For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ప్రెగ్నన్సీలో స్కిన్ డార్కెనింగ్ సమస్య సాధారణమేనా?

  |

  ప్రెగ్నన్సీ అనేది కచ్చితంగా కేక్ వాక్ మాత్రం కానే కాదు. ఇది ఒక రోలర్ కోస్టార్ రైడ్ వంటిది. ఈ సమయంలో ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో ఎదురవుతాయి. ప్రెగ్నన్సీ వలన హార్మోన్ల మార్పులు ఏర్పడతాయి. ఇవి మీ శరీరంలో అనేక మార్పులను తీసుకువస్తాయి. కొన్ని మార్పులు మీకు తెలిసినవై ఉంటే మరి కొన్ని మీకు కనీసం ఊహకు అందనివి.

  కొన్ని ప్రెగ్నన్సీ లక్షణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు. అయితే, కొన్ని లక్షణాలు బయటికి కనిపిస్తాయి కాబట్టి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయవచ్చు. పొట్ట పెరగడం వంటి లక్షణాలు యిట్టే అందరికీ తెలుస్తాయి. కొందరిలో స్కిన్ డార్కెనింగ్ సమస్య కూడా ఎదురవుతుంది. బ్లాచెస్, ప్యాచెస్ అలాగే లైన్స్ ఏర్పడటం వంటివి ప్రెగ్నన్సీ వలన చర్మంపై కనబడే కొన్ని లక్షణాలు.

  How common is skin darkening during pregnancy?

  ప్రెగ్నన్సీ సమయంలో చర్మంపై కనిపించే డార్క్ ప్యాచెస్ గురించి తెలుసుకోండి మరి.

  • ముఖంపై కనిపించే డార్క్ ప్యాచెస్ ని "క్లొస్మా" అనంటారు. వీటిని కొన్ని సార్లు "మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ" అని పిలుస్తారు. ఇవి డెలివరీ అయిన రెండు మూడు నెలల తరువాత వాటంతటవే తగ్గిపోతాయి.

  • నిపుల్స్ ఇంతకు ముందు కంటే డార్క్ గా మారతాయి. అలాగే, సెన్సిటివ్ గా కూడా మారతాయి. నిజానికి, నిపుల్స్ సెన్సిటివిటీ అనేది ప్రెగ్నెన్సీని గుర్తించేందుకు ముఖ్య లక్షణంగా వ్యవహరిస్తుంది. హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కంటే ముందే ఈ లక్షణాన్ని గుర్తించడం ద్వారా ప్రెగ్నెన్సీ ని గుర్తించవచ్చు.

  • నిపుల్స్ చుట్టూ ఉండే అరియోలా అనే ప్రదేశం కూడా మరింత డార్క్ గా మారుతుంది.

  • వెజీనల్ ప్రాంతం చుట్టూ డార్క్ ప్యాచెస్ అనేవి కనిపించడం సహజం. అప్పర్ లెగ్స్ తో పాటు అండర్ ఆర్మ్స్ కూడా రంగు కోల్పోతాయి.

  How common is skin darkening during pregnancy?

  • అరచేతులు, అరికాళ్ళు రెడ్డిష్ గా మారతాయి.

  • ఫ్రెకిల్స్ తో పాటు పుట్టుమచ్చలు, ప్రత్యేకించి ముఖంపై నుండేవి ఇంతకు ముందు సరిగ్గా కనపడనివి ఇప్పుడు మరింత డార్క్ గా మారి స్పష్టంగా కనిపిస్తాయి

  • మీ బెల్లీని బాగా గమనిస్తే ప్రెగ్నెన్సీ నెలలు నిండే కొద్దీ బెల్లీకి మధ్యలో ఒక నల్లటి లైన్ ని గమనించవచ్చు. దానిని "లీనియా నిగ్రా" అనంటారు. ఇది డెలివరీ తరువాత మూడు లేదా నాలుగు నెలలకు ఫేడ్ అయిపోతుంది.

