ప్రెగ్నెన్సీ సమయంలో సెన్సిటివ్ బ్రెస్ట్ సమస్యను డీల్ చేయడం ఎలా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల మార్పుల వలన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. బ్రెస్ట్స్ లో మార్పులు కలగడం సహజం. అందువలన, సెన్సిటివ్ మరియు సోర్ బ్రెస్ట్ సమస్య సర్వసాధారణమే. నిజానికి, ప్రెగ్నెన్సీకి చెందిన లక్షణమిది. ప్రెగ్నెన్సీతో అనుసంధానమైన ఈ లక్షణాలు కొన్ని సార్లు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలలో బ్రెస్ట్స్ లో విపరీతమైన నొప్పిని గమనించవచ్చు. హార్మోనల్ ఛేంజెస్ వలన నొప్పులు కలుగుతాయి. ప్రసవం తరువాత బేబీకి ఫీడింగ్ కి అనువుగా బ్రెస్ట్స్ లో మార్పులు ఏర్పడతాయి. కాబట్టి, ఎర్లీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన సూచికగా బ్రెస్ట్స్ లోని నొప్పులను గమనించవచ్చు.

How to deal with sensitive breasts during pregnancy?

బ్రెస్ట్స్ సెన్సిటివ్ గా ఎందుకు మారతాయి?

గర్భిణీలందరిలోనూ సోర్ బ్రెస్ట్ సమస్య కనిపించకపోవచ్చు. అయితే, చాలా మంది గర్భిణీలు ఈ సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మొదటి ట్రైమిస్టర్ లో ప్రారంభమయ్యే ఈ లక్షణం ప్రెగ్నెన్సీ దశ మొత్తం కంటిన్యూ అవుతుంది. గర్భం దాల్చిన తరువాత బ్రెస్ట్స్ లో ఏర్పడే ఈ నొప్పిని తామింతకు ముందెప్పుడూ ఎక్స్పీరియెన్స్ చేయలేదని గర్భిణీలు చెబుతున్నారు.

బ్రెస్ట్ లో నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు నిద్రలో అటు ఇటూ కదలడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాస్త బిగుతుగా ఉన్న దుస్తులను ధరించేందుకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది. పీరియడ్స్ సమయంలో కూడా బ్రెస్ట్స్ లో నొప్పి ఏర్పడుతుంది. అయితే, ప్రెగ్నెన్సీ సమస్యల్లో తలెత్తే నొప్పి కంటే ఇది చాలామటుకు తేలికపాటిగా ఉంటుంది.

బేబీ పుట్టిన తరువాత బ్రెస్ట్ ఫీడింగ్ కోసం శరీరం బ్రెస్ట్ ని సిద్ధం చేసుకుంటుంది. అందువలన సోర్ బ్రెస్ట్స్ సమస్య తలెత్తుతుంది. బ్రెస్ట్స్ లో నున్న ఫ్యాట్ లేయర్ అనేది దట్టంగా మారుతుంది అలాగే మిల్క్ గ్లాండ్స్ విస్తరణ ప్రారంభం అవుతుంది. బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. అలాగే, నిపుల్స్ లో కలిగే మార్పులను కూడా మీరు గుర్తించవచ్చు.

నిపుల్స్ సైజ్ లో అలాగే షేప్ లో డార్క్ నెస్ ను మీరు గుర్తించవచ్చు. నిపుల్ చుట్టూ ఉండే ఏరియా అంటే అరియోలా కూడా డార్క్ గా మారుతుంది. ఈ మార్పుల వలన బ్రెస్ట్స్ లు సోర్ గా అలాగే సెన్సిటివ్ గా మారతాయి. ముట్టుకుంటే విపరీతమైన నొప్పి కలుగుతుంది. పిల్లగాలి కూడా బ్రెస్ట్స్ పెయిన్ ను కలిగిస్తుందంటే అతిశయోక్తి కాదు. అయితే, నెలలు నిందుతున్నకొద్దీ సోర్ బ్రెస్ట్స్ సమస్య తగ్గుముఖం పట్టేందుకు ఆస్కారం కలదు.

How to deal with sensitive breasts during pregnancy?

