For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  గర్భంపై గ్లైఫోసేట్ దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోండి!

  |

  గ్లైఫొసేట్ అనేది గ్లైసిన్ అనే సహజమైన అమైనో ఆమ్లం యొక్క అమినోఫాస్ఫోనిక్ సారూప్యం. దీనిని కలుపు నాశిని (హెర్బిసైడ్)గా మరియు కలుపు మొక్కలు ఎండిపోయేట్టు చేసేందుకు (డెసికెంట్) వినియోగిస్తారు. దీనిని పంటల మధ్య పెరిగే కలుపు మొక్కల నివారణకు, ముఖ్యంగా వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు మరియు గడ్డి జాతి మొక్కల నివారణకు వాడతారు. పంటకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కలుపును మాత్రమే నివారిస్తుంది కనుక దీనిని విస్తృతంగా వాడతారు. కానీ, దీనిని పంటలు కూడా వెంటనే శోషించుకుంటాయి!

  సంవత్సరాలుగా చేసిన అనేక పరిశోధనలలో గ్లైఫొసేట్ మనుషులలో క్యాన్సర్ కారకం కావచ్చని తేలింది. ఆహారం ద్వారా గ్లైఫొసేట్ శరీరంలోనికి చేరితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు.

  కానీ గ్లైఫొసేట్ నందు వివిధ ఫార్ములేషన్స్ మన శరీరానికి తాకినప్పుడు, శరీరంను రకరకాలుగా ప్రభావితం చేస్తాయి. చర్మాన్ని తాకినప్పుడు కాలినట్టు గాయాలు, బొబ్బలు కలుగజేస్తుంది. ముక్కు ద్వారా పీలిస్తే నాసల్ కేవిటీలలో అసౌకర్యం మొదలైన సమస్యలు కలుగుతాయి. కొన్ని తీవ్రమైన సందర్భాలలో మూత్రపిండాలు మరియు కాలేయంనకు నష్టం కలుగుతుంది. మెటబాలిక్ అసిడోసిస్, హైపర్కలేమియా వంటి వ్యాధులకు లోనయ్యి చివరకు చనిపోయే అవకాశం ఉంది.

  Heres How Pregnancy Gets Adversely Affected For Lifetime By Glyphosate Levels

  గ్లైఫొసేట్ అత్యధిక ప్రభావం గర్భవతులపై చూపిస్తుంది. గర్భధారణ కాలం కొంతమేరకు తగ్గినా బిడ్డపై జీవితకాలానికి సరిపడా ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. పుట్టక మునుపే బిడ్డకు శాశ్వతంగా నిలిచిపోయే హాని జరగవచ్చు.ఒకవేళ బిడ్డ జన్మించినప్పటికి శారీరక ఎదుగుదలలో లోపాలు ఉండవచ్చు.

  అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పర్యావరణ ఆరోగ్యం విభాగం "గ్లైఫొసేట్ మరియు గర్భధారణ మధ్య సంబంధం" అనే విషయం పై సర్వే చేపట్టింది. ఈ సర్వే యొక్క ప్రధాన పరిశోధకుడిగా IU లో ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్స్ శాఖలో సహాయ ఆచార్యులైన షాహిద్ పర్వేజ్ మరియు రిచర్డ్ ఎం, ఫెయిర్ బ్యాంక్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, IUPUI చురుకుగా పాల్గొన్నారు.

  18 నుండి 40 ఏళ్ల మధ్య అన్ని వయస్సుల గర్భిణీ స్త్రీలను మొత్తం 77 మందిని తీసుకుని జూన్ 2015 నుండి జూన్ 2016 మధ్య కాలంలో పరిశోధనలు చేశారు.

  Heres How Pregnancy Gets Adversely Affected For Lifetime By Glyphosate Levels

  వీరిపై గ్లైఫొసేట్ యొక్క ప్రత్యక్ష ప్రభావాన్ని అంచనా వేయడానికి మూత్ర నమూనాలలో గ్లైఫొసేట్ స్థాయిని కొలిచారు. ఈ అధ్యయనం 93% స్త్రీల మూత్రనమూనాలలో గ్లైఫొసేట్ స్థాయిలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

  పట్టణ ప్రాంతాల స్త్రీలతో పోలిస్తే, కెఫిన్ తో కూడిన పానీయాలు అధికముగా సేవించే గ్రామీణ ప్రాంత స్త్రీలలో గ్లైఫొసేట్ గాఢత అధికంగా ఉంది.

