For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో మలబద్దకం నివారించడానికి మార్గాలు

|

గర్భంతో పాటు స్త్రీలలో అనేక రకాల శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. అటువంటి రుగ్మతలలో, మలబద్దకం ఒకటి. ఇది మీలో హార్మోన్ మార్పులు వలన లేదా ఆహారపు అలవాట్ల వల్ల కలిగిన, దీనిని ఎదుర్కోవడం ఒకింత కష్టమైన పనే!

ఏదేమైనప్పటికి, కొన్ని సమర్ధవంతమైన నివారణ చర్యలు చేపడితే, మలబద్దకంతో ముడిపడిన సమస్యలన్నింటిని తగ్గించవచ్చు.

మలబద్దకం వలన పొత్తికడుపులో నొప్పి, ప్రేగుల్లో కదలికలు నెమ్మదించడం మరియు విసర్జకాలు గట్టిపడటం వంటివి జరుగుతాయి. ఇవ్వు గర్భధారణ సమయంలో ఎప్పుడో ఒకప్పుడు జరుగుతాయి. ఆఖరి త్రైమాసికంలో, పొట్ట పెరుగుతున్నప్పుడు, ఇంచుమించుగా ప్రతి గర్భిణి స్త్రీలో ఈ సమస్య కనిపిస్తుంది.

హార్మోన్లలో మార్పులు,ఐరన్ మాత్రలు తీసుకోవడం, గర్భంపై ఒత్తిడి తదితర కారణాల వల్ల మొదలయ్యే ఈ సమస్యను పూర్తిగా నివారించడం అంత సులభమేమి కాదు. ప్రసవానంతరం ఈ సమస్య దానంతట అదే మాయమవుతుంది. అయినప్పటికి కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా, ఈ సమస్య నుండి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు.

గర్భిణీ స్త్రీలలో అసలు మలబద్దకం ఎందుకు వస్తుంది?

గర్భిణీ స్త్రీలలో అసలు మలబద్దకం ఎందుకు వస్తుంది?

గర్భం దాల్చినపుడు, ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరుగుతూ పోతున్నప్పుడు, శరీర కాండరాలు సడలటం మొదలవుతుంది. ఇది ప్రేగు కండరాల విషయంలో కూడా వర్తిస్తుంది. దీని మూలంగా జీర్ణప్రక్రియ ప్రభావితమయ్యి, నెమ్మదించి, మలబద్దకానికి దారితీస్తాయి

గర్భం దాల్చినపుడు, మలబద్దకం కలగడం అనేది అసాధారణ సమస్య కాదు. ఆక్టా అబ్స్ట్రెషియా ఎట్ గైనెకోలాజికా స్కాండినేవికా వారు ప్రచురించిన డేటా ప్రకారం, 90% మంది గర్భిణీ స్త్రీలలో మలబద్దక సంబంధిత సమస్యలు మరియు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. అనాదిగా ఈ సమస్య పరిష్కారానికి వివిధ పద్ధతులు ఆచరిస్తూ వస్తున్నారు. వీటిలో కొన్ని సహజ పరిష్కారాలు మరియు విరోచనకారి అయిన మందులు వాడటం కూడా ఉన్నాయి.

ఏదేమైనప్పటికి, గర్భధారణ సమయంలో మలబద్దకం కలిగినప్పుడు మామూలు సమయంలో పాటించే నివారణ చర్యలన్నింటిని పాటించలేము. ఈ వ్యాసం ద్వారా, గర్భధారణ సమయంలో సురక్షితంగా మలబద్దకాన్ని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.

గర్భధారణ సమయంలో మలబద్దకం నివారించడానికి మార్గాలు

గర్భధారణ సమయంలో మలబద్దకం నివారించడానికి మార్గాలు

• గర్భిణీ స్త్రీలు పీచుపదార్ధం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీని వలన మలబద్దకం దరిచేరదు. పీచుపదార్థాలు యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లను కూడా అందజేస్తాయి. గర్భిణీ స్త్రీలు ప్రతిదినం కనీసం 25 నుండి 30 గ్రాముల పీచుపదార్ధం తప్పనిసరిగా తీసుకోవాలి.

తమ ఆహారంలో కూరగాయలు, తాజా పండ్లు, పచ్చి బఠాని, చిరుధాన్యాలు, పప్పులు, హోల్ గ్రైన్ బ్రెడ్ మరియు ప్రూన్స్ ను భాగం చేసుకోవాలి. యాపిల్స్, అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, రాస్పుబెర్రీలు మరియు ఫిగ్స్ తో కూడిన సలాడ్లు తినడానికి ప్రయత్నించాలి. స్వీట్ కార్న్, క్యారెట్లు మరియు బ్రస్సెల్స్ స్ప్రౌట్ లను కొద్దిగా వేగనిచ్చి తినడం మంచిది.

