ప్రీమెచ్యూర్ బర్త్ కి దారితీసే కారణలేంటి?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

గర్భం దాల్చినప్పటి నుంచి గర్భంలో ప్రాణం పోసుకున్న శిశువు ఆరోగ్యంగా ఉండాలని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ దశ ఆరోగ్యకరంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని కోరుకుంటారు గర్భిణీలు. గర్భంలోని పాపాయి ఆరోగ్యకరంగా ఎదగాలని ఆశిస్తారు. ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సరైన సమయానికి కానుపు జరిగి పండంటి బిడ్డకి జన్మనివ్వాలని ఆశిస్తారు.

అయితే, ఈ విషయంలో అందరూ అదృష్టవంతులు కారు. చాలా మంది 40 వారాలు కూడా నిండక ముందే ప్రసవ వేదనకు గురవుతారు. కొన్ని దశాబ్దాల క్రితం, ప్రీ టర్మ్ బర్త్ అంటే శిశువు ప్రాణానికే ప్రమాదమన్న ఆలోచనా ధోరణి ఉండేది. అలాగే తల్లి ప్రాణానికి కూడా ప్రమాదమని భావించేవారు.

What causes premature birth?

అదృష్టవశాత్తూ, సైన్స్ మరియు మెడిసిన్ లు ఎంతో అభివృద్ధి చెందడంతో ప్రీటెర్మ్ బేబీస్ కూడా ఎంతో ఆరోగ్యంగా అలాగే నార్మల్ గా ఉంటున్నారు.

అయితే, ప్రీ టర్మ్ లేబర్ కి దారితీసే ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటి వలన ప్రీమెచ్యూర్ బర్త్ ని అరికట్టే జాగ్రత్తలు తీసుకోవడాంతో పాటు ప్రీమెచ్యూర్ బర్త్ కి దారి తీసే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

• యుటెరస్ మరియు సెర్విక్స్ లో అబీనార్మాలిటీస్

• యుటెరస్ మరియు సెర్విక్స్ లో అబీనార్మాలిటీస్

కొంతమంది గర్భిణీలలో డెలివరీకి ఇంకా చాలా సమయం ఉన్నా కూడా యుటెరస్ కాంట్రక్షన్స్ ప్రారంభం అవుతాయి. ఇది ప్రీమెచ్యూర్ బర్త్ కి దారి తీస్తుంది. మరికొంత మందిలో, యుటెరస్ షేప్ అబ్నార్మల్ గా ఉంటుంది లేదా సెర్విక్స్ అనేది ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ చివరి వరకు క్లోజ్ అయి ఉండటం జరగదు. ఇటువంటి సందర్భాలలో, డాక్టర్లు, బెడ్ రెస్ట్ ను అలాగే కొన్ని మెడిసిన్స్ ను సూచిస్తారు. ఇవి డెలివరీ ని ఎంత వీలయితే అంత పొడిగిస్తాయి.

• జెనిటలియా వద్ద ఇన్ఫెక్షన్స్:

• జెనిటలియా వద్ద ఇన్ఫెక్షన్స్:

గర్బిణీలలో జెనిటల్స్ వద్ద ఇన్ఫెక్షన్స్ తలెత్తితే ప్రీమెచ్యూర్ బర్త్ కి దారితీసే ప్రమాదం ఉంది. బాక్టీరియల్ వెజినోసిస్ లేదా బీవీ అనే ఇన్ఫెక్షన్ ప్రీ టర్మ్ లేబర్ తో సాధారణంగా అసోసియేట్ అయి ఉండే ఇన్ఫెక్షన్. కానుపు తరువాత తల్లికి ఎండోమెట్రియోసిస్ అనే సమస్య కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది.

