కడుపుతో ఉన్నప్పుడు నువ్వులు ; గర్భస్రావానికి దారితీస్తాయా

Posted By: Deepthi TAS
Subscribe to Boldsky

నువ్వులు, శాస్త్రీయ నామం సెసమం ఇండికం 3500 ఏళ్ల క్రితం నుండి రోజువారీ జీవనవిధానంలో వాడుతున్న ఒక పురాతన నూనె మొక్కల విత్తనాలు. వీటిని బెన్నె, బెనె, జింజెల్లీ లేదా తిల్ అని కూడా అంటారు. ఇవి తెల్లగా, నల్లగా లేదా ఎర్రగా, నువ్వు మొక్క రంగును బట్టి ఉంటాయి. మీరు వాటిని పొట్టు ఉన్న రూపం లేదా పొట్టు తీసేసినవిగా కొనుక్కోవచ్చు.

బోల్డ్ స్కై మీరు కడుపుతో ఉన్నప్పుడు నువ్వులు వాడటం వలన మీకు, మీ బేబీపై దాని ప్రభావాలను ఈరోజు తెలియచేస్తుంది.

Sesame Seeds (Til) During Pregnancy: Does It Lead To A Miscarriage?,

కడుపుతో ఉన్నప్పుడు నువ్వులు తినటం సురక్షితమేనా?

అవును మితంగా తింటే నువ్వులు మంచిదే, ఎందుకంటే కడుపుతో ఉన్నప్పుడు అవి సురక్షితం కాదు అనటానికి ఏ శాస్త్రీయ ఆధారం ఇప్పటివరకు లేదు. నువ్వులు వంట్లో వేడిని పెంచి, అసమతుల్యతను కలిగించి గర్భస్రావానికి దారితీయవచ్చనటం ఒక అపోహ మాత్రమే.

నిజానికి నువ్వులు ఆరోగ్యానికి లాభదాయకమైనవి ఎందుకంటే వాటిలో ఐరన్, కాల్షియం, అమినో ఆసిడ్లు, ప్రొటీన్, ఆక్సాలిక్ యాసిడ్ , విటమిన్ బి, సి మరియు ఇ ఉంటాయి.

అయితే ఈ పోషకాలున్న నువ్వులు ఇచ్చే ఆరోగ్య లాభాలు ఏంటి?కడుపుతో ఉన్నప్పుడు నువ్వుల ఆరోగ్య లాభాలుఇక్కడ మేము లిస్టును పొందుపరిచాం. చదవండిః

1. పీచు పదార్థం జీర్ణక్రియలో సాయపడుతుందిః

1. పీచు పదార్థం జీర్ణక్రియలో సాయపడుతుందిః

కడుపుతో ఉన్నప్పుడు మలబద్ధకం సాధారణ సమస్య. నువ్వులలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన, ఇవి సహజంగా మలబద్ధకాన్ని నివారించి, తగ్గించి, మూత్ర, పేగుల వ్యవస్థ సులభంగా కదిలేట్లా చేస్తాయి. నువ్వులని మీ ఆహారంలో జత చేయటం వలన మీ జీర్ణవ్యవస్థ యాక్టివ్ గా పని చేస్తుంది.

2. పోషకాలు రోగనిరోధకతను మెరుగుపరుస్తాయిః

2. పోషకాలు రోగనిరోధకతను మెరుగుపరుస్తాయిః

నువ్వులలో ఉండే అనేక పోషకాలు మీ ఆరోగ్యం మరియు రోగనిరోధకతను మెరుగుపడేట్లా చేస్తాయి. కడుపుతో ఉన్నప్పుడు నిరోధించే శక్తి తగ్గటం వలన, నువ్వులు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలపర్చి, జలుబు జ్వరం నుంచి మిమ్మల్ని దూరంగా ఉండేలా చేస్తాయి.

3. కాల్షియం పళ్ళు మరియు ఎముకలను బలపరుస్తుందిః

3. కాల్షియం పళ్ళు మరియు ఎముకలను బలపరుస్తుందిః

బిడ్డ ఎముకల అభివృద్ధికి అండగా ఉంటారు కూడా కాబట్టి కడుపుతో ఉన్న స్త్రీలలో కాల్షియం తక్కువగా ఉంటుంది. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉండి ఇవి ఎముకలను బలపరిచి, దంత సమస్యలను కూడా నివారిస్తాయి.

4. ఒంట్లో ఓపికను పెంచుతాయిః

4. ఒంట్లో ఓపికను పెంచుతాయిః

నువ్వులు సహజంగా ఒంట్లో ఓపికను పెంచే పదార్థాలు. ఇవి కండరాలు మరియు నరాలను బలపర్చి, లోపల పేరుకున్న కండరాల బలహీనతను, అలసటను, ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా శరీరం ఫిట్ మరియు శక్తివంతంగా తయారవుతుంది.

ఇప్పుడు మనం నువ్వులలో ఉండే పోషకవిలువలు తెలుసుకుందాం. దాని ద్వారా మీ డైట్ లో సరైన పరిమాణంలో జతచేసుకోవచ్చు.

నువ్వుల పోషక విలువలుః

నువ్వుల పోషక విలువలుః

సంపూర్ణ, వేయించిన లేదా టోస్ట్ చేసిన నువ్వుల పోషక విలువలు, 100 గ్రాముల సర్వింగ్ కి ఎలా ఉన్నాయో కింద చూడండిః

పోషకాలు

ప్రతి సర్వింగ్ లో ఉండే పరిమాణం

క్యాలరీలు

565 కిలో క్యాలరీలు

కార్బొహైడ్రేట్లు

25.7 గ్రా

ప్రొటీన్

17 గ్రా

ఆహారంలో పీచుపదార్థం

14 గ్రా

కొవ్వు పదార్థం

48 గ్రా

కాల్షియం

989 మి.గ్రా

మెగ్నీషియం

356 మిగ్రా

ఫాస్పరస్

638 మిగ్రా

విటమిన్

9 ఐయూ

థయమిన్

0.8 మిగ్రా

నియాసిన్

4.6 మిగ్రా

ఫోలేట్

98 ఎంసిజి

మీ ఆహారంలో నువ్వులను జతచేయాలనుకుంటే, అదెలా చేయవచ్చో మీకు మేం చెప్తాం.

