For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దపడుతున్నారా ? మానసికంగా సన్నద్దులవ్వండి ఇలా !

బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దపడుతున్నారా ? మానసికంగా సన్నద్దులవ్వండి ఇలా !

|

తల్లిదండ్రులుగా మారడం అనేది భార్యాభర్తల సంబంధంలో అత్యుత్తమమైన అడుగుగా ఉంటుంది. మీ భాగస్వామి, మీరు పరస్పరం ఒక పరిపూర్ణ కుటుంబాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటే, క్రమంగా జీవిత కాలం "రోలర్ కాస్టర్ రైడ్" కి సిద్ధంగా ఉన్నారనే అర్ధం. ఒక శిశువు గురించి ఆలోచిస్తున్నప్పుడు అనేక అంశాల నడుమ నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది.

నిజానికి, మీ భాగస్వామి మరియు మీరు ఇప్పటికే ఆర్థిక స్థిరత్వం మరియు ఉద్యోగ భద్రతతో ఉన్న ఎడల మీరు నిర్ణయం తీసుకోడానికి అర్హత ఉన్నట్లుగా భావిస్తున్నప్పటికీ, మీ జీవితంలో జరిగే అన్నిరకాల మార్పులకు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. శారీరిక, మానసిక, ఆర్ధిక, కుటుంబ మరియు వృత్తిపరమైన జీవితం కూడా ప్రభావితం కావొచ్చు. కావున అన్నిటా సిద్దపడి ప్రణాళికాబద్దంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.

Ready For A Baby? Here’s How You Should Be Emotionally Prepared

గర్భం దాల్చడం అనేది ఒక అద్భుతమైన వరంలా భావించే తల్లులు, తమ జీవితాల్లోకి శిశువు అడుగు పెట్టడానికి ఉత్సుకతను కలిగి ఉంటారు. క్రమంగా తల్లిదండ్రులకు, రాబోయే జీవితం ఒక బాద్యతాయుతమైన ఉద్యోగంవలె ఉంటుంది.

తల్లిదండ్రులు కావడానికి ముందు, మీరు మీ జీవితాన్ని ఎలా నడుపుతున్నారు, మరియు మీరు ఒక శిశువును కలిగి ఉండే క్రమంలో ఎంతమేర సిద్ధంగా ఉన్నారో అన్నది ఖచ్చితంగా నిర్ధారించుకోవలసిన విషయం. మీరు మాతృ బంధంలోకి దిగాలని నిర్ణయించుకుంటున్న ఎడల, ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి.

1) మీరు గర్భధారణకు మానసికంగా సిద్దంగా ఉన్నారా?

1) మీరు గర్భధారణకు మానసికంగా సిద్దంగా ఉన్నారా?

గర్భం దాల్చడం అనేది మీ సమయం, ఆర్ధిక పరిస్థితులు, శారీరిక మరియు మానసికబలం మొదలైన అనేక అంశాలకు సంబంధించింది. మీరు ఇష్టపడే కొన్ని కార్యక్రమాలు కూడా నియంత్రించబడవచ్చు. మీకు శారీరిక సౌందర్యం మీద మక్కువ ఎక్కువ అయితే, కొన్ని మానసిక సంఘర్షణలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, గర్భధారణ సంబంధిత హార్మోన్లు మీ మానసిక పరిస్థితుల మీద కొంతమేర ప్రభావాన్ని చూపవచ్చు. మరియు మీ భావోద్వేగాలు అధికమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

మీరు ఎటువంటి కారణం లేకుండానే కోపానికి గురవడం లేదా కలతకు గురవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇష్టపడే పనులే మీకు బోర్ ఫీల్ కలిగించవచ్చు. వాస్తవానికి, మీ జీవనశైలిలో భారీమార్పు ఉంటుంది. కానీ ఈమార్పును స్వీకరించి మార్పులను అందంగా మలచుకునేలా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మీరు ఫాస్ట్ లేన్లో జీవించడానికి ఇష్టపడే వ్యక్తి అయితే, ఆ విరామాలన్నింటినీ ఇప్పుడు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. బహుశా ఇది మీ జీవితానికి కాస్త స్తబ్ధతను తీసుకుని రావొచ్చు. కానీ, మీ జీవితంలోని ఇతర విషయాలను పునర్విమర్శ చేసుకోడానికి, కొన్నిటిని పునర్నిర్మించడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి.

