For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు, నవజాత శిశువులకు, సువర్ణా ప్రషాన్ ఎందుకు సూచిస్తుంటారు?

|

"నివారణ కన్నా జాగ్రత్తపడడం ఉత్తమం".

ఈ వ్యాఖ్య ఎంత ప్రాచుర్యం పొందినదో వేరే చెప్పనవసరం లేదు. మన జీవితకాలంలో అడుగడుగునా వినిపించే మాటల్లో ఇది కూడా ఒకటి. కానీ దాని నిజమైన అర్ధాన్ని ఎంత మంది గ్రహిస్తున్నారు?

ఉదాహరణకు, ధూమపానం, మద్యపానం, పొగాకు సంబంధిత పదార్ధాల వాడకం వంటి అనేక వ్యసనాలు ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. వాటి వలన కాన్సర్ వంటి రోగాలు వస్తాయని, ఆర్ధిక మరియు కుటుంబ జీవనాన్ని కూడా పణంగా పెట్టాల్సి వస్తుందని తెలుసు. కానీ తెలిసి కూడా వాటిని వీడని వ్యసనపరుల్ని మనం చూస్తూనే ఉంటాం.

Importance Of Suvarna Prashan For Babies And Pregnant Mothers

ప్రాచీన భారతీయ సంస్కృతి మరియు పూర్వీకుల జ్ఞానం, వారసత్వంగా తరతరాలుగా అభివృద్ధి చెందుతూ, ఇప్పటికీ నేటి తరానికి ఒక రక్షగా ఉందన్నది జగమెరిగిన సత్యం. మన రోజు వారీ ఆహారపు అలవాట్ల నుండి, ఆరోగ్య విధానాల వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు, విధానాలను వారి శాస్త్రాలు, వేదాలలో పొందుపరచబడి ఉన్నాయి. అందులో ఆయుర్వేదం ప్రముఖమైనది.

ఆయుర్వేదం మానవజాతికి తెలిసిన అత్యంత శక్తివంతమైన ఔషధ మరియు వైద్య విధానం. ప్రకృతిలో కనిపించే పదార్ధాల మరియు మూలికల యొక్క విస్తృతమైన ఉపయోగం, ఎక్కువ శాతం మానవ సంబంధిత వ్యాధులు మరియు నొప్పులను నయం చేయడంలో అత్యంత శక్తివంతమైన పాత్రను పోషించగలవు. మరియు బలమైన రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. మరియు రోగ నిరోధక శక్తి అవసరాన్ని విశదీకరిస్తుంది. దీనికి కారణం అనేక వ్యాధుల నివారణకు శరీరంలోని రోగ నిరోధక శక్తి అత్యంత కీలకం కాబట్టి.

గర్భిణీ స్త్రీలు మరియు నవజాత శిశువులు రోగ నిరోధక శక్తిని తక్కువగా కలిగి ఉన్నకారణంగా అధిక మోతాదులో అంటువ్యాధులకు గురవుతుంటారు.

ఆయుర్వేదం ప్రకారం, పిల్లలు మరియు గర్భిణి స్త్రీలలో రోగనిరోధకతను పెంచే ఉత్తమ ఔషధంగా సువర్ణా ప్రషాన్ అత్యంత ప్రాచుర్యం పొందినది.

అసలు ఏమిటీ సువర్ణా ప్రషాన్?

బంగారు మరియు వెండి వంటి స్వచ్ఛమైన లోహాలు ఆయుర్వేదంలో అతి ముఖ్యమైనవి. మరియు అద్భుతమైన వైద్య లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని అత్యంత శక్తిమంతమైన రోగనిరోధక బూస్టర్లుగా పిలుస్తుంటారు. మరియు మొత్తం భౌతిక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే క్రమంలో ఇవి ఎంతగానో సహాయపడుతాయి.

మానవులలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలలో పేర్కొన్న పదహారు ప్రధాన ఔషధాలలో సువర్ణా ప్రషాన్ ఒకటి. ఇది శుద్ది చేసిన బంగారం యొక్క బూడిదను వివిధ రకాల మూలికలతో కలిపి, ఘన లేదా ద్రవరూపంలో వినియోగిస్తారు. ఈ ప్రక్రియను సులభతరం చేసే క్రమంలో భాగంగా, ప్రస్తుతం ఈ సువర్ణా ప్రషాన్, ఆయుర్వేదిక్ మందుల దుకాణాలలో చుక్కల మందు రూపంలో లభిస్తూ ఉంది.

