`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో అధిక రక్తపోటును నియంత్రించడం ఎట్లా?

|

మీ ముందు రకరకాల సమస్యలు ఉన్నాయి! వాటిని పరిష్కరించుకోవడానికి నలుగురు ద్వారా మీరు వింటున్న రాకరకాల సలహాలు, సూచనలను దృష్టిలో పెట్టుకుని, వాటిని ఆచరిస్తూ, అవలంబిస్తూ నిదానంగా ఉండటమనేది చాల కష్టమైన పని. మీరు కష్టబడి మీ స్వేదాన్ని చిందిస్తూ ఎలా ఆరోగ్యంగా ఉండాలో అని ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని మీ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

అంతగా అయోమయానికి లోనుకాకండి. ఒక్కోసారి మీ రక్తపోటు అమాంతంగా అధికమవ్వడానికి రకరకాల కారణాలుంటాయి. మీ శరీరబరువు, పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు, మీ వయస్సు లేదా మీ గర్భంలో ఒకరిక ఎక్కువమంది పిల్లల్ని మోయడం మొదలైనవి. కారణం ఏదేమి ఐనప్పటికిని, కొన్ని ప్రభావవంతమైన మార్గాల ద్వారా మీ రక్తపోటు నియంత్రించుకోవచ్చు.

వ్యాయామం:

వ్యాయామం:

మీ రక్తపోటును అదుపులో ఉంచాలంటే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ కొంతదూరం నడవటమో, లేదా యోగా వంటివి చేయడమో అలవాటు చేసుకోండి.. ఇలా చేయడం వలన మీ గుండెకు సంబంధించిన కండరాలు బలంగా తయారయ్యి రక్తప్రసరణ పెరుగుతుంది.

శరీర బరువు:

శరీర బరువు:

మీ రక్తపోటును నియంత్రించే అంశాలలో మీ శరీర బరువు ఒకటి. కనుక అధికంగా బరువు పెరగకుండా జాగ్రత్త పడండి. మీరు ఆరోగ్యంగా ఉంటె మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఊబకాయం వలన తీవ్రమైన తలనొప్పి మాత్రమే కాక ఇంకా క్లిష్టమైన ప్రీక్లాంప్సియా వంటి సమస్యలు ఉత్పన్నమయ్యి గర్భిణులలో ప్రసవం ఆలస్యమవ్వడం, నొప్పి నివారణ మాత్రలు పనిచేయకపోవడం వంటివి జరుగుతాయి.

ఉప్పు వాడకం:

ఉప్పు వాడకం:

మీ దైనందిన ఉప్పు వినియోగాన్ని 15౦౦ మిల్లీ గ్రాములకు కుదించుకోండి. ఇంకో విషయమేమిటంటే , మీరెంత ఉప్పును ప్రతిరోజూ వినియోగిస్తున్నారో అంచనా వేసుకోండి. అప్పుడు సహజంగానే మీ రక్తపోటులో అనుకూలమైన మార్పులు గమనించవచ్చు. వేపుడు పదార్థాలు తినకండి. బయట ఆహరం మరియు స్పోర్ట్స్ డ్రింకులు సేవించకండి.

తక్కువ కొవ్వు కలిగిన పాలు తాగండి:

తక్కువ కొవ్వు కలిగిన పాలు తాగండి:

కాల్షియం,మెగ్నీషియం మరియు పొటాషియం యొక్క ఆవశ్యకత మీకు అధికంగా ఉంటుంది. ఇవి మీ రక్తపోటు సమస్యను మాయం చేస్తాయి. కొవ్వులేని పాల పదార్ధాలతో పాటు నారింజ రసం, హేజల్ నట్లు మరియు గోధుమ తవుడు తీసుకోండి. మీరు ఉత్తి పాలను తాగడం ఇష్టపడనట్లయితే, స్ట్రా బెర్రీలు, వొయిలా వంటి పండ్లతో కలిపి మిల్క్ షేక్ తయారుచేసుకుని తాగండి.

