్భం దాల్చిందంటే, ఆమెకు తదుపరి తొమ్మిది నెలల వరకు నెలసరి రాదు. ఆ సమయంలో గర్భంలో చిన్నారి ప్రాణం పోసుకుంటుంది.

నిజానికి, గ్రామీణ భారత దేశంలో అలాగే పట్టణాలలోని పేద కుటుంబాలకు ఈ హోమ్ ప్రెగ్నన్సీ టెస్ట్ కిట్స్ లకు యాక్సెస్ ఉండదు. వారంతా పీరియడ్ ని మిస్ అవడాన్ని గర్భం దాల్చడానికి సూచికగా వాడతారు.

Can I be pregnant even after I have a period

పీరియడ్ ని మిస్ అవకపోయినా గర్భం దాల్చే అవకాశం ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది. ఈ విషయంపై ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో శాస్త్రీయ కోణం నుంచి ఈ విషయాన్ని స్పష్టంగా వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన మెడికల్ డీటెయిల్స్ ను పరిగణలోకి తీసుకుని వివరాలను పొందుబరిచాము.

• ప్రెగ్నన్సీలో పీరియడ్స్ ఉండవు

మెడికల్ గా మాట్లాడుకుంటే, యుటెరస్ ఇన్నర్ లైనింగ్ నుంచి కొంత క్వాన్టిటీ బ్లడ్ అలాగే మ్యూకల్ టిష్యూ వెజీనా ద్వారా పీరియడ్స్ సమయంలో డిశ్చార్జ్ అవుతాయి. యుటెరస్ అనేది ఫెటస్ ని క్యారీ చేస్తున్నప్పుడు ఇటువంటి బ్లీడింగ్ అనేది వెజీనా ద్వారా జరిగే అవకాశం ఉండదు.

అందువలనే, పీరియడ్ రాకపోవటాన్ని ప్రెగ్నన్సీకి సూచికగా వాడతారు. మెడికల్ గా ప్రెగ్నన్సీతో పాటు పీరియడ్స్ రావటమనేది జరగటం అసాధ్యమని వైద్యులు చెబుతున్నారు. నిజానికి, చాలా మంది మహిళలకు పీరియడ్స్ అనేవి బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా రావు.

అందువలన, మీకు పీరియడ్స్ అనేవి వస్తున్న సమయంలో మీరు ప్రెగ్నన్సీ అనుమానాన్ని పెట్టుకోనవసరం లేదు. అటువంటి పరిస్థితి ఎదురైతే, ప్రెగ్నన్సీ టెస్ట్ తో మీ డౌట్ ని తీర్చుకోవడం ఉత్తమం.

Can I be pregnant even after I have a period

• బ్లీడింగ్ లో మిగతా రకాలు:

అని రకాల బ్లీడింగ్ కి పీరియడ్ ఒకటే కారణమని భావించకూడదు. బ్లీడింగ్ లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. వెజీనల్ బ్లీడింగ్ కావచ్చు లేదా సెర్విక్స్ లోని ఇన్ఫెక్షన్ వలన బ్లీడింగ్ రావచ్చు. ప్రెగ్నన్సీకి సంబంధం లేని ఇన్ఫెక్షన్ వలన కూడా బ్లీడింగ్ రావచ్చు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (లేదా యూటీఐ) అనేది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య. దీని వలన కూడా మీకు బ్లీడింగ్ రావచ్చు. దానిని పీరియడ్స్ అని భ్రమ పడే అవకాశం కూడా లేకపోలేదు. పైల్స్ సమస్య కలిగిన మహిళల్లో, ప్రెగ్నన్సీ సమయంలో కూడా బ్లీడింగ్ కనపడవచ్చు. పైల్స్ వలన కనబడే బ్లీడింగ్ ను పీరియడ్స్ వలనని పొరపాటు పడవద్దు.

