మీరు గర్భిణీ అని తెలిపే 10 లక్షణాలు - వీటి గురించి మీకు తెలియకపోవచ్చు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఒక ప్రాణంలో మరొక ప్రాణం ఊపిరి పోసుకోవడం నిజంగా ఒక అద్భుతం. అయితే, అందరికీ ఈ అదృష్టం దక్కదు. కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది.

మహిళలు మాత్రమే గర్భం దాల్చగలుగుతారు. అయితే, మహిళలందరినీ గర్భం దాల్చే అదృష్టం వరించకపోవచ్చు. కొన్ని కారణాల వలన కొందరు గర్భం దాల్చలేరు. ఆరోగ్య సమస్యలు కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు. గర్భం దాల్చి ఒక జీవికి జన్మనివ్వడం నిజంగా ఒక వరమే.

ఇప్పుడు, ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, గర్భం దాల్చిన విషయాన్ని కొన్ని వారాలు గడిచే కొద్దీ కూడా గమనించలేకపోవటం. నెలలు నిండే వరకు గర్భం దాల్చిన విషయానికి సంబంధించిన సూచనలు స్పష్టంగా లేకపోవటం మరొక కారణం. అయితే, గర్భం దాల్చిన విషయాన్ని నిర్దారించుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. వాటిని గమనిస్తే మీకు సులభంగా ఈ విషయం స్పష్టమవుతుంది.

10 signs you might be pregnant and you are not aware of it

అందువలన, గర్భం దాల్చే అవకాశాలున్న వారు ఈ ఆర్టికల్ లోని పది సైన్స్ ని ఇగ్నోర్ చేయకుండా గమనిస్తే గర్భం దాల్చిన విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

1. శ్వాస అందకపోవటం

1. శ్వాస అందకపోవటం

కొన్ని పనులను చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి శ్వాస అందనట్టు మీకు అనిపిస్తే మీరు గర్భం దాల్చడం వలన ఇలా జరిగి ఉండవచ్చు. మీలో పెరుగుతున్న ఇంకొక ప్రాణికి కూడా ఆక్సిజన్ అవసరపడుతుంది. అందువలన, మీరు శ్వాస సరిగ్గా అందదు. మెట్లు ఎక్కుతున్నప్పుడు, బస్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా హడావిడిగా పనులు చేస్తున్నప్ప్పుడు మీకు ఇలా అనిపించే అవకాశాలు ఎక్కువ.

2. బ్రెస్ట్ లో హెవీనెస్:

2. బ్రెస్ట్ లో హెవీనెస్:

మీ బ్రాస్ సడెన్ గా టైట్ గా మారిపోయాయి. అంటే, మీరు బ్రెస్ట్ లో హెవీనెస్ ని ఫీల్ అవుతున్నారన్నమాట. నిజానికి, కొన్నిసార్లు బ్రా ని తొలగించాలన్నంత హెవీ నెస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు గర్భం దాల్చడం వలన ఇలా మీకు అనిపించవచ్చు. బ్రెస్ట్ లో నొప్పులు మిమ్మల్ని ఇబ్బందిపెడుతూ ఉంటే సాధరణ బ్రాస్ ను పక్కనపెట్టి సపోర్టివ్ బ్రాస్ ని ఎంచుకుంటే ఉపయోగం ఉంటుంది. నిపిల్స్ కూడా పెద్దవిగా అవుతూ వాటి షేడ్స్ లో తేడాలు కూడా కనిపించడం కూడా ప్రెగ్నన్సీ లక్షణమే.

3. ఆహారంపై విముఖత లేదా ఆహారంపై విపరీతమైన కోరిక:

3. ఆహారంపై విముఖత లేదా ఆహారంపై విపరీతమైన కోరిక:

ఇంతకు ముందు మీకు నచ్చని ఆహారంపై సడెన్ గా మీకు మక్కువ ఎక్కువవుతుంది. మరోవైపు, ఇంతకు ముందు మీకు నచ్చిన ఆహారంపై ఇప్పుడు మీకు విముఖత ఏర్పడుతుంది. ఇవి, ప్రెగ్నన్సీ లక్షణాలే. వివిధ ఆహారపదార్థాలపై మీకిలా జరిగితే మీరు ప్రెగ్నెంట్ అయి ఉండడం వలన ఇలా జరిగి ఉండవచ్చు. ఇది కేవలం రుచులకు పరిమితం కాదని మీరు గమనించాలి. కొన్ని సార్లు, గర్భం దాల్చిన మహిళలు కొన్ని రకాల ఆహార వాసనలపై కూడా విముఖతకు ప్రదర్శిస్తారు. మరోవైపు, కొన్ని రకాల ఆహార వాసనలు వారిని అట్రాక్ట్ చేస్తాయి.

