For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్కింగ్ మామ్ గిల్ట్ ని అధిగమించే 5 చిట్కాలు

|

తల్లిగా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఈ సృష్టిలో తల్లికుండే స్థానం ప్రత్యేకమైంది. అయితే, ఈ మధ్యకాలంలో ఉద్యోగబాధ్యతలను పురుషులతో పాటు స్త్రీలు కూడా పంచుకుంటున్నారు. ఆ విధంగా బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కూడా ఉద్యోగబాధ్యతలు తీసుకోవడానికి ఎంతో మంది స్త్రీలు ముందుకువస్తున్నారు. ఇది ఒక విధంగా అభినందనీయం. అయితే, కొన్నాళ్ల తరువాత వర్కింగ్ మామ్స్ కాస్తంత అపరాధభావానికి గురవడం సాధారణమైంది. ఈ నిర్ణయం పట్ల తమను తామే నిందించుకోవడం మనం గమనించవచ్చు. ఇలా మీరు తరచూ ఆందోళనకు గురవటం వలన మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించలేరు.

వివిధ అంశాలు వర్కింగ్ మామ్ కి ఆందోళనని కలిగించేందుకు కారణమవుతాయి. పిల్లల ఎదుగుదలలో కొన్ని మైల్ స్టోన్స్ ని మిస్ అవడం, ఇంట్లోని పిల్లలతో సమయాన్ని కేటాయించలేకపోవటం, దగ్గరుండి వారికి భోజనాన్ని తినిపించలేకపోవటం, వారితో ఎమోషనల్ బాండింగ్ సరైన విధంగా ఏర్పడకపోవటం వంటివి ఉద్యోగబాధ్యతలను నిర్వర్తించే తల్లులను ఆందోళనకు గురిచేసే అంశాలు.

5 Tips To Overcome Working Mom's Guilt

అయితే, ఈ అయిదు చిట్కాల ద్వారా వర్కింగ్ మామ్స్ గిల్ట్ ని అధిగమించవచ్చు. సమాజం నుంచి కూడా వీరికి కొన్ని సమయాలలో వ్యతిరేకత ఏర్పడుతుంది. పిల్లల బాధ్యతను ఇంట్లో అప్పచెప్పి ఉద్యోగానికే ప్రాధాన్యతనిస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే, అందరి మాటలను పట్టించుకోకుండా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దానికి కట్టుబడి ఉండటం సహజం.

మీరు ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందు ఆ నిర్ణయం వలన కలిగే పాజిటివ్స్ ని అలాగే నెగటివ్స్ ని అంచనా వేసుకుని నిర్ణయాన్ని తీసుకోవడం ఉత్తమం. ఎక్కువ పాజిటివ్స్ ఉన్న అప్షన్ ని ఎంచుకోవడం మంచిది.

అలాగే, మీ ఫ్యామిలీ టైమ్ ని అలాగే మీ వర్కింగ్ టైమ్ ని సరైన విధంగా బాలన్స్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఈ పరిస్థితిని చక్కగా డీల్ చేయడానికి ఎన్నో ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. వర్కింగ్ మామ్ గిల్ట్ ని తొలగించుకునే అయిదు చిట్కాలను మీకు ఈ రోజు తెలియచేస్తున్నాము.

5 Tips To Overcome Working Mom's Guilt

కుటుంబానికి సమయాన్ని కేటాయించండి: మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ సమయాన్ని సాధ్యమైనంత వరకూ సద్వినియోగపరుచుకోవడానికి ఉపయోగించుకోండి. సాధ్యమైనంత ఫ్రీ టైమ్ ను మీ ఫ్యామిలీతో గడపడానికి ప్రయత్నించండి. తద్వారా, ప్రతి మూమెంట్ ను మధురమైన జ్ఞాపకంగా మరల్చుకోండి. ఈ విధంగా చేస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని మిస్ అయినట్లు భావించరు. నిజానికి, వారి నుంచి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభించే అవకాశముంది. వర్కింగ్ మదర్ సమస్యని నివారించేందుకు ఇదొక అద్భుతమైన చిట్కా.
5 Tips To Overcome Working Mom's Guilt