• ఇంప్లాంటేషన్ బ్లీడింగ్:

ప్రెగ్నన్సీ ప్రారంభ దశలలో, ఫెర్టిలైజడ్ ఎగ్ అనేది యుటెరస్ లైనింగ్ కు దానంతట అదే ఎటాచ్ అవుతుంది. మరికొంతమంది మహిళల్లో, దీని వలన లైనింగ్ లో ఇరిటేషన్ ఏర్పడి బ్లీడింగ్ సమస్య తలెత్తవచ్చు. ప్రెగ్నన్సీ ప్రారంభ దశలో దాదాపు ముప్ఫై శాతం మంది మహిళల్లో ఈ సమస్య సాధారణంగా కనిపిస్తుంది.

కొంతమంది మహిళలు ఈ బ్లీడింగ్ ని పీరియడ్స్ అని భావించి కన్ఫ్యూజ్ అయ్యారని చెప్తున్నారు. అయితే, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కి అలాగే మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కి గల తేడాని గుర్తించగలిగితే అసలు సందేహమే ఉండదు. బ్లీడింగ్ రంగు బట్టి ఈ తేడాను గుర్తించవచ్చు. పీరియడ్స్ తో సంబంధం ఉన్న బ్లీడింగ్ కు మూడ్ స్వింగ్స్, క్రామ్ప్స్ వంటివి అనుసంధానమై ఉంటాయి. ఈ విషయాన్ని కూడా గమనించాలి.

ఇంప్లాంటేషన్ బ్లడ్ అనేది సాధారణ పీరియడ్ బ్లడ్ కంటే లైటర్ గా ఉంటుంది. తక్కువ పరిమాణాలలో బ్లీడింగ్ జరుగుతుంది. సాధారణంగా, డిశ్చార్జ్ అనేది యెల్లోవిష్ లేదా పింకిష్ గా ఉంటూనే కొన్ని బ్లడ్ స్ట్రీక్స్ తో కలిసి ఉంటుంది. ఇటువంటి బ్లీడింగ్ ని మీరు గమనించినట్లయితే మీరసలు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఇది సాధారణమే.

Can I be pregnant even after I have a period

• వెంటనే జాగ్రత్తలు తీసుకోవలసిన సందర్భాలు:

ఇప్పటివరకు మీరు వివిధ రకాల బ్లీడింగ్స్ గురించి తెలుసుకున్నారు. అయినా, మీరు ప్రెగ్నెంట్ అన్న అనుమానం మీకు ఇంకా నిలిచి ఉంటే, మీరు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. పీరియడ్స్ వచ్చిన తరువాత కూడా గర్భం దాల్చారేమోనన్న సందేహం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే వైద్యున్ని సంప్రదించడం మంచిది.

మిస్ క్యారేజ్ కి సంబంధించిన ఎర్లియెస్ట్ లక్షణాలలో బ్లీడింగ్ ఒక ముఖ్యమైన లక్షణం. మిస్ క్యారేజ్ కాకపోయినా పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ అనేది కొన్ని యుటెరైన్ అబ్నార్మాలిటీస్ గురించి సూచిస్తుంది. ఇవి ప్రెగ్నన్సీ సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ ను తెలియచేస్తుంది. వాటన్నిటినీ మీరు డీల్ చేయాలనుకుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. మీ శరీరంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు వివరించాలి. తద్వారా, మీ గైనకాలజిస్ట్ మీకు చేయవలసిన ట్రీట్మెంట్స్ గురించి తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది.

కొన్ని వరస్ట్ కేస్ సినారియోలో, ఎక్టోపిక్ ప్రెగ్నన్సీకి సంబంధించి సూచనగా కూడా బ్లీడింగ్ ను పరిగణించవచ్చు. ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ అనేది సీరియస్ కండిషన్. దీనిని వైద్యులు మెడికల్ ఎమర్జెన్సీగా ట్రీట్ చేస్తారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Can I be pregnant even after I have a period

    Missed period is a sign of being pregnant. But there might a question can one be pregnant and also have periods? Medically speaking, one cannot get their periods while they are pregnant. But one may experience other types of bleeding such as UTI, infections, etc. We are then told that when a woman conceives a child
    Story first published: Friday, April 6, 2018, 16:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more