For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పుట్టబోయే బిడ్డ బాలేదని తెలిపే 7 లక్షణాలు

|

మీలోపల పెరుగుతున్న బేబీ అప్పుడే ఏ రకమైన వ్యాధులు ఎదుర్కోని పోరాడలేనంత సున్నితమైనది. అందుకే ఆ విషయంలో మీరు వస్తారు- మీరంటే కనీసం మీ శరీర రోగనిరోధక వ్యవస్థ. మీరే ఈ తొమ్మిది నెలలు పాపాయికి కావాల్సినంత రక్షణను అందిస్తారు, తను బయటకి వచ్చేదాకా మీరే అన్నిటితో పోరాడతారు.

కానీ, ఒకవేళ నిజంగా సమస్య ఉంటే మీరు లోపల ఉన్న పాపాయిని నేరుగా పరీక్షించలేరు కదా, సమస్య తెలుసుకోవటం అలా కష్టమవుతుంది. కానీ మీరు ఏదన్నా సమస్య వస్తే తెలుసుకోగలిగే కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటో చదవండి.

1.గుండె కొట్టుకోకపోవటం

1.గుండె కొట్టుకోకపోవటం

ఇది ప్రత్యేకంగా తెలియక్కర్లేదు. మీ బేబీ గుండెచప్పుడును మీరు కడుపుతో ఉన్న 10 వ వారం నుంచి వినగలగాలి. నిజానికి గుండె ఐదవ వారం నుంచే కొట్టుకోవడం మొదలైనా మీరు మరో ఐదువారాల వరకు వినలేరు (1). గుండె చప్పుడు వినబడటం లేదంటే అయితే వత్తిడి వల్ల కావచ్చు లేదా సరైన ఎదుగుదలకి వాతావరణం లేకపోవటం అయివుంటుంది. మీరు వెంటనే మీ గైనకాలజిస్టును సంప్రదించాలి.

2.తిమ్మిర్లు

2.తిమ్మిర్లు

కడుపుతో ఉన్నప్పుడు తిమ్మిర్లు పట్టడం అసాధారణమేం కాదు,మీ పిరియడ్ సమయంలో వచ్చినప్పటిలాగానే ఉంటాయి. కానీ మీరు భరించలేనంత సేపు ఎక్కువగా ఉంటే, నిజంగా ఏదో సమస్య ఉన్నట్టే. గర్భసమయంలో వచ్చే తిమ్మిర్లు శరీరంలో వచ్చే వేగవంతమైన మార్పుల వల్ల జరుగుతుంది, అందుకని పెద్దగా చింతించనక్కర్లేదు. తిమ్మిర్లు రెండు లేదా మూడవ త్రైమాసికంలో రావచ్చు కూడా, అది తొందరగా డెలివరీనో, ఏమన్నా అనారోగ్యాన్నో లేదా గర్భస్రావాన్ని సూచిస్తుంది(2). మీకు అన్పించే ఏ నొప్పి గురించి డాక్టర్ కు చెప్పటానికి భయపడవద్దు

3.రక్తస్రావం

3.రక్తస్రావం

కడుపుతో ఉన్నప్పుడు ఎప్పుడు రక్తం వచ్చినా అది మంచి గుర్తు కాదు- ముఖ్యంగా వెజైనా నుంచి రావటం (3).కొన్నిసార్లు ఇది గర్భస్రావానికి దారితీయవచ్చు, అది చాలా బాధాకరమైన వార్త అవుతుంది. ఇది హార్మోనల్ అసమతుల్యత వలన కావచ్చు. ఇది ప్లేసెంటాకి సంబంధించిన సమస్య కూడా అవ్వవచ్చు,అంటే బిడ్డ సమయానికి ముందే పుట్టవచ్చు. ముందే పుట్టే ప్రీమెచ్యూర్ బేబీకి మొదటి నెలలు చాలా సమస్యలు వస్తాయి.

4.తీవ్రమైన నడుంనొప్పి

4.తీవ్రమైన నడుంనొప్పి

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ గురుత్వాకర్షణ కేంద్రం ముందువైపు అధికబరువు వల్ల మారుతుంది.అందుకే దాదాపు అందరు గర్భం దాల్చినవారు ఎప్పుడో అప్పుడు నడుంనొప్పి బారిన పడేవుంటారు (4). కానీ ఇది భరించలేనంతగా,చాలా కాలం కొనసాగుతుంటే, ఇది మీ కిడ్నీలు లేదా బ్లాడర్ సమస్యకి సూచనవుతుంది. ప్రెగ్నెన్సీతో పాటు ఇన్ఫెక్షన్ రావటం చాలా ఊహించలేనంత బాధగా ఉంటుంది.

5.అసాధారణ డిశ్చార్జి

5.అసాధారణ డిశ్చార్జి

సాధారణ డిశ్చార్జిలో వాసన, రంగు ఉండదు, ఉన్నా కొంచెం తెల్లగా ఉంటుంది. మీకు ఇంకేదన్నా కన్పిస్తే, ముఖ్యంగా రక్తం, దాని అర్థం బేబీకి ఏదో సమస్య ఉందని. మీకు చాలా నొప్పిగా కూడా ఉంటే, గర్భాశయ ద్వారం సమయానికి ముందే తెరుచుకుందని అర్థం. ఇతర కారణాలు కూడా అయివుండవచ్చు (5). వెంటనే మీ బిడ్డ సురక్షితంగా ఉండటం కోసం డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.

6.ఐయుజిఆర్

6.ఐయుజిఆర్

ఐయుజిఆర్ అంటే ఇంట్రా యుటెరిన్ గ్రోత్ రెసిస్టెన్స్. పేరులో సూచించబడినట్లు ఇది బేబీ మీ గర్భాశయంలో ఎదగటానికి నిరాకరించే ఒక సమస్య. ఈ పరీక్షను ఆ సమయానికి తగ్గట్టు బిడ్డ సైజు పెరిగిందా లేదా అని పరిశీలించడానికి చేస్తారు (6). బేబీ మరీ చిన్నగా ఉంటే, వారికి శ్వాస సమస్యలు, జ్వరం లేదా పుట్టినవెంటనే రక్తపోటులో సమస్యలు రావచ్చు. ఈ పరీక్షను క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండండి.

7.కదలికలు లేకపోవటం

7.కదలికలు లేకపోవటం

మీ పాపాయి మార్షల్ ఆర్ట్'స్ తెలిసిన యుద్ధవీరుడిలా లోపల మిమ్మల్ని తన్నాలి, నిజంగా అలానే కాదనుకోండి. కడుపుతో ఉన్న 20 వారాల నుంచి మీకు ప్రతి రెండు గంటలకి 10 సార్లైనా తన్నటం తెలియాలి (7).బేబీ అన్నిసార్లు తన్నటం,కదలటం చేయకపోతే తను చాలా వత్తిడిలో ఉన్నట్లు. ఇది కూడా మీరు చెక్ చేయించుకోవాల్సిన విషయం.

మీరు కడుపుతో వున్నప్పుడు అనేక విషయాల్లో సమస్యలు కలగవచ్చు. దాని అర్థం అవి నిజంగా మీకే జరుగుతాయని కాదు. మీకు వీటిల్లో ఏ లక్షణాలు కన్పించినా, వెంటనే మీ డాక్టర్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయించుకోండి. కడుపుతో ఉన్నన్నాళ్ళూ క్రమంతప్పని చెకప్స్ ఏ ప్రమాదం రాకుండా ముందే నివారించటానికి ఉపయోగపడుతుంది. పాపాయి బానే ఉంటుంది, ఉండాలనే మనం అందరం కోరుకుంటాం. కానీ తన ఆరోగ్యానికి సంబంధించి రిస్క్ ఎందుకు తీసుకోవటం?

English summary

Seven Signs That Your Unborn Baby Is Not Doing So Well

there are many signs you can lookout for if you want to make sure that your pregnancy is going all hale and hearty.
Story first published:Monday, January 22, 2018, 9:50 [IST]
Desktop Bottom Promotion