For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో పంటినొప్పా? నివారణా పద్దతులను తెలుసుకోండి.

|

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ శరీరం అనేక మార్పులకు లోనవడం సహజం. గర్భధారణ గావించిన వారు, ఎక్కువగా మార్నింగ్ సిక్నెస్, అలసట మరియు బరువు పెరుగుట వంటి సమస్యలకు తరచూ గురవుతూ ఉంటారు. గర్భధారణ తర్వాత కలిగే సమస్యలలో, కొన్ని తెలిసినవిగా ఉంటే, కొన్ని మాత్రం సంబంధంలేనివిగా కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యమైనది పంటినొప్పి.

గర్భధారణ సమయంలో పంటినొప్పి కూడా సాధారణంగా కలిగే సమస్యలలో ఒకటిగా ఉంది. మీ శరీరంలోని హార్మోన్ల మార్పులన్నీ గింజివిటిస్ యొక్క అవకాశాలను పెంచుతాయి, ఇది గమ్ ఇన్ఫ్లమేషన్ యొక్క రకంగా చెప్పబడినది. అదనంగా, మీరు గర్భవతిగా ఉన్నప్పుడు కావిటీ సమస్యలను కలిగి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కూడా. ఈ రెండు కారణాలు పంటి లేదా గొంతు సమస్యలకు దారితీస్తుంది. గర్భధారణ సమయంలో మీ శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం ఎంత ముఖ్యమో, మీ దంతాల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీ దంతాలను తరచూ శుభ్రం చేయడం, ఫ్లాసింగ్, రిన్సింగ్ మరియు మౌత్ వాష్ లిక్విడ్స్ ఉపయోగించటం ద్వారా గర్భధారణ సమయంలో కలిగే దంతాల సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో పంటినొప్పా? నివారణా పద్దతులను తెలుసుకోండి.

గర్భధారణ సమయంలో దంత సమస్యలకు సహజ సిద్దమైన చికిత్స చేయడం మంచిది:

గర్భధారణ సమయంలో మందులు తీసుకోవడం గురించి అనేక ఆందోళనలు ఉన్నాయి. కావున, ప్రతి సమస్యకు మందుల మీద ఆధారపడడం మూలంగా ఆ డ్రగ్స్ ప్రభావం కడుపులోని బిడ్డకు, లేదా తల్లి పాలు తాగే బిడ్డలపై కూడా పడవచ్చు. ఈమధ్యనే జరిగిన ఒక పసిబిడ్డ మరణం ఉదంతం ప్రపంచాన్నే కుదిపివేసింది. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఆ ఉదంతం ప్రకారం, మానసిక సమస్యల నివారణా క్రమంలో భాగంగా తల్లి వేస్కున్న డ్రగ్స్ కారణంగానే పసిపిల్లవాడు మృతి చెందినట్లు తేలింది. కావున మీ పంటినొప్పికి సహజసిద్దమైన పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడమే మంచిదిగా చెప్పబడింది. అనివార్య పరిస్థితుల్లో వైద్యుని సలహా మేరకు మాత్రమే మందులకు ఉపక్రమించవలసి ఉంటుంది.

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు, పంటినొప్పి వేధిస్తున్న ఎడల ఈ క్రింది నివారణా చర్యలు మీకు ఉపయుక్తంగా ఉండగలవు.

1. ఐస్

1. ఐస్

ఏదైనా ఒక బాగ్ లో ఐస్ ముక్కలను ఉంచి, ఆ బ్యాగ్ పంటినొప్పిగల చెంప ప్రాంతాన ఉంచడం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. బాగ్ లేని ఎడల ఏదైనా శుభ్రమైన వస్త్రాన్ని కూడా ఉపయోగించవచ్చు. మరియు ఐస్ అందుబాటులో లేని పక్షాన, ఫ్రిడ్జ్లో గడ్డకట్టబడిన బఠానీ గింజలను కూడా వినియోగించవచ్చు.

2. వెచ్చని నీరు

2. వెచ్చని నీరు

ఒక కప్పు మందపాటి నీటిలో కొంత ఉప్పు వేయండి. తరువాత, మీ అంగిట్లో గలగరించి శుభ్రం చేయడానికి ఈ నీటిని ఉపయోగించండి. ఇది పంటి నొప్పిని నెమ్మదిగా తొలగించి, మీ దంతాలలోని ఏవైనా ఆహార కణాలు పేర్కొనిన ఎడల సురక్షితంగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. రోజులో పలుమార్లు చేయడం వలన ఉత్తమ ఫలితాలను పొందగలరు.