గర్భిణీ స్త్రీలు మరియు నవజాత శిశువులకు సువర్ణా ప్రషాన్ వినియోగం మరియు ప్రాముఖ్యత:

ఆయుర్వేదం, గర్భిణీ స్త్రీలకు మరియు నవజాత శిశువులకు సరైన పోషకాహార అవసరాన్ని వివరిస్తుంది. సరైన శారీరక మరియు మానసిక అభివృద్ధికి తగిన పోషణ ముఖ్యం. అందువల్ల, గర్భిణీ స్త్రీలు కనీసం 5 వ నెల గర్భం నుండి తీసుకునేలా సూచిస్తుంటారు. మరియు శిశువు పుట్టిన తరువాత, ఇది పదహారు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అందించాల్సిన అవసరం ఉంటుంది.

సువర్ణా ప్రషాన్ క్రమం తప్పకుండా తీసుకునే పిల్లలు రోగ నిరోధక శక్తిని అధికంగా కలిగి ఉండడంతో పాటు, ఉత్తమ మానసిక మరియు శారీరిక ఎదుగుదలను కలిగి ఉంటారని చెప్పబడింది.

1) రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

1) రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

సువర్ణా ప్రషాన్లో ఉన్న శుద్ది చేసిన బంగారు బూడిద, మరియు వివిధ మూలికల మిశ్రమం పిల్లలలో బలమైన రోగనిరోధక శక్తిని నిర్మించడానికి సహాయపడుతుంది. క్రమంగా శరీరాన్నిఅంటువ్యాధులకు మరియు అనారోగ్యాలకు వీలైనంత దూరంగా ఉంచగలుగుతుంది.

2) జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:

2) జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:

సువర్ణా ప్రషాన్లో ఉన్న మూలికలు, జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరించడంలో అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కడుపులోని ఆహారాన్ని జీర్ణం చేయడంలో, మరియు శరీరానికి అవసరమైన పోషకాలను సంగ్రహించే సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్రను పోషిస్తుంది. పిల్లలకు తరచూ కడుపు నొప్పి, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలకు గురవుతుంటారు. సువర్ణా ప్రషాన్ తీసుకోవడం ద్వారా వీటి నుండి దూరంగా ఉంచవచ్చు.

3) చర్మపోషణ మరియు చర్మ సౌందర్యం:

3) చర్మపోషణ మరియు చర్మ సౌందర్యం:

సువర్ణా ప్రషాన్ గర్భిణీ స్త్రీలు వినియోగించినప్పుడు వారి చర్మ ఆరోగ్యం మెరుగు పడడం, ప్రకాశవంతంగా కనిపించడం వంటి లక్షణాలను గమనించవచ్చు. శరీరం నుండి అవాంఛిత మలినాలను తొలగించటం ద్వారా చర్మo నిర్విషీకరణకు సహాయపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరచి మంచి చర్మ సౌందర్యాన్ని అందివ్వడంలో కీలకపాత్రను పోషిస్తుంది.

4) వినికిడి మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది:

4) వినికిడి మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది:

సువర్ణా ప్రషాన్లోని సహజ మూలికలు, శిశువు యొక్క దృష్టి మరియు వినికిడి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాస్తవానికి, సువర్ణా ప్రషాన్ క్రమం తప్పకుండా వినియోగిస్తున్న శిశువులలో అవలక్షణాల సంఖ్య కూడా తగ్గినట్లు నిరూపించబడ్డాయి.

5) శిశువులను శాంతపరిచేందుకు సహాయపడుతుంది :

5) శిశువులను శాంతపరిచేందుకు సహాయపడుతుంది :

సువర్ణా ప్రషాన్లో ఉన్న ఈ సహజ మూలికలలోని శాంత ప్రభావాలు పిల్లల చిరాకును తగ్గించడానికి దోహదపడుతాయని తేలింది. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా, జీర్ణ క్రియల సమస్యలు మరియు కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడం ద్వారా వారి చిరాకును తగ్గించేలా సహాయపడగలదు. పిల్లలకు సువర్ణా ప్రషాన్ తప్పకుండా ఇచ్చే తల్లుల నివేదికల ప్రకారం, పిల్లలలో అనేక చిరాకు తెచ్చే సమస్యలు తగ్గుముఖం పట్టడం గమనించడం జరిగిందని, క్రమంగా వారు సంతోషంగా అనేక సమస్యలకు దూరంగా ఉండగలుగుతున్నారని తెలుపడం జరిగింది.

6) ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రయోజనకరంగా:

6) ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రయోజనకరంగా:

ఆటిజం, జ్ఞాపకశక్తి ఇబ్బందులు లేదా హైపర్ యాక్టివ్ వంటి లోపాలు ఈ శతాబ్దంలో పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని అందరికీ తెలిసిన విషయమే. సువర్ణా ప్రషాన్ పిల్లల పెరుగుదలకు పరిపూర్ణ పోషణను అందివ్వగలుగుతుంది, తద్వారా ఇటువంటి అనారోగ్యాలు తగ్గుముఖం పట్టడంలో సహాయం చేయగలుగుతుంది.

7) మంచి ఎత్తు మరియు బరువు సాధించడానికి సహాయం చేస్తుంది:

7) మంచి ఎత్తు మరియు బరువు సాధించడానికి సహాయం చేస్తుంది:

తల్లిదండ్రులు, తమ పిల్లలలో ఒక మంచి ఎత్తు మరియు బరువుని కోరుకోవడం సహజం. ఈ క్రమంలో భాగంగా సువర్ణా ప్రషాన్లోని మూలికలు, రోగ నిరోధక శక్తిని పెంచడం, జీర్ణ క్రియలను క్రమబద్దీకరించడం వంటి చర్యలకు సహాయపడడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చేసి వారి ఉత్తమమైన ఎదుగుదలలో మరియు సరైన బరువును పొందే క్రమంలో ఎంతగానో సహాయం చేస్తుంది.

సువర్ణా ప్రషాన్ తీసుకునే సరైన మార్గం -

సువర్ణా ప్రషాన్ తీసుకునే సరైన మార్గం -

సువర్ణా ప్రషాన్, పూర్తి లాభాలను పొందడానికి, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు, ఈ ఆయుర్వేద ఔషధాన్ని స్వీకరించే క్రమంలో భాగంగా కొన్ని మార్గదర్శకాల సమితిని అనుసరించాల్సి ఉంటుంది.

- సువర్ణా ప్రషాన్ యొక్క వినియోగం 27 రోజులకు ఒకసారి వచ్చే పవిత్ర దినమైన పుష్యమీ నక్షత్ర లగ్నాన ప్రారంభించాలి.

- ఔషధం ఎల్లప్పుడూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవలసి ఉంటుంది. పిల్లల కోసం, సూర్యోదయం తర్వాత తీసుకునేలా చర్యలు తీసుకోవాలి.

-గర్భిణీ స్త్రీలు 5వ నెల గర్భం చేరిన తర్వాత, ఔషదాన్ని స్వీకరించవలసినదిగా చెప్పబడినది.

-నవజాత శిశువుకు ఇచ్చే క్రమంలో వైద్యుని సూచనలను పాటించవలసి ఉంటుంది, శిశువు ఆరోగ్యానుసారం వైద్యులు సూచించే విధానం లేదా ప్రత్యామ్నాయ ఔషధాలను స్వీకరించవలసి ఉంటుంది.

మోతాదు సూచనలు:

మోతాదు సూచనలు:

- నవజాత శిశువు నుండి 5సంవత్సరాల పిల్లల వరకు - ఒక్క చుక్క

- 5 నుండి 10 సంవత్సరాలు - రోజువారీ 2 చుక్కలు

- 10 నుండి 16 సంవత్సరాలు - రోజువారీ 3 చుక్కలు

- గర్భిణీ స్త్రీలు - రోజువారీ 3 చుక్కలు

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత అంశాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Importance Of Suvarna Prashan For Babies And Pregnant Mothers

Ancient Indian Culture is filled with knowledge that holds true even today. Although most of our day-to-day practices stem from the ancient texts that are left behind by our learned ancestors, the greatest gift we received from them is definitely the science of Ayurveda.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more