For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  గర్భస్రావానికి సాధారణంగా దారితీసే కారణాలు

  |

  "మాతృత్వంతోనే ఆడజన్మ సార్ధకమవుతుంది" అంటారు పెద్దలు. ప్రతి స్త్రీ యుక్త వయస్సు రాగానే, తనకు తగిన వరుడుతో పెళ్లికావాలని ఎలా కోరుకుంటుందో, అదే విధంగా పండంటి పాపాయికి తల్లి కూడా కావాలనుకుంటుంది . ముద్దులొలికే పాపాయికి జన్మనివ్వాలని తహతహలాడుతూ, తీవ్ర ప్రయత్నానంతరం గర్భం ధరించి, అది ఎక్కువ కాలం నిలువకుండా, గర్భస్రావానికి దారితీస్తే, ఎవరైనా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ప్రసూతి వైద్యులు చెప్పినట్లు, గర్భస్రావాలు, తొలి త్రైమాసికంలో గర్భం పోవడం అసాధారణ సమస్యలు కావు. ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో సాధారణ భాగమే!

  కొన్ని నివేదికల ప్రకారం, కొన్ని గర్భస్రావాలు తెలియకుండానే జరిగిపోతాయి. మీరు నెలసరి ఆలస్యం అయినట్టు గమనించకపోవచ్చు, ఆ ఆలస్యమైన నెలసరి గర్భస్రావం కావచ్చు. ముఖ్యంగా పిల్లల కోసం ఎటువంటి ప్రణాళిక లేకుండా గర్భం ధరించినవారిలో , గర్భ పరీక్ష చేసుకోనట్లైతే, తొలి రోజులలో గర్భం ధరించినట్టు తెలుసుకోలేరు. వైద్యులు చెప్పేదాని ప్రకారం,సగం గర్భాలు మొదటి త్రైమాసికంలోనే ముగిసిపోతాయి.

  Natural Reasons For Miscarriages

  మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లైనా లేదా మీకు గర్భస్రావం జరిగినట్లైతే,మీకు సహజంగా గర్భస్రావానికి దారితీసే కారణాలను తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. ఒకసారి లేదా పదేపదే జరిగే గర్భస్రావానికి, దారితీసే సాధారణ కారణాలు ఈ వ్యాసం చదివి తెలుసుకోండి.

  • క్రోమోజోమ్లలో అసాధారణతలు:

  అరవై శాతం గర్భస్రావాలు సరిపోలని క్రోమోజోముల మూలంగా జరుగుతాయి. క్రోమోజోములు అనేవి, ప్రతి కణంలో ఉండే చిన్న నిర్మాణాలు. ఇవి జన్యువులను కలిగి ఉంటాయి. ప్రతి మానవునిలో 23 జతల క్రోమోసోములు ఉంటాయి. ఒక సెట్టు తల్లి నుండి , ఒక సెట్టు తండ్రి నుండి సంక్రమిస్తాయి. అండం మరియు శుక్రకణం రెండు జతకలసినపుడు,వాటిలో ఒకటి లోపంతో కూడుకుని ఉన్నట్లయితే, క్రోమోజోముల తీరు సక్రమంగా ఉండకపోవచ్చు. దీని మూలంగా పిండంలోని క్రోమోజోమ్లలో అసాధారణతలు తలెత్తవచ్చు. ఇటువంటి గర్భాలు సాధారణంగా నిలవవు.

  • గర్భాశయం మరియు సర్విక్స్ లో లోపాలు:

  కొంతమందిలో అండాశయ ఆకారం సక్రమంగా ఉండదు. కొన్ని సందర్భాలలో, అండాశయం విడిపోయి ఉంటుంది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో "యుటరైన్ సెప్టం" అంటారు.

  దుర్బలమైన సర్విక్స్ వలన కూడా విజయవంతమైన గర్భానికి అడ్డుకట్ట వేస్తుంది. మొదటి త్రైమాసికం గడిచిన అనంతరం కూడా, పిండం పరిమాణం పెరగడం వలన, ఆ ఒత్తిడి బలహీనమైన సర్విక్స్ పై పడి, వాపు లేక అసౌకర్యం కలుగజేసి, పిండాన్ని నిలిపి ఉంచే పరిస్థితి లేకుండా చేస్తుంది. ఈ సమస్య సాధారణంగా పదేపదే గర్భస్రావం జరిగిన మహిళలలో కనిపిస్తుంది.

