For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మెనోపాజ్ తరువాత ప్రెగ్నన్సీ సాధ్యమేనా?

  |

  లేటు వయసులో వివాహం చేసుకున్న మహిళలు గర్భం దాల్చే విషయంలో కంగారు పడతారు. కన్సీవ్ అయ్యే అవకాశాలు మెనోపాజ్ తరువాత తక్కువని వీరు భావిస్తారు. మెనోపాజ్ అనేది పునరుత్పత్తి సామర్థ్యానికి స్వస్తి పలుకుతుందని వీరి అభిప్రాయం. లేట్ ప్రెగ్నన్సీ లో ఛాన్సెస్ నిల్ అని వీరి అభిప్రాయం.

  ఈ ఆలోచన కలగడానికి కారణం ఓవరీస్ లో మెనోపాజ్ తరువాత ఎగ్స్ అనేవి రిలీజ్ అవకపోవడం, ఫెర్టిలైజ్ అవకపోవడం అలాగే బేబీ పెరిగే ఛాన్సెస్ లేకపోవడం. అయితే, మెనోపాజ్ తరువాత గర్భం దాల్చడం అనేది లేటెస్ట్ టెక్నాలజీ వలన సాధ్యపడుతుంది.

  మెనోపాజ్ తరువాత కన్సెప్షన్ ఛాన్స్లు తక్కువే ఉన్నా, ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అయ్యాక మరిన్ని కాంప్లికేషన్స్ ను ఎదుర్కోవలసి వస్తుంది. మెనోపాజ్ దశలో కన్సీవ్ అయినా తల్లీ బిడ్డల ఆరోగ్యం అనేది లేటు ప్రెగ్నన్సీలో రిస్క్ లో పడుతుంది. మహిళల్లో పిల్లల్ని కనే సామర్థ్యం తగ్గుతుంది కానీ పూర్తిగా క్షీణించదు.

  మెనోపాజ్ తరువాత ప్రెగ్నన్సీ అనేది కాంప్లికేషన్స్ తో కూడి ఉండటానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  మెనోపాజ్ తరువాత ప్రెగ్నన్సీ సాధ్యమేనా

  మెన్స్ట్రుయేషన్

  మెనోపాజల్ దశలో కూడా మెన్స్ట్రుయేషన్ యాక్టివ్ గా ఉన్నప్పుడు ప్రెగ్నన్సీ అనేది సాధ్యమే. మెన్స్ట్రుయేషన్ అనేది సజావుగా జరుగుతున్న కొద్దీ ఓవులేషన్ అనేది సక్రమంగా జరుగుతుంది. ఎగ్ అనేది ఓవరీ ద్వారా సులభంగా రిలీజై ఫెర్టిలైజ్ అవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రెగ్నన్సీ అనేది సాధ్యమవుతుంది. అయినప్పటికీ, ప్రెగ్నన్సీ అనేది మెనోపాజ్ తరువాత స్మూత్ రైడ్ కాదు. అయితే, మెన్స్ట్రుయేషన్ ఆగిపోయినప్పుడు ప్రెగ్నన్సీ అనేది సాధ్యపడదని గుర్తించుకోండి.

  హార్మోన్ లెవెల్స్ లో తగ్గుదల

  ఈస్ట్రోజెన్స్ అనే ఎసెన్షియల్ సెక్స్ హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది కన్సీవ్ అయ్యే ఎబిలిటీను పెంపొందిస్తాయి. అయితే, మెనోపాజ్ లో ఇది సాధ్యపడదు. హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మెనోపాజ్ దశలో మీ శరీరం కన్సీవ్ అవడానికి సిద్ధంగా ఉండదు. మరోవైపు, మెనోపాజ్ లో కొంతమంది మహిళలు వివిధ ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఇందువలన, పిల్లలు కలిగే అవకాశం తక్కువ.

  తల్లీ బిడ్డలలో హెల్త్ రిస్క్స్

  మెనోపాజ్ తరువాత గర్భం దాల్చితే తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ దశలో ఇద్దరి ఆరోగ్యాలకి సీరియస్ కాంప్లికేషన్స్ ఎదురవవచ్చు. లేట్ ప్రెగ్నన్సీలో బిడ్డ పుడితే కాంజేనిటాల్ బర్త్ డిఫెక్ట్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుందని మీరు గుర్తించాలి.

  ఈ దశలో ప్రెగ్నన్సీని ప్లాన్ చేయడం అనేది కష్టతరం. ఎందుకంటే, మెన్స్ట్రువేశం సైకిల్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఓవులేషన్ డేట్ ను గుర్తించడం కష్టం.

  హెర్బల్ మెడిసిన్స్ పై ఆధారపడకండి

  ఏజ్ ప్రకారమే ఓవరీస్ పనిచేస్తాయి. గర్భం దాల్చే సామర్థ్యం ఉన్నప్పుడే ఓవరీస్ ఎగ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. మెన్స్ట్రువల్ సైకిల్ లో శరీరం అనేది పీరియడ్స్ స్టార్ట్ అవడానికి ముందే రెండు ఎగ్స్ ను రిలీజ్ చేస్తాయి. అయితే, శరీరం ఓవులేట్ చేయడం మానేసినప్పుడు, ఎగ్స్ అనేవి ఫెర్టిలైజేషన్ కోసం ఉత్పత్తి కావు. అందువలన, మెనోపాజ్ తరువాత ప్రెగ్నన్సీ అనేది సాధ్యపడే అవకాశాలు ఉండవు.

  మార్కెట్ లో లభ్యమయ్యే హెర్బల్ ప్రోడక్ట్స్ ను గుడ్డిగా నమ్మకండి. అవన్నీ వండర్స్ చేస్తాయని భావించకండి. మెనోపాజ్ తరువాత మెన్స్ట్రువేషన్ కోసం కంగారు పడి హెర్బల్ ప్రోడక్ట్స్ ని స్వంతంగా ప్రయత్నించకండి. మెనోపాజ్ తరువాత గర్భం దాల్చే అవకాశాన్ని ఇవి అందించలేవు.

  English summary

  Is Pregnancy After Menopause Possible?

  Women who marry late worry whether they can get pregnant. These women feel that their chances of getting pregnancy are slim after menopause. People have this notion that menopause is the end of the reproductive years and the chances are nil for late pregnancy.The reason for this assumption is that there are no eggs present in the ovaries to release, fertilise and grow into a baby. However, getting pregnant after menopause or late pregnancy is possible with latest technology.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more