For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ మరియు వైట్ స్ట్రెచ్ మార్క్స్ కు గల తేడా

|

స్ట్రెచ్ మార్క్స్ అనేవి హానికరం కాదు. ఇవి స్కిన్ పైన ఏర్పడే మచ్చలు. ఈ మచ్చలు స్కిన్ ఆకృతి మారినప్పుడు ఏర్పడతాయి. సాధారణంగా ప్రెగ్నన్సీ సమయంలో బెల్లీపై కనిపిస్తాయి. అలాగే బ్రెస్ట్, తొడలు, పిరుదులు అలాగే చేతులపై కూడా కనిపిస్తాయి. బరువులో మార్పులు, బాడీ బిల్డింగ్ లేదా హార్మోనల్ ఛేంజెస్ వలన స్కిన్ సాగినట్లు ఐతే చర్మం మధ్య పొర డెర్మిస్ లో చిరుగు ఏర్పడుతుంది. ఈ కండిషన్ వలన చర్మం సాగినచోట రెడిష్ గా లేదా పర్పిలిష్ గా మారుతుంది. ఈ మార్క్స్ అనేవి వివిధ రంగులలో పారలెల్ లైన్స్ గా ఏర్పడతాయి.

The difference between red and white stretch marks

రెడ్ మరియు వైట్ కలర్ మార్క్స్ కి గల తేడా

రెడ్ స్ట్రెచ్ మార్క్స్


రెడ్ కలర్ స్ట్రెచ్ మార్క్స్ అనేవి స్ట్రెచ్ మార్క్స్ కి ప్రారంభ దశలో ఏర్పడేవని చెప్పుకోవచ్చు. ఈ మార్క్స్ తాజావి. మార్క్స్ ఏర్పడడానికి ముందు రెడిష్ గా ఉంటాయి. అటువంటి స్కారింగ్ అనేది బ్లడ్ వెజిల్స్ మీదుగా ఏర్పడటం వలన రెడ్ కలర్ వస్తుంది. ఈ దశలో, వివిధ టాపికల్ క్రీమ్స్ ని అప్లై చేయడం ద్వారా చర్మానికి కొలాజిన్ ని అందించి ఈ మార్క్స్ ని హీల్ చేయవచ్చు. పల్స్డ్ డై వంటి లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఈ మార్క్స్ ని తొలగించడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి.

గమనిక: లైట్ బేస్డ్ ట్రీట్మెంట్స్ నుంచి గర్భిణీలు దూరంగా ఉండటం మంచిది. అటువంటి ట్రీట్మెంట్స్ కైనా ఏవైనా టాపికల్ క్రీమ్స్ కైనా మీ గైనకాలజిస్ట్ సలహాను స్వీకరించండి.

The difference between red and white stretch marks

వైట్ స్ట్రెచ్ మార్క్స్


ఇటువంటి స్కార్స్ చర్మంపై దీర్ఘకాలం నుంచి ఉండుంటాయి. ఈ వైట్ లేదా సిల్వరిష్ కలర్ మార్క్స్ అనేవి పాతవి. వీటిని టాపికల్ క్రీమ్స్ తో రూపుమాపలేము. 'మైక్రోడెర్మాబ్రాసన్' వంటి ట్రీట్మెంట్స్ తో ఏవైనా ప్రయోజనం లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఈ ట్రీట్మెంట్ అనేది కొలాజెన్ ని రిస్టోర్ చేయలేదు. ఎక్సయిమర్ లేజర్ వంటి ట్రీట్మెంట్ అనేది వైట్ స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించి మీ కలర్ ని రిస్టోర్ చేసేందుకు దోహదపడుతుంది. ఐపీఎల్ మరియు ఫ్రాక్సల్ వంటి కొన్ని లైట్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా టెక్స్చర్ ని మెరుగుపరచవచ్చు. అలాగే రంగును ఫేడ్ చేయవచ్చు. అయితే, ఈ రిజల్ట్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి.

The difference between red and white stretch marks

ఈ వైట్ మార్క్స్ అనేవి మొండి మచ్చలు. చర్మంలోని చిన్ని చిన్ని చిరుగులివి. అందువలన వైట్ మార్క్స్ కి పెర్ఫెక్ట్ క్యూర్ అనేది లేదు.

English summary

The difference between red and white stretch marks

Stretch marks are a form of harmless scarring on the skin. These marks have an off-colour hue and happen when the skin changes its shape. They usually occur during pregnancy on the belly and commonly on body parts like breasts, thighs, buttocks and arms. With weight changes, bodybuilding or hormonal changes, the skin stretches rapidly causing a tear in the dermis, the middle layer of the skin.
Story first published:Monday, March 5, 2018, 14:49 [IST]
Desktop Bottom Promotion