For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవ వేదనను పెంచే కొన్ని పరిస్థితులు

|

గర్భిణీ స్త్రీలు త్వరలో తాము తల్లి కాబోతున్నామనే వాస్తవాన్ని తలుచుకుని ఉద్వేగభరితం అవుతారు. కానీ తల్లి కాబోయే ఈ ప్రయాణంలో, కొన్ని అనుభవాలు విపరీతమైన బాధ, భయంతో కూడుకుని ఉంటాయి. జన్మనిచ్చేటప్పుడు కలిగే నొప్పులను ఎవరూ తప్పించుకోలేరు. ప్రతి తల్లి ఈ అనుభవానికి లోనవ్వాల్సిందే!

ప్రసవ వేదనను తప్పించుకునే మార్గం లేనప్పటికీ, ఆ నొప్పిని కొంతమేరకు తగ్గించే మార్గాలు అనేకం ఉన్నాయి. నొప్పులు మొదలయ్యే సమయంలో , చేపట్టవలసిన కొన్ని చర్యలు ఉన్నాయి.


అదేవిధంగా, కొన్ని చర్యలను నివారించాలి. లేదంటే నొప్పులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా అనవసర నొప్పులను తప్పించుకోవచ్చు.

ఈ రోజు మనం, బిడ్డను ప్రసవించే సమయంలో సాధ్యమైనంతవరకు నొప్పిని తగ్గించాలంటే, ఏ ఏ పనులు చేయరాదో తెలుసుకుందాం.

మరింకెందుకు ఆలస్యం.. చదివేయండి!

• వెల్లకిలా పడుకోవడం:

• వెల్లకిలా పడుకోవడం:

బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు, చాలామంది వెల్లకిలా పడుకుని ఉంటారు. కానీ, ఇలా పడుకోవడం వలన బిడ్డ బరువు మీ నడుము మీద పడుతుంది. దీని వలన మీ ప్రసవం మరీంత బాధాకరంగా మారుతుంది. ఈ భంగిమలోనే నొప్పి అధికంగా ఉంటుంది. ఈ భంగిమ, మీ రక్తప్రసరణను కూడా అడ్డుకుంటుంది.

మీ వైద్యుని సలహా తీసుకుని, ప్రసవ వేదన సందర్భంలో, కొంతసమయం పాటైనా నిటారుగా ఉండటమో లేదా ముందుకు వంగినట్టు ఉండటానికో, వీలు కుదురుతుందేమో కనుక్కోండి.

• ప్రసవ వేదన పట్ల భయం పెంచుకోవడం:

• ప్రసవ వేదన పట్ల భయం పెంచుకోవడం:

తొలిచూలు గర్భిణులకు ప్రసవ వేదన పట్ల భయం అధికంగా ఉంటుంది. ఇదివరకు ఈ అనుభవం ఉన్నవారు కూడా, ఇంతకు మునుపు కలిగిన నొప్పులను గుర్తుకు తెచ్చుకుని భయపడుతుంటారు. ఎలాగైనా కానీ, ఇటువంటి అనవసర భయాల వలన అవసరానికి మించిన నొప్పి అనుభవంలోకి వస్తుంది. ఈ భయాల వలన శరీరంలో ఒత్తిడి పెరిగి శ్వాస సరిగ్గా అందదు.

ఇటువంటి భయాలను నివారించడానికి, జన్మనిచ్చే ప్రక్రియకు సంబంధించిన పరిజ్ఞానం పెంచుకోవడానికి దోహదపడే విషయాలను గురించి చదివి తెలుసుకోవాలి. గర్భధారణ మరియు ప్రసవానికి సంబంధించిన అవగాహన కల్పించే గ్రూపులలో సభ్యులుకండి. ఇటువంటి గ్రూపులు అంతర్జాలంలో ఎన్నో ఉన్నాయి. మంచి సాంగత్యం ఉన్నప్పుడు మీ దృష్టి, ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించడం పైన తప్ప, ఈ ప్రక్రియ వలన కలిగే నొప్పిపై నిలువదు. మీరు గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, ఇంత కష్టం వెనుక ఒక ముద్దులొలికే చిన్నారి మీకు జన్మించడమనే ఆనందం దాగి ఉంది.