• ప్రీమెచ్యూర్ బర్త్ కి చెందిన హిస్టరీ

• ప్రీమెచ్యూర్ బర్త్ కి చెందిన హిస్టరీ

మీ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలోని ప్రీమెచ్యూర్ బర్త్ ని మీరు ఎక్స్పీరియెన్స్ చేస్తే మళ్ళీ మీరు అటువంటి కానుపుని ఎక్స్పీరియెన్స్ చేసే ప్రమాదం ఉంది. ఇంతకు ముందు ప్రీమెచ్యూర్ బేబీ కలిగినట్లయితే, ఇప్పుడు తక్కువ బరువుతో బేబీ పుట్టడం లేదా కానుపులో బేబీ మరణించడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చు. వైద్యునితో మాట్లాడితే మీకు ప్రికాషనరీ మెజర్స్ తో పాటు వాడవలసిన మెడిసిన్స్ గురించి కూడా అవగాహన వస్తుంది. తగు జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు.

• మిస్ క్యారేజ్:

• మిస్ క్యారేజ్:

గతంలో మీకు మిస్ క్యారేజ్ జరిగి ఉండుంటే, ప్రీ మెచ్యూర్ బేబీ కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం వలన ప్రెగ్నెన్సీలోనే బేబీని కోల్పోయే ప్రమాదాలు ఎక్కువ.

• అబార్షన్:

• అబార్షన్:

గతంలో మీరు అబార్షన్ చేయించుకున్నప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో ప్రీ టర్మ్ బేబీని కనే ప్రమాదాలు ఎక్కువ. అబార్షన్ జరిగిన ఆరు నెలల్లో గర్భం దాల్చితే ఈ ప్రీ మెచ్యూర్ బేబీని కనే ప్రమాదపు స్థాయి మరింత ఎక్కువ. అలాగే, బేబీ ఎదుగుదలలో కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి.

• మల్టిపుల్ బేబీస్:

• మల్టిపుల్ బేబీస్:

మీ గర్భంలో ట్విన్స్ లేదా మల్టిపుల్ బేబీస్ ఉన్నట్టయితే వారు డెలివరీ డేట్ కంటే ముందే జన్మించే అవకాశం ఉంది. ట్విన్స్ విషయంలో 60 శాతం కంటే ఎక్కువగా ప్రీమెచ్యూర్ బర్త్ కే అవకాశం ఉంది. ట్రిప్లెట్స్ అయితే, ఈ స్టాటిస్టిక్స్ 90 శాతం వరకు పెరుగుతాయి. 36 వారాలకు ట్విన్స్ జన్మించవచ్చు. ట్రిప్లెట్స్ అయితే 32 వారాలకే జన్మించవచ్చు. మరోవైపు క్వాడ్రాప్లెట్స్ అయితే 30వ వారం పూర్తవకముందే జన్మించే అవకాశాలున్నాయి.

రెగ్యులర్ చెక్ అప్స్ కోసం వైద్యున్ని సంప్రదించి తగిన కేర్ ను తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన కాన్పు జరిగే అవకాశం ఉంది.

• ఫ్యామిలీ హిస్టరీ:

• ఫ్యామిలీ హిస్టరీ:

మీకు దగ్గరివారైన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిస్తే మీరు కూడా ప్రీమెచ్యూర్ లేబర్ ని ఎక్స్పీరియెన్స్ చేయవలసిన సూచనలు కలవు. మీరు ప్రీమెచ్యూర్ బేబీ అయితే, ప్రీమెచ్యూర్ బేబీని డెలివరీ చెసే ప్రమాదం కూడా ఎక్కువే. మీ వైద్యునికి ఈ విషయానికి సంబంధించిన ఫ్యామిలీ హిస్టరీని తెలియచేస్తే తగిన సూచనలు మీకు అందుతాయి.

• జెనెటిక్స్:

• జెనెటిక్స్:

గెస్టేషన్ డ్యూరేషన్ లో జీన్స్ ముఖ్య పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. బ్లాక్ యత్నేసిటీకి చెందిన వారిలో ప్రీమెచ్యూర్ బేబీస్ కి జన్మనిచ్చే అవకాశం 17 శాతం ఉండవచ్చు. మరోవైపు, కాశేషియన్ వుమెన్ లో ఇది 10 శాతం మాత్రమే. ఒకవేళ మీరు ప్రీమెచ్యూర్ కి జన్మనిచ్చే అవకాశం ఎక్కువ ఉన్న గ్రూప్ కి చెందినవారైతే మీరు మీ మెడికల్ ప్రాక్టీషనర్ సలహాలను పాటించి ఆరోగ్యంగా ఉండటం మంచిది.