టెక్నాలజీని వినియోగించండి: ఆధునిక టెక్నాలజీని చక్కగా సద్వినియోగం చేసుకోండి. వర్క్ ప్లేస్ లో కాస్త సమయం చిక్కినప్పుడు మీ ప్రియమైన వారితో చాట్ చేసుకుని, మాట్లాడి మీ మధ్యనున్న దూరాన్ని తొలగించుకోండి. వర్కింగ్ మదర్ గిల్ట్ ని తొలగించుకునేందుకు ఇదొక అద్భుతమైన చిట్కా. మీ పిల్లలతో వీడియో ఛాట్ ని చేయడం ద్వారా వారి గురించి మీరు అనుక్షణం ఆలోచిస్తున్నారన్న విషయాన్ని మీ పిల్లలు గుర్తిస్తారు. తద్వారా, మీ మధ్య బాండింగ్ ఏర్పడుతుంది.

5 Tips To Overcome Working Mom's Guilt

రిలాక్స్ అవ్వండి: ఎప్పుడూ ఒత్తిళ్లతో సతమతమయ్యేవారికి ఆందోళన అధికంగా ఉంటుంది. రిలాక్స్ అయితే ఆనందంగా కుటుంబసభ్యులతో గడిపే అవకాశం ఉంటుంది. వర్కింగ్ మామ్ గిల్ట్ ని తగ్గించుకునేందుకు మీరు తగిన విశ్రాంతిని తీసుకుని ఉత్తేజాన్ని పొందాలి. తద్వారా, ఫామిలీతో గడిపే సమయాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు మీ విలువైన ఫామిలీని తలచుకుని మరికొన్ని గంటలలో వారితో గడిపేందుకు సిద్ధమవుతున్న సంగతిని గుర్తించండి. ఈ ఆలోచనే మీకు అమితమైన రిలాక్సేషన్ ను ప్రసాదిస్తుంది.
5 Tips To Overcome Working Mom's Guilt

పిల్లల భద్రతకు చర్యలు తీసుకోండి:

పిల్లల భద్రత విషయమైన వర్కింగ్ మదర్స్ తరచూ ఆందోళనకు గురవుతారు. ఇంట్లోని పిల్లలు ఎలా ఉన్నరోనన్న ఆలోచన వారికి పనిమీద ధ్యాస లేకుండా చేస్తుంది. ఇంట్లోని, పిల్లలను చూసుకునే కుటుంబసభ్యులు లేనప్పుడు పిల్లల భద్రత కోసం నానీని గాని డే కేర్ ని గాని సెలెక్ట్ చేసేముందు భద్రత విషయంలో తగినంత సమాచారాన్ని పొందండి. తద్వారా, వర్కింగ్ మామ్ గిల్ట్ నుంచి మీరు ఉపశమనం పొందుతారు. పిల్లల్ని ఒంటరిగా వదిలేశామన్న భావన కంటే వారిని భద్రంగా ఉంచుతున్నామన్న ఆలోచన మీకు వర్కింగ్ మామ్ గిల్ట్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

5 Tips To Overcome Working Mom's Guilt

మిమ్మల్ని మీరు అభినందించుకోండి: మీరు వర్కింగ్ వుమెన్. అంటే, అటు ఇంట్లోని బాధ్యతలతో పాటు ఇటు ఉద్యోగబాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. మీరు చాలా తెలివైనవారు. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కూడా మీరు ఉద్యోగబాధ్యతలను తీసుకునే ధైర్యం చేశారు. మీరు ఫైనాన్షియల్ గా ఇండిపెండెండ్ వుమెన్. అలాగే మీరు స్మార్ట్ మదర్. ఆఫిస్ పనులని అలాగే ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపే సమయాన్ని సమర్థవంతంగా మేనేజ్ చేస్తున్నారు. వీటిని గుర్తించి వర్కింగ్ మామ్ గిల్ట్ నుంచి త్వరగా బయటికి వచ్చేయండి మరి.

English summary

5 Tips To Overcome Working Mom's Guilt

It's extremely difficult to be a mother and a working woman. But once you choose to be a working woman, the major problem that arise is the guilt that you would feel about your decision. This will make you constantly worried about the practical aspect of your decision.There are many factors that contribute to this. Missing the growth milestones of children, their safety at home, giving food in time or breakage of emotional link can be the reasons that make a woman worried and guilty.
Story first published:Wednesday, February 7, 2018, 14:55 [IST]
Desktop Bottom Promotion