  • డార్కర్ స్కిన్ టోన్ కలిగిన వారు ఫెయిర్ స్కిన్ కలిగిన వారి కంటే చర్మంలో కలిగిన మార్పులను సులభంగా గుర్తించగలుగుతారు.

  How common is skin darkening during pregnancy?

  ఈ కింద చెప్పిన కొన్ని చిట్కాలను పాటిస్తే ప్రెగ్నన్సీ సమయంలో తలెత్తే పిగ్మెంటేషన్ సమస్యలను సులభంగా డీల్ చేయవచ్చు.

  • ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు టోపీని ధరించండి. అలాగే, ఎక్కువ ఎస్ పీ ఎఫ్ కంటెంట్ కలిగిన నాణ్యత కలిగిన సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవడం మరచిపోకండి.

  • ఫుల్ స్లీవ్స్ కల్గిన దుస్తులను ధరించండి. ఎండనుంచి చర్మాన్ని రక్షించుకుంటే స్కిన్ డిస్కలరేషన్ సమస్య చాలామటుకు తగ్గుతుంది.

  • సూర్యుని హానికర కిరణాలూ శరీరంపై పడకుండా జాగ్రత్తపడండి. ముఖ్యంగా మధ్యాహ్నం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ, ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే మీ స్కిన్ ను వస్త్రంతో పూర్తిగా కవర్ అయ్యేలా కప్పుకోవడం మంచిది.

  • ప్రెగ్నన్సీ సమయంలో మీరు క్లొస్మా బారిన పడ్డారని మీ వైద్యులు నిర్దారించినప్పుడు మీరు కచ్చితంగా సన్ స్క్రీన్ ను రోజూ ఉపయోగించవలసి రావచ్చు. ఎండలో బయటికి వెళ్లినా లేదా వెళ్లకపోయినా మీరు సన్ స్క్రీన్ ను రోజూ ఉపయోగించాలి. కిటికీలు అలాగే తలుపుల ద్వారా సన్ రేస్ ఇంట్లోకి చొరబడే అవకాశం ఉంది కాబట్టి మీ చర్మాన్ని రక్షించుకోవాలి.

  How common is skin darkening during pregnancy?

  • కొంతమంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కోవడానికి హెర్బల్ సొల్యూషన్స్ ను వాడమని సలహా ఇస్తారు. అందులో భాగంగా కొన్ని ఆయిల్స్ ను ఉపయోగించవచ్చు. అలాగే, వీటిని ప్రెగ్నెన్సీ పన్నెండవ వారం లోకి ప్రవేశించడాని కంటే ముందు ఆపేయడం మంచిది. ఈ ఆయిల్స్ ను లేదా క్రీమ్స్ ను వాడే ముందు వైద్యుల సూచనలు పొందటం మంచిది. తద్వారా, గర్భంలోని శిశువుకు ఏ విధమైన హానీ కలగకుండా కాపాడుకోవచ్చు.

  • కొంతమంది వైద్యులు ఫోలిక్ యాసిడ్ లోపం వలన స్కిన్ డిస్కలరేషన్ సమస్య తలెత్తుతుందని భావిస్తారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఫోలిక్ యాసిడ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. మీ రెగ్యులర్ డైట్ లో ఫోలేట్ ను భాగం చేయడం ద్వారా పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ రూపంలో కూడా లభ్యమవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే వైద్యులు ఈ సప్లిమెంట్స్ ను సూచిస్తారు.

  English summary

  How common is skin darkening during pregnancy?

  If you are dreaming about pregnancy, well there are many other challenges along with that, since it's not an easy job. There will be many bodily changes. Apart from fatigue and nausea, skin darkening is a common problem. The best way to keeping away from the direct rays of the sun is the most preventive manner to avoid skin darkening.
  Story first published: Wednesday, April 25, 2018, 19:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more