గర్భవతులు దానిమ్మ పండును తీసుకోవచ్చా?

Subscribe to Boldsky

అత్యంత పోషకవిలువలు కలిగిన పండ్లలో దానిమ్మ కూడా ఒకటి అని వేరే చెప్పనవసరంలేదు. ఒకవేళ మీరు గర్భందాల్చి ఉంటే, మీరు ఖచ్చితంగా మీకు మరియు మీ కడుపులో బిడ్డకు సరితూగేలా సరైన పోషకవిలువలు కలిగిన ఆహారపదార్ధాలు తీసుకొనవలసి వస్తుంది. తద్వారా మీరు చర్యలు ప్రారంభిస్తారు కూడా. కానీ ఇలాంటి సమయంలోనే అనేకులు అనేకరకాల సలహాలు ఇస్తుంటారు. అవి తినండి ఇవి తినకండి అంటూ వాళ్ళ వాళ్ళ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చెప్తుంటారు. కానీ వాటన్నిటినీ గుడ్డిగా నమ్మకుండా మీకై మీరు ఇంటర్నెట్, జర్నల్స్ , వీడియోలు, డాక్టర్ , డైటీషియన్ లేదా నమ్మదగిన వ్యక్తుల సలహాల ద్వారా తగిన పరిశోధనలు చేసి ఆహారప్రణాళికల విషయంలో ఒక అవగాహనకు రావలసి ఉంటుంది. పూర్తిగా నిర్ధారణకు వచ్చాక ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుని తద్వారా సమయానుసారం ఆహారం తీసుకొనవలసి ఉంటుంది.

ఇక్కడే అనేకమంది దానిమ్మపండు గురించిన సందేహాలను కలుగజేస్తారు, కొందరు తినమని సలహా ఇస్తే కొందరు ప్రమాదమని హెచ్చరికలు ఇస్తుంటారు. ఇలాంటి సందర్భంలో మీకు అనుమానం రావడం సహజం. ఇక్కడ ప్రతిఒక్కరికి వారి వారి అనుభవాలు, అభిప్రాయాలూ ఉంటాయి. వారి వారి మానసిక అభిప్రాయాలను ఉద్దేశించి ఆహారాల గురించిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కావున ఈ వ్యాసం ద్వారా మీరు దానిమ్మ పండును గురించిన పూర్తి వివరాలు తెలుసుకుని తద్వారా తీసుకోవచ్చా, లేదా అన్న సందేహానికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు.

Is it OK to have Pomegranate during pregnancy?

ఒకవేళ మీరు గర్భం దాల్చి, మీకు మీ బిడ్డకు సరైన పోషకవిలువలను అందించాలని మీరు నిజంగా భావిస్తున్న ఎడల దానిమ్మ పండు ఖచ్చితంగా సిఫార్సు చేయబడినది. దానిమ్మ పండు గురించిన అపోహలనన్నింటిని పక్కన పెట్టి నిరభ్యంతరకరంగా, నిర్భయంగా దానిమ్మ పండును స్వీకరించవచ్చు. మనకు తెలిసినదే ఎప్పటికీ ప్రామాణికం కాదు.

అనేకమంది దానిమ్మ గురించిన ఎన్నో అపోహలలో ఉన్నారు. పరిశీలన తర్వాతే, వారి అపోహలను దూరం చేయడానికే ఈ వ్యాసం. దానిమ్మ పండును అనేకమంది రుచి కోసం కానీ, స్నాక్స్ గా కానీ తీసుకొనుటకు మొగ్గు చూపుతారు. శరీరానికి అవసరమైన కాలరీలు, ప్రోటీన్లు, మినరల్స్ కలిగి ఉండే పండు దానిమ్మ పండు. కేలరీలు అధికంగా ఉండే స్నాక్స్ కి ప్రత్యామ్నాయంగా ఈ దానిమ్మ పండును స్వీకరించవచ్చు.

ఏ డాక్టర్ కూడా దానిమ్మ పండుకు వ్యతిరేకంగా సలహా ఇవ్వజాలరు. కేవలం అలర్జీలు, లేదా కొన్ని ప్రత్యేకించిన వ్యాధులకు గురై ఉంటే తప్ప. ఈ కారణాలు కాకుండా వేరే ఏ ఇతరకారణాలు దానిమ్మ పండు తీసుకోవడానికి వ్యతిరేకంగా ఉండవు. దానిమ్మ పండు తీసుకోవడం ద్వారా మీకు మరియు మీ కడుపులోని బిడ్డకు సరైన పోషకాలను అందివ్వగలరు అన్నది నిజం.

Is it OK to have Pomegranate during pregnancy?

