గర్భిణీ స్త్రీల తలనొప్పి నివారణా చర్యలు

Subscribe to Boldsky

గర్భిణీ స్త్రీలు తరచుగా శారీరక మరియు హార్మోన్ల అసమతౌల్యానికి గురవుతూ ఉంటారు. ఇది శరీరంలోని అనేక రుగ్మతలకు దారితీస్తుంది. ఈ రుగ్మతల కారణాన అశాంతికి, అసౌకర్యానికి తరచూ లోనవుతూ ఉంటారు.

గర్భిణీ స్త్రీల ప్రధాన సమస్యలలో పునరావృత తలనొప్పి తరచుగా వినిపించే సమస్య. ఇది ప్రముఖంగా మొదటి మరియు చివరి త్రైమాసికం లో వస్తుంటుంది.

ఈసమయంలో తలనొప్పికి ప్రధాన కారణాలు హార్మోన్ల అసమతౌల్యం, రక్తం లో చక్కర నిల్వలు, డీ హైడ్రేషన్, సరైన నిద్ర లేకపోవడం, మరియు ఒత్తిడి.

గర్భిణీ స్త్రీలకు సురక్షితం కాని పద్దతులు అనేకం ఉన్నాయి. అందులో ప్రధానమైనది, సాధారణ రుగ్మతలకు సురక్షితం కాని మందులను డాక్టర్లను సంప్రదించకుండా వినియోగించడం.

గర్భం దాల్చిన స్త్రీలలో ప్రముఖంగా భాదించే సమస్య ఈ తలనొప్పి. ఇది అశాంతితో పాటు అసౌకర్యానికి గురిచేస్తూ ఉంటుంది. దీనిని నివారించుటకు అనేక సురక్షితమైన సాధారణ పద్దతులు ఉన్నాయి. ఆ నివారణా చర్యలు మీకోసం.

అన్నిటికన్నా ముఖ్యం విశ్రాంతి:

అన్నిటికన్నా ముఖ్యం విశ్రాంతి:

తలనొప్పి నివారణా చర్యలలో విశ్రాంతి అనునది ప్రముఖంగా చెప్పబడినది. స్వచ్చమైన గాలి పీల్చడం, పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుకోవడం, చక్కటి సంగీతం వినడం, ఎక్కువ కాంతిని వెదజల్లే లైట్లను వినియోగించకుండా ఉండడం, రణగొణ ధ్వనులకు కాలుష్య కోరలకు దూరంగా ఉంటూ సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా తలనొప్పికి దూరంగా ఉండవచ్చు.

అవసరమైన మేర తినడం:

అవసరమైన మేర తినడం:

గర్భం దాల్చినవారు, తమతో పాటి గర్భం లోని శిశువుకి కూడా ఆహారం ఇవ్వాలి అని అపోహ తో ఎక్కువ మోతాదులో తింటూ ఉంటారు. అది సరైన పద్దతి కాదు. పైగా ఇది వేరే సమస్యలకు దారితీస్తుంది. సమయానుసారం సరైన మోతాదులో భోజనం చేయడం ఉత్తమం. ఇది మీ శరీర జీవప్రక్రియ ను మెరుగుపరచి తలనొప్పి లాంటి సమస్యలు దరిచేరనీకుండా చూస్తుంది.

నీరు అన్నిటికన్నా శ్రేష్టం:

నీరు అన్నిటికన్నా శ్రేష్టం:

గర్భిణీ స్త్రీలు రోజుకి కనీసం 8 నుండి 12 గ్లాసుల నీటిని తాగాల్సిందిగా సూచన చేయబడినది. నీటిని సరిగ్గా తీసుకోని పక్షంలో శరీరం డీహైడ్రేషన్ కు గురై తద్వారా తలనొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కావున సమయానుసారం నీటిని కాని, డాక్టర్లు సూచించిన పండ్ల రసాలను కాని స్వీకరించడం మంచిది. తలనొప్పి లక్షణాలు ప్రారంభం అయిన వెంటనే రెండు గ్లాసుల నీళ్ళు తాగడం వలన ఉపశమనం పొందవచ్చు.