గర్భధారణ సమయంలో మలబద్దకం నివారించడానికి మార్గాలు

గర్భధారణ సమయంలో మలబద్దకం నివారించడానికి మార్గాలు

• మీ శరీరానికి అవసరమైన నీటిని అందివ్వాలి. మామూలు సమయంతో పోలిస్తే గర్భధారణ సమయంలో నీటిని రెండింతలు అధికంగా తీసుకోవడం మంచి ఆలోచన. ప్రతి గర్భిణీ స్త్రీ రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగడం తప్పనిసరి. దీనివలన జీర్ణవ్యవస్థలో కదలికలు సక్రమంగా జరిగి, విసర్జకాలు మృదువుగా ఉండి, మలవిసర్జన సులువుగా జరుగుతుంది.

గర్భధారణ సమయంలో మలబద్దకం నివారించడానికి మార్గాలు

గర్భధారణ సమయంలో మలబద్దకం నివారించడానికి మార్గాలు

• మీరు తీసుకునే ఆహారం పెద్దమొత్తంలో ఒక్కసారిగా కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువసార్లు తీసుకోండి. రోజుకు మూడుసార్లు అధికంగా తినకుండా, కొంచెం కొంచెంగా ఐదు నుండి ఆరు సార్లు తినడం మంచిది. దీనివలన మలబద్దకం నుండి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం వలన మీ జీర్ణవ్యవస్థ సులువుగా పనిచేయగలుగుతుంది.

ఇలా చేయడం వలన మనం తీసుకున్న ఆహారం ప్రేగులను చేరుకునే ప్రక్రియ సులువుగా జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో తినడం వలన మీ జీర్ణకోశం పై ఒత్తిడి అధికమై, మీరు తీసుకున్న ఆహారం జీర్ణమవ్వడం కష్టమవుతుంది.

• ఈ పద్ధతులన్నీ చేపట్టినప్పటికి, మీ సమస్యలో ఎటువంటి మార్పు లేనట్లయితే తక్షణమే మీకు వైద్యసహాయం అవసరం.

• ఈ పద్ధతులన్నీ చేపట్టినప్పటికి, మీ సమస్యలో ఎటువంటి మార్పు లేనట్లయితే తక్షణమే మీకు వైద్యసహాయం అవసరం.

మీలో మలబద్దకం తీవ్రంగా ఉన్నట్లయితే, వైద్యులు తాత్కాలిక ఉపశమనం కొరకు మాలన్ని మృదుపరిచే మందులు(స్టూల్ సాఫెనర్స్) ఇస్తారు. శరీరంలో ఎలెక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీసి, డీహైడ్రేషన్ కు దారితీస్తుంది కనుక, వీటిని ఎక్కువ కాలం పాటు వాడరాదు.

స్టూల్ సాఫెనర్స్ విసర్జకాలకు తేమనందించి, సులువుగా శరీరం నుండి వెలుపలికి వచ్చేటట్లు చేస్తాయి. గర్భిణీ స్త్రీలలో మలబద్దకం కలగడానికి ఐరన్ మాత్రలు తీసుకోవడం ముఖ్య కారణం. ఈ సమస్య నివారణకు స్టూల్ సాఫెనర్స్ ఉపయోగపడతాయి.

వీటిని వైద్యుల సలహా అనుసారం మాత్రమే వాడాలి తప్ప, గర్భధారణ సమయంలో మీ ఇష్టానుసారంగా వాడటం ప్రమాదకరం.

గర్భధారణ సమయంలో మలబద్దకం కలగడం తీవ్రంగా అనిపించినప్పటికి, సర్వసాధారణమైన సమస్య. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా లేదా స్టూల్ సాఫెనర్స్ ఉపయోగించడం ద్వారా దీనిని నివారించడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రసవానంతరం ఈ సమస్య దానంతట అదే కనపడకుండాపోతుంది.

దృఢంగా ఉండండి. మీ జీవితంలో వివిధ దశలలో ఎదురయ్యే వివిధ సమస్యలను ఎంత ధైర్యంగా ఎదుర్కుంటారో, అలానే ఈ సమస్యను కూడా ఎదుర్కోండి. పైన తెలిపిన సులువైన మార్గాలను కూడా పాటించి, మీ ఇబ్బందిని చాలావరకు పరిష్కరించుకోవచ్చు.

English summary

Ways To Cure Constipation Problem During Pregnancy

Pregnancy brings along a lot of physical ailments. One of them being constipation. Blame it on the hormones or your dietary structure, dealing with constipation during pregnancy is a tough job.
Story first published: Tuesday, June 19, 2018, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more