కడుపుతో ఉన్నప్పుడు స్తనాల రంగు మారటానికి కారణాలు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ప్రతి స్త్రీ జీవితంలో తల్లయ్యే దశ చాలా ఉత్సాహంగా, ఆనందాన్ని ఇచ్చే సమయం. ఆ సమయంలో, ముఖ్యంగా మీరు మొదటిసారి తల్లి కాబోతుంటే, అన్ని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా అన్పిస్తాయి. తొమ్మిది నెలల సమయంలో ముందేం జరగబోతున్నాయో మీకు అస్సలు తెలీదు. అంటే మీకు శరీరంలో ఏ మార్పులు వస్తాయనే అవగాహన ఉన్నా, కొన్ని విషయాలు ఎక్కువ చర్చించని కారణంగా వాటికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు.

నిజమే, కడుపు మరియు స్తనాల సైజులో కన్పించే మార్పు తప్పక ఉంటుంది. ఈ సమయంలో స్తనాలు నిండుగా కూడా మారతాయి. కొంతమంది స్త్రీలకు, స్తనాల నుండి పాపాయిలకి చాలా పోషణ, రోగనిరోధక శక్తిని అందించే పసుపురంగు ద్రవం- కొలోస్ట్రమ్ కూడా స్రవించబడుతుంది. రక్తనాళాలు కూడా ఎక్కువ రక్తప్రసరణ వలన ఉబ్బి కన్పిస్తాయి.

Reasons For Breast Colour Change During Pregnancy

కానీ మీరెప్పుడైనా స్తనాల రంగు, నిపుల్స్ మరియు దాని చుట్టూ ఉండే నల్ల మచ్చ ఏరియోలా రంగు మారటం గురించి విన్నారా? అవును, ఇది ప్రతి గర్భవతికి మొదటి త్రైమాసికం నుంచే కన్పిస్తుంది, ముఖ్యంగా పింక్ రంగులో ఏరియోలాలు ఉండే స్త్రీలకి స్పష్టంగా కన్పిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందోనని ఆశ్చర్యంగా లేదూ? తెలుసుకోవటానికి చదవండి.గర్భసమయంలో స్తనాల రంగు మారటానికి కారణాలు

హార్మోన్లు

కడుపుతో ఉన్నప్పుడు జరిగే ఏ ఇతర మార్పులకి కారణం హార్మోన్ల లాగానే, దీనికి కూడా అవే మొదట కారణాలు. ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరోన్ రెండూ ఈ మార్పుకి కారణమవుతాయి. ప్రెగ్నెన్సీ హార్మోన్లు హఠాత్తుగా పెరగటంతో, మెలనిన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది - మెలనిన్ జుట్టుకి, కళ్ళకి, చర్మానికి రంగునిచ్చే పదార్థం.

ఫలితంగా, మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవుతుండటంతో, నిపుల్స్ చుట్టూ ఉన్న చర్మం మరింత నల్లగా, గాఢంగా మారతాయి.

Reasons For Breast Colour Change During Pregnancy

ఎండలో తిరగటం

దీన్ని నిర్ధారించటానికి ఏ పరిశోధన సరిగా లేదు కానీ, ఎండలో ఎక్కువ గంటలు తిరగటం వలన స్తనాలు నల్లబడతాయనే నమ్మకం ఉంది. సూర్యకాంతికి చర్మం ఎక్కువ ఎక్స్ పోజ్ అయితే మెలనిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది- ఇది చర్మాన్ని నల్లబరిచే పదార్థం కాబట్టి నిపుల్స్ మరియు ఏరియోలాలు నల్లగా మారతాయి.

గర్భసమయంలో స్తనాల రంగు మారటానికి కారణాలు

పరిణామ క్రమంలో స్వీకరించిన లక్షణం

ఇది స్తనాలు హఠాత్తుగా ఎలా ఎక్కువ రంగును పొందుతాయనటానికి మిగతా వాటికన్నా సంతృప్తినిచ్చే వివరణ. కొత్తగా పుట్టిన పాపాయిలకి కనుచూపు అస్పష్టంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఆ రంగు గాఢమవటం వలన, స్తనాలు నల్లబడటం వలన బేబీలు సులభంగా స్తనాలను చూసి పాలు తాగగలుగుతారని చెప్తున్నారు. దీని వలన ఆరోగ్యకరంగా ఆహారం కూడా అందుతుంది.

ఈ రంగులో మార్పు ఎంతకాలం కొనసాగుతుంది?

నిపుణుల ప్రకారం స్తనాల అంచుల్లో ఏరియోలా మరియు నిపుల్స్ రంగులో మార్పు తాత్కాలికమే మరియు డెలివరి తర్వాత మళ్ళీ మాములు స్థితికి వచ్చేస్తాయి. నిజంగా చెప్పాలంటే, పాలిచ్చే తల్లులందరిలో రంగు ఒకేలా ఉంటుంది, పాలివ్వడం ఆపేసాక తగ్గిపోతుంది.

Reasons For Breast Colour Change During Pregnancy

పాలివ్వని తల్లులలో నల్లబడిన రంగు మిగతావారికన్నా తగ్గిపోతుంది.కానీ, కొంతమంది స్త్రీలలో జీవితాంతం ఈ నలుపుదనం పోదు. అయినా కూడా ఇది సాధారణ విషయమే, వైద్యపరంగా ఏం కంగారు పడక్కర్లేదు.

గర్భసమయంలో స్తనాల రంగు మారటానికి కారణాలు

మళ్ళీ సాధారణ రంగులోకి రావటాన్ని నిర్ణయించేవి జన్యుపర లక్షణాలు, బిఎంఐ, బరువు పెరగటం, పొగతాగటం మరియు అలాంటివి మరిన్ని.

ఏరియోలా మరియు నిపుల్ లో వచ్చే ఇతర మార్పులు

నిపుల్స్ మరింత స్పష్టంగా ముందుకి పొడుచుకువస్తాయి. సున్నితంగా మారి కొంచెం ఉబ్బినట్లు అవుతాయి. ఎప్పుడూ ఒక చక్కిలిగింత భావం ఉంటుంది.నిపుల్స్ చుట్టూ మచ్చ ప్రాంత వ్యాసం పెరిగి డెలివరీ డేట్ దగ్గరపడే కొద్దీ మరింత పరిమాణం పెరుగుతుంది.

మరో పదాల్లో చెప్పాలంటే, స్తనాలపై నల్లబడిన చర్మం పెరుగుతుంది. ఇదికాక, నల్లబడిన ప్రాంతంపై కొన్ని సన్నని బుడిపెలుగా వస్తాయి. వీటిని మాంట్గోమెరి ట్యూబర్కిల్స్ అంటారు. ఇవి నిపుల్స్ ను ఎప్పుడూ తేమగా ఉంచే, పగుళ్లు రాకుండా చూసే నూనెగ్రంథులు.

నిజానికి ఈ నూనె పదార్థాల వలన పాపాయి ఆకలి పెరిగి మరింత పాలు తాగుతుంది. ఇదే కాక ఏరియోలాల చుట్టూ వెంట్రుకలు కూడా పెరగటం చూడవచ్చు.

English summary

Reasons For Breast Colour Change During Pregnancy

But have you heard of the change in breast colour, colour change in the nipples and areolas to be exact? Yes, this does happen to any pregnant woman as early as the first trimester and the change is much more visible in women with pink areolas. Aren't you intrigued about the cause of it? Read on.
Story first published: Saturday, January 27, 2018, 11:00 [IST]
Subscribe Newsletter