భంగిమ:

భంగిమ:

కంప్యూటర్ ముందు కూర్చునే విధానం, స్క్రీన్ ఉండు విధానం సరిగ్గా లేకపోయినా , ఎత్తైన దిండ్లు తలకు ఎత్తుగా వాడడం వంటి క్రియల ద్వారా తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చివరి మూడునెలల్లో మీరు ఉన్న భంగిమల ఆధారంగా కూడా తలనొప్పులు వస్తుంటాయి. ఆ భంగిమ సరైనది కాదు అని మన దృష్టికి వచ్చినప్పుడు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒత్తిడిని జయించండి:

ఒత్తిడిని జయించండి:

గర్భం దాల్చిన స్త్రీకి ప్రధాన సమస్య ఈ ఒత్తిడి. సరైన సమయంలో దీనిని గుర్తించకపోతే రక్తపీడనం వంటి సమస్యలకు దారితీసి గర్భం దాల్చిన స్త్రీకి, మరియు గర్భస్థ శిశువుకు కూడా సమస్యలు తలెత్తవచ్చు. కావున ఒత్తిడిని దూరం చెయ్యడం ఉత్తమం. ఆహ్లాదకరమైన పాటలు వినడం, పరిసరాలను ఆహ్లాదకరం గా మార్చడం, ప్రియమైన వారితో సమయపాలన, ఇష్టమైన పనుల్లో నిమగ్నమవ్వడం లాంటి వాటి ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. తద్వారా తలనొప్పులకు, BP లాంటి రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు.

మర్దన :

మర్దన :

నిజం, మర్దన అనునది తలనొప్పికి ప్రధాన నివారణా మార్గంగా చెప్పబడినది. కాని దీనికి మీ ప్రియమైన వారి సహకారం కూడా అవసరం. ఈ మసాజ్ ఒత్తిడిని తొలగించడమే కాకుండా మానసిక ప్రశాంతతని ఇస్తుంది.

వేడి మరియు చల్లని పదార్ధాల వినియోగం:

వేడి మరియు చల్లని పదార్ధాల వినియోగం:

గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్ ను కనుబొమ్మలకు , కళ్ళకు , ముఖానికి అద్దడం ద్వారా మరియు చల్లటి ఐస్ పాక్ ని కాని, చల్లని నీటిలో ఉంచిన టవల్ ని కాని, మెడ వెనుక భాగంలో అద్దడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

క్రమం తప్పకుండా వ్యాయామం:

క్రమం తప్పకుండా వ్యాయామం:

గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చెయ్యల్సిందిగా సూచించబడుతారు. సున్నితమైన వాకింగ్, స్విమ్మింగ్, లేదా గర్భధారణ వ్యాయామాలను డాక్టర్ సలహా మేరకు సమయానుసారం చెయ్యడం ద్వారా శరీర జీవక్రియ (METABALISM) బాగా పనిచేసి ఒత్తిడిని దూరం చేసి తద్వారా తలనొప్పులను రానివ్వకుండా ఆపుతుంది. .

సమయానుసారం నిద్ర:

సమయానుసారం నిద్ర:

గర్భిణీ స్త్రీలు సాధారణ నిద్ర నమూనాను అనుసరించడం చాలా ముఖ్యం. అన్నీ రోజుల్లోనూ ఒకేసమయంలో నిద్రకి ఉపక్రమించేలా, ఒకేసమయంలో నిద్ర లేచేలా సమయాన్ని పట్టిక చేసుకోవాలి. మొట్టమొదటి త్రైమాసికంలో, సాధ్యమైనంత ఎక్కువ నిద్రపోవడం మంచిది. ఈవిధంగా చేయడం తలనొప్పులు దగ్గరకు రాకుండా చేస్తుంది.

తైలమర్ధనం:

తైలమర్ధనం:

పెప్పర్మింట్(పుదీనా ఆకులు), లావెండర్ నూనెతో చేయు మర్దనం తలనొప్పికి నివారణగా పని చేస్తుంది. 3, 4 చుక్కల తైలాన్ని కణజాలం పై అప్లై చేసి ఊపిరిని నెమ్మదిగా తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. కాని ఇది అన్నీ వేళలా మంచిది కాదు అని సూచించబడినది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Headache Remedies For Pregnant Women | Headache Remedies Pregnancy | Headache Cures Pregnancy

    Pregnancy is a time during which women undergo a series of physical and hormonal changes. This often results in various ailments in the expectant mother. The changes in your body will be reflected as various pregnancy discomforts.One of the main complaints of pregnant women is recurring headaches. The frequency of this will vary from woman to woman. Headaches during pregnancy are commonly frequent during the first and last trimesters.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more