For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబార్షన్ తర్వాత ఎలా కోలుకోవాలి

|

ప్రతి స్త్రీ జీవితంలో గర్భం దాల్చటం మేటి విషయాలలో ఒకటి అవుతుంది, అలాగే అబార్షన్ జరగటం కూడా చెడ్డ విషయాలలో ఒకటి.

బిడ్డను పోగొట్టుకోవడం ఏ స్త్రీకైనా పీడకల నిజమవటంలాంటిది. దాన్నుండి మానసికంగా, శారీరకంగా కూడా మళ్ళీ మామూలవటానికి చాలా సమయమే పడుతుంది.

స్త్రీలు సహజంగా పోషకులు. దేవుడిలో ఉండే శక్తి వారిలో కూడా ఉంటుందని నమ్ముతారు – ఒక కొత్త మనిషికి జన్మనిచ్చే శక్తి. కానీ దురదృష్టవశాత్తూ జరిగే ఇలాంటి సంఘటనల వలన వారి మనస్సు,గుండెల్లో పెద్ద ఖాళీ ఏర్పడుతుంది.

గర్భస్రావం ఒక స్త్రీకి చాలా కఠినమైన సమయం. గర్భవతులైనవారు తమ కడుపులో బిడ్డలకి పుట్టకముందే అటాచ్ అయిపోతారు. బాబు లేదా పాప ఎవరైనా పేరు ముందే డిసైడ్ అయిపోతుంది. పట్టలేని సంతోషంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల గదుల రంగులు, వారి భవిష్యత్తు ఆశయాలు అన్నీ ఆలోచించేస్తారు.

How To Recover After A Miscarriage

మానసికంగా కన్నా ఎక్కువ, గర్భస్రావం వలన స్త్రీ శరీరంలో కూడా శారీరక ప్రభావాలు ఎక్కువ పడతాయి. శరీరంలో ఉండే ప్రెగ్నెన్సీ హార్మోన్లు గర్భస్రావం తర్వాత వారిని భావోద్వేగాలలో ముంచెత్తుతాయి.

గర్భస్రావం అంటే ఏమిటి?

ప్రెగ్నెన్సీలో 24వ వారం ముందు బిడ్డ పోతే ఆ స్థితిని గర్భస్రావం అంటారు. ఇలా పిండం గర్భాశయం నుండి బయటకి తోసివేయబడితే జరుగుతుంది. ఇలా జరగటానికి చాలా కారణాలున్నా, మానసికంగా కన్నా,స్త్రీ శరీరం శారీరకంగా మామూలవటానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఒక స్త్రీకి తన అబార్షన్ వలన జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. కానీ శారీరకంగా ఎలా మామూలవ్వాలో తెలుసుకోవటం ముఖ్యం.

ఈ ఆర్టికల్ లో గర్భస్రావం తర్వాత వచ్చే శారీరక ప్రభావాలు, గర్భాశయంలో మార్పుల గురించి వివరాలు ఇవ్వబడ్డాయి.

గర్భస్రావం సమయంలో అన్నిటికన్నా ప్రభావం పడేది గర్భాశయం మీదనే. ఎందుకంటే అందులోనే బేబీ పెరిగేది.గర్భస్రావం జరిగిన సమయం బట్టి గర్భాశయం ఎన్నిరోజుల్లో మామూలవుతుందో ఆధారపడి వుంటుంది. కడుపుతో ఉన్నప్పుడు మొదట్లోనే అబార్షన్ అయిపోతే, అంత వేగంగా మీ రికవరీ కూడా జరుగుతుంది.

అబార్షన్ తర్వాత ఏం జరుగుతుంది?

పిండం గర్భాశయ గోడల నుండి విడిపోతే అబార్షన్ జరుగుతుంది. ఇది వెంటనే రక్తస్రావానికి దారితీస్తుంది. మీ అబార్షన్ జరిగిన సమయాన్ని బట్టి బ్లీడింగ్ కొంచెం చుక్కల నుండి, కణజాలాలతో కూడిన భారీ స్రావం మధ్యలో ఎలా అయినా ఉండవచ్చు.

అబార్షన్ సమయంలో కండరాల సంకోచం వలన నొప్పులు కూడా రావచ్చు. ప్రెగ్నెన్సీ హార్మోన్లను సాధారణంగా హెచ్ సిజి హార్మోన్లంటారు, ఇవి అబార్షన్ జరిగిన రెండు నెలల వరకు కూడా ఉంటాయి.

అందుకే చాలామంది స్త్రీలలో ప్రెగ్నెన్సీ లక్షణాలు తర్వాత కూడా కన్పిస్తాయి. ఇదిలా వుంటే గర్భాశయానికి తన మామూలు సైజుకి రావటానికి కనీసం రెండు వారాలైనా పడుతుంది. ఇలా జరగాలంటే బ్లీడింగ్ పూర్తిగా ఆగిపోవాలి.