4. తరచూ అలసిపోతూ ఉండటం:

4. తరచూ అలసిపోతూ ఉండటం:

స్టామినా తగ్గినట్టు మీకనిపించినా, నిస్సత్తువగా ఏ పనీ చేయలేని స్థితిలో మీరున్నా ఇవి ప్రెగ్నన్సీ లక్షణాలే. మీరు ఇదివరకు ఇష్టంగా చేసిన కొన్ని పనులను చేయడానికి మీకు శక్తి సరిపోకపోవటం కూడా ఈ లక్షణమే. మీకు నచ్చిన హాబీలను కూడా మీరు ఎంజాయ్ చేయలేకపోతే మీరు కచ్చితంగా హోమ్ ప్రెగ్నన్సీ టెస్ట్ ను చేసుకోవాలి. ఎందుకంటే, ఈ లక్షణాలన్నీ ప్రెగ్నన్సీకి సంబంధించినవే.

5. వికారం:

5. వికారం:

ఏ విధమైన స్టమక్ ఇన్ఫెక్షన్స్ లేకపోయినా వికారంతో మీరు బాధపడుతున్నట్టయితే, మీరు గర్భం దాల్చడం వలన ఈ అనుభవం మీకు ఎదురై ఉండవచ్చు. మార్నింగ్ సిక్నెస్ కి వికారానికి ఏ మాత్రం సంబంధం లేదు. ప్రెగ్నన్సీ సమయంలో మార్నింగ్ సిక్నెస్ ఎర్లీ మార్నింగ్ లో ఎదురవుతుంది. అయితే, ఈ వికారమనేది సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేయవచ్చు. అయితే, ఈ వికారం లక్షణాలు అలాగే సమయం కూడా ఒక్కొక్క మహిళకు ఒక్కోలా ఉండవచ్చు.

6. పిరియడ్ ని మిస్ అవడం:

6. పిరియడ్ ని మిస్ అవడం:

కొన్ని సార్లు పీరియడ్ మిస్ అవటం అనేది సాధారణమే. అయితే, ఇది ప్రెగ్నన్సీ వలన కూడా జరగవచ్చు. కాబట్టి, ఈ విషయాన్ని తేలికగా చూడకండి. ప్రెగ్నన్సీకి సంబంధించిన ముఖ్య లక్షణం నెల తప్పడం. కాబట్టి, నెలసరి ఒకవేళ తప్పినట్టయితే వెంటనే ప్రెగ్నన్సీ టెస్ట్ ను చేసుకోండి. మీరు గర్భం దాల్చడం వలన నెల తప్పి ఉండవచ్చు.

7. తరచూ మూత్రానికి వెళ్లవలసిన అవసరం రావడం:

7. తరచూ మూత్రానికి వెళ్లవలసిన అవసరం రావడం:

ప్రెగ్నన్సీలో శరీరం అనేక రకాల అదనపు ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. వీటివలన, బ్లాడర్ అనేది ఓవర్ టైం వర్క్ చేయవలసి వస్తుంది. అందువలన, తరచూ మీరు రెస్ట్ రూమ్ వైపు పరుగు పెడుతూ ఉన్నట్టయితే, ఈ లక్షణాన్ని అశ్రద్ధ చేయకండి. ఇది, ప్రెగ్నన్సీకి సంబంధించిన ముఖ్య లక్షణం. గర్భిణీలలో ఈ లక్షణాన్ని గుర్తించవచ్చు. దీనిని మీరు ముఖ్య సూచనగా గమనించే ముందు మీరు ఎక్కువగా నీళ్లు తీసుకోవడం వలన తరచూ మూత్రానికి వెళ్ళవలసి రావటం లేదన్న విషయాన్ని నిర్దారించుకోవాలి.

8. భరించలేని నొప్పులు:

8. భరించలేని నొప్పులు:

రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న మహిళలకు నెలసరి నొప్పులు పరిచయమే. అందువలన, ఈ లక్షణాన్ని సాధారణంగా ఇగ్నోర్ చేస్తారు. అయితే, క్రామ్పింగ్ అనేది దీర్ఘ కాలం కొనసాగితే మీరు కచ్చితంగా ఈ లక్షణంపై దృష్టి పెట్టాలి. గర్భిణీలలో ఈ లక్షణం సహజం. మీరు గర్భం దాల్చిన విషయాన్ని టెస్ట్ చేసుకుని తెలుసుకోండి.

9. ఇంతకు ముందు కంటే మూడీగా ఉంటున్నారు:

9. ఇంతకు ముందు కంటే మూడీగా ఉంటున్నారు:

మీవారిపై లేదా మీ స్నేహితులపై మీరు అనవసరంగా కోపతాపాలను ప్రదర్శిస్తున్నారా? మీరు ప్రెగ్నెంట్ అవడం వలన ఇలా జరుగుతూ ఉండవచ్చు. ప్రెగ్నన్సీ వలన హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయి. అందువలన, మీరు మూడీగా మారతారు. అనవసర విషయాలపై కూడా మీకు చికాకు ఏర్పడుతుంది. అయితే, ఈ విషయం గురించి చింత అనవసరం. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. ప్రశాంతంగా ఉండాలి.

English summary

10 signs you might be pregnant and you are not aware of it

10 signs you might be pregnant and you are not aware of it,There are a few symptoms that you may not even know about that could indicate you are pregnant. So, here we have mentioned about the signs and symptoms of pregnancy.