ఒవేరియన్ సిస్ట్స్ క్యాన్సర్ గా మారే ప్రమాదముందా?

Subscribe to Boldsky

మహిళల్లో రీప్రొడక్టివ్ గ్లాండ్స్ జతని ఓవరీ అనంటారు. ఇవి పొత్తికడుపులో యుటెరస్ కి ఇరువైపులా ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ వంటి ఫీమేల్ హార్మోన్స్ కి ముఖ్యమైన సోర్స్ గా వ్యవహరిస్తాయి. ఇవి ఎగ్స్ ని ఉత్పత్తి చేస్తాయి.

ఒవేరియన్ సిస్ట్స్ అంటే ఏంటి?

ఓవరీలోని లేదా ఓవరీపైన ద్రవంతో నిండిన శాక్ వంటి పదార్థాన్ని ఒవేరియన్ సిస్ట్స్ అనంటారు. ఇవి సాధారణంగా హానికరం కానివి అలాగే నొప్పి కలిగించవు. చాలా మంది మహిళలు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా కనీసం ఒక ఒవేరియన్ సిస్ట్ నైనా కలిగి ఉంటారు.

Can Ovarian Cysts Turn Cancerous?
ఒవేరియన్ సిస్ట్స్ రకాలు:

ఒవేరియన్ సిస్ట్స్ రకాలు:

1. ఫాలికల్ సిస్ట్ : ఫాలికల్ అనే శాక్ లో మెన్స్ట్రువల్ సైకిల్ సమయంలో ఎగ్ వృద్ధి జరుగుతుంది. ఈ ఫాలికల్ అనేది చాలా సందర్భాలలో విచ్చిన్నమై అందులోంచి ఎగ్ విడుదలవుతుంది. ఫాలికల్ ఓపెన్ అవకుండా ఎగ్ ను విడుదల చేయనప్పుడు ఫ్లూయిడ్ అనేది సిస్ట్ కి దారితీస్తుంది. కాలక్రమేణా ఈ సమస్య దానంతటదే పరిష్కారమవుతుంది.

2. కార్పస్ ల్యూటియం సిస్ట్ :

2. కార్పస్ ల్యూటియం సిస్ట్ :

ఫాలికల్ నుంచి ఎగ్ విడుదలైనప్పుడు ఇంకొక ఎగ్ పెరిగే వరకు ఫాలికల్ అనేది సాధారణంగా చిన్నగా మారిపోతుంది. ఒకవేళ, ఫాలికల్ మూసుకుపోయి అందులోని ద్రవం పేరుకుపోతే అది సిస్ట్ గా మారుతుంది. దాన్ని కార్పస్ ల్యూటియం సిస్ట్ అనంటారు.

3. డెర్మాయిడ్ సిస్ట్స్ :

3. డెర్మాయిడ్ సిస్ట్స్ :

ఈ సిస్ట్స్ లో హెయిర్, స్కిన్ మరియు టీత్ వంటి టిష్యూస్ కలిగి ఉంటాయి. ఈ టిష్యూస్ అనేవి శరీరంలోని ఇతర టిష్యూస్ లాగా అసాధారంగా వృద్ధి చెందుతాయి.

4. సిస్టాడేనామాస్ :

4. సిస్టాడేనామాస్ :

ఇది ఓవరీస్ వెలుపలి వైపు వృద్ధి చెందుతాయి. ఇవి నీళ్ల వంటి లేదా మ్యూకస్ వంటి పదార్థాలతో నిండి ఉంటాయి.

5. ఎండోమెట్రియోమాస్ :

5. ఎండోమెట్రియోమాస్ :

యుటెరస్ లోపల పెరుగుతున్న టిష్యూస్ యుటెరస్ వెలుపలి వైపు వృద్ధి చెందినప్పుడు ఓవరీస్ కి అతుక్కుపోతాయి. ఇవి సిస్ట్స్ గా మారతాయి. యుటెరస్ లోపల యుటెరైన్ ఎండోమెట్రియల్ సెల్స్ అనేవి పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది.

6. పోలీసిస్టిక్ ఓవరీయన్ సిండ్రోమ్ (PCOS):

6. పోలీసిస్టిక్ ఓవరీయన్ సిండ్రోమ్ (PCOS):

ఈ కండిషన్ రెండు ఓవరీస్ లోను చిన్నవైన సిస్ట్స్ అనేకం వృద్ధి చెందుతాయి. వివిధ హార్మోన్ల సమస్యలతో ఈ కండిషన్ ముడిపడి ఉంటుంది.

