Latest Updates
-
Wolrd Blood Donor Day 2026: రక్తదానం చేస్తే ఇన్ని ప్రయోజనాలుంటాయా? -
అమృత సిద్ధి యోగం: ఈ 3 రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం, తలరాత మారబోతోంది! -
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -
ఈరోజు రాత్రి అరుదైన యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
శని దోషం ఉందా? ఈ 7 పరిహారాలు వెంటనే మొదలుపెట్టండి -
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే! -
సోమవతి అమావాస్య: ఈ చిన్న పరిహారాలతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు! -
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు -
మ్యారేజ్ లైఫ్ బోర్ కొడుతుందా.. ప్రతిరోజూ రొమాంటిక్గా ఉండాలంటే ఇలా చేయండి.!
మూడ్ మార్పులు , ప్రెగ్నెన్సీ సమయంలో మూడ్ ఎలా మారుతుంటుంది
మీరు గర్భవతి, మీరు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండాలి, కానీ మీ మూడ్ మాత్రం దానికి నచ్చినట్లు ఉంటోంది. ఒక నిమిషం సంతోషంగా ఉంటే, మరునిమిషం ఏడుస్తున్నారు; ఒక నిమిషం పాపాయి భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తుంటే, వెంటనే మరో నిమిషం భయం, అభద్రతతో వణికిపోతున్నారు.
ప్రెగ్నెన్సీ సమయంలో మూడ్లలో మార్పు రావటం చాలా సాధారణ సమస్య, చాలామంది ఆడవాళ్లలో ఇది వస్తుంది. మీ శరీరం బేబీకోసం తయారవుతుంటే (ఆ,అవును ఇప్పుడు మీరు బేబీ వచ్చాక కొనాల్సిన వస్తువుల గురించి ఆలోచించండి! బాధపడద్దు. మీకు వెచ్చని దుప్పట్లు, బేబీ బట్టలు, బేబీ పరిశుభ్రతకోసం వస్తువులు, ఇంకా ఇంకా చాలా చాలా పాంపర్స్ న్యూ బేబీ డైపర్లు. అదిగో చూసారా మేము కూడా మీకు కొంచెం సాయం చేసేసాం.ఇక రిలాక్స్ అవండి!) కొన్ని ప్రత్యేక మార్పులకి గురవుతుంది, అవి హార్మోనల్ గా ఇంకా శారీరకంగా కూడా. ఈ హార్మోన్ల మార్పులే ప్రెగ్నెన్సీ సమయంలో మూడ్ల మార్పులకి కారణం.
కానీ కేవలం హార్మోన్లనే నిందించక్కర్లేదు. మీ ఒంట్లో కూడా పెనుమార్పులు జరుగుతున్నాయి. మీ శరీరం మారటాన్ని చూడటం ఎంత అద్భుతమైన అనుభవంగా అన్పిస్తుందో, అంత చిరాగ్గా కూడా ఉంటుంది. మీరు మళ్ళీ ఇదివరకటి సైజు, ఆకృతికి వెళ్ళగలరా అని ఆలోచిస్తారు. వరుసగా గుండెల్లో మంట, పొద్దునే వికారం వంటివి ఉన్న ఆనందాన్ని మొత్తం హరించేస్తాయి.

అవును, ప్రెగ్నెన్సీలో మూడ్ల మార్పులు సాధారణమైనవి, వాటితో పోరాడటానికి మార్గాలు కూడా ఉంటాయి
ప్రెగ్నెన్సీలో వచ్చే మూడ్ మార్పులు రెండవ త్రైమాసికానికల్లా తగ్గిపోతాయి. మీరు ఎలా ఫీలవుతారో దాని నియంత్రణ మీ చేతిలోనే ఉంటుంది ,అలాగే మళ్ళీ మూడ్లో మార్పులు నెలలు నిండుతున్నప్పుడు, డెలివరీ గురించి చింతించడం వలన మొదలవుతాయి.
కడుపుతో ఉన్నప్పుడు మూడ్ల మార్పును ఎదుర్కోవటం
మీ ప్రెగ్నెన్సీ సమయంలో మూడ్ మార్పులు కూడా భాగమేనని మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవటం, ప్రశాంతంగా ఉండటానికి మొదటి మెట్టు.

ఎవరితోనైనా మాట్లాడండి
మీ భయాలను మీరు నమ్మే వ్యక్తితో పంచుకోండి – మీ భాగస్వామి, కుటుంబం, స్నేహితులు, మీరంటే ప్రేమ,ఆప్యాయత ఉండే ఎవరితోనైనా పంచుకోని వారి అండ పొందండి.

సాయం అడగండి
కడుపుతో ఉండటమే పెద్ద మార్పులొచ్చే దశ.దాన్ని మీ బేబీ కోసం చేసే పనులతో మరింత భారం వేసుకోకండి – శుభ్రం చేయటం, అలంకరించడం, షాపింగ్…ఇలాంటి పనులు మీరు నమ్మేవారికి అప్పచెప్పవచ్చు. మీకు సాయం చేయటం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు, మీ నుంచి అంగీకారం వస్తే చాలు దూసుకుపోతారు, మీరే చూడండి.

విశ్రాంతి తీసుకోండి,తీసుకుంటూనే ఉండండి
అలసటగా ఉంటేనే చిరాకుగా అన్పిస్తుంది. చెత్త మూడ్ నుంచి బయటపడాలంటే అవసరమైనంత విశ్రాంతి తీసుకోవాలని గుర్తించండి. రాత్రంతా సరిగా నిద్రపట్టకపోతే రోజంతా కొంచెం కొంచెంసేపు నిద్రపోండి.

రిజిస్ట్రేషన్
రివార్డ్ మిలో సభ్యులుగా మారి ప్రత్యేక ఆఫర్లను పొందండి!

సభ్యులుగా మారండి
మీ పనిలోంచి కొంత సమయం ఖాళీ చేసుకుని, ఇంకా విశ్రాంతి తీసుకోగలరో లేదా ఇంటి నుంచి పనిచేయగలరేమోనని ఆలోచించండి. మీ పురిటి సమయం లీవును తగ్గించవద్దు.

వ్యాయామం
వ్యాయామం వలన ఎండార్ఫిన్లు(ఆనందకర హార్మోన్లు) విడుదలై మీకు అప్పటికప్పుడు శక్తి వస్తుంది. నడవండి, ఈతకొట్టండి లేదా కొంచెం యోగా, బ్రీతింగ్ వ్యాయామాలను మీకు ఎప్పుడు డల్ గా అన్పిస్తే అప్పుడు చేయండి.

కలిసి మంచి సమయం గడపండి
మీ భాగస్వామితో మూడ్స్ మార్పు గురించి మాట్లాడి సాయం అడగండి. దురదృష్టవవశాత్తూ మీకు దగ్గరగా ఉండేవారే మీ మూడ్స్ వలన కష్టపడతారు. వారితో ఎంత వీలైతే అంత సంతోషక్షణాలను గడపండి.

పశ్చాత్తాపపడకండి
నెగటివ్ ఆలోచనలు ఈ సమయంలో మీకు తప్పక వస్తాయన్న నిజాన్ని ఒప్పుకోండి. అది సహజమే. దాని అర్థం మీరు సరైన తల్లి అవలేరని కాదు.



Click it and Unblock the Notifications