గర్భస్రావం ప్రక్రియ మొత్తంలో ఎక్కువగా ప్రభావం పడేది గర్భాశయం మీదనే కాబట్టి, అది బాగవ్వటానికి మీరు అదనంగా జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా నయమవుతుంది. నొప్పి తెలియకుండా ఉండటానికి మీ డాక్టరు ఇచ్చే భారీ మందుల డోసులతో పాటు, మీరు కూడా గర్భాశయానికి మాములు చేయటానికి కొన్ని విషయాలు పాటించవచ్చు.

1) హెర్బల్ చిట్కాలు

1) హెర్బల్ చిట్కాలు

ఎర్రటి రాస్ప్ బెర్రీ, చెర్రీలలాంటి పళ్ల ఆకులలో అన్ని పోషకాలు అంటే ఐరన్, కాల్షియంలాంటివి ఉండి మీ గర్భాశయాన్ని త్వరగా బాగయ్యేలా చేస్తాయి. ఇవి మీ హార్మోన్లను స్థిరపరిచి డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తాయి.

2)ఐరన్ సప్లిమెంట్లు

2)ఐరన్ సప్లిమెంట్లు

గర్భస్రావం వలన చాలా రక్తం పోతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉంటే, నయమవ్వడానికి ఎక్కువకాలం పడుతుంది. అందుకని, మీరు శరీరం త్వరగా కోలుకోవాలంటే ఐరన్ డోసును శరీరంలో పెరిగేలా చేయాలి.అబార్షన్ తర్వాత గర్భాశయ గోడలకి పిండం విడిపోవటం వలన గాయపడవచ్చు. ఐరన్ ఈ గాయాలను పూడ్చి మామూలు సైజుకి వచ్చేలా సాయపడుతుంది.

3) వేడి నీటి కాపడం

3) వేడి నీటి కాపడం

గర్భస్రావం తర్వాత జరిగే డిశ్చార్జి వలన పొత్తికడుపు దగ్గర నొప్పి ఉండవచ్చు. ఈ నెప్పికి వేడినీటి కాపడం పెట్టుకుని రిలీఫ్ పొందవచ్చు. ఈ గోరువెచ్చని కాపడం వలన కూడా గర్భాశయం దాని మామూలు సైజుకి కుచించుకుపోతుంది.

4)ఆరోగ్యకరమైన డైట్

4)ఆరోగ్యకరమైన డైట్

బ్యాలెన్స్డ్ డైట్ వల్ల శరీరానికి సరైన పోషకాలు లభించటమేకాక, మామూలు స్థితికి కూడా త్వరగా వస్తుంది. గుడ్లు, ఛీజ్, పండ్లు,కూరలలాంటి పదార్థాలు శరీరానికి బలం పెంచి శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మామూలు స్థితికి తెస్తాయి.

5)మిమ్మల్ని మీరు ఎప్పుడూ హైడ్రేటడ్ గా ఉంచుకోండి

5)మిమ్మల్ని మీరు ఎప్పుడూ హైడ్రేటడ్ గా ఉంచుకోండి

ఎలాంటి రికవరీకి అయినా హైడేషన్ చాలా ముఖ్యం. మీరు కోలుకుంటున్నప్పుడు ఎక్కువగా ద్రవపదార్థాలు వేడి సూప్ లతో కలిపి తీసుకోండి. గర్భస్రావం తర్వాత అన్పించే చిరాకు ఫీలింగ్ పోవటానికి కెఫీన్ కి కూడా కొన్నాళ్ళు దూరంగా ఉండండి.

6)మసాజ్

6)మసాజ్

లైంగిక అవయవాలకి రక్తం తిరిగి మామూలుగా ప్రసరించటానికి మసాజ్ ఉత్తమమైన మార్గం. రక్తప్రసరణ జరిగితే గర్భాశయం కూడా త్వరలోనే దాని పూర్వస్థితికి వచ్చేస్తుంది. ఫెర్టిలిటీ మసాజ్ లు, వాటి ఉపయోగాల గురించి మీకు సందేహం ఉన్నట్లయితే, అవి తీర్చుకోడానికి ఇదే మంచి సమయం.

English summary

How To Recover After A Miscarriage

How To Recover After A Miscarriage, Pregnancy is one of the best things that can happen to a woman and miscarriage is one of the worst things. Losing a baby can be the worst nightmare come true to any woman. It is mentally as well as physically something that takes a long time to cope with.
Story first published: Thursday, June 28, 2018, 11:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more