గర్భస్థ శిశువుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

గర్భిణీలు తమ శిశువుల ఎదుగుదలని తెలుసుకునేందుకై అమితమైన ఆసక్తిని కనబరుస్తారు. గర్భంలోని తన శిశువు ఎదుగుదల ఎలా ఉంది, శిశువు ఎదుగుదలలో ఏవైనా గమనించదగ్గ మార్పులున్నాయా అనేవి తెలుసుకోవడానికి గర్భిణీలు అత్యంత ఆసక్తిని వ్యక్తబరుస్తారు.

గర్భంలోనున్న శిశువుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలనేవి చాలా మందికి తెలియవు. గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రతి దశలోను బిడ్డ ఎదుగుదలలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.

వైద్యుణ్ణి సంప్రదించిన ప్రతీ సారి శిశువు ఎదుగుదలని తెలుసుకునేందుకు మీరు ఉత్సాహంగా అలాగే ఆత్రుతగా ఉంటారు. శిశువు ఎదుగుదల సవ్యంగానే ఉందని తెలుసుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటారు.

కాబట్టి, గర్భస్థ శిశువుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఈ రోజు ఈ ఆర్టికల్ లో పొందుబరిచాము. వీటిని చదివి మీ శిశువు ఎదుగుదల గురించి తెలుసుకుని మీ సందేహాలను నివృత్తి చేసుకోండి...

కళ్ళు, చెవుల ఎదుగుదల

కళ్ళు, చెవుల ఎదుగుదల

ప్రెగ్నన్సీ ఎనిమిదవ వారం చేరుకోగానే చిన్నారుల కళ్ళు, చెవులనేవి ఎదగడం ప్రారంభిస్తాయి. ఈ దశలో శిశువు రెండు సెంటీమీటర్ల పొడవవుతుంది. శిశువు యొక్క ముఖం కూడా ఎదగడం ప్రారంభమవుతుంది.

జననేంద్రియాలఎదుగుదల

జననేంద్రియాలఎదుగుదల

శిశువులలో జననేంద్రియాల ఎదుగుదల ఎప్పుడు మొదలవుతుంది? ప్రెగ్నన్సీ తొమ్మిదవ వారానికి చేరుకోగానే ఆడ లేదా మగ శిశువులలో జననేంద్రియాలు ఎదుగుదల ప్రారంభం అవుతుంది. తద్వారా, ఆడ లేదా మగ బిడ్డ అనే తేడాని తెలుసుకోగలిగిన విధంగా జననేంద్రియాలు ఎదుగుదల జరుగుతుంది. గర్భస్థ శిశువుకి సంబంధించి ఇది ముఖ్యమైన విషయం.

శరీరం పూర్తిగా ఏర్పడుతుంది

శరీరం పూర్తిగా ఏర్పడుతుంది

ప్రెగ్నన్సీ పన్నెండవ వారానికి చేరుకుంటున్న దశలో గర్భస్థ శిశువు అయిదు సెంటీమీటర్ల పొడవవుతుంది. చేతివేళ్లతో పాటు కాలి వ్రేళ్ళు అలాగే గోర్లు, చెవులు కూడా పూర్తిగా ఏర్పడతాయి.

పుట్టేటప్పుడు ఉండే పొడవులో సగం పొడవుకు చేరుకుంటుంది

పుట్టేటప్పుడు ఉండే పొడవులో సగం పొడవుకు చేరుకుంటుంది

20 వారాల ప్రెగ్నన్సీ దశకు చేరుకోగానే శిశువు క్రౌన్ నుంచి రాంప్ వరకు 18 సెంటీమీటర్ల పొడవవుతుంది. మీ గర్భంలో కదలాడుతూ ఉంటుంది. ఈ దశలో శిశువులో కనుబొమ్మలు అలాగే గోర్లు స్పష్టంగా కనిపిస్తాయి.

వినికిడి శక్తి అభివృద్ధి చెందుతుంది

వినికిడి శక్తి అభివృద్ధి చెందుతుంది

ప్రెగ్నన్సీ 24 వారాలకు చేరుకోగానే శిశువు శబ్దాలను గ్రహించి గుర్తించడం ప్రారంభించి అందుకు తగిన ప్రతిస్పందనలు తెలియచేస్తుంది. ఈ దశకు చేరుకోగానే శిశువు యొక్క ముఖం అలాగే అవయవాలు పూర్తిగా ఏర్పడి ఉంటాయి. చర్మం పలుచగా ఉంటుంది అలాగే ముడతలుగా ఉంటూనే నూగుతో సంరక్షించబడుతూ ఉంటుంది.

శ్వాస ఆడటం

శ్వాస ఆడటం

గర్భంలో కూడా శిశువు శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తుంది. ప్రెగ్నన్సీ 27వ వారానికి చేరినప్పుడు ఈ మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఈ దశలో శిశువు యొక్క ఊపిరితిత్తులు శ్వాసను తీసుకోవడం ప్రారంభిస్తాయి.

వాసనను గ్రహించే శక్తి:

వాసనను గ్రహించే శక్తి:

దాదాపు 28వ వారానికి చేరేసరికి శిశువులో వాసనను గ్రహించే శక్తి వృద్ధి చెందుతుంది. పెద్దవారు గ్రహించే విధంగానే గర్భస్థ శిశువు కూడా వాసనలను గ్రహిస్తుంది.

కళ్ళు తెరుస్తుంది:

కళ్ళు తెరుస్తుంది:

దాదాపు 32 వారాల ప్రెగ్నన్సీ దశలో శిశువు కళ్ళు తెరుస్తుంది. ఈ సమయానికల్లా గర్భస్థ శిశువు తన కోణాన్ని మార్చుకుని వెజీనల్ ఓపెనింగ్ వైపు తలను అమర్చుతుంది. గర్భస్థ శిశువు పోసిషన్ లో మార్పులను గమనించవచ్చు. శిశువు యొక్క చేతుల అలాగే కాళ్ళ కదలికలను మీరు గుర్తించగలుగుతారు. క్రవున్ నుంచి రాంప్ వరకు మీ శిశువు యొక్క పొడవు దాదాపు 35 నుంచి 38 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. తల నుంచి బొటనవేలి వరకు 44 నుంచి 55 సెంటీమీటర్లు ఉంటుంది.

శిశువు ఆరోగ్యంగా బొద్దుగా ఉంటుంది

శిశువు ఆరోగ్యంగా బొద్దుగా ఉంటుంది

40 వారాల ప్రెగ్నన్సీలో శిశువు పూర్తిగా ఎదిగి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ దశలో శిశువు యొక్క తల సెర్విక్స్ వైపుగా తిరిగి ఉంటుంది. ప్రసవం సమయంలో శిశువు బరువు దాదాపు రెండు నుంచి మూడు కేజీలు ఉండాలి. కొంతమంది శిశువులు అయిదు కేజీల వరకు ఉంటారు కూడా.

English summary

Interesting Facts About Baby In Womb| Baby's Development In Womb| Baby Growth Inside Womb

Have you ever thought how your baby grows in womb? So lets understand the interesting things about your baby's development. Here are some amazing facts that you never knew: