For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాకు మైగ్రేన్ తలనొప్పి వస్తుంటుంది. ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించేముందు దీని గురించి నేనేమైనా తప్పక తెలుసుకోవాలా?

|

ఆడవారు కడుపుతో ఉన్నప్పుడు తీవ్రంగా తలనొప్పితో బాధపడుతూ ఉంటే ఏదో సంకెళ్ళు వేసి బంధించినట్లుగా ఫీలవుతారు, అది నిజమే కూడా.

తీవ్రంగా తలనొప్పి వచ్చినపుడు దాదాపు చాలామంది స్త్రీలు సింపుల్ గా పెయిన్ కిల్లర్ మందు తీసుకుంటారు, కానీ ఈ బాధకన్నా పుట్టబోయే బిడ్డ సంక్షేమం అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ముఖ్యమవుతుంది.

నొప్పి తగ్గించే పెయిన్ కిల్లర్ బేబీకి హానికరం కావచ్చు, అందుకని ఇప్పుడు ఆ దారి కూడా లేదు. అందుకని ఉన్న ఏకైక దారి సహజమైన పద్దతులు వెతకడం,కానీ ఏమిటి ఆ మార్గాలు?

Migraine During Pregnancy: Dangerous?

ప్రతి స్త్రీ జీవితంలో ప్రెగ్నెన్సీ చాలా ప్రత్యేకమైన సమయం, కానీ దాంట్లో స్త్రీ శరీరం చాలా పెద్ద మార్పులకి గురవుతుంది, శరీరమే కాదు ఇద్దరి జీవితాలలో కూడా ఈ అద్భుత మార్పులు వస్తాయి. కొత్తగా వచ్చే బిడ్డ జీవితాన్ని మొత్తంగా మార్చేయటమే కాదు, ప్రెగ్నెన్సీ సమయంలో తీవ్ర హార్మోన్ల మార్పుల వలన శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి.

కడుపుతో ఉన్నప్పుడు వచ్చే వివిధ నెప్పులలో తలనొప్పి చాలా సాధారణమైనది అని చెప్పుకోవచ్చు. ఇది శరీరంలో హార్మోన్ల స్థాయిలు మారుతూ ఉండటం వలన వస్తుంది, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ఈ మార్పులన్నిటికీ ముఖ్య కారణం. ఇంతకుముందెన్నడూ మైగ్రేన్ తలనొప్పి రాని ఆడవారికి ప్రెగ్నెన్సీ ముందే మొదటిసారి తరచుగా వస్తుంటుంది.

Migraine During Pregnancy: Dangerous?

మరీ తరచుగా కాకపోయినా ఈ మైగ్రేన్ ఎటాక్ లు మొదటి త్రైమాసికం మొత్తం వస్తూనే ఉంటాయి, నెలలు నిండేకొద్దీ కొంచెం తక్కువగా వస్తుంటాయి. కానీ ఏది ఏమైనా వచ్చినప్పుడల్లా చాలా బాధాకరంగా ఉంటుంది.

.మొదటగా చేయాల్సింది కారణమేంటో కనుక్కోవటం. హార్మోన్ల మార్పులే సాధారణంగా పెద్ద దోషులవుతాయి కానీ అవొక్కటే కాదు. ప్రెగ్నెన్సీలో వచ్చే తలనొప్పులు నిటారుగా నిలబడటం, కూర్చోవటం లేకపోవటం వలన కూడా రావఛ్చు. మూడవ త్రైమాసికం మొత్తం తలనొప్పి రావటానికి ముఖ్యకారణం ఇదే. సరిగ్గా నిటారుగా కూచోవడం, నిలబడడం చేస్తే ఇది నివారించవచ్చు.

Migraine During Pregnancy: Dangerous?

ప్రెగ్నెన్సీలో వచ్చే తలనొప్పులకి ఇతర కారణాలు నిద్రలేకపోవటం, ఆకలి, మానసిక వత్తిడి, తగినంత నీరు శరీరంలో లేకపోవటం లేదా రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండటం వంటివి. అందరికీ తెలిసినట్టు ఇలాంటి కారణాల వలన వచ్చే తలనెప్పులనుంచి ఉపశమనం పొందటానికి మానసికంగా వత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉండటం, సరిగా పడుకోవటం, కావాల్సినంత నీరు తాగటం, కొంచెం మొత్తాలలో భోజనం చేయటం వంటివి తరచుగా చేయాలి.
Migraine During Pregnancy: Dangerous?

చాలామంది కాఫీ తాగే అలవాటున్న స్త్రీలు కడుపుతో ఉన్నామని తెలియగానే కాఫీ మానేస్తారు. కెఫీన్ నుంచి హఠాత్తుగా దూరమవ్వడం కూడా తలనొప్పులకి కారణమవుతుంది, ఇంకా మొత్తానికే మానేస్తే ఈ లక్షణాలు తీవ్రమవుతాయి కూడా.

మెల్లగా కాఫీని తగ్గిస్తూ తాగటం వలన ఈ ప్రభావాలు నెమ్మదిగా తగ్గిపోతాయి లేదా ముందుకన్నా తగ్గుతాయి. మీరు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తుంటే గర్భం వచ్చేముందే మెల్లగా కాఫీ అలవాటును తగ్గించుకోండి.

Migraine During Pregnancy: Dangerous?

చాలా పెయిన్ కిల్లర్లను ప్రెగ్నెన్సీ సమయంలో వేసుకోడానికి అనుమతించరు, అందుకని వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఇంకా ఇతర ప్రసిద్ధ సహజ చిట్కాలైన ఫీవర్ ఫ్యూ, ఓట్’స్ మొక్కల వాడకం కూడా కడుపుతో ఉన్నవారికి సాధారణంగా సూచించరు.

ఇది కూడా చదవండి;తలనెప్పి తగ్గించటానికి భారతీయ సహజ ఇంటి చిట్కాలు

English summary

Migraine During Pregnancy: Dangerous?

Migraine During Pregnancy: Dangerous? ,Headaches are probably the most typical types of pain experienced during pregnancy and fluctuations in bodily hormone levels, especially oestrogen,
Story first published:Monday, March 5, 2018, 18:18 [IST]
Desktop Bottom Promotion