సోర్ బ్రెస్ట్స్ సమస్యను తగ్గించే చర్యలు:

ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమ్స్టర్ లోకి ఎంటర్ అవగానే ఈ సమస్య దాదాపుగా తగ్గిపోయే సూచనలు గలవు. అయితే, అప్పటివరకు మీరు కొన్ని నేచురల్ రిలీవర్స్ పై ఆధారపడటం ద్వారా సోర్ బ్రెస్ట్స్ ద్వారా కలిగే అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.

•ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో స్పోర్ట్స్ బ్రా వంటి సపోర్టివ్ బ్రా ను వాడటం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇవి బ్రెస్ట్స్ కు సపోర్ట్ ను అందించి అసౌకర్యాన్ని చాలామటుకు తగ్గిస్తాయి. ప్రాపర్ ఫిట్టింగ్ బ్రాను ఎంచుకోవడం ముఖ్యం. బస్ట్ సైజ్ లను పరిగణలోకి తీసుకుని మీకు సరిగ్గా పట్టే బ్రాను ఎంచుకోండి.

• ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు సరిగ్గా పట్టే బ్రాను ధరించాలి. పుల్లింగ్ మరియు స్ట్రెచింగ్ అనేవి బ్రెస్ట్స్ పై ఒత్తిడి కలిగిస్తాయి. అందువలన, సరైన బ్రాను ధరించడం ద్వారా బ్రెస్ట్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

• ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్ సైజ్ తో పాటు షేప్ మారుతూ ఉంటుంది. మార్పులకు అనుగుణంగా బ్రాస్ ను ఎంచుకుని వాడాలి. తక్కువ సైజ్ బ్రాను వాడటం వలన అసౌకర్యం కలగడం సహజం.

• నిద్రపోయేటప్పుడు కాటన్ మెటర్నిటీ బ్రాను ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది.

How to deal with sensitive breasts during pregnancy?

• వాటర్ రిటెన్షన్ వలన సోర్ బ్రెస్ట్స్ సమస్య తలెత్తుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలోని అదనపు ద్రవాలని తొలగించుకునేందుకు రోజంతా తగినంత నీటిని తీసుకోవాలి. నీళ్లను తీసుకోవడం ద్వారా సోర్ బ్రెస్ట్స్ వంటి హార్మోన్ల సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే, నీళ్లలో నిమ్మ, అల్లం, మెంతులు లేదా బెంటోనైట్ వంటి వాటిని జోడించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

• పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా సోర్ బ్రెస్ట్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. డైట్ లో శరీరానికి అవసరమైన మినరల్స్ తో పాటు విటమిన్స్ ఉండేలా జాగ్రత్తపడండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సీడ్స్, హోల్ గ్రెయిన్స్ మరియు నట్స్ ని రోజూ తీసుకోవడం ద్వారా బ్రెస్ట్ టెండర్ నెస్ ను తగ్గించుకోవచ్చు.

• బ్రెస్ట్ కి సరైన బ్లడ్ సర్క్యూలేషన్ ను పెంపొందించడం ద్వారా వాపు మరియు సున్నితత్వం నుంచి ఉపశమనం పొందవచ్చు. బ్రెస్ట్స్ ను వెచ్చటి తడి టవల్ తో కవర్ చేయడం ద్వారా రిలీఫ్ ను పొందవచ్చు. ఈ పద్దతిని 10 నుంచి 15 నిమిషాల పాటు పాటిస్తే మీకు ఎక్కువ రిలీఫ్ అందుతుంది.

• వెచ్చటి షవర్ ను తీసుకోవడం ద్వారా నొప్పిని తగ్గించుకోవచ్చు. వార్మ్ బాత్ సోక్ ను ప్రిఫర్ చేయండి. అయితే, వైద్యుల సూచనని అనుసరించి ఈ పద్దతిని పాటించండి.

• హార్మోన్ల మార్పులనేవి తాత్కాలికం. హార్మోన్ల మార్పుల వళ్ళ ఎదురయ్యే సమస్యలను తగ్గించే చిట్కాలను పాటించడం ద్వారా కొంతవరకు ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ దశ దాటగానే మీకు రిలీఫ్ అందుతుంది.

English summary

How to deal with sensitive breasts during pregnancy?

Sore breasts are extremely common among pregnant women. It can start during the first trimester and end upto until the delivery of the baby. Wear a sports bra to support the breast in the first trimester. You can choose to wear a cotton maternity bra. You can try home remedies, where you can consume one tablespoon of flax seeds.
Story first published: Monday, April 30, 2018, 12:45 [IST]