  ఏదేమైనప్పటికి, యుటరైన్ సెప్టం సమస్యను మాత్రం శస్త్రచికిత్సతో సరిచేయవచ్చు. బలహీనమైన సర్విక్స్ కు కుట్లు వేయడం ద్వారా మూసుకుని ఉండేట్టు చేయవచ్చు. ఈ ప్రక్రియను సెర్క్లేజ్ అని అంటారు. ఈ ప్రక్రియలు చేపట్టిన అనంతరం కూడా, ప్రసవమయ్యేదాక, పూర్తి విశ్రాంతి అవసరం

  • ఇమ్యునోలాజిక్ డిజార్డర్:

  కొంతమంది స్త్రీల శరీరంలో శుక్రకణం, అన్య పదార్థముగా పరిగణింపబడి, రోగనిరోధక వ్యవస్థ తదనుగుణంగా పనిచేయడం మొదలుపెడుతుంది. ఇలా జరిగినపుడు, పిండాన్ని కూడా స్త్రీ దేహం అంగీకరించదు. యాంటిఫాస్ఫోలిపిడ్ యాంటిబాడీస్ గా పిలువబడే ప్రతిరోధకాలు తమ శరీరంలో కణజాలాన్ని, పిండంతో సహా, తామే నాశనం చేస్తాయి. దీనివలన గర్భస్రావం జరుగుతుంది. ఇది సర్వసాధారణమైన పరిస్థితి కానప్పటికీ, వైద్యులు ఇటువంటి రోగులకు, హెపారిన్ వంటి రక్తం పలుచన చేసే పదార్థాలు మరియు స్టెరాయిడ్స్ ఉపయోగించి చికిత్స చేస్తారు.

  • థైరాయిడ్ మరియు అనియంత్రిత మధుమేహం:

  ఒక స్త్రీ, థైరాయిడ్ మరియు అనియంత్రిత మధుమేహంతో బాధపడుతున్నట్లైతే, ప్రతికూలమైన గర్భాశయ వాతావరణం ఏర్పడుతుంది. ఈ వాతావరణంలో పిండం నిలదొక్కుకోవడం కష్టతరమవుతుంది. ఇలా జరగకూడదంటే, వైద్యుని సలహాను అనుసరించి చికిత్స పొందుతూ, జీవనశైలిలో సానుకూల మార్పులు చేసుకోవాలి. మధుమేహ నియంత్రణకు ప్రతిపాదిత చికిత్స తీసుకోండి. థైరాయిడ్ నివారణకు క్రమం తప్పకుండా మందులు తీసుకోండి.

  • పాలీసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS):

  పదేపదే గర్భస్రావం జరగడానికి మరొక ముఖ్య కారణం, PCOS ఉన్న మహిళలలో, టెస్టోస్టెరాన్ అనే పురుష హార్మోన్ స్థాయి అధికంగా ఉండటం. దీనివలన అండోత్పత్తి మరియు నెలసరిలో అసమతుల్యతలు మొదలవుతాయి. ఒక మహిళలో మధుమేహం లేనప్పటికీ, PCOS ఉన్నట్లైతే, ఇన్సులిన్ నిరోధక చిహ్నాలు కనిపిస్తాయి. దీనివలన ఎండోమెట్రియల్ లైనింగ్ సరిగా ఏర్పడదు. PCOS ఉన్నట్లు గుర్తింపబడిన మహిళలు, దానిని సరిదిద్దుకోవడానికి తప్పక చికిత్స చేయించుకోవాలి.

  • బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు:

  ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చేరే కొన్ని బాక్టీరియాలు, చాలా హానికారకంగా మారతాయి. ఈ బాక్టీరియాలు (మైకోప్లాస్మా హోమినిస్ మరియు యూరియోప్లాస్మా యురియాలైలటియం వంటివి ), జననేంద్రియ మార్గములో నివసిస్తూ, గర్భస్రావాలకు దారితీస్తాయి. ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, ఎండోమెట్రియంలో మంట మొదలై , పిండాభివృద్ధిని నశింపజేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ల చికిత్స లో యాంటీబయాటిక్స్ అవసరమవుతాయి.

  • జీవనశైలి:

  అనారోగ్యకర జీవనశైలి మూలంగా, గర్భం దాల్చడం మరియు గర్భం నిలుపుకోవడం కష్టతరమవుతాయి.పొగత్రాగేవారిలో , త్రాగనివారితో పోలిస్తే గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నికోటిన్ మాయ ద్వారా ఎదుగుతున్న పిండంలోకి చేరి, దాని ఎదుగుదల మరియు రక్తప్రసరణలో అవాంఛిత మార్పులకు దారితీస్తుంది. అధిక మద్యపానం కూడా గర్భస్రావానికి దారితీస్తుంది.

  అధిక రక్తస్రావం తో పాటుగా, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి గర్భస్రావానికి తొలి సంకేతం. మీకు కనుక గర్భస్రావమైందనే సందేహం కలిగితే, తక్షణమే వైద్యుని సంప్రదించండి.

  English summary

  Natural Reasons For Miscarriages

  Miscarriages can get quite depressing, especially if you have been eagerly waiting to conceive, and then when it finally happens, the joy does not last long. Although going by what most obstetricians say, miscarriages or early pregnancy loss is not uncommon. It should be considered as normal part of female reproduction.
  Story first published: Friday, June 22, 2018, 15:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more