2) మీరు తల్లి కాబోతున్నారా ?

2) మీరు తల్లి కాబోతున్నారా ?

ఒక తల్లిగా ఉండటం అనేది అత్యంత కృతజ్ఞతా భావంతో కూడుకున్న అంశం. మానసికంగా మీరు పూర్తి సన్నద్దులై, శిశువుని ఆహ్వానించడానికి సిద్దంగా ఉన్న వారైతే, మీకు రాబోయే రోజులు ఎంతో అద్భుతంగా ఉండనున్నాయి. మీరు మీ పట్ల అధికంగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. క్రమంగా అదే జాగ్రత్తను శిశువుతో నిర్వహించవలసి ఉంటుంది.

ఫీడింగ్, స్నానం చేయించడం, మొదలైన అనేక విషయాల పరంగా వ్యక్తిగతంగా శిశువు అవసరాల పట్ల శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది. కొంతకాలం మీ వృత్తిపరమైన జీవితానికి దూరం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కావున, వీటి పట్ల మానసికంగా కూడా కొంతమేర సన్నద్దమవ్వాల్సిన అవసరం ఉంటుంది.

3) మిమ్ములను మీరే త్యాగం చేసుకోవడానికి సిద్దంగా ఉండాలి

3) మిమ్ములను మీరే త్యాగం చేసుకోవడానికి సిద్దంగా ఉండాలి

తల్లిదండ్రులవడం అనేది ఒక వరం అయినప్పుడు, కొన్ని త్యాగాలు సర్వసాధారణం. కొంతకాలం గడిచిపోయాక, ఇవన్నీ మధుర స్మ్రుతులుగా కనిపిస్తుంటాయి. మీ శిశువు కోసం షాపింగ్ చేయడం, మీకోసం కాకుండా మీ శిశువుకు సంబంధించిన అంశాల గురించి తెలుసుకోవడం మొదలైనవి. ఇక మీ గురించి శ్రద్ద ఎటుతిరిగీ అవసరం. ముఖ్యంగా ఆరోగ్య, మానసిక ఆరోగ్యాల దృష్ట్యా. ఈ సమయంలో వ్యక్తిగత స్వాతంత్ర్యం అని ఆలోచించకుండా, మీ శిశువు గురించిన మరిన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఇతరుల మీద కూడా ఆదారపడవలసి ఉంటుంది. ముఖ్యంగా మీ మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు.

మీ స్నేహితులు మిమ్మల్ని చూడలేకపోతున్నామని కూడా ఫిర్యాదు చేయవచ్చు. నిజానికి, శిశువుకు కొన్ని నెలల వయస్సు వచ్చే వరకు మీకు ఇష్టమైన సినిమాని కూడా మీరు చూడలేని పరిస్థితి నెలకొంటుంది. అన్నివేళలా మనకు అనుగుణంగానే పరిస్థితులు ఉంటాయని అనుకోవద్దు. మీరు మాతృత్వం ప్రారంభ దశ తరువాత మీ జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి పొందవచ్చు. ఏది ఏమైనా మాతృత్వం అనుభవం ముందు ఈ త్యాగాలన్నీ ఏమాత్రం అనిపిస్తుంది.

Most Read:చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే...Most Read:చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే...

4) కొన్ని తెలియని పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో సానుకూలంగా స్పందించండి.

4) కొన్ని తెలియని పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో సానుకూలంగా స్పందించండి.

ప్రతిఅంశాన్ని ప్రతికూలంగా భావించడం అనేది మానసిక మరియు శారీరిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, కావున అన్నివేళలా సానుకూల దృక్పధంతో మెలగాలని వైద్యులు సూచిస్తున్నారు.

తల్లిదండ్రులుగా మీరు జీవితoలో కొన్ని పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.అన్నిటినీ ఎదుర్కొనడానికి మీరు సిద్దంగా ఉండకపోవచ్చు కూడా. కావున ప్రణాళికలు వేసుకునే దిశగా మీరు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది.

