For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్య గనుక గర్భవతి అయితే అటువంటి సమయంలో సానిహిత్యంగా ఉండవచ్చా ?

By R Vishnu Vardhan Reddy
|

అభినందనలు! మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు! మీ భార్య గర్భవతి అనే రహస్యం తెలియగానే మీరు ఉత్సాహవంతులై ఉంటారు మరియు మీకు పుట్టబోయే బిడ్డ కోసం కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

కానీ, ఇదంతా జరగాలంటే, ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే తొమ్మిది నెలల పాటు వేచిచూడవలసి ఉంది. ఈ తొమ్మిది నెలల కాలం పాటు మీ దృష్టి అంతా మీ భాగస్వామి పైనే ఉంటుంది. కష్టతరమైన గర్భధారణ సమయంలో, అన్ని నెలల పాటు మీరు మీ భాగస్వామి కీ అండగా నిలబడి, అన్ని పనులు దగ్గర ఉండి చేయవలసి ఉంటుంది. అయితే మీరు ఈ సమయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది, అనుమానాలు వస్తాయి. ఎందుకంటే మీరు మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన దశలోకి అడుగుపెట్టబోతున్నారు మరియు మీరు ఆ దశలో కొన్ని నెలలపాటు ప్రయాణం చేయబోతున్నారు. వీటిల్లో అతి ముఖ్యమైనది భాగస్వామితో సన్నిహితంగా ఉండటం.

కొంత మంది పురుషులు గర్భవతి అయినా భార్యను చూసి విపరీతమైన ఆకర్షణకు లోనవుతారు మరియు మరికొంతమంది ఏమో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్న భార్య యొక్క శరీరాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఇటువంటి వారు గర్భవతి అయినా భార్య పట్ల ఆకర్షితులు కారు.

మరికొంతమంది పురుషులు చాల విభిన్నంగా ఆలోచిస్తుంటారు. గర్భవతి అయినా భార్యకు శృంగారపరంగా గనుక దగ్గర అయినట్లైతే అటువంటి సమయంలో కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎక్కడ హాని కలుగుతుందో అని భయపడతారు.

గర్భవతి అయిన భార్యతో సన్నిహితంగా ఉండాలి అని భావించినట్లైతే, అటువంటి సమయంలో ఒక తండ్రిగా మరియు భర్తగా ఏ ఏ విషయాలు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ విషయమై ప్రచారంలో ఉన్న దురభిప్రాయాలను మరియు అనుమానాలను పూర్తిగా నివృత్తి చేసి మరియు గర్భవతి అయిన భార్యతో పడక గదిలో ఉన్నప్పుడు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోబోతున్నాం.

మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి :

1. మీ భార్య నిజంగానే విపరీతంగా అలసిపోయి ఉండవచ్చు :

1. మీ భార్య నిజంగానే విపరీతంగా అలసిపోయి ఉండవచ్చు :

బిడ్డకు జన్మనిచ్చే ప్రక్రియల్లో భాగంగా కొన్ని విషయాల వల్ల మీ భార్య విపరీతంగా అలసిపోయి ఉండవచ్చు. మీ భాగస్వామి శారీరికంగా మరియు భావోద్వేగపరంగా మార్పులకు లోనవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తించండి. ఈ మార్పుల వల్ల ఆమె విపరీతమైన ఒత్తిడిలకు లోనవుతుంది మరియు శరీరంలోని హార్మోన్లలో మార్పులు విపరీతంగా వస్తాయి. దీని వల్ల వాళ్ళు విపరీతంగా అలసిపోతారు.

ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో మీ భార్య గనుక త్వరగా పడుకోవాలని భావించిన లేక సరైన సమయానికి నిద్ర లేవకపోయినా మనస్థాపం చెందకండి. ఆమె ఎప్పుడూ అలసిపోయినట్లే ఉంది, అని మీరు గనుక భావించినట్లైతే, అటువంటి సమయంలో మీరు ఒకసారి వైద్యున్ని కలవండి. ఎందుకంటే ఆమె అనీమియా వ్యాధితో బాధపడుతూ ఉండవచ్చు.