ఒవేరియన్ క్యాన్సర్ :

ఒవేరియన్ క్యాన్సర్ :

ఓవరీలోని అసాధారణ సెల్స్ అనేవి నియంత్రణ లేకుండా వృద్ధి చెందుతున్నప్పుడు ట్యూమర్ గా తయారవుతుంది. సాధారణంగా, పెల్విస్ మరియు పొత్తికడుపులోకి స్ప్రెడ్ అయ్యే వరకు ఒవేరియన్ క్యాన్సర్ ను గుర్తించడం జరగదు.

ఏ వయసులోనైనా ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన వారిలో మెనోపాజ్ తరువాత ఎదురవుతుంది.

ఒవేరియన్ క్యాన్సర్ రకాలు:

ఒవేరియన్ క్యాన్సర్ రకాలు:

• ఎపితెలియల్ ట్యూమర్లు : ఓవరీస్ వెలుపల టిష్యూలో రూపుదిద్దుకుంటుంది. ఇది అత్యంత సాధారణమైన ఒవేరియన్ క్యాన్సర్.

• జెర్మ్ సెల్ కార్సినోమా ట్యూమర్లు : ఇది అరుదైన ఒవేరియన్ క్యాన్సర్ రకం. ఎగ్స్ ని ఫార్మ్ చేసే సెల్ నుంచి ఇది ప్రారంభమవుతుంది.

• స్ట్రామాల్ ట్యూమర్లు : ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ వంటి ఫిమేల్ హార్మోన్స్ ని ఉత్పత్తి చేసే సెల్స్ లో ఇది కనిపిస్తుంది.

ఒవేరియన్ సిస్ట్స్ మరియు ఒవేరియన్ క్యాన్సర్ కి చెందిన లక్షణాలు:

ఒవేరియన్ క్యాన్సర్ కి చెందిన లక్షణాలు

ఒవేరియన్ క్యాన్సర్ కి చెందిన లక్షణాలు

ఒవేరియన్ సిస్ట్స్ అనేవి ఎటువంటి గుర్తించదగిన లక్షణాలను చూపించలేవు. అయితే, అవి పెరుగుతున్న కొద్దీ కొన్ని లక్షణాలు ఎదురవుతాయి. ఒవేరియన్ సిస్ట్స్ మరియు ఒవేరియన్ క్యాన్సర్ కి చెందిన లక్షణాలు సాధారణంగా సిమిలర్ గానే ఉంటాయి. అవేంటంటే:

• అబ్డోమినల్ బ్లోటింగ్

• పెల్విక్ పెయిన్ (మెన్స్ట్రుల్ సైకిల్ ముందుగానీ లేదా మెన్స్ట్రువల్ సైకిల్ సమయంలో)

• నడుము కింద భాగంలో నొప్పి

• నొప్పితో కూడిన బౌల్ మూవ్మెంట్స్

• వికారం మరియు వాంతులు

• పొత్తికడుపులో బరువు

• అజీర్తి

• త్వరగా కడుపునిండిపోవడం

• మూత్రాన్ని ఆపుకోలేకపోవడం

• విపరీతమైన అలసట

• శ్వాసను వేగంగా తీసుకోవడం

• ఇర్రెగ్యులర్ పీరియడ్స్

• మలబద్ధకం

కారణాలు :

కారణాలు :

ఒవేరియన్ సిస్ట్ కి దారితీసే కారణాలు:

• మెన్స్ట్రుయేషన్ త్వరగా రావడం

• ఇరెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్

• ఓవరీయన్ సిస్ట్స్ ఇంతకు ముందే ఉండటం

• ఇన్ఫెర్టిలిటీ

• ఒబెసిటీ

• హార్మోన్ల సమస్యలు

• తీవ్రమైన పెల్విక్ ఇన్ఫెక్షన్

ఒవేరియన్ క్యాన్సర్ కి అలాగే సిస్ట్స్ కి దారితీసే కారణాలు చాలావరకు సిమిలర్ గానే ఉంటాయి. వీటికి సంబంధించిన మరిన్ని కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

• ఫ్యామిలీ హిస్టరీ

• ఒవేరియన్ క్యాన్సర్ తో అసోసియేట్ అయిన BRCA1 మరియు BRCA2 జీన్స్ మ్యుటేషన్

• కొన్ని ఫెర్టిలిటీ డ్రగ్స్ ని వాడటం

• ఎండోమెట్రియోసిస్

• ఏజ్

• హార్మోనల్ థెరపీ

ఒవేరియన్ సిస్ట్స్ వలన ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందా?

