ఆరోగ్యవంతమైన సంతానోత్పత్తి కోసం ఆముదము నూనె చికిత్స ఎలా ఉపయోగపడుతుందో మీకు తెలుసా ?

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

కొన్ని వందల సంవత్సరాలుగా ఆముదము నూనె చికిత్సను మన పూర్వికులు, శరీరంలో వివిధ లోపాలను మరియు రోగాలను నయం చేయడానికి వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా సంతానోత్పత్తి కోసమై ఎక్కువగా ఈ చికిత్సను వాడుతుంటారు. ఆముదము నూనె ప్యాక్ లతో చేసే చికిత్స అత్యద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా సంతానోత్పత్తి కోసం చేసే మర్దన మరియు సంతానోత్పత్తి కోసం శుభ్రం చేయు విధానానికి ఇది అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది.

అసలు ఆముదపు నూనె అంటే ఏమిటి ?

అసలు ఆముదపు నూనె అంటే ఏమిటి ?

ఆముదము మొక్కల నుండి వచ్చే గింజల నుండి తయారుచేసే నూనె ను ఆముదము నూనె అంటారు, ఈ ఆముదము మొక్కకు మరొక పేరు పాల్మ క్రిస్టి. ఆముదము మొక్కను కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి వాడుతున్నారు, అంటే దాదాపు 4 వేల సంవత్సరాల నుండి ఇది వాడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆముదము నూనె ప్యాక్ అంటే ఏమిటి ?

ఆముదము నూనె ప్యాక్ అంటే ఏమిటి ?

ఒక బట్టను ఆముదము నూనెలో బాగా ముంచాలి, ఆ తర్వాత దానిని చర్మంపై పై పెట్టడం వల్ల రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది మరియు చర్మం లోపల ఉండే కణజాలాలు, అవయవాలు కు ఏమైనా నష్టం కలిగి ఉంటే నయం అవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

ఆముదము నూనె ప్యాక్ ని ఎందుకువాడుతారో మీకు తెలుసా ?

ఆముదము నూనె ప్యాక్ ని ఎందుకువాడుతారో మీకు తెలుసా ?

సంప్రదాయ బద్దంగా ఆముదము నూనె ప్యాక్ ని వివిధ సందర్భాల్లో మంచి ఫలితాల కోసం వాడుతూవుంటారు. ముఖ్యంగా కాలిన గాయాలు, నొప్పి, రక్త ప్రసరణ బాగా జరగాలి అనుకున్నప్పుడు వివిధ సందర్భాల్లో ఆముదము నూనె ప్యాక్ ని వాడుతారు. సంతానోత్పత్తిని పెంపొందించడంలో భాగంగా, ఆముదము ఆయిల్ ప్యాక్ లు ఎంతో సహకరిస్తాయి మరియు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా వీటిని విశ్రాంతి చికిత్స కోసం కూడా వాడుతూ ఉంటారు.

యోని ఆరోగ్యవంతంగా ఉండటానికి సహాయం చేస్తూనే మరియు అండాశయము నుండి గర్భకోశమునకు గల నాళమార్గంని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గర్భాశయన్నీ ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, ఆ ప్రదేశంలో హానికర పదార్ధాలన్నింటిని బయటకు పారద్రోలుతుంది మరియు గర్భ ధారణకు ముందు అండం ఆరోగ్యవంతంగా ఉండేలా చూసుకుంటుంది.

ఆముదము నూనె ప్యాక్ లు వైద్యం చేయడంతో పాటు, నయం చేయడానికి ఎలా పనికి వస్తాయో మీకు తెలుసా ?

ఆముదము నూనె ప్యాక్ లు వైద్యం చేయడంతో పాటు, నయం చేయడానికి ఎలా పనికి వస్తాయో మీకు తెలుసా ?

