For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం దాల్చక ముందే జన్యుపరమైన పరీక్షలు చేసే వీలుందా ? లాభాలేమిటి ?

గర్భం దాల్చక ముందే జన్యుపరమైన పరీక్షలు చేసే వీలుందా ? లాభాలేమిటి ?

|

ఒక శిశువు జన్మించినప్పుడు, తల్లి మరియు తండ్రి నుండి రెండు జతల జన్యువులను కలిగి ఉంటుంది. తల్లిదండ్రుల జన్యువుల కలయిక బిడ్డ రూపాన్ని మరియు వ్యక్తిత్వాన్ని సైతం నిర్ణయిస్తుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల నుండి పిల్లలు కొన్ని జన్యుసంబంధ రుగ్మతలను సైతం పొందుతుంటారు.

జన్యుపరమైన రుగ్మతలు, ఉత్పరివర్తనలు లేదా జన్యువులలో కలిగే అసాధారణ మార్పుల వలన సంభవిస్తాయి. ఈ మార్పులు కణాల వృద్ధాప్యం లేదా నిర్దిష్ట రసాయన చర్యలకి గురవుతాయి. కొన్ని జన్యుపరమైన లోపాలు కుటుంబంలో తరతరాలుగా సంక్రమిస్తూ ఉంటాయి.

Should You Do Genetic Testing Before Getting Pregnant?

మీరు కుటుంబంలో జన్యుపరమైన రుగ్మతలను కలిగి ఉంటే, మీ శిశువుకు కూడా వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేక్రమంలో మీ భాగస్వామి కుటుంబంలో కూడా జన్యుపరమైన రుగ్మతలు ఉంటే, అవకాశాలు మరింత పెరుగుతాయి.

కానీ, మీ భాగస్వామి లేదా మీశరీరంలోని జన్యువుల్లో పరివర్తన చెందిన జన్యువులు పునరుద్దరించబడడం లేదా పునఃపంపిణీ కావచ్చు, క్రమంగా ఈ జన్యుసంక్రమణ వ్యాధులు శిశువుకు వస్తాయో లేదో తెలుసుకోవడం కష్టతరంగా ఉంటాయి. కావున జన్యుపరీక్షలు ప్రధానంగా చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా తరాలతరబడి తమతమ కులాలలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వారిలో ఈ జన్యు సంబంధమైన రోగాలు అధికంగా ఉంటున్నట్లు అనేక నివేదికలు కూడా తేల్చాయి. క్రమంగా జన్యుపరమైన పరీక్షలు చేసుకుని పెళ్ళిళ్ళకు సిద్దపడాల్సిన దుస్థితిలో ఉన్నాం. ఈ సమస్య గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈవ్యాసం చూడండి.

అసలేమిటీ జన్యుపరీక్ష ?

అసలేమిటీ జన్యుపరీక్ష ?

జన్యు పరీక్ష అనేది తల్లి మరియు తండ్రి ఇద్దరిలో జన్యువులలోని ఉత్పరివర్తనాలను కనుగొనే ఒక వైద్య పరీక్ష. తల్లి లేదా తండ్రి నుండి వారసత్వంగా జన్మించిన శిశువు యొక్క జన్యు సంక్రమణ రోగాల అవకాశాలను నిర్ధారణ చేసుకోవటానికి, ఉత్పరివర్తన చెందిన జన్యువుల ఆధిపత్యం లేదా పునఃపంపిణీ అయినట్లయితే, వీటిని గుర్తించడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది.

జన్యు సంక్రమణ వ్యాధులను ఎలా స్పష్టం చేస్తున్నాయి?

జన్యు సంక్రమణ వ్యాధులను ఎలా స్పష్టం చేస్తున్నాయి?