ఒవేరియన్ సిస్ట్స్ వలన ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందా?

ఒవేరియన్ సిస్ట్స్ అనేవి సాధారణంగా హానికరం కావు. కాలక్రమేణా ట్రీట్మెంట్ తో సంబంధం లేకుండా వాటంతటవే తగ్గిపోతాయి. చాలా మంది మహిళలు తమ రీప్రొడక్టివ్ ఏజ్ లో సిస్ట్స్ ను కలిగి ఉంటారు.

ఈ సిస్ట్స్ అనేవి ఒవేరియన్ క్యాన్సర్ కి దారితీయవచ్చు లేదా దారితీయకపోవచ్చు. చాలా సిస్ట్స్ క్యాన్సర్ గా మారవు. కొన్ని అరుదైన సందర్భాలలో ఇవి క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది.

సిస్ట్స్ మరియు క్యాన్సర్ కి సంబంధించిన లక్షణాలు సిమిలర్ గా ఉండటంతో వీటి మధ్య తేడాను గుర్తించడం కాస్త కష్టతరమే. అయినా, పూర్తిగా ఎగ్జామిన్ చేయడం ద్వారా తగినన్ని పరీక్షలను నిర్వహించడం ద్వారా వీటి డయాగ్నసిస్ సులభమవుతుంది.

సరైన సమయంలో చికిత్సను తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

డయాగ్నోసిస్ :

డయాగ్నోసిస్ :

ఒవేరియన్ సిస్ట్స్ ను గుర్తించేందుకు రొటీన్ పెల్విక్ ఎగ్జామినేషన్ తోడ్పడుతుంది. తద్వారా క్యాన్సర్ కి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవచ్చు. సిస్ట్స్ యొక్క సైజ్ మరియు రూపును బట్టి ఏ టెస్ట్ ఉపయోగకరమో తెలుసుకోవచ్చు. సిస్ట్స్ ను గుర్తించేందుకు వైద్యులు కొన్ని రకాల ఇమేజింగ్ టూల్స్ ను ఉపయోగిస్తారు. అవేంటంటే:

• సిటీ స్కాన్ : ఇది అంతర్గత అవయవాల యొక్క క్రాస్ సెక్షనల్ ఇమేజెస్ ను క్రియేట్ చేయడం కోసం అలాగే సిస్ట్ ల ఉనికిని గుర్తించడం కోసం ఉపయోగపడుతుంది.

• ఎమ్ ఆర్ ఐ : ఇది అంతర్గత అవయవాల యొక్క స్పష్టమైన ఇమేజెస్ ను అందించడానికి తద్వారా సిస్ట్స్ కు చికిత్స చేయడానికి తోడ్పడుతుంది.

• అల్ట్రా సౌండ్ టెస్ట్ (అల్ట్రా సోనోగ్రఫీ) : ఇది సైజ్, షేప్, లొకేషన్ మరియు సిస్ట్స్ యొక్క కంపోసిషన్ ని తెలుసుకోవడానికి తోడ్పడుతుంది.

కొన్ని సిరీస్ ల అల్ట్రా సౌండ్ టెస్ట్ తరువాత కూడా సిస్ట్ యొక్క కండిషన్ లో ఎటువంటి మార్పు లేనప్పుడు డాక్టర్లు మరిన్ని ఇతర టెస్ట్ లను నిర్వహించవచ్చు:

• ప్రెగ్నెన్సీ టెస్ట్ : గర్భధారణ అవకాశాన్ని చెక్ చేసేందుకు తోడ్పడుతుంది.

• CA-125 రక్త పరీక్ష : ఒవేరియన్ క్యాన్సర్ ను చెక్ చేసేందుకు తోడ్పడుతుంది.

• హార్మోన్ లెవెల్ టెస్ట్ : హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లెమ్స్ ను చెక్ చేసేందుకు తోడ్పడుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Can Ovarian Cysts Turn Cancerous?

    Ovarian cyst & ovarian cancer symptoms are very similar. Identifying the differences between the two can be hard. Cysts are usually not cancerous. Treating ovarian cysts depend upon its size, type, symptoms & the patient's age, while ovarian cancer is treated based on its stage & how much it has spread.
    Story first published: Monday, August 13, 2018, 19:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more