• తల్లి యొక్క వయసు:

• తల్లి యొక్క వయసు:

ప్రీ టర్మ్ లేబర్ కి గర్భిణీ వయసు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. 14 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్యనున్న టీన్ మదర్స్ లో ఈ ప్రేటెర్మ్ లేబర్ కి దారి తీసే ప్రమాదం ఎక్కువ. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న టీన్ మదర్స్ లో ఈ రిస్క్ అనేది కాస్తంత తగ్గే అవకాశం ఉంది. 35 ఏళ్ళ వయసు దాటిన మహిళల్లో ఈ ప్రమాదం స్థాయి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. 39 ఏళ్ళ లోపు మహిళలు సరైన విధంగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలో సమస్యల బారిన పడే ప్రమాదం తగ్గే అవకాశాలున్నాయి. 40 ఏళ్ళ తరువాత ప్రీమెచ్యూర్ బర్త్స్ రిస్క్ విపరీతంగా పెరుగుతుంది.

• గర్భిణీలపై ఒత్తిడి చూపే ప్రభావం:

• గర్భిణీలపై ఒత్తిడి చూపే ప్రభావం:

గర్భిణీలు ప్రశాంతంగా ఉండాలి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈ విషయాన్నే పెద్దవాళ్లు పదే పదే గుర్తుచేస్తూ ఉంటారు. దీనికొక కారణం ఉంది, శరీరం ఒత్తిడికి గురయినప్పుడు ఎపినెఫ్రాయిన్ మరియు కార్టీసాల్ లు ఉత్పత్తి అవుతాయి. ఇది కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ను ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్ అనేది ప్రోస్టాగ్లాండిన్స్ మరియు ఇస్ట్రియల్ స్థాయిలను పెంచుతాయి.

ఇవన్నీ ప్రీమెచ్యూర్ బర్త్ కి దారితీస్తాయి. ప్యానిక్ వలన కలిగే ఇంఫ్లేమేషన్ కూడా ప్రెగ్నెన్సీ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అందువలన ప్రీ టర్మ్ లేబర్ కి దారితీయవచ్చు. అందువలన, శరీరంలో పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. ఇవన్నీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వలన ఏర్పడతాయి.

• రెండు ప్రెగ్నెన్సీల మధ్య చాలా తక్కువ గ్యాప్:

• రెండు ప్రెగ్నెన్సీల మధ్య చాలా తక్కువ గ్యాప్:

ప్రెగ్నెన్సీ వలన శరీరంలో ఎన్నో పోషకాలు కోల్పోతారు. బ్రెస్ట్ ఫీడింగ్ వలన కూడా శరీరం వీక్ గా మారిపోతుంది. అందువలన, మరొక ప్రెగ్నెన్సీ కి తయారవ్వాలంటే శరీరం పూర్తిగా కోలుకోవాలి. మరొక బేబీకి జన్మనివ్వడానికి రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా పూర్తిగా కోలుకోవాలి. కానుపు అయిన కొంత కాలానికే మళ్ళీ కన్సీవ్ అయితే ప్రీ టర్మ్ బర్త్ కి దారితీసే ప్రమాదం ఉంది. సెకండ్ ప్రెగ్నెన్సీకై ప్రయత్నించే వారు కనీసం 18 నెలల గ్యాప్ ను మెయింటెయిన్ చేయడం మంచిది. ఈ సమయంలో మీ శరీరం తాను కోల్పోయిన పోషకాలను పొందుతుంది.

• స్మోకింగ్, డ్రింకింగ్ అలాగే సెకండ్ హ్యాండ్ స్మోక్ కు దూరంగా ఉండండి:

• స్మోకింగ్, డ్రింకింగ్ అలాగే సెకండ్ హ్యాండ్ స్మోక్ కు దూరంగా ఉండండి:

ప్రెగ్నెంట్ అయినప్పుడు లైఫ్ స్టయిల్ చేంజెస్ ను పాