For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  గర్భస్రావం చేయించుకుంటే, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి?

  |

  తల్లి కావడమనేది ఒక మహిళకు ప్రపంచంలో అత్యుత్తమమైన ఆనందం. కానీ కొంతమంది మహిళలు ఈ అదృష్టానికి నోచుకోలేరు. దీనికి వివిధ కారణాలు ఉంటాయి.

  ఒక స్త్రీ శరీరం బిడ్డకు జన్మనివ్వడానికి వీలుగా నిర్మితమై ఉంటుంది. కానీ కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో ఈ గర్భం, తల్లి ప్రాణాలకు గండంగా మారవచ్చు. అటువంటి సందర్భాల్లో ఆమె ప్రాణాన్ని రక్షించడానికి గర్భస్రావం చేస్తారు.

  సాధారణంగా గర్భస్రావం అనేది వైద్యపరమైన కారణాల వలన తల్లి ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలున్నా లేదా ఎటువంటి ప్రణాళిక లేకుండా గర్భం కలగడం వంటి ఇతర కారణాల వలన, గర్భానికి బలవంతంగా ముగింపు పలికే ప్రక్రియ.

  What Are The After Effects Of Abortion?

  నేటి మహిళలు ఏ నిర్ణయాన్ని అయినా కూడా స్వతంత్రంగా తీసుకునే స్థాయిలో ఉన్నారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా , వారు ఊహించని సమయంలో గర్భం ధరిస్తే, ఆ బాధ్యత తలకెత్తుకోవడానికి వారు ఇష్టపడటంలేదు. అటువంటి పరిస్థితులలో వారు గర్భస్రావం చేయించుకోవడానికి కూడా వెనుకాడటం లేదు.

  గర్భస్రావానికి పాలై కారణాలు ఉన్నప్పటికీ, మన దేశంలో ఇప్పటికీ అది బహిరంగంగా చర్చించలేని సున్నితమైన అంశమే! మన పూర్వీకులు ఈ పదాన్ని ఉచ్ఛరించడానికికూడా అసహ్యించుకునేవారు ఎందుకంటే ఇది స్త్రీల శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది.

  వైద్యపరమైన కారణాల వలనైన కాని, లేదా కావాలని చేయించుకున్నా కానీ గర్భస్రావం సరైన పద్దతిలో జరగకపోతే అది మహిళలకు ప్రమాదకరంగా మారుతుంది. గర్భస్రావం అనేక క్లిష్ట సమస్యలతో కూడుకుని ఉంటుంది. ఇవి మహిళలను శారీరక మరియు మానసికంగా కృంగదీస్తాయి.

  గర్భస్రావానంతరం తలెత్తే మార్పుల నుండి కోల్కోవడానికి శరీరానికి సమయం కావాలి. గర్భస్రావం చేయించుకున్న తరువాత తలెత్తే పరిస్థితుల గురించి కొంత అవగాహన కలిగి ఉండటం ఉత్తమం. కనుక వాటిని మీ కోసం అందిస్తున్నాం.

  1) రక్తస్రావం:

  1) రక్తస్రావం:

  గర్భస్రావ ప్రక్రియను డాక్టర్ ప్రారంభించగానే ముందుగా రక్తస్రావం మొదలవుతుంది. రక్తస్రావ పరిమాణం పూర్తిగా గర్భవిచ్చిత్తి ఎన్ని నెలలకు లేదా గర్భమేర్పడిన ఎంత సమయం తరువాత జరిగిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. గర్భధారణ జరిగిన పది వారాల లోపే గర్భస్రావం జరిగితే రక్తస్రావం తక్కువ ఉంటుంది. డాక్టర్ సూచించిన పిల్, మన శరీరం ప్రొజెస్టెరాన్ ను ఉత్పత్తికి చేసే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది, కనుక మన శరీరం గర్భాన్ని కొనసాగించలేదు. గర్భసంచిలో సంకోచ వ్యాకోచాలు మొదలవుతాయి.