మీరు ప్రెగ్నెంట్ అయి ఉండి, స్వీట్స్ మీద మమకారం కనపరుస్తూ ఉంటే, స్వీట్స్ కు బదులుగా దానిమ్మ పండును తీసుకోండి. స్వీట్స్ మీ నాలికను తృప్తి పరుస్తాయే తప్ప , ఎటువంటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉండవు. ఈ స్వీట్స్ కి బదులుగా దానిమ్మ పండును తీసుకోవడం ఎన్నో విధాలుగా మంచిది. మరియు, దానిమ్మ గింజలను నేరుగా తినలేని పక్షంలో ఎటువంటి కృత్రిమ చక్కెరలు కలుపకుండా, వీలైతే ప్రకృతి సిద్దమైన తేనె కలిపి, లేదా తాజా దానిమ్మ రసం తాగడం మంచిది. ఇది మీ స్వీట్స్ పై ఉన్న మమకారాన్ని తృప్తి పరచడమే కాకుండా, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది.

గర్భధారణ సమయంలో సహజసిద్దంగా ఉన్న శరీరానికి రోజుకి అవసరమైన కేలరీల కంటే అదనంగా 300 కాలరీల శక్తి అవసరమవుతుందని చెప్పబడినది. ముఖ్యంగా రెండవ మరియు మూడవ ట్రెమిస్టర్స్ లో. కావున కాలరీలను, పోషకాలను కలిపి ఒకేసారి పొందగల దానిమ్మ పండు ఎంతో ముఖ్యమైనది. కేవలం రుచికరంగానే ఉండడం కాకుండా అనేకరకాల ఆరోగ్యప్రయోజనాలను కలిగించే ఈ దానిమ్మ పండును, గర్భవతులే కాకుండా అందరూ క్రమంతప్పకుండా తీసుకోవలసినదిగా సూచిస్తుంటారు.

గర్భధారణ సమయంలో దానిమ్మ వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు :

Is it OK to have Pomegranate during pregnancy?

1. ముఖ్యంగా చివరి ట్రెమిస్టర్ లో అనగా 7,8,9 నెలల్లో , అనేకరకాల జీర్ణసమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇది సహజం, ఇలాంటి సందర్భాలలో ఫైబర్ ఎక్కువ ఉండేలా ఆహారపదార్ధాలు తీసుకొనవలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో దానిమ్మ పండు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. దానిమ్మ పండులో అత్యధికంగా ఫైబర్ ఉన్న కారణంగా, ఎక్కువ ఆకలి వేయకుండా జాగ్రత్త తీసుకుంటుంది. కనీసం సగం కప్పు దానిమ్మ గింజలను తీసుకోవడం ద్వారా, కడుపులో జీర్ణక్రియ చక్కగా జరిగి తద్వారా మీకు అనేక జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తకుండా చూడడంలో సహాయం చేస్తుంది.

2. చాలామంది గర్భవతులు ఎక్కువగా రక్త హీనత వంటి రోగాలబారిన పడుతూ ఉంటారు. ఎనీమియా అంటారు. గర్భవతిగా ఉన్నప్పుడే కాకుండా, ప్లానింగ్ కు 3 నెలల ముందు నుండే ఐరన్ సప్లిమెంట్స్ (ఐరన్ టాబ్లెట్స్) తీసుకోవలసిందిగా డాక్టర్లు సూచిస్తుంటారు. ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మూలంగా రక్తహీనత కలుగకుండా జాగ్రత్త పడవచ్చు. కానీ కేవలం ఐరన్ సప్లిమెంట్స్ ద్వారానే కాకుండా, ఆహార పదార్ధాల రూపంలో కూడా ఐరన్ స్వీకరించాల్సి వస్తుంది. అప్పుడే శరీరానికి అవసరమైన మోతాదులో ఐరన్ అందివ్వగలము. ఇక్కడ దానిమ్మ పండులో ఎక్కువ మోతాదులో ఐరన్ నిక్షిప్తమై ఉంటుంది. రోజూ వారీ ఆహార ప్రణాళికలలో భాగంగా దానిమ్మ పండు తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ఐరన్ ను అందివ్వగలము, తద్వారా రక్తహీనత రాకుండా కాపాడవచ్చు.

3. శరీరంలో ఐరన్ ను తగుమోతాదులో నియంత్రించడానికి, ఆహారం నుండి ఐరన్ స్వీకరించడానికి కూడా విటమిన్ సి కావాలి. దానిమ్మ పండులో ఐరన్ తో పాటు శరీరానికి కావలసిన విటమిన్ సి కూడా పుష్కలంగా దొరుకుతుంది. తద్వారా శరీరానికి కావలసిన మోతాదులో విటమిన్-సి అందివ్వగలము. తద్వారా ఆహారం నుండి ఐరన్ ను స్వీకరించి, శరీరానికి అందివ్వడంలో ఎంతో దోహదం చేస్తుంది.