రోజుకు ౩ లీటర్ల నీరు తాగండి.

రోజుకు ౩ లీటర్ల నీరు తాగండి.

మీ శరీరానికి అవసరమైన నీటిని అందివ్వడం తప్పనిసరి. రోజుకు ౩ లీటర్ల నీరు తాగండి. కార్బనేటెడ్ పానీయాలు ఆరోగ్యానికి మంచివి కావు. వాటిని తాగరాదు.

 తగినంతగా నిద్రపోండి.

తగినంతగా నిద్రపోండి.

వికారంగా అనిపించినప్పుడు చిన్న కునుకు తీయండి.

పొగత్రాగడం మానేయండి.

పొగత్రాగడం మానేయండి.

మీ శరీరానికి, మీ బిడ్డకు అత్యంత వినాసకరమైన అలవాటు ఇది. మీ రక్తపోటును అమాంతంగా పెంచుతుంది, కనుక సిగరెట్లకు దూరంగా ఉండండి.

మీ ఆహారంలో కొత్తగా ఒమేగా ౩ కొవ్వు ఆమ్లాలకు చోటు ఇవ్వండి.

మీ ఆహారంలో కొత్తగా ఒమేగా ౩ కొవ్వు ఆమ్లాలకు చోటు ఇవ్వండి.

మీ ఆహారంలో కొత్తగా ఒమేగా ౩ కొవ్వు ఆమ్లాలకు చోటు ఇవ్వండి. ఇవి మీ రక్తపోటు స్థాయిని నియంత్రించి, ట్రైగ్లిసరైడ్స్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.

మీ ఆహారంలో పొటాషియం పాళ్ళు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి.

మీ ఆహారంలో పొటాషియం పాళ్ళు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి.

మీ ఆహారంలో పొటాషియం పాళ్ళు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. దీనివలన మీ రక్తపోటు తగ్గి సాధారణ స్థాయికి వస్తుంది. ఎక్కువగా అరటిపళ్ళు, చిలకడ దుంపలు, టొమాటోలు, డ్రై ఫ్రూట్స్, రాజ్మా, నారిజలు, బఠానీలు తీసుకోవాలి.

ఆల్కహాల్ మరియు కెఫీన్:

ఆల్కహాల్ మరియు కెఫీన్:

ఈ పానీయాలు మీ రక్తపోటును పెంచడమే కాక ఇతర తీవ్ర దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. మీరు కెఫీన్ లేని పానీయాల రుచి చూడటం అలవర్చుకోండి. ఇలా చేయడం వలన మీ ప్లసెంటాకుజరిగే రక్తప్రసరణ వేగం తగ్గి గర్భావిచ్చిత్తి అవకాశాలు తగ్గుతాయి. ఆల్కహాల్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. దీనివలన బిడ్డ ఎదుగుదలలో రకరకాల సమస్యలు ఎదురవుతాయి.

వీటన్నిటిని పాటించడంలో కొంత కష్టమెదురైనప్పటికి , కొంత కాలం తరువాత మీ చిటికెన వేలు పట్టుకుని బుడిబుడి అడుగులు వేసి ముద్దులు మూటకట్టే బుజ్జాయిని గుర్తు తెచ్చుకోండి. మీ ఉనికికి సార్ధకత చేకూర్చే ఆ ప్రాణం కోసం ఏమి చేయడానికైనా సిద్ధమే అనిపించకమానదు!

English summary

How to control blood pressure during pregnancy

Pregnant women with high blood pressure suffer from a lot of health issues. It can lead to health complications for both the foetus and the mother.Shocking fact is that, it is one of the major causes of death that occurs among the pregnant women. Hence, it is highly required that a pregnant lady gets her BP level monitored on a regular basis.Some of the causes of high blood pressure in pregnancy include alcohol consumption, sedentary lifestyle, heredity and smoking. High blood pressure in pregnancy is dangerous because it can cause serious damages to the organs too such as brain and kidneys.