2. మీ భాగస్వామితో గడపడం కష్టతరమయ్యే అవకాశం ఉంది :

2. మీ భాగస్వామితో గడపడం కష్టతరమయ్యే అవకాశం ఉంది :

కొంతమంది స్త్రీలు ఏ పని చేయడానికైనా విముఖత చూపిస్తారు. ఎందుకంటే అంతలా అలసిపోయి ఉంటారు. మరికొంత మందికి ఏమో గర్భధారణ సమయంలో శృంగార కోరికలు పెరుగుతాయి. ఇలా జరగడానికి కారణం మరియు దాని వెనుక ఉన్న నిజం ఏమిటంటే, గర్భధారణ సమయంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల అతి సున్నితమైన జననాంగం మరింత సున్నితంగా మారుతుంది. దీని వల్ల ఆ ప్రాంతం వెడల్పుగా మారుతుంది మరియు కోరికలు పెరుగుతాయి.

3. శృంగారపరంగా సన్నిహితంగా ఉండటం ఉత్తమైన సమయం - రెండవ త్రైమాసికంలో :

3. శృంగారపరంగా సన్నిహితంగా ఉండటం ఉత్తమైన సమయం - రెండవ త్రైమాసికంలో :

గర్భధారణ సమయంలో మీరు గనుక మీ భాగస్వామితో ప్రేమను పంచుకోవాలని భావించినట్లైతే, రెండవ త్రైమాసికం ఉత్తమమైనది. మొదటి త్రైమాసికంలో పగటిపూట అనారోగ్యం, వికారం, శక్తిలేకపోవడం, ఆతురత మరియు హార్మనోల సమతుల్యత దెబ్బతినడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

మూడవ త్రైమాసికంలో బిడ్డ ఎప్పుడు బయటకు వస్తుందా అని ఆతురతగా ఎదురుచూస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో వివిధరకాల నొప్పులు కూడా స్త్రీలను వేధిస్తాయి మరియు సమీప భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

రెండవ త్రైమాసికంలో మీ భాగస్వామితో ప్రేమను పంచుకోవడం చాలా ఉత్తమమైన సమయం. ఈ సమయంలో మీ భాగస్వామి హార్మోన్లు విపరీతమైన ప్రేరణ ఇస్తాయి మరియు ఉత్సాహవంతమైన శక్తి కూడా వారిలో ఉంటుంది. అంతేకాకుండా, వారిలో కూడా శృంగారం చేయాలి అనే కోరికలు రెండవ త్రైమాసికంలో లో పెరిగిపోతాయి.

4. ప్రేమను పంచే సమయంలో బిడ్డకు మీరు ఎటువంటి హాని చేయరు :

4. ప్రేమను పంచే సమయంలో బిడ్డకు మీరు ఎటువంటి హాని చేయరు :

సాధారణంగా చాలామంది తండ్రులకు ఉండే భయం ఏమిటంటే, గర్భవతి అయిన భార్య కు సన్నిహితంగా గనుక ఉంటే, కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమైనా అయిపొతుందెమో అని భయపడిపోతుంటారు. మీరు తెలుసుకోబోతున్న అంశం ఏమిటంటే, తల్లి గర్భంలో బిడ్డ ఎంతో క్షేమంగా సంరక్షించబడుతూ ఉంటుంది. మీ భార్య యొక్క గర్భాశయం శ్లేష్మంతో పూర్తిగా ఉండి అన్ని ఒత్తిడిలను తట్టుకునే విధంగా ఉంటుంది. ఇంత సంరక్షించబడే ఈ ప్రాంతం బిడ్డ జన్మించే సమయంలో కానీ లేదా అందుకు కొద్దిగా ముందు మాత్రమే ఆ శ్లేష్మం తొలిగిపోతుంది.

5. మీరు చేస్తున్న పని మీ బిడ్డకు తెలిసిపోతే ఎలా ?

5. మీరు చేస్తున్న పని మీ బిడ్డకు తెలిసిపోతే ఎలా ?