ఆముదము నూనె ప్యాక్ లు శరీరంలోని మూడు అతి ముఖ్యమైన భాగాలను చైతన్యం కలిగిస్తాయి. శోషరస, రక్త ప్రసరణ వ్యవస్థలను మరియు కాలేయ వ్యవస్థలను ఉత్తేజపరుస్తాయి. ఈ మూడు వ్యవస్థలను చైతన్య పరచడం వల్ల శరీరంలో కణజాల మరియు అవయవాలు వాటంతటకు అవే నయంచేసుకొనే శక్తిని ఈ ఆముదము నూనె ప్యాక్ అందిస్తుంది. ఎక్కడైతే ఈ ఆముదము నూనె ప్యాక్ లను పెడతారో, వాటి క్రింద ఈ పైన చెప్పబడిన అద్భుతాలన్నీ జరుగుతాయి.

శోషరస వ్యవస్థ :

శోషరస వ్యవస్థ :

శోషరస పాత్రలు, శోషరస గ్రంధులు మరియు పసుపు పచ్చ రంగులో ఉండే ద్రవం అదే శోషరసం వీటన్నింటి కలయికనే శోషరస వ్యవస్థ అని అంటారు. శోషరస వ్యవస్థలో ఉండే కణాలను లింఫోసైట్స్ అంటారు. ఈ లింఫోసైట్స్ వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధుల పై పోరాడటానికి సన్నద్ధం చేస్తాయి. ఈ వ్యవస్థ శరీరం మొత్తంలో ఉంటుంది. శోషరస గ్రంధులు శరీరంలోని కొన్ని భాగాల పై మాత్రమే, తమ దృష్టిని కేంద్రీకరిస్తాయి. సాధారణంగా చాలావరకు శోషరస గ్రంధులు సంతానోత్పత్తి అవయవాల చుట్టూనే ఉంటాయి.

శోషరస వ్యవస్థ శరీరంలో ఉండే చెడు పదార్ధాలను మరియు అవసరం లేని పదార్దాలను తీసివేస్తుంది. కానీ, ఇలా జరగాలంటే, అందుకోసం ఆముదము నూనె ప్యాక్ తో శోషరస వ్యవస్థను చైతన్య పరచవల్సి ఉంది. మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణం అవసరంలేని పదార్ధాలను బయటకు పంపించే విధంగా సంసిద్ధం చేస్తుంది శోషరస వ్యవస్థ. బాహ్య ప్రపంచ కదలికలు, తారుమారు చేసే పద్దతి మరియు శరీర ప్రక్రియలో భాగంగా చోటుచేసుకొని సాధారణ కదలికల పై శోషరస వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. రక్త ప్రసరణలో భాగంగా, గుండె ఎలా అయితే రక్తాన్ని శరీరమంతా ప్రసరించేలా చేస్తుందో, అలా శోషరసాన్ని శరీరమంతా ప్రసరించేలా చేయడానికి శోషరసం వద్ద ఎటువంటి అవయవం లేదు. కావున, ఆముదము నూనె ప్యాక్ ల ద్వారా శోషరస వ్యవస్థకు చైతన్యం తేవాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా శారీరిక వ్యాయామం చేయడం ద్వారా శోషరస వ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు, సరైన పద్దతిలో జరగవలసిన పనులన్నీ సమతుల్యత జరగడానికి తోడ్పడుతుంది.

ఆముదము నూనె ప్యాక్ ని సంతానోత్పత్తి వ్యవస్థ పై ప్రయోగించడం ద్వారా, శోషరస వ్యవస్థలో చైతన్యాన్ని తీసుకురావచ్చు. ఇలా చేయడం ద్వారా సంతానోత్పత్తి అవయవాలు కూడా శుభ్రపరచవచ్చు మరియు ప్యాక్ ని ఎక్కడైతే వాడుతారో, ఆ ప్రాంతంలో దెబ్బతిన్న కణజాలాన్ని నయం చేయడానికి మరియు సాధారణ స్థితికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.

