ప్రెగ్నన్సీ సమయంలో మెంతులని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు నష్టాలు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ప్రెగ్నన్సీ అనేది వేడుకకు సిద్ధమవుతున్న సమయం. ఈ సమయం అనేడి సంతోషంతో పాటు ఆందోళనతో నిండుకుని ఉంటుంది. మహిళ జీవితంలో ఇది ఎంతో కీలక సమయం. గర్భిణీలు ఈ దశలో అనేక సందేహాలతో ఉంటారు. ఏవి తినొచ్చు, వేటిని అవాయిడ్ చేయాలి అనే సందేహాలు వారిని అనేకం వేధిస్తూ ఉంటాయి. ఇది సహజమే. గర్భిణీ తీసుకుకునే ఆహారం ప్రెగ్నన్సీని సజావుగా నడిపించేందుకు తోడ్పడుతుంది. అందుకనే ఈ సమయంలో తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. హెల్తీ మరియు బాలన్సుడ్ డైట్ ను తీసుకోవడం ద్వారా తల్లీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. మెంతులలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే, వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హానికరం.

ప్రెగ్నన్సీ సమయంలో మెంతులని తీసుకోవడం వలన కలిగే లాభాలు మరియు నష్టాల గురించి ఇక్కడ వివరించబోతున్నాము.

జెస్టేషనల్ డైయాబెటిస్ ని అరికడుతుంది:

జెస్టేషనల్ డైయాబెటిస్ ని అరికడుతుంది:

ప్రెగ్నన్సీకి ముందు డయాబెటిస్ లేకపోయినా ప్రెగ్నన్సీ సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడటం సాధారణమే. గర్భిణీలు గెస్టేషనల్ డయాబెటిస్ కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. గర్భిణీగా ఉన్నప్పుడు శరీరం అవసరమైనంత నాణ్యమైన ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోవటంతో గెస్టేషనల్ డయాబెటిస్ సమస్య తలెత్తుతుంది. తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోవడంతో గ్లూకోస్ శక్తిగా మారదు. అందువలన, రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. దీనిని హైపర్ గ్లైకేమియా అనంటారు. మెంతులని మితంగా తీసుకుంటే ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. గెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ ను ఎదుర్కొనేందుకు మెంతులు ఉపయోగపడతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని స్టెబిలైజ్ చేసే సామర్థ్యం ఉంది.

లాక్టేషన్ ని ప్రోమోట్ చేస్తుంది:

లాక్టేషన్ ని ప్రోమోట్ చేస్తుంది:

లాక్టేషన్ ని బూస్ట్ చేస్తే సామర్థ్యం మెంతులలో కలదు. వివిధ అధ్యయనాలలో ఈ విషయం స్పష్టమైంది కూడా. ప్రతి ఒక్క అధ్యయనం కూడా మెటర్నిటీ సమయంలో మెంతులను మితంగా తీసుకునే మహిళలలో పాల ఉత్పత్తి పెరిగిందని వెల్లడించింది. లాక్టేషన్ పెరగడం వలన శిశువుకు ఆకలి తీరుతుంది. అయితే, ఈ రోజుల్లో అనేక అనారోగ్య సమస్యల వలన లాక్టేషన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మితంగా మెంతులను తీసుకుంటే ఈ సమస్య పరిష్కారమవుతుంది.

కాంట్రక్షన్ కి తోడ్పడుతుంది

కాంట్రక్షన్ కి తోడ్పడుతుంది

కాంట్రాక్షన్స్ ని ప్రేరేపించదానికి మెంతులు ఉపయోగపడతాయి. కాంట్రాక్షన్స్ ని ఇండ్యూస్ చేయడానికి మెంతుల రెమెడీని ప్రాచీన కాలంలోంచి ఆచరిస్తున్నారు. లేబర్ ప్రాసెస్ ని తగ్గించేందుకు మెంతులు ఉపయోగపడతాయి. యుటెరిన్ కాంట్రాక్షన్స్ ని స్టిములేట్ చేయడం ద్వారా ప్రసవం సజావుగా జరిగేందుకు మెంతులు కీలకపాత్ర పోషిస్తాయని అంటున్నారు.

 బ్రెస్ట్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది

బ్రెస్ట్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది

మెంతులనేవి బ్రెస్ట్ ల ఎంలార్జిమెంట్ కి ఉపయోగకరంగా ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యం వలన మెటర్నిటీ సమయంలో బ్రెస్ట్ ల ఎంలార్జిమెంట్ సరిగ్గా జరగదు. మూడు నుంచి నాలుగు గ్రాముల మెంతులను తీసుకోవడంతో ఈ సమస్య పరిష్కారమవుతుంది. ప్రెగ్నన్సీలో మెంతులను తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలతో ఇది ఒకటి.

మెంతుల వలన గర్భిణీలు కొన్ని ఇబ్బందులు పడవచ్చు. సరైన మోతాదులో మెంతులను తీసుకోకపోతే గర్భిణీలు అనారోగ్య సమస్యలను ఫేస్ చేయవలసి వస్తుంది. ఆరోగ్యకరమైన మెటర్నిటీ కోసం మెంతులను తీసుకునే ముందు వాటి సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మెటర్నిటీ అనేది ముఖ్యమైన దశ. ఈ దశలో ఈటింగ్ హ్యాబిట్స్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. తినే వాటి వలన కలిగే లాభాలు ఆలాగే నష్టాలను బేరీజు వేసుకోవాలి. మెంతుల విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరమని గుర్తించాలి.