తలసేమియా లేదా సికిల్ సెల్ డిసీజ్ వంటి కొన్ని జన్యు సంబంధిత వ్యాధులు ప్రాణాంతకమైన జన్యు వ్యాధులుగా ఉన్నాయి. మీరు లేదా మీ కుటుంబానికి ఏ ఇతర జన్యుపరమైన రుగ్మత కలిగిన చరిత్ర ఉన్న ఎడల, మీ శిశువుకు వారసత్వంగా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అయినప్పటికీ, జన్యువులతో ఉన్న ప్రధాన అంశం ఏమిటంటే, అవి ఆధిపత్య ధోరణి కలిగి ఉంటాయి లేదా పునరుజ్జీవనం చెందుతుంటాయి. మీరు ఒక జన్యువ్యాధికి గురవకుండా, లేదా కుటుంబంలో జన్యుసంక్రమణ రోగాల చరిత్రను కలిగి ఉండకపోయినా, మీరు దాని క్యారియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా మీ శిశువులకు జన్యు సంక్రమణ రోగాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకే కులాలలో వివాహాలు జరిగే వారిలో, ఈ సమస్య అధికంగా తలెత్తుతున్నట్లు కొన్ని పరిశోధనల నివేదిక.

(హైదరాబాద్ ఆధారిత సెల్యులర్&మాలిక్యులర్ బయాలజీ(CCMB)వారు సైంటిఫిక్ జర్నల్ నేచర్ జెనెటిక్స్ విభాగంలో చెప్పిన DNA పరీక్షల వివరాల ప్రకారం.)

అంతేకాక, మీ జన్యుసంబంధ చరిత్రలో భాగంగా సమస్యాత్మక జన్యువులను కలిగి ఉండి, మీ భాగస్వామికి అటువంటి జన్యుపరమైన రుగ్మతల చరిత్రను కలిగి ఉండకపోయినా కూడా, ఆధిపత్య జన్యువులు శిశువుకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. కావున పరీక్షలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది.

ఈ జన్యు పరీక్షలు, శిశువుకు జన్యు సంక్రమణ రోగాల ప్రభావాల గురించిన వివరాలను పూర్తిస్థాయిలో అందిస్తాయి. క్రమంగా పరిస్థితులను అనుసరించి జాగ్రత్తలు తీసుకుని, శిశువులకు సోకకుండా చర్యలు తీసుకోవచ్చని చెప్పబడింది. కొంతమంది అయితే, జన్యు సంక్రమణ ప్రభావాల పరిస్థితులను అనుసరించి వివాహాలను కూడా దాటవేస్తున్నారు. కానీ అంత అవసరం లేదు, కొన్నిచర్యలు తీసుకోవడం ద్వారా పిల్లలకు సమస్యలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని సూచించబడింది.

గర్భం దాల్చక ముందే జన్యుపరమైన పరీక్షలు చేసే వీలుందా

జన్యు పరీక్ష అనేది జన్యువులలో మ్యుటేషన్ సమస్యలను కనుగొనటానికి సూచించబడిన ఖచ్చితమైన మార్గంగా ఉంది. పరివర్తనం చెందే జన్యువుల ఆధిపత్యం ఎంతమేర ఉంది, అన్న అంశాలను గుర్తించడానికి సహాయపడుతుంది.

మీ భాగస్వామి మరియు మీరు గర్భధారణ గురించిన ఆలోచనలు చేస్తూ, కుటుంబంలో జన్యుపరమైన పరిస్థితుల గురించి ఆందోళన చెందుతున్నట్లయితే, మిమ్ములను జన్యుసంబందిత వైద్యుని సంప్రదించవలసినదిగా వైద్యులు సూచిస్తారు.

ఈ పరీక్షలలో భాగంగా, రక్తం లేదా జుట్టు నమూనాలను ప్రయోగశాలకు పంపబడుతుంది. క్రమంగా శరీరంలోని జన్యువుల పరివర్తన పరిస్తితులు అంచనా వేయబడుతాయి. నివేదికలలో పాసిటివ్ నమోదైతే, ఈ నమూనాలలో జన్యుపరివర్తన సమస్య ఉందని అర్థం. ఖచ్చితమైన పరివర్తన మరియు దాని సమస్యలను అర్థం చేసుకోవటానికి మరిన్ని పరీక్షలు అవసరం కావచ్చు. నెగెటివ్ అని నివేదికలు వచ్చిన ఎడల సమస్య లేదని అర్ధం.

మీరు ఎప్పుడు జన్యు పరీక్షకు సూచించబడుతారు?

మీరు ఎప్పుడు జన్యు పరీక్షకు సూచించబడుతారు?