రక్త ప్రసరణ వ్యవస్థ :

రక్త ప్రసరణ వ్యవస్థ :

చాలా మంది ప్రజలకు రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఒక అవగాహన ఉంది. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగాలు గుండె, రక్తం, ధమనులు మరియు సిరలు. ఇవన్నీ శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆముదము నూనె ప్యాక్ ని వాడటం జరుగుతుందో, అటువంటి సమయంలో ప్రాణవాయువుతో కూడిన సరికొత్త రక్తం, పోషకాలు అధికంగా ఉన్న రక్తం సంతానోత్పత్తి అవయవాలకు సరఫరా జరుగుతుంది. ముఖ్యంగా గర్భాశయనికి కూడా ఈ రక్తం అందడం వల్ల ఎంతో మేలుని జరుగుతుంది. ఒకవేళ సంతానోత్పత్తి అవయవాలకు సరైన రక్తప్రసరణ జరగకపోతే అవి ఉత్తమంగా పనిచేయలేవు. దీంతో ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడతాయి. దెబ్బతిన్న ప్రాంతాలు నయంకావు. కణజాలాలు ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోకుండా ఒక మచ్చలా మిగిలిపోతాయి. ఆ కణజాలాలు సరైన పద్దతిలో ఒకదానికి ఒకటి అతుక్కోవు.

 కాలేయం :

కాలేయం :

మన శరీరంలో రసాయనాలను శుద్ధి చేసే కర్మాగారం కాలేయం. హార్మోన్లను, మందులను మరియు రక్తంలో ఉండే ఇతర క్రిమికీటకాలన్నింటిని, వాటి యొక్క కణజాలాలను కాలేయం తీసివేస్తుంది.ఆ తర్వాత వాటి యొక్క నిర్మాణాన్ని మార్చివేస్తుంది లేదా అవి పూర్తిగా పనిచేయకుండా చేస్తుంది. వివిధ ప్రక్రియల ద్వారా ఇవన్నీ చేసిన తర్వాత, మూత్రపిండాల ద్వారా శరీరం నుండి వాటన్నింటిని బయటకు పంపిస్తుంది. ఒకేవేళ గనుక విషపదార్ధాలు మరియు హార్మోన్లు విపరీతంగా ఉన్నట్లైతే, అవి కాలేయంలోనే కాకుండా, శరీరంలోని ఇతర భాగాల్లో కొవ్వు రూపంలో నిక్షిప్తం అయి ఉంటుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే శోషరసంలో మూడో వంతు నుండి సగభాగం వరకు కాలేయము ఉత్పత్తి చేస్తుంది. శోషరస వ్యవస్థ సరైన పద్దతిలో పనిచేయాలంటే కాలేయ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఒకవేళ సరైన సమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోకపోతే, సరైన జీవన విధానాన్ని అలవర్చుకోకపోతే, పాశ్చాత్య పోకడలను ఎక్కువగా అలవర్చుకుంటే లేదా అధిక హార్మోన్లు గనుక శరీరంలో ఉంటే, అటువంటి సమయంలో సరైన పద్దతిలో కాలేయం పనిచేయలేదు. అంతేకాకుండా తగిన మోతాదులో శోషరసాన్ని ఉత్పత్తి చేయలేదు. దీని వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది మరియు వివిధరకాల రోగాలు చుట్టుముడతాయి.

ఆముదము నూనె ప్యాక్ ని ఎలా వాడాలి :

ఆముదము నూనె ప్యాక్ ని ఎలా వాడాలి :

ప్రధమ చికిత్స డబ్బాలో ఉండే కంబళి బట్ట తీసి ఆముదము నూనె లో బాగా నాననివ్వండి. ఆ తర్వాత చర్మంపై ఉంచండి. ఆ కంబళి బట్టని ఒక ప్లాస్టిక్ షీట్ తో కప్పివేయండి. ఆ తర్వాత వేడిగా ఉండే నీళ్ల బాటిల్ ని లేదా వేడిగా ఉండే ఏదైనా ప్యాక్ ని తీసుకొని ఆ ప్లాస్టిక్ షీట్ పై పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా క్రింద ఉంచిన ఆముదము ప్యాక్ వేడెక్కుతుంది. ఈ మొత్తాన్ని ఏదైనా టవల్ తో కప్పివేసి విశ్రాంతి తీసుకోండి.