మెంతులను తీసుకోవడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.

ప్రీటెర్మ్ లేబర్ ముప్పు:

ప్రీటెర్మ్ లేబర్ ముప్పు:

ప్రెగ్నన్సీ మొత్తమ్మీద మెంతులను తీసుకుంటూ ఉంటే ప్రేటెర్మ్ లేబర్ సమస్య తలెత్తవచ్చు. ప్రసవ సమయం దగ్గర పడుతున్నప్పుడు మీరు మెంతులను తీసుకుంటే ప్రసవం సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ, మీరు ప్రెగ్నన్సీ ప్రారంభం నుంచి మెంతులను తీసుకుంటూ ఉంటే ప్రీటర్మ్ లేబర్ సమస్య వేధించవచ్చు. కాబట్టి, డెలివరీ డేట్ కి ముందే కాంట్రాక్షన్స్ కి సంబంధించిన లక్షణాలను మీరు గమనిస్తే ప్రెగ్నన్సీకే నష్టమని మీరు గుర్తించాలి. ఇటువంటి మెటర్నిటీ అనేది మిస్ క్యారేజ్ లేదా ప్రేటెర్మ్ బర్త్ తో ఎండ్ అయ్యే ప్రమాదం కలదు.

అజీర్ణ సమస్యలు:

అజీర్ణ సమస్యలు:

మెంతులను రెగ్యులర్ గా తీసుకునే గర్భిణీలలో అజీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం కలదు. యాసిడ్ ఇండైజేషన్ వలన ఇలా జరుగుతుంది. తద్వారా, వికారం అలాగే ఇండిజేషన్ తలెత్తుతాయి. అలాగే, బ్లోటింగ్ మరియు బౌల్స్ లో లూజ్ నెస్ ను కూడా మీరు గమనించవచ్చు. కాబట్టి, మెంతులను తీసుకునే ముందు మీరు కాస్తంత జాగ్రత్తను వహించాలి. లేదంటే, వివిధ డైజెషన్ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

మూత్రంలో వాసన:

మూత్రంలో వాసన:

మెంతులను తీసుకునే గర్భిణీలు ఈ లక్షణాన్ని గుర్తించడం సహజం. మ్యాపిల్ సిరప్ వంటి వాసనని మూత్రంలో గుర్తించవచ్చు. ఈ సమస్యను మ్యాపిల్ సిరప్ ఇష్యూగా చాలా మంది గర్భిణీలు భావిస్తారు. సిరప్ వాసనని యూరిన్ లో గుర్తించడం వలన వారలా భావించడం సహజం. ఇటువంటి కండిషన్ చాలా ప్రమాదకరమైనది. ఇది ఒకరకమైన డిజార్డర్. అనవసరమైన టెన్షన్ తో వారు లేనిపోని సమస్యలను కొనితెచ్చుకునే ప్రమాదం ఉంది.

అలర్జీలు ఎదురవవచ్చు:

అలర్జీలు ఎదురవవచ్చు:

గర్భిణీలలో హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ అనేది మెంతుల వలన ఎదురవవచ్చు. నాసల్ కంజెషన్, దగ్గు, వాపు, హిస్సింగ్ వంటి సెన్సిటివ్ రియాక్షన్స్ తో పాటు కొన్ని రకాల తీవ్రమైన కండిషన్స్ కూడా తలెత్తవచ్చు. మెంతుల వలన ప్రెగ్నన్సీ సమయంలో అనేక లాభాలు ఉన్నా కూడా మెంతుల వలన కలిగే నష్టాలను కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది.

డ్రగ్స్ తో ఇంటరాక్షన్:

డ్రగ్స్ తో ఇంటరాక్షన్:

ప్రెగ్నన్సీ సమయంలో వాడే మెడికేషన్స్ యొక్క ప్రభావాలను మెంతులు తగ్గించవచ్చు. బ్లడ్ క్లాట్ కి ఉపయోగపడే వివిధ మెడికేషన్స్ ప్రభావాలని మెంతులు తగ్గించవచ్చు. ఇది ప్రెగ్నన్సీ సమయంలో తీవ్ర ప్రమాదానికి దారితీస్తుంది.

డైట్

డైట్

ప్రెగ్నన్సీ సమయంలో అనేక కాంప్లికేషన్స్ ఎదురయ్యే ప్రమాదం ఉంది. గర్భంలో తీసుకునే ఆహారాలపై గర్భిణీలు అనేక సందేహాలతో నిండి ఉంటారు. ప్రెగ్నన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆర్టికల్ మీకు ఇంటరెస్టింగ్ గా అనిపించిందని ఆశిస్తున్నాము. ప్రెగ్నన్సీ సమయంలో హెల్తీ మరియు బాలన్సుడ్ డైట్ ను తీసుకుని ప్రెగ్నన్సీ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాము.

English summary

Ten Health Benefits And Dangerous Effects Of Fenugreek During Pregnancy

Pregnancy is a duration of party. It is a duration of rejoice as well as anxiousness. This is the most crucial stage in the life of a lady. Expectant ladies are constantly in predicament regarding exactly what to consume and also exactly what to stay clear of. It is fairly all-natural. The food which a pregnant female takes might play significant part for a healthy and balanced maternity. The food taken during the maternity must be taken under correct assistance.