మీ శిశువు యొక్క శ్రేయస్సు గురించిన ఆలోచనలతో సానుకూల దృక్పధంతో ముందుకు సాగాలి. శిశువుకు సంబంధించిన ఏ చిన్న సమస్య ఎదురైనా, తక్షణమే వైద్య నిపుణుడిని సంప్రదించండి. క్రమంగా కొన్ని సంక్రమణ వ్యాధులు, మరియు సమస్యలు తీవ్రతరం కాకుండా శిశువును కాపాడుకోవచ్చు. అంతేకాకుండా క్రమం తప్పకుండా వైద్యుని సూచనల మేరకు శిశువుకు టీకాలు అందించాలి. మరియు, తల్లి కూడా పోషకాహారం, మందుల పట్ల జాగ్రత్త వహించాలి. మీ ఆరోగ్యం మీదనే బిడ్డ భవిష్యత్తు, ఆరోగ్యం ఆధారపడి ఉన్నదని మరువకూడదు.

5) తెలిసిన వారి సూచనలు, సహాయం తీసుకోండి:

5) తెలిసిన వారి సూచనలు, సహాయం తీసుకోండి:

గర్భధారణ సమయంలో మరియు ప్రసవం తర్వాత, మీ చుట్టు పక్కల బంధువులు శ్రేయోభిలాషులు చేరి మీకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అవి వారి వారి అనుభవాలు, ఎదుర్కొన్న పరిస్థితులు, తెలుసుకున్న విషయాలు మొదలైన అనేక అంశాల ఆధారితంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని విస్మరించకూడదు. కానీ, ఏది నిజం , ఏది అబద్దమో తెలుసుకోగలిగిన ఆలోచనా శక్తి మీకుందని నిర్ధారించుకోండి. అలా లేని పక్షంలో, మీ సమూహంలో ఖచ్చితంగా ఒక తెలివైన వ్యక్తి శ్రేయోభిలాషిగా ఉంటారు. మొహమాటపడకుండా అభిప్రాయాలు తీసుకుని ముందుకు అడుగు వేయవలసినదిగా సూచించడమైనది.

6) మీ భావాలను నిర్వహించడం అన్నిటికన్నా ముఖ్యమని తెలుసుకోండి

6) మీ భావాలను నిర్వహించడం అన్నిటికన్నా ముఖ్యమని తెలుసుకోండి

మీరు కోపంతో ఉన్నా లేదా విచారంగా ఉన్నా, మీ మూడ్ శిశువును ప్రభావితం చేస్తుందని మరచిపోకండి. కడుపులో శిశువు పెరుగుతున్న సమయంలో అటువంటివి మీ మానసిక ఆందోళనలను పెంచి, రక్తపోటును ప్రభావితం చేయవచ్చు. ఒక్కోసారి ఇలాంటివి కడుపులో బిడ్డకు హానిని కలుగ చేయవచ్చు. కావున మీ మానసిక స్థితిని నిర్వహించేలా పరిసరాలను మార్చుకోవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా, మీరు ఎక్కువగా వేటికి ప్రభావితం అవుతున్నారో గమనించి వాటి పట్ల జాగ్రత్త వహించేలా చర్యలు తీసుకొనవలసి ఉంటుంది.

శిశువుతో సమయాన్ని గడపడం కన్నా ముఖ్యమైన అంశాలేవీ ఉండకూడదు. మీరు భౌతికంగా మానసికంగా ఎలా ప్రభావితం అయినా, ఖచ్చితంగా ఆ ప్రతికూల ప్రభావాలు మీ శిశువు మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. కావున మీ భావోద్వేగ మద్దతు అన్నిటికన్నా ముఖ్యమని మరువకండి.

Most Read:ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!Most Read:ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

English summary

Ready For A Baby? Here’s How You Should Be Emotionally Prepared

Pregnancy is indeed a hard time for expecting mothers. This is the time when the baby takes precedence over their own lives. Parenthood is indeed a full-time job. Before becoming parents, it is time you retrospect your life and see whether you are emotionally ready to have a baby.
Story first published:Thursday, September 20, 2018, 18:26 [IST]
Desktop Bottom Promotion