మీ కుటుంబం లేదా మీ భాగస్వామి కుటుంబానికి, క్రింద చెప్పబడిన జన్యుపరమైన రుగ్మతల చరిత్ర ఉన్నట్లయితే, జన్యుపరీక్ష జరగాలని వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా గర్భధారణ గురించిన ఆలోచనలు చేసే వారికి, మరియ వివాహానికి పూర్వ పరీక్షలను సంకల్పించిన వారికి సూచించబడుతుంది.

- రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్

- ఉదరకుహర వ్యాధి

- మాక్యులర్ డీజనరేషన్

- బైపోలార్ డిజార్డర్

- ఊబకాయం

- పార్కిన్సన్స్ వ్యాధి

- సిస్టిక్ ఫైబ్రోసిస్

- టే-సాక్స్ వ్యాధి

జన్యుపరీక్ష ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు :

జన్యుపరీక్ష ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు :

జన్యు పరీక్షలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబాలలో జన్యుపరమైన వ్యాధులతో బాధపడుతున్న వారి పిల్లలకు ఈ సమస్యలు ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవడంలో, మరియ పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు, మరియు చికిత్సా పద్దతులు అవలంభించవలసిన విధానాలను అవగాహన చేసుకోవడంలో ఉత్తమంగా సహాయం చేస్తాయి. క్రమంగా తమ భావితరాలకు రోగాలను అందివ్వకుండా, వారిని కాపాడగలుగుతారు.

పుట్టుకతో వచ్చే జన్యు సంక్రమణల క్యారియర్, భాగస్వాముల లేదా మీ శరీరంలో ఉన్నట్లు నిర్ధారణగావింపబడితే, భవిష్యత్తులో పిల్లల మానసిక శారీరిక పెరుగుదల అభివృద్ధి స్థితిని నిర్ధారించడానికి ఈ జన్యు పరీక్షలు దోహదం చేస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా వారి జీవితాలను కాపాడవచ్చు. ఈ చర్యలు, గర్భధారణ ముందు నుండి శిశువు పుట్టిన తర్వాత కూడా అవలంభించేలా ఉంటాయి.

<strong>Most Read:B అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి వ్యక్తిత్వ వికాస లక్షణాలు </strong>Most Read:B అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి వ్యక్తిత్వ వికాస లక్షణాలు

మరొక వైపు, జన్యు పరీక్షలు కూడా స్వంత పరిమితులను కలిగి ఉంటుంది.

మరొక వైపు, జన్యు పరీక్షలు కూడా స్వంత పరిమితులను కలిగి ఉంటుంది.

జన్యు పరీక్షకు సంబంధించిన అతి పెద్ద ఆందోళన, విచారం. తమ పిల్లలు జన్యు సంబంధిత వ్యాధికి గురవుతారని తెలుసుకున్నప్పుడు అనేకమంది ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని చెప్పబడింది. ఇది వారి మానసిక పరిస్థితుల మీద దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటుంది.

జన్యు పరీక్ష ఫలితాలు కుటుంబాలలో ఉద్రిక్తతలు సృష్టించవచ్చు. విశాల దృక్పధం లేకపోవడం, పరిస్థితులను అర్ధం చేసుకోకపోవడం కూడా కారణమే. ఈ జన్యు పరీక్షలు సంభావ్య కుటుంబ రహస్యాలు, మరియు పరిస్థితులను బహిర్గతం చేయవచ్చు.

మరియు కొన్ని ప్రత్యేక సందర్భాలలో పరీక్షలకు భిన్నంగా ఫలితాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.

జన్యు పరీక్షలు జరిగే ముందు, మానసిక మరియు శారీరక సమస్యలను అర్థం చేసుకోవడం ముఖ్యం. అలాగే, పాసిటివ్ రిసల్ట్ వచ్చినంత మాత్రాన, అదేమీ జీవితాలకు ముగింపు కాదు. సమస్య తెలుసుకోవడం ద్వారా, పరిస్థితులను అనుసరించి చికిత్స తీసుకుని పిల్లలకు సమస్యలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని మరువకండి.

English summary

Should You Do Genetic Testing Before Getting Pregnant?

Genetic disorders happen due to mutations or changes in the genes. These changes occur due to cell ageing or exposure to certain chemicals. Some genetic disorders run in the family for generations.
Story first published:Monday, September 24, 2018, 16:11 [IST]
Desktop Bottom Promotion