  ప్రారంభంలో ప్రజా తాగునీటి వ్యవస్థ అధిక గ్లైఫొసేట్ స్థాయికి ప్రాధమిక కారణంగా అనుకున్నారు. కానీ తరువాత నీటిలో గ్లైఫొసేట్ స్థాయిని కొలిచేందుకు పరీక్షలు నిర్వహించారు. ఒక్క నీటి నమూనాలో కూడా గ్లైఫొసేట్ జాడలు నమోదు కాలేదు.

  అప్పుడు వారికి ఆ స్త్రీలు సేవించే జన్యుమార్పిడి ఆహార పదార్థాలపై మరియు కెఫిన్ తో కూడిన పానీయాలపై అనుమానం వచ్చింది. వారి అనుమానం నిజమైంది. చాలా వరకు గ్లైఫొసేట్ ను మొక్కజొన్న మరియు సోయా బీన్ పంటల ఉత్పత్తికై వాడతారు. వీటిని సేవించడం వలన వారి శరీరంలోని గ్లైఫొసేట్ అవశేషాలు నేరుగా ప్రవేశించాయి.

  "ఈ పరిశోధన యొక్క పరిధి విస్తృతమైనది కానప్పటికీ, పరిమితమైన ప్రాంతీయ మరియు జాతి వైవిధ్యంతో కూడుకున్నప్పటికిని, ఇది ఆహారంలో గ్లైఫోసెట్ అవశేషాలకు మరియు గర్భిణీ స్త్రీల యొక్క గర్భధారణ కాలపరిమితికి ప్రాముఖ్యతతో కూడిన సహసంబంధం ఉందని చెప్పడానికిి సాక్ష్యంగా నిలిచింది" అని షాహిద్ పర్వేజ్ అభిప్రాయపడ్డారు.

  Heres How Pregnancy Gets Adversely Affected For Lifetime By Glyphosate Levels

  గ్లైఫోసేట్ ప్రభావం వలన కొన్ని ప్రయోగశాల జంతువుల పిండాలలో లోపాలు చూడవచ్చాయి. కేవలం గర్భవతులను మాత్రమే కాక వారికి పుట్టబోయే పిల్లలపై కూడా దుష్ప్రభావాలు ఉంటాయి.

  ఈ కలుపునాశక మందు నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తుంది. మొదటి త్రైమాసికంలో పిండంలో నాడీ వ్యవస్థ అభివృద్ధి జరగడం మొదలవుతుంది. కనుక ఈ సమయంలో గ్లైఫోసేట్ కు వీలైనంత దూరంగా ఉండటం శ్రేయస్కరం.

  మొదటి త్రైమాసికం చాలా కీలకమైనది. ఈ సమయంలో నాడీ నాళం అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో జాగ్రత్తగా ఉండకపోతే, ఎదుగుతున్న పిండానికి ఎక్కువగా హానిజరిగే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే, గ్లైఫోసేట్ తల్లిపాల ద్వారా కూడా బిడ్డలోనికి మనకు తెలియకుండానే ప్రవేశిస్తుంది.

  గ్లైఫోసేట్ ను ఉపయోగించకుండా పండించిన పంటలను వినియోగించడం ఉత్తమం. ప్రజలు గ్లైఫోసేట్ యొక్క దుష్ప్రభావాల గురించి చైతన్యవంతులై సహజముగా పండించిన ఆహారం తినడానికి మొగ్గుచూపుతున్నారు.

  గర్భవతులు గ్లైఫోసేట్ యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా ఉండాలంటే ఆహారాన్ని ఎన్నుకునేటప్పుడు తగు మాత్రం జాగ్రత్తలు తీసుకుంతే చాలు. మీరు కనుక గ్లైఫోసేట్ ను అధికంగా వినియోగించే వ్యవసాయ భూములకు దగ్గరగా నివాసముండేవారైతే, ఆ తొమ్మిది నెలల కాలంలో దూరంగా ఉండటం మేలు.

  English summary

  Here's How Pregnancy Gets Adversely Affected For Lifetime By Glyphosate Levels

  A study revealed that Glyphosate - a weed killer - is related to shortened length of pregnancy. This shortened gestational period can lead to adverse consequences. The research was carried out on a small group of women in the US, which revealed a link between shortened pregnancy period and maternal glyphosate exposure.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more