మీ పొట్టలో పాపాయి పొత్తిళ్లలోకి అడుగుపెట్టబోతుంది.

• అవసరమైన సహకారం అందకపోవడం:

• అవసరమైన సహకారం అందకపోవడం:

గర్భధారణ సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే, మీరు ముందుగా సంప్రదించవలసింది ప్రసూతి వైద్య నిపుణులే అయినా, వారు ప్రసూతి గదిలో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఆ ఆస్పత్రిలో పనిచేసే ఇతర సిబ్బంది లేదా మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

మీకు బాగా కావలసిననవారు మీ చెంత ఉంటే, అది మీకు అంతా సక్రమంగా జరిగిపోతుందనే మనో నిబ్బరాన్ని ఇస్తుంది. వైద్యుని సంప్రదించి, ప్రసవ సమయంలో మీ వద్ద ఉండబోయే సిబ్బందిని కలుసుకోండి. ఇలా చేస్తే మీకున్న భయాలు మరియు అపోహలు తొలగిపోతాయి.

• జన్మనిచ్చేటప్పుడు ఒత్తిడిని పెంచే వాతావరణం లేకుండా చూసుకోవాలి:

• జన్మనిచ్చేటప్పుడు ఒత్తిడిని పెంచే వాతావరణం లేకుండా చూసుకోవాలి:

ప్రసవించే గదిలో మీపై ఒత్తిడి కలిగించే వాతావరణం లేకుండా జాగ్రత్తపడడం తప్పనిసరి. ఇలా చేస్తే మీరు ప్రసవించే సమయంలో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీరు ఎన్నుకున్న ఆస్పత్రి సురక్షితమైనదై, మంచి పేరు కలిగినదై ఉండేలా చూసుకోండి.

మీరు ప్రసవించేటప్పుడు వైద్య పరికరాలు ఏవి అడ్డు తగలకుండా ఉండేట్లు, ఆస్పత్రి యాజమాన్యంతో ముందుగానే మాట్లాడుకోండి. ప్రసవానికై మీరు బిడ్డను బయటకు నెట్టే ప్రయత్నంలో ఉన్నప్పుడు, ఆ పరిసరాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తూ, మీ ఏకాంతానికి భంగం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే ప్రసూతి గదిని సందర్శించి, మీరు అక్కడ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు, సౌకర్యవంతమైన వాతావరణం నెలకొని ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోండి.

• కృత్రిమ పద్ధతుల ద్వారా నొప్పులను వేగవంతం చేయడాన్ని నిరోధించాలి:

• కృత్రిమ పద్ధతుల ద్వారా నొప్పులను వేగవంతం చేయడాన్ని నిరోధించాలి:

కొన్ని సందర్భాలలో, ప్రసవించే ప్రక్రియను వేగవంతం చేయడానికి, కృత్రిమంగా నొప్పులను ప్రేరేపించడానికి, లేదా కృత్రిమంగా నొప్పులను వేగవంతం చేయడానికి వైద్యులు కొన్ని మందులను వాడవలసి వస్తుంది. మీలో ప్రసవ ప్రక్రియ పురోగమనం కనుక సహజంగా బాగానే ఉన్నట్లయితే, కృత్రిమ పద్ధతులను అవలంబించవద్దు.

ఆక్సిటోసిన్ ను కృత్రిమంగా వాడటం వలన ప్రసవం వేగవంతమైనప్పటికి, నొప్పులతీవ్రత అధికంగా ఉంటుంది. మరికొన్ని పద్ధతుల ద్వారా కూడా ప్రసవ వేదనను ప్రేరేపించవచ్చు. కానీ, వీటివల్ల నొప్పి భరింపశక్యం కానీ నొప్పులు రావచ్చు. కనుక అనివార్య కారణాల వల్ల తప్పితే, సహజసిద్ధంగా ప్రసవించడమే ఉత్తమం.

English summary

Factors That Worsen Labor Pain

The most crucial time during your pregnancy is the labor pain. There are certain things that you need to avoid, as these will eventually increase your labor pain. During labor pain being upright or in forward leaning position could be helpful, as lying on back can increase the pain.Factors That Worsen Labor Pain
Story first published:Saturday, June 9, 2018, 12:51 [IST]
Desktop Bottom Promotion