Just In
- 2 hrs ago
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- 5 hrs ago
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- 10 hrs ago
Today Rasi Palalu 28January 2023: ఈ రోజు తులారాశి వారికి అకస్మిక ధనలాభం
- 18 hrs ago
ఈ 5 రాశుల వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు..మాటలతో చిత్రహింసలకు గురిచేస్తారు
ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ను మేనేజ్ చేయటమెలా
ప్రెగ్నెన్సీ అనేది అందమైన అనుభూతి. ఇది కొన్ని సార్లు ఛాలెంజింగ్ గా కూడా ఉంటుంది. తనలోని మరో ప్రాణిని నవమాసాలు మోస్తున్నప్పుడు అనేక ఎక్స్పీరియెన్సెస్ లను ఎదుర్కోవలసి వస్తుంది. మూడ్ స్వింగ్స్ అనేవి ఈ సమయంలో తలెత్తే ముఖ్యమైన అసౌకర్యం.
శరీరంలోని మార్పులు జరుగుతూ ఉన్నందువల్ల ఎమోషనల్ గా రోలర్ కోస్టర్ రైడ్ అనేది ఈ పీరియడ్ లో తలెత్తడం సహజం. అయితే, మీరు వంటరి వారు కాదు. ఈ సమస్య గర్భం దాల్చిన వారందరిలోనూ కనిపిస్తుంది. హార్మోన్స్ లోని సంభవించే మార్పుల వలన ఇలా జరుగుతుంది.
మరి హార్మోన్ల హెచ్చుతగ్గుల వలన ఎదురయ్యే మూడ్ స్వింగ్స్ ను ఎదుర్కోవడమెలా? ఈ సమస్యను సులభ ఈ చిట్కాలను పాటిస్తూ సులభంగా ఎదుర్కోవచ్చు.

1. ప్రీనాటల్ యోగాను సాధన చేయండి:
డీప్ బ్రీతింగ్ అనేది శరీరంలో పేరుకుపోయి ఉన్న నెగటివిటీను బయటకు పంపించేందుకు తోడ్పడుతుందని అంటుంటారు. ఈ ప్రక్రియ మనసుకు ఉపశమనాన్ని అందిస్తుంది కూడా. అలాగే శరీరానికి కూడా రిలాక్సేషన్ అందుతుంది. ప్రీనాటల్ యోగా అనేది బ్లడ్ ప్రెషర్ తో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతతనిస్తుంది. దానివలన మూడ్ స్వింగ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఒత్తిడి తగ్గడంతో పాటు యోగాసనాల వలన గర్భం దాల్చడం వలన ఎదురయ్యే ఇతర ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. నడుం నొప్పి, మార్నింగ్ సిక్నెస్ మరియు తలనొప్పులు నుంచి ఉపశమనం అందుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే మెడిటేషన్ చేయడమనేది మూడ్ స్వింగ్స్ ను హరించడానికి తోడ్పడే ఉత్తమైన మార్గం.

2. విరామం తీసుకోండి:
ప్రెగ్నెన్సీలో ఎమోషనల్ అస్థిరతలు సాధారణమని గుర్తించి మీరు ఒత్తిడిని తగ్గించుకోండి. సెల్ఫ్ కేర్ కి సంబంధించిన నిరంతర కృషి మిమ్మల్ని ఎమోషన్ అస్థిరతల నుంచి రక్షిస్తుంది. ప్రతి పని ఒకేసారి పూర్తి చేయాలన్న ఆలోచనను విరమించుకోండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రాధాన్యతనివ్వండి. మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోండి. మీరు బిజీ బీ అయితే, ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు బిజీగా ఉండే వ్యక్తి అయితే ఫ్రీక్వెన్ట్ గా బ్రేక్స్ తీసుకోండి. ఒత్తిడి అదుపులోకి మీరు వెళ్ళకండి. ఒత్తిడిని అదుపులోకి తెచ్చుకోండి.

3. హాయిగా నిద్రపోండి:
తగినంత నిద్ర లభిస్తే మూడ్ స్వింగ్స్ మటాష్ అవుతాయి. త్వరగా నిద్రకుపక్రమించండి, అలసట అనిపించినప్పుడల్లా నిద్రపోండి. నిద్రలో డిస్టర్బెన్స్ లు ఉండకుండా చూసుకోండి. దోమల వలన నిద్రకు ఇబ్బంది ఎదురవుతున్నట్టయితే గుడ్ నైట్ పవర్ యాక్టివ్ వ్యాపరైజర్ ను ప్రయత్నించండి. దీని వలన దోమల బెడద తగ్గుతుంది. తగినంత నిద్ర లభిస్తుంది. గుడ్ నైట్ పవర్ యాక్టివ్ వ్యాపరైజర్ తో మంచి నిద్రను పొందండి మరి.
హైడ్రేటెడ్ గా ఉండటం ఈ సమయంలో ఎంతో ముఖ్యమైన విషయం. దీని వలన మూడ్ స్వింగ్స్ ను దూరంగా ఉంచవచ్చు. గర్భస్థ శిశువుకు తగినంత పోషణ లభించడం కూడా ముఖ్యం. అనవసర ఒత్తిడి వలన ఆకలి అమాంతం పెరుగుతుంది. ఆకలిని తీర్చుకోవడానికి ఏది పడితే అది తినడం వలన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అకేషనల్ క్రేవింగ్ అనేది సాధారణమే అయినప్పటికీ అనారోగ్యకర ఫుడ్స్ కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన వాటినే తీసుకోవడం ముఖ్యం.

5. భావాలను పంచుకోండి:
మీ ప్రియమైన వారితో మీ భావాలను పంచుకోండి. మీ యాంగ్జైటీ గురించి వివరించండి. మీ కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోండి. మీ మానసిక ఒత్తిడి గురించి వివరించండి.
వీటన్నిటితో పాటు మీకు సంతోషాన్ని కలిగించే విషయాలకు సమయాన్ని కేటాయించడం మరచిపోకండి. మీ భాగస్వామితో క్వాలిటీ టైం ను గడపండి. మసాజ్ ను పొందండి. వాక్ కి వెళ్ళండి. ఫ్రెండ్స్ ని కలవండి. ఈ చిట్కాలను మనసులో పెట్టుకుని హ్యాపీ గా ఉండండి.ఈ సమయంలో ఎదురయ్యే మూడ్ స్వింగ్స్ తాత్కాలికమైనవి మాత్రమే. సరైన యాక్షన్ ను వీటిని సులభంగా అధిగమించవచ్చు.