సంతానోత్పత్తితో బాధపడే వారు ఈ ఆముదము ఆయిల్ ప్యాక్ ని కడుపు క్రింది భాగంలో పెట్టుకుంటే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి.

జాగ్రత్తలు :

జాగ్రత్తలు :

ఆముదము నూనెను ఎప్పుడు గాని నోటి ద్వారా సేవించకూడదు లేదా శరీరం లోపలకి తీసుకోకూడదు. పగిలిన చర్మానికి రాయకూడదు. గర్భం దాల్చినవారు, పాలు ఇచ్చేవారు లేదా రుతుక్రమం సమయంలో దీనిని అస్సలు వాడకూడదు . మీరు గనుక సంతానాన్ని కావాలి అని అనుకున్నట్లైతే, ఆ సమయంలో మాత్రమే వాడండి. ఒకసారి మీరు గర్భం దాల్చారు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను నిలిపివేయండి.

ఆముదము నూనె ప్యాక్ ని ఎలా తయారుచేసుకోవాలి :

ఆముదము నూనె ప్యాక్ ని ఎలా తయారుచేసుకోవాలి :

పదార్ధాలు :

ప్రధమ చికిత్స డబ్బాలో ఉండే కంబళి లాంటి బట్ట

ఆముదము నూనె డబ్బా

మనం తీసుకున్న బట్ట కంటే కూడా ఓ రెండు ఇంచీలు వెడల్పుగా ఉండే ఒక ప్లాస్టిక్ షీటు ( దీనిని ఏదైనా ప్లాస్టిక్ బ్యాగ్ నుండి కత్తిరించుకోవచ్చు)

వేడి నీళ్ల బాటిల్

మూత ఉన్న డబ్బా

పాత బట్టలు మరియు షీట్లు. ఆముదము బట్టలు లేదా పరుపుకు అంటుకుంటే ఆ మరకలు అలానే ఉండిపోతాయి.

క్రమపద్ధతిలో పాటించాల్సిన సూచనలు :

క్రమపద్ధతిలో పాటించాల్సిన సూచనలు :

1. ఒక పాత్రలో ఆముదము నూనె వేసి అందులో పైన చెప్పిన కంబళి లాంటి బట్టని బాగా నానబెట్టాలి అంతేగాని ఆముదము నూనె ఆ బట్ట నుండి బొట్టు బొట్టులా కారేవిధంగా నానబెట్టకూడదు.

2. ఈ ఆముదము ప్యాక్ ని అవసరమున్న శరీరభాగాల పై ఉంచండి .

3. అలా ఉంచిన బట్టని ఒక ప్లాస్టిక్ షీట్ తో కప్పండి.

4. ఆ ఆముదము నూనె ప్యాక్ పై వేడి నీళ్ళ బాటిల్ ని ఉంచి, దానిని 30 నుండి 40 నిమిషాల వరకు అలా వదిలేయండి. ఈ ప్యాక్ ని అలా ఉంచేసి మీరు కొద్ది సేపు విశ్రాంతిని తీసుకోండి.

5. ప్యాక్ తీసేసిన తర్వాత, ఆ ప్రదేశాన్ని అంతా వంట సోడా కలిపిన నీటి తో శుభ్రపరచండి.

6. ఆముదము నూనె ప్యాక్ ని మూసి ఉన్న పాత్రలో ఉంచి రెఫ్రిడ్జిరేటర్ లో భద్రపరచండి. ఒక ఆముదము ప్యాక్ ని 25 నుండి 30 సార్లు వాడవచ్చు.

English summary

Castor Oil Therapy for Reproductive Health

Castor oil has been traditionally used to aid in cases with inflammation, pain, growths or when increased circulation was desired. When it comes to fertility Castor Oil packs could be a great, supportive and relaxing therapy for:
Subscribe Newsletter