చాలామంది తండ్రులు గర్భవతి భార్య తో ప్రేమను పంచుకొనే సమయంలో ఎక్కువగా ఆలోచించే విషయం ఏమిటంటే, ఇంకా పుట్టని బిడ్డకు ఎక్కడ తెలిసిపోతుంది, దాని వల్ల ఏదైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఇది అసాధ్యం. కడుపులో పెరుగుతున్న బిడ్డ కుదుపులకు లోనుకావొచ్చు. కానీ, మీ భాగస్వామి ఎప్పుడైతే త్వరగా నడుస్తుందో, బస్సు లో ప్రయాణిస్తుందో అటువంటి సమయంలో కూడా బిడ్డ అలాంటి కుదుపులకి లోనవుతుంది.

6. సన్నిహితంగా ఉన్న సమయంలో ఈ ఒక్క పని అస్సలు చేయకండి :

6. సన్నిహితంగా ఉన్న సమయంలో ఈ ఒక్క పని అస్సలు చేయకండి :

మీరు నోటితో గనుక శృగారం చేస్తున్నట్లైతే, అటువంటి సమయంలో ఈ సందర్భంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఆమె యోనిలోకి ఎటువంటి గాలి ని ఎట్టిపరిస్థిల్లోనూ పోనివ్వకూడదు. ఇలా గనుక చేస్తే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణను అడ్డు తగులుతుంది. ఈ స్థితిని ఆంగ్లంలో ఎంబాలిజం అంటారు. దీని వల్ల ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు.

7. పడక గదిలో కఠినంగా వ్యవహరిస్తాను అంటే కుదరదు :

7. పడక గదిలో కఠినంగా వ్యవహరిస్తాను అంటే కుదరదు :

శృంగారంలో పాల్గొనేటప్పుడు మీ భాగస్వామికి లేదా కడుపులో పెరుగుతున్న బిడ్డకు మీరు గనుక హానిచేయకూడదు అని భావించినట్లైతే, అటువంటి సమయంలో మీరు పడక గదిలో అసలు కఠినంగా వ్యవహరించకండి. ఇష్టం వచ్చినట్లు చేయకండి. మరీ ఎక్కువ ఒత్తిడి లేదా బరువు గనుక పెడితే మీ భాగస్వామి అసౌకర్యంగా భావించి విపరీతమైన నొప్పికి లోనుకావాల్సి వస్తుంది.

8. ప్రేమను పంచుకొనే పనిలో భాగంగా కొత్త భంగిమలను ప్రయత్నించండి :

8. ప్రేమను పంచుకొనే పనిలో భాగంగా కొత్త భంగిమలను ప్రయత్నించండి :

మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైన భంగిమలో శృంగారం చేయడం అంత ఆమోదయోగ్యం కాదు మరియు ఆలా చేయలేరు కూడా. ఆమె వంగే గుణాన్ని కోల్పోతుంది ఎందుకంటే, ఆమె గర్భం పెరుగుతున్న బిడ్డ కోసం విపరీతంగా సాగుతుంది.

నొప్పులు, తిమ్మిరిగా ఉండటం మరియు పట్టేయడం లాంటి ఎన్నో సమస్యలతో ఆమె బాధపడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో కొన్ని భంగిమల్లో శృంగారం చేయడం వీలుకాకపోవచ్చు. అందువల్ల ఇటువంటి సందర్భాల్లో ప్రేమను పంచుకొనే విషయంలో మీరు కొత్త మార్గాలు ఎంచుకోవాలి. ఏవైతే మిమ్మల్ని, మీ భాగస్వామిని ఇద్దర్ని ఉద్రేకపరుస్తాయో మరియు మీ భాగస్వామికి ఏదైతే సౌకర్యంగా ఉంటుందో అటువంటి వాటిని ఎంచుకోండి. మొదటి నాలుగు నెలల తర్వాత మిషనరీ భంగమని అస్సలు చేయకండి. ఎందుకంటే, ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి యొక్క వెనుక భాగం పై ఒత్తిడి పెరిగిపోతుంది.

దీని వల్ల ఆమె యొక్క ముఖ్యమైన రక్త నాళాల పై చెప్పలేనంత ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణం చేతనే వెనుక భాగాన్ని ఉపయోగించి నిద్రపోవడాన్ని పూర్తిగా నిషేధించండి అని గర్భవతి స్త్రీలకు సూచిస్తూ ఉంటారు.