3. హాట్ కంప్రెస్

3. హాట్ కంప్రెస్

వేడి నీటిని ఉపయోగించి, శుభ్రమైన వస్త్రాన్ని తడిగా చేసి, పిండివేయండి. పంటి నొప్పి ఉన్న చెంప వైపున ఈ వస్త్రoతో అద్దండి. ఈ చర్య, ఆ భాగంలో రక్త ప్రసరణ సజావుగా సాగేలా దోహదం చేయడమే కాకుండా, ఆ ప్రాంతంలో రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరచేలా సహాయం చేయగలదు.

4. ఉల్లిపాయలు

4. ఉల్లిపాయలు

ఉల్లిపాయలు శతాబ్దాలుగా పంటి నొప్పి కోసం ఉపయోగిస్తున్నారు. ఐదు నిమిషాల కన్నా తక్కువ సమయం, ముడి ఉల్లిపాయ ముక్కను నమలడానికి ప్రయత్నించండి. ఈ ప్రక్రియ సౌకర్యంగా లేని ఎడల, నొప్పి ఉన్న భాగాన ఒక ముడి ఉల్లిపాయ ముక్కను కాసేపు ఉంచండి.

5. లవంగాలు

5. లవంగాలు

లవంగాలు లేదా లవంగాల నూనె పంటి నొప్పికి ఒక సహజ గృహ వైద్యంగా చెప్పబడింది. ప్రభావితమైన దంతాలకు నేరుగా వినియోగించే ముందు, ఒక కాటన్ బాల్ తీసుకుని దానిమీద కొంచం లవంగాల నూనెను వేయాలి. ఆ తర్వాత ప్రభావిత ప్రాంతానికి, అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. లేదా లవంగాలను నెమ్మదిగా నమలడం కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. లవంగాలలోని క్రిమినాశక లక్షణాలు సంక్రమణ సమస్యలు తగ్గించడానికి సహాయం చేస్తాయి మరియు నొప్పి నివారణకు కూడా దోహదం చేస్తుంది.

6. పాలకూర

6. పాలకూర

ముడి పాలకూర నొప్పి ఉపశమనంలో సహాయం చేస్తుంది. పాలకూర ఆకులు నమలడం లేదా వాటిని ఒక ముద్దగా ప్రభావిత భాగాన ఉంచడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.

 7. వెల్లుల్లి

7. వెల్లుల్లి

వెల్లుల్లి యాంటీమైక్రోబయాల్ లక్షణాలతో ప్రసిద్ధి చెందింది. వెల్లుల్లిలోని అల్లిసిన్ అంటువ్యాధిని కలిగించే బాక్టీరియాపై దాడి చేయడానికి ఒక యాంటీబయోటిక్ వలె పనిచేస్తుంది. శతాబ్దాలుగా వెల్లుల్లిని, పంటినొప్పి చికిత్సలో వినియోగిస్తున్నారు. కనుక ఇది గర్భధారణ సమయంలో కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చు. కానీ ఎక్కువసేపు మీ దంతాల మీద వెల్లుల్లిని వదిలివేయకూడదని గుర్తుంచుకోండి, ఇది తీవ్ర అసౌకర్యాన్ని కలిగించవచ్చు.

8. జామ ఆకులు

8. జామ ఆకులు

జామ ఆకులు నమలడం లేదా నీటిలో జామాకుల రసం కలిపి నోటిలో గలగరించి ఊయడం ద్వారా పంటి నొప్పికి ఉపశమనం కలిగించవచ్చు. ఈ జామాకులను, ఉప్పునీటిలో మరిగించి, చల్లార్చిన తర్వాతనే వినియోగించాలి. మరియు ప్రభావిత ప్రాంతాలకు తగులునట్లుగా, ఆయాప్రాంతాలకు జామాకుల నీరు వెళ్ళునట్లు జాగ్రత్త తీసుకోవాలి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Toothache during pregnancy? Try these simple home remedies.

Toothache is one such problem that requires special attention during pregnancy. The general cause of toothache during pregnancy is inflamed or infected gums that lead to soreness. Treating your tooth with antibacterial properties of ginger root can heal minor infections, redness, inflammation and wounds associated with a toothache.
Story first published: Tuesday, August 7, 2018, 11:20 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more