గర్భధారణ సమయంలో దానిమ్మ పండువలన కలిగే సమస్యలు :

ఇప్పటి దాకా దానిమ్మ పండు గురించిన లాభాలు చూశాము, కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అవేమిటో చూద్దాం.

1. దానిమ్మ పండును ఎక్కువగా జ్యూస్ రూపంలో తీసుకునేవారికి సమస్య ఉంటుంది. నేరుగా తినడంవలన జీవక్రియల సహకారంతో శరీరానికి అవసరమైన మినరల్స్, పోషకాలను మాత్రమే తీసుకుని వ్యర్ధాలను నెట్టివేసే అవకాశం ఉంది, కానీ జ్యూస్ ద్వారా తీసుకోవడం వలన కేలరీల సంఖ్య అధికమయ్యే అవకాశం ఉంది. కావున దానిమ్మ పండును రసంగా తీసుకునే వారు తక్కువ మోతాదులో తీసుకొనవలసి ఉంటుంది.

2. ఒకవేళ మీరు ఏదైనా రక్త పోటు (BP) వంటి సమస్యలతో భాధపడుతూ ఉంటే, డాక్టర్ సలహామేరకే దానిమ్మ పండును తీసుకోవలసి ఉంటుంది. ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ కాకుండా, మరేదైనా ఆరోగ్య సమస్యల దృష్ట్యా మీరు మందులు స్వీకరిస్తూ ఉంటే, డాక్టరుని సంప్రదించి దానిమ్మ పండు తినడం మేలు.

3. సమస్యలు డాక్టరు దృష్టికి తీసుకుని రాకుండా మీరు వాడుతున్న మందులతో సంబంధంలేకుండా దానిమ్మ పండును తీసుకుంటూ ఉంటే, లేబర్ డేట్ (డెలివరీ సమయం) ముందుకు జరిగే సూచనలు ఉన్నాయి.

కావున మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే దానిమ్మను స్వీకరించాల్సి ఉంటుంది.

మీరు గర్భందాల్చి ఉన్నఎడల మీశరీరానికి కాల్షియం, ఐరన్, విటమిన్D, ఫోలెట్, ప్రోటీన్లను కూడా అందిoచవలసి వస్తుంది. అరకప్పు దానిమ్మ గింజలలో 72 కాలరీలు, మరియు రోజులో శరీరానికి కావలసిన 1000మిల్లీగ్రాముల కాల్షియంలో 9గ్రాముల కాల్షియం, 27లో 0.26మిల్లీగ్రామ్స్ ఐరన్, 800 మైక్రోగ్రామ్స్ లో 33మైక్రోగ్రామ్స్ ఫోలెట్ ను, 71గ్రాముల ప్రోటీన్ లో 1.45గ్రామును, 8.9మిల్లీగ్రామ్స్ విటమిన్ సి కలిగి ఉంటాయి. తద్వారా శరీరానికి కావలసిన మోతాదులో అందివ్వడానికి సహాయం చేస్తుంది. మరియు ముఖ్యంగా గర్భందాల్చిన వారు దానిమ్మను జ్యూస్ గా కన్నా, నేరుగా తీసుకుంటేనే అధిక ప్రయోజనాలను పొందగలరు. కేవలం దానిమ్మపండు మాత్రమే పూర్తి పోషకాలను ఇవ్వలేదు, డాక్టర్ సలహామేరకు పలురకాల పండ్లను మన ఆహార ప్రణాళికలో భాగంగా చేర్చుకోవలసి ఉంటుంది.

ఒక ప్రణాళికా బద్దమైన ఆహార నియమాలు, వ్యాయామo, డాక్టర్ సూచించిన విటమిన్, ఐరన్ సంప్లిమెంట్స్ క్రమశిక్షణతో తీసుకోవడం, మీ చుట్టూ ఉన్న ప్రకృతిని మీకు తగినట్లుగా మార్చుకోవడం వంటివి మీ ఆరోగ్యoతో పాటు మీ బిడ్డ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని చార్ట్ ప్రిపేర్ చేసుకుని ప్రాణాళికా బద్దంగా వ్యవహరించడం ఎంతో మంచిది. ఈవ్యాసం మీకు దానిమ్మ పండు గురించిన అనేక సందేహాలని నివృత్తి చేసిందని భావిస్తున్నాం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Is it OK to have Pomegranate during pregnancy?

    Pomegranate is one such fruit that is loved by many. And if you are pregnant, this is one fruit that provides all the nutrients that are required for your body. Doctors also advise you to have pomegranate and it is a completely safe to have it during pregnancy, until you don't have any other allergies.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more