ప్రెగ్నెన్సీ సమయంలో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కి గల ప్రాముఖ్యం

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ప్రెగ్నన్సీ అనేది మహిళల జీవితంలో ఒక మహాద్భుతమైన దశ. ఈ దశలో గర్భిణీల ముఖంలో కాంతి మరింత పెరుగుతుంది. తనలో పెరుగుతున్న చిన్నారి గురించి ఆలోచిస్తూ తరిస్తుంది గర్భిణీ. తనలోనున్న చిన్నారి బాగోగులకై తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. ఈ దశలో చిన్నారి గురించి తప్పితే మరే ధ్యాసా ఉండదు.

ఈ సమయంలో గర్భిణీలు తమ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలి. సాధ్యమైనంత వరకూ యాక్టివ్ గా ఉండాలి. ఇంటిపనులలో నిమగ్నమవడం ఎంతో మంచిది. ఉద్యోగస్తులైతే వృత్తి రీత్యా ఎక్కువసేపు కూర్చుని ఉండవలసి వస్తుంది కాబట్టి వారు మరికొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘ శ్వాస తీసుకోవడమనేది ఎంతో సులభమైన ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ను చేస్తే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఎక్సరసైజ్ అటు గృహిణిలకు అలాగే ఇటు ఉద్యోగం చేసుకునే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వివరాలను తెలుసుకోండి.

ప్రెగ్నన్సీ సమయంలో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాముఖ్యత

గర్భం దాల్చగానే డీప్ బ్రీతింగ్ కి ప్రాముఖ్యతని ఎందుకివ్వాలి?

గర్భం దాల్చగానే డీప్ బ్రీతింగ్ కి ప్రాముఖ్యతని ఎందుకివ్వాలి?

డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వలన అనేక లాభాలు పొందవచ్చు. ఈ ఎక్సరసైజ్ అనేది అందరికీ ఉపయోగకరమే. అయితే, గర్భం దాల్చిన సమయంలో ఈ ఎక్సరసైజ్ వలన రెండు ముఖ్య లాభాలను పొందవచ్చు.

శ్వాస ఆడకపోవుట

శ్వాస ఆడకపోవుట

నెలలు గడిచే కొద్దీ గర్భసంచి విస్తరిస్తూ ఉంటుంది. అందువలన, పొట్ట అనేది ప్రత్యేకించి మూడవ త్రైమాసికంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ ఎదుగుదల అనేది డయాఫ్రాగమ్ అనే దానిపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా, ఉపిరితిత్తులపై కూడా ఒత్తిడి పడుతుంది. అందువలన, ఈ దశలో సాధారణంగా శ్వాస తీసుకోవడమనేది కాస్తంత కష్టతరంగా మారుతుంది. కొన్ని సార్లు, ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. అందువలన, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ను సాధన చేయడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా గట్టెక్కవచ్చు.

ప్రసవం సులభంగా జరుగుతుంది

ప్రసవం సులభంగా జరుగుతుంది

ప్రసవ సమయంలో గర్భిణీలు అనేకమైన భావోద్వేగాలు ఒకేసారి గురవుతారు. సంతోషం, ఆత్రుత, ఒత్తిడి, ఆందోళన, భయం వంటి భావోద్వేగాలకు గురవుతారు. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ప్రసవం జరిగితే అందరూ సంతోషంగా ఉంటారు. డీప్ బ్రీతింగ్ వలన ప్రసవం సజావుగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే, బేబీని పుష్ చేయడానికి శ్వాసని కొన్ని సెకండ్ల పాటు నిలపగలగాలి. అయితే, ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉన్నటువంటి వారు ఇబ్బందులకు గురవుతారు. అందువలన, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఈ సమస్యను తొలగించేందుకు చక్కటి పరిష్కారంగా పనికొస్తుంది.

డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వలన కలిగే మరికొన్ని లాభాలు

మెరుగైన ఆక్సిజన్ సరఫరా

మెరుగైన ఆక్సిజన్ సరఫరా

రక్తప్రవాహంలో తగినంత ఆక్సిజన్ సరఫరా అనేది తల్లికీ బిడ్డకీ ఆరోగ్యకరం. డీప్ బ్రీతింగ్ వలన కార్బన్ డయాక్సైడ్ అనేది శరీరం నుంచి తొలగిపోతుంది. తద్వారా, ఆక్సిజన్ అనేది భర్తీ అవుతుంది.

శరీరంలోని మలినాలను తొలగిస్తుంది

శరీరంలోని మలినాలను తొలగిస్తుంది

సరైన విధంగా శ్వాస తీసుకుంటే శరీరంలోని 70 శాతం మలినాలు సహజంగా తొలగిపోతాయి. డీప్ బ్రీతింగ్ వలన సాధారణంగా కూడా సరైన విధంగా శ్వాస తీసుకోవడం అనేది అలవాటవుతుంది. అలా, శరీరంలోని మలినాలు సులభంగా బయటకు పోవడానికి మార్గం సుగమం అవుతుంది.

రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది

రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది

ప్రెగ్నన్సీ సమయంలో రోగనిరోధక వ్యవస్థ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ వ్యవస్థ పనితీరు సవ్యంగా ఉంటే తరచూ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తక్కువ. శరీరంలోని బాక్టీరియాని తొలగించుకోవడం ద్వారా మెటబాలిజం వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. అదే విధంగా, రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది.

బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది

బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది

ప్రెగ్నన్సీ సమయంలో బరువు నియంత్రణలో ఉండాలి. అధికంగా బరువు పెరగడం వలన ప్రసవ సమయంలో ఇబ్బందికి గురికావలసి ఉంటుంది. డీప్ బ్రీతింగ్ వలన శరీరానికి తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. తద్వారా, బరువు నియంత్రణలో ఉంటుంది.

స్టామినాని పెంపొందించుకోవచ్చు

స్టామినాని పెంపొందించుకోవచ్చు

తల్లి కాబోతున్నవారికి స్టామినా అనేది అత్యంత అవసరం. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లను తమ రోజువారీ రొటీన్ లో భాగంగా చేసుకోవడం ద్వారా స్టామినా ని పెంపొందించుకోవచ్చు. తద్వారా, ప్రెగ్నన్సీ దశని సులభంగా దాటవచ్చు.

డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ను సాధన చేసే విధానం

డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ను సాధన చేసే విధానం

చక్కటి వెంటిలేషన్ కలిగిన ప్రదేశాన్ని ఎంచుకోండి. అవుట్ డోర్ అయితే మరీ మంచిది.

నేలపై మఠం వేసుకుని కూర్చోండి. వెన్నును నిటారుగా ఉంచండి. లేదంటే, బ్యాక్ సపోర్ట్ సరిగ్గా ఉండేలా చూసుకుని మీకు సౌకర్యవంతంగా ఉండేలా కూర్చోండి.

కళ్ళు మూసుకుని మొత్తం శరీరాన్ని రిలాక్స్ అవనివ్వండి. నుదురుదగ్గరనించి, దవడలు, భుజాలు, ఛాతీ, పొత్తికడుపు అలాగే కాళ్ళను రిలాక్స్ చేయండి.

ఇప్పుడు ఒక చేతిని ఛాతిపై ఆనించి మరొక చేతిని ఉదరంపై ఆనించండి.

ఇప్పుడు, నెమ్మదిగా శ్వాసను ముక్కు ద్వారా తీసుకోండి. ఊపిరి అనేది ఛాతీ నుంచి పొత్తికడుపు వరకు ప్రయాణిస్తున్నట్టు భావించండి. గాలితో నిండినప్పుడు మీ ఉదరం పెద్దదిగా అవుతుంది. గాలి అనేది కేవలం ఛాతి వరకే కాకుండా పొత్తికడుపు వరకు ప్రయాణించాలని గుర్తుంచుకోండి. డీప్ బ్రీతింగ్ ముఖ్య ఉద్దేశ్యం ఇదే.

ఇప్పుడు మీ శ్వాసను రెండు సెకండ్ల వరకు నిలిపివేయండి. ఆ తరువాత పెదవుల ద్వారా శ్వాసను బయటికి వదలండి. శ్వాస తీసుకోవడానికి పట్టిన సమయానికి రెట్టింపు సమయాన్ని శ్వాసను వదలడానికి వినియోగించాలన్న విషయాన్ని గుర్తించండి. ఉదాహరణకు, శ్వాస తీసుకోవడానికి 3 సెకండ్లు పడితే, శ్వాసను వదలడానికి ఆరు సెకండ్లు పట్టాలి.

శ్వాసను బయటకు వదులుతున్నప్పుడు మీ ఉదరం సాధారణ పొసిషన్ కు చేరుకుంటుంది.

ఈ ప్రక్రియను కనీసం అయిదు నుంచి పది నిమిషాల వరకు కొనసాగించండి. ఈ ఎక్సర్సైజ్ ను రోజులో అయిదు సార్లు కూడా చేయవచ్చు. ఈ ఎక్సర్సైజ్ ను ఉదయాన్నే సాధన చేయడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గుర్తించవలసిన కొన్ని విషయాలు

డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గుర్తించవలసిన కొన్ని విషయాలు

పొట్ట నిండుగా ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ ను సాధన చేయకూడదు. పొట్ట సగం ఖాళీగా ఉన్నప్పుడే ఈ ఎక్సర్సైజ్ ను సాధన చేయాలి.

అసౌకర్యంగా లేదా అనారోగ్యంగా అనిపించినా ఈ ఎక్సర్సైజ్ ను చేయకండి.

అసౌకర్యంగా లేదా అనారోగ్యంగా అనిపించినా ఈ ఎక్సర్సైజ్ ను చేయకండి.

ఎక్సర్సైజ్ ను సాధన చేసే సమయంలో మీ శరీరంలోని ఏ మాత్రం అసౌకర్యంగా అనిపించినా అప్పటికప్పుడే ఎక్సర్సైజ్ ను విరమించండి

మీ పక్కన ఎవరైనా ఉన్నప్పుడే ఎక్సరసైజ్ ను చేయడం ఉత్తమం. మీకేదైన సహాయం అవసరమైతే అందుబాటులో మనిషి ఉండటం మంచిది.

English summary

The Importance Of Deep Breathing Exercise During Pregnancy

The number of calories going in and out of your body determine the success of your weight loss efforts. So, here are 10 zero-calorie foods that can help you reach that goal, like grapefruit, cucumber, and fish..