  2) పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి:

  2) పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి:

  గర్భస్రావం జరిగినప్పుడు గర్భాశయంలోని కణజాలం రాలడం మొదలై , గర్భాశయం తిరిగి తన సాధారణ పరిమాణానికి చేరుకొనే ప్రక్రియ మొదలవుతుంది. దీని వలన నెలసరి సమయంలో కలిగే నొప్పులు వంటివి ప్రారంభమవుతాయి. మూడవ లేదా నాల్గవ రోజు ఈ నొప్పి అధికమవుతుంది. ఈ రక్తస్రావంలో రక్తం గడ్డకట్టడాన్ని గమనించవచ్చు. ఇది గర్భస్రావం సజావుగా జరుగుతుందని తెలిపే సంకేతం.

  3) ఇన్ఫెక్షన్లు:

  3) ఇన్ఫెక్షన్లు:

  గర్భస్రావానంతరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. ఎందుకంటే గర్భస్రావ సమయంలో తెరుచుకున్న సెర్విక్స్ కనీసం రెండు వారాల పాటు అలానే ఉంటుంది. ఈ సమయంలి వివిధ ఇన్ఫెక్షన్లు మన శరీరంలోనికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. వీటిలో కొన్ని ఇన్ఫెక్షన్లు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్ లను తప్పక తీసుకోవాలి.

  4) హార్మోన్ల అసమతుల్యత:

  4) హార్మోన్ల అసమతుల్యత:

  గర్భస్రావం జరిగిన తరువాత మానవ శరీరంలోని హార్మోన్ వ్యవస్థ గందరగోళానికి లోనవుతుంది. ఈ ప్రక్రియ జరిగిన తరువాత, మహిళలు ఒత్తిడికి గురవడం, బాధపడుతుండటం లేదా ఎంతో ఉపశమనం పొందినట్టు భావించడం జరుగుతుంది. ఇదంతా హార్మోన్ల మాయే! ఈ హార్మోన్ల మూలంగా, గర్భం తొలగించినప్పటికి, గర్భధారణ సమయంలో కలిగే, కడుపులో తిప్పడం,తలనొప్పి, వికారం, తల తిరగడం వంటి భావనలు కలుగుతాయి. గర్భస్రావం జరిగినప్పటికీ, మన హార్మోన్ వ్యవస్థ ఈ విషయాన్ని గ్రహించి సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం అవసరమవుతుంది.

  5) సర్విక్స్ దెబ్బతినవచ్చు:

  5) సర్విక్స్ దెబ్బతినవచ్చు:

  గర్భస్రావం కొరకు సర్వీక్స్ ను బలవంతంగా తెరుచుకునేట్టు చేస్తారు. అలా చేయడం వల్ల కొన్నిసార్లు సర్వీక్స్ కణజాలం దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో సూక్ష్మంగా ఫ్రాక్చర్లు ఏర్పడవచ్చు. ఇవి ఎప్పటికి నయం కాకపోవచ్చు లేదా చికిత్సకై కుట్లు అవసరమవ్వవచ్చు. కొన్ని సందర్భాల్లో సర్విక్స్ తీవ్రంగా దెబ్బతిని భవిష్యత్తులో గర్భం ధరించే అవకాశం లేకుండా చేయవచ్చు.

  6) గర్భసంచి గోడలు దెబ్బతినే అవకాశం ఉంది:

  6) గర్భసంచి గోడలు దెబ్బతినే అవకాశం ఉంది:

  గర్భస్రావ సమయంలో ఉపయోగించే పరికరాల వలన, గర్భసంచికి రంధ్రం పడి దాని గోడలు దెబ్బతినవచ్చు. దీనిని యుటిరైన్ ప్రాలిఫరేషన్ అంటారు. దీనివలన కొన్నిసార్లు తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. సరైన సమయంలో దీనిని నివరించకపోతే ప్రాణాంతక సమస్యగా మారుతుంది. ఒక మహిళలో తిరిగి ఋతుచక్రం మొదలయ్యే సరికి గర్భసంచి పూర్తిగా కొలుకోవాలి. కనుక గర్భస్రావం కొరకై, గర్భసంచికి ఎటువంటి నష్టం కలుగజేయకుండా ప్రక్రియ పూర్తి చేయగల సామర్ధ్యం కలిగిన అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించాలి.

  English summary

  What Are The After Effects Of Abortion?

  Due to certain complications during pregnancy, many women may have to undergo an abortion. Some opt for abortion due to unplanned pregnancies. So once the abortion is done, there are several side effects of the same. For some women, there will be severe bleeding, but this depends on the term of the pregnancy.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more