9. సాధ్యమైనంత వరకు వాసన రాకుండా జాగ్రత్త పదండి :

9. సాధ్యమైనంత వరకు వాసన రాకుండా జాగ్రత్త పదండి :

గర్భధారణ సమయంలో స్త్రీల యొక్క వాసన చూసే శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. మీ నుండి గనుక ఏ చిన్న దుర్వాసన వచ్చిన, మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆమె ఇంతక ముందు ఏవైనా సుగంధ ద్రవ్యాలను లేదా సెంట్లు ఇష్టపడినా, అటువంటి వాటి వాసనలు కూడా ఇప్పుడు తట్టుకోలేదు.

మీ దగ్గర నుండి వస్తున్న వాసనల గురించి ఆమె గనుక మీకు పిర్యాదు చేస్తే, ఆ పిర్యాదుని మీరు మరీ వ్యక్తిగతంగా తీసుకోకుండా, అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంతవరకు శుభ్రంగా ఉండండి. ఇలా ఉండటం వల్ల చెడు వాసన మీ నుండి దూరం అవుతుంది. అదే సమయంలో సుగంధ ద్రవ్యాలను లేదా సెంట్లను వాడటం కూడా పూర్తిగా నిషేధించాలి.

10. శృంగారంలో గనుక పాల్గొంటే, పురిటి నొప్పులు పెరుగుతాయి అనేది నిజం :

10. శృంగారంలో గనుక పాల్గొంటే, పురిటి నొప్పులు పెరుగుతాయి అనేది నిజం :

మీ యొక్క వీర్యం లో ప్రోస్టాగ్లాన్దిన్ అనే హార్మోన్ ఉంటుంది. దీని యొక్క పని ఏమిటంటే, గర్భవతి అయిన స్త్రీల యొక్క గర్భాశయాన్ని ఉత్తేజ పరుస్తుంది మరియు సంకోచాలను సృష్టిస్తుంది. మీరు గనుక బిడ్డకు జన్మనిచ్చే తేదికి దగ్గరగా లేకపోతె మరియు మీ గర్భం గనుక ఆరోగ్యవంతంగా ఉంటే, సంకోచాలు మిమ్మల్ని ఏమిచేయలేవు మరియు పురిటి నొప్పులు మిమల్ని ముందుగానే ఇబ్బంది పెట్టవు.

మరో వైపు ఈ జ్ఞానాన్ని మీరు మీకు అనుకూలంగా వాడుకోవచ్చు. మీకు పుట్టబోయే బిడ్డ కొద్దిగా ఆలస్యంగా గనుక జన్మిస్తున్నట్లైతే అటువంటి సమయంలో మీరు పడక గదిలో కొన్ని శృంగార పనులు చేయవచ్చు.

 11. ఈ సమయంలో మీరు శృంగారానికి పూర్తిగా దూరంగా ఉండాలి :

11. ఈ సమయంలో మీరు శృంగారానికి పూర్తిగా దూరంగా ఉండాలి :

మీ భాగస్వామికి గనుక గతంలో ముందే పురిటి నొప్పులు వచ్చి ఉంటే, అటువంటి సమయంలో శృంగారానికి పూర్తిగా దూరంగా ఉండండి. మీ భాగస్వామి గనుక ప్లాసెంటా పెరువియా లేదా గర్భాశయం చాలకుండా ఉండే సమస్యలతో బాధపడుతున్నట్లైతే, అటువంటి సమయంలో మీరు శృంగారానికి దూరంగా ఉండండి. మీకు గనుక శృంగారపరమైన వ్యాధులు ఏవైనా ఉంటే, అటువంటి సమయంలో కూడా మీరు శృంగారంలో అస్సలు పాల్గొనకూడదు.

English summary

Is It Okay Being Intimate With Your Pregnant Wife?

Is It Okay Being Intimate With Your Pregnant Wife?,Many fathers-to-be are scared being intimate with their pregnant wife, as they are scared if it may hurt their baby in the womb. So read to know how safe it is to have sex during pregnancy and a few other valid points on the same.
Story first published:Saturday, February 24, 2018, 17:06 [IST]
Desktop Bottom Promotion