కడుపుతో ఉన్నప్పుడు నువ్వులను ఆహారంలో జతచేయగలిగే విధానాలు ;

కడుపుతో ఉన్నప్పుడు నువ్వులను ఆహారంలో జతచేయగలిగే విధానాలు ;

మీ రోజువారీ భోజనంలో నువ్వులను జతచేయగలిగే కొన్ని పద్ధతులుః

త్వరగా తయారయ్యే నువ్వుల డిప్ ( తహిని), మరియు తాజా కాయగూరలతో తినండి.

కొన్ని నువ్వులను కొత్తిమీర లేదా పుదీనా చట్నీలలో కలపండి. దీనివల్ల రుచి పెరిగి, మెరుగైన పోషకాలు కూడా అందుతాయి.

చట్నీ తయారుచేసి ఉడికించిన అన్నం లేదా కినోవాతో కలిపి తినండి.

వేయించిన నువ్వులను నూడుల్స్ , కూరలు ఇంకా మరెన్నిటిలోనో అలంకరించటానికి వాడుకోవచ్చు.

నువ్వుల లడ్డూ లేదా చిక్కి లేదా రెవ్డీ ( భారతీయ స్వీట్లు) తయారుచేయండి, ఇవి మీ పోషకాలనిచ్చే ఆరోగ్యకరమైన స్వీట్లు.

నువ్వులు పోషకాలని మాత్రమే ఇవ్వటం కాదు, మీ ఆహారానికి రుచిని కూడా ఇస్తాయి. కానీ దాని అర్థం మీరు మితిమీరి తినటం కాదు.

కడుపుతో ఉన్నప్పుడు నువ్వులు తినటం వలన దుష్ప్రభావాలు

కడుపుతో ఉన్నప్పుడు నువ్వులు తినటం వలన దుష్ప్రభావాలు

నువ్వులు తినటం వలన కొన్ని రిస్క్ లు కూడా ఉన్నాయిః

కడుపుతో ఉన్న మొదటి మూడు నెలల్లో నువ్వులను ఎక్కువగా తినవద్దు ఎందుకంటే మీ గర్భం ఇంకా సున్నితంగానే ఉంటుంది. నువ్వులు తిన్నాక మీకు కొంచమైన రక్తస్రావం కన్పిస్తే, వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

మీకు ఇదివరకే యూఎస్ లో నిర్ణయించిన ఆరు సాధారణ ఆహారపదార్థాల అలర్జీలలో ఒకటి ఉండి ఉంటే, నువ్వులను తీసుకోవద్దు.

కడుపుతో ఉన్నప్పుడు నువ్వులు తినటం గురించి మీకు ఇంకా సందేహాలుంటే, మీ వైద్యున్ని సంప్రదించాకే తినండి. గుర్తుంచుకోండి, మితంగానే తినటం ముఖ్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

నల్ల నువ్వులు తెల్ల నువ్వుల కంటే మంచివా?

నల్ల నువ్వులు తెల్ల నువ్వుల కంటే మంచివా?

అవును, నల్ల నువ్వులు తెల్ల నువ్వుల కంటే ఆరోగ్యకరమైనవి ఎందుకంటే వాటిలో ఎక్కువ పోషకాలుంటాయి. తెల్ల నువ్వులు సాధారణంగా పొట్టు తీసేసినవి అయివుంటాయి, నల్ల నువ్వులకి సాధారణంగా పొట్టు తీయరు, మరియు పొట్టులోనే పోషకాలు ఎక్కువగా, ముఖ్యంగా కాల్షియం ఉంటుంది. పొట్టు తీసిన నువ్వుల్లో కూడా కాల్షియం ఉన్నా పొట్టు తీయని రకంలో రోజువారీ కావాల్సిన కాల్షియం 100 శాతం ప్రతి 100 గ్రాముల పరిమాణానికి లభిస్తుంది.

కడుపుతో ఉన్నప్పుడు నువ్వుల నూనె తినటం సురక్షితమేనా?

కడుపుతో ఉన్నప్పుడు నువ్వుల నూనె తినటం సురక్షితమేనా?

కడుపుతో ఉన్నప్పుడు నువ్వుల నూనెను వాడటం పూర్తిగా సురక్షితమే. ఆరోగ్యకర కొవ్వుల కోసం ఆలివ్ నూనె లేదా కనోలా నూనెలాగానే ఇది కూడా అంత మంచిదే. నువ్వుల నూనెలో మోనో మరియు పాలీ అన్ సాచ్యురేటడ్ కొవ్వులు సరైన బ్యాలెన్స్ తో ఉంటాయి. ఇవి బేబీ మెదడు మరియు నాడీ కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కొవ్వులు కొవ్వులో కరిగే విటమిన్లను మరియు ఖనిజలవణాలను పీల్చుకుని మీ మరియు మీ బేబీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

English summary

Sesame Seeds (Til) During Pregnancy: Does It Lead To A Miscarriage

Sesame Seeds (Til) During Pregnancy: Does It Lead To A Miscarriage?,Read to know more about..
Story first published: Thursday, February 8, 2018, 8:00 [IST]