ప్రెగ్నన్సీ సమయంలో అశ్రద్ధ చేయకూడని లక్షణాలివే

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

స్త్రీ జీవితంలో ప్రెగ్నన్సీకి అపురూప స్థానం లభిస్తుంది. దాదాపు ప్రతి స్త్రీ ఈ దశ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. అయితే, ఈ దశ అనేది స్త్రీ జీవితంలో కీలకమైనది. ఈ సమయంలో స్త్రీ శరీరం అనేక మార్పులకు గురవుతుంది. అలాగే మానసికంగా కూడా అనేక మార్పులు ఏర్పడతాయి. అటువంటి కొన్ని మార్పులను ఇగ్నోర్ చేయకూడదు.

ఈ మార్పులన్నీ ప్రెగ్నన్సీ వలన జరిగే హార్మోనల్ ఛేంజెస్ వలన ఏర్పడినవి. వీటి గురించి మీకు అవగాహన ఉండాలి. ప్రెగ్నన్సీలో తలెత్తే వివిధ మార్పుల గురించి సరైన సమాచారం తెలుసుకుని ఆ విధంగా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి.

Symptoms that Shouldn’t Be Ignored During Pregnancy

కొత్తగా తల్లులైన వారితో ఈపాటికే మీరు ప్రెగ్నన్సీకి సంబంధించిన విషయాలు గురించి తెలుసుకుని ఉండుంటారు. మీ కుటుంబసభ్యుల నుంచి కూడా మీకు సమాచారం లభించి ఉంటుంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రెగ్నన్సీ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. మీరెన్ని విషయాలు తెలుసుకున్నా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అనుభవం మీకెదురవుతుంది. అందువలన, ప్రెగ్నన్సీ సమయంలో తీసుకోవలసిన కేర్ గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటే ఈ దశ మీకు మధుర జ్ఞాపకాలనే మిగులుస్తుంది.

ప్రతి ప్రెగ్నన్సీ అనేది విభిన్నమైనది. ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుంది. ఒకే మహిళకు సంబంధించిన రెండు ప్రెగ్నన్సీలలో కూడా తేడాలుంటాయి. అటువంటి సందర్భాలలో, కొన్ని విషయాలలో ప్రిపేర్ అవ్వాల్సిన అవకాశం కూడా ఉండదు.

ప్రెగ్నన్సీలో మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న లక్షణాలను గమనించడం మంచిది. అటువంటి లక్షణాలను ఇగ్నోర్ చేయకుండా వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలి.

ఈ రోజు అటువంటి లక్షణాల గురించి మీకు వివరించబోతున్నాము. మీకు మీ పాపాయికి ఇబ్బంది కలగకుండా అటువంటి లక్షణాలు తలెత్తినప్పుడు వెంటనే మీరు మీ డాక్టర్ ని సంప్రదించాలి.

మిడిల్ లేదా అప్పర్ అబ్డోమెన్ లో నొప్పి

మిడిల్ లేదా అప్పర్ అబ్డోమెన్ లో నొప్పి

మిడిల్ లేదా అప్పర్ అబ్డోమెన్ లో నొప్పి అనేది వామిటింగ్ లేదా నాజియాతో ముడిపడి ఉంటుంది. చాలాసార్లు, ఇది హార్ట్ బర్న్, ఎసిడిటీ, అజీర్ణం, ఫుడ్ పాయిజనింగ్ వలన కలుగుతుంది. అయితే, ప్రీ ఎక్లెమ్ప్సియా అనే సీరియస్ కండిషన్ వలన కూడా ఇది తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువలన, ఈ లక్షణం గురించి మీ డాక్టర్ కి వెంటనే తెలియచేయండి.

లోయర్ అబ్డోమిన్ పెయిన్:

లోయర్ అబ్డోమిన్ పెయిన్:

ప్రెగ్నన్సీలో లోయర్ అబ్డోమిన్ పెయిన్ కలిగితే ఈ పెయిన్ ని అశ్రద్ధ చేయకూడదు. సాధారణంగా లిగమెంట్ టియర్ వలన ఇది తలెత్తుతుంది. ఇది సాధారణ సమస్యే. అయితే, కొన్ని సార్లు ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ, మిస్ క్యారేజ్, ప్రీమెచ్యూర్ లేబర్, ప్లాసెంటాల్ అబ్రాప్షన్ లేదా ఫైబ్రాయిడ్ రప్చర్ వలన ఇది తలెత్తవచ్చు. కాబట్టి, ఈ విషయాన్ని డాక్టర్ కి వెంటనే తెలియచేయాలి.

ఫీవర్:

ఫీవర్:

100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఫీవర్ తో మీరు బాధపడుతున్నట్లయితే డాక్టర్ ని వెంటనే సంప్రదించాలి. కోల్డ్ వంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ప్రెగ్నన్సీ సమయంలో హై టెంపరేచర్ అనేది శిశువు ప్రాణానికి ముప్పు కలిగించవచ్చు. కాబట్టి, ఫీవర్ విషయంలో అశ్రద్ధ కనబరచవద్దు.

కంటిచూపులో తేడా

కంటిచూపులో తేడా

స్పాట్స్, ఫ్లాషింగ్, డిమ్మింగ్, బ్లరింగ్ వంటి లక్షణాలు మీ కంటిచూపులో తేడాని కలిగిస్తే డాక్టర్ తో మాట్లాడటం మంచిది. ప్రీ ఎక్లెమ్ప్సియాకి సూచికగా విజువల్ డిస్టర్బెన్స్సెస్ పనిచేస్తాయి.

చేతులు, లింబ్స్ మరియు ముఖంలో వాపు

చేతులు, లింబ్స్ మరియు ముఖంలో వాపు

బ్లోటింగ్ మరియు పఫీనెస్ ని ఆర్మ్స్, లింబ్స్ మరియు ముఖంలో ఎక్స్పీరియెన్స్ చేయడం గర్భిణీలకు సహజం. కానీ, ఈ లక్షణాలకు తోడుగా అబ్డోమినల్ పెయిన్ అలాగే చూపులో తేడాలు వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇవన్నీ, ప్రీ ఎక్లెమ్ప్సియా కి సూచికలు.

తలనొప్పి:

తలనొప్పి:

ప్రెగ్నన్సీలో తలనొప్పులు సహజమే. అయితే, మిగతా లక్షణాలతో భరించలేనటువంటి తలనొప్పి ముడిపడి ఉంటే వెంటనే మీరు వైద్యుని సలహాను స్వీకరించాలి.

విపరీతమైన దాహం

విపరీతమైన దాహం

యురినేషన్ లో మార్పులతో పాటు విపరీతమైన దాహం కలిగితే మీరు మీ వైద్యునికి మీ కండిషన్ ను వివరించండి. మీ యూరిన్ డార్క్ ఎల్లోగా ఉన్నా తరచూ మీకు దాహం వేస్తున్నా మీరు డిహైడ్రేటెడ్ అయ్యారని అర్థం. యురినేషన్ ఎక్కువయినా మీరు గెస్టేషనల్ డయాబెటిస్ తో బాధపడుతున్నారని అర్థం. ఈ విషయాన్ని వెంటనే వైద్యుని దృష్టికి తీసుకువెళ్ళండి. లేదంటే, బిడ్డకు కూడా హానీ జరిగే ప్రమాదం ఉంది.

యూరినేషన్ లో నొప్పి మరియు మంట

యూరినేషన్ లో నొప్పి మరియు మంట

యూటీఐ వలన యురినేషన్ లో బర్నింగ్ సెన్సేషన్ కలుగుతుంది. యాంటీ బయోటిక్స్ తో ఈ సమస్యను తొలగించుకోవాలి.

వామిటింగ్:

వామిటింగ్:

ప్రెగ్నన్సీలో వామిటింగ్ అనేది సహజమే. అయితే రోజుకు రెండు కంటే ఎక్కువ సార్లు మీకు వామిటింగ్ జరిగితే మీ ఎనర్జీ మొత్తం నీరుగారిపోతుంది. డిహైడ్రేషన్ బారిన పడతారు. వామిటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటె మీరు హైపరిమేసిస్ గ్రావిడారం అనే కండిషన్ తో బాధపడుతున్నట్టు అర్థం. అలాగే, ప్రీ ఎక్లెమ్ప్సియా లక్షణం కూడా ఇదే. వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.

English summary

Symptoms that Shouldn’t Be Ignored During Pregnancy

Pregnancy is an important period for any woman. It is miraculous to feel a new life developing within you. During pregnancy, there are symptoms that may indicate a problem with the mother or the baby. Some of the symptoms such as pain in your middle or upper abdomen, problem in eyesight, etc., should be notified to the doctor immediately.
Story first published: Saturday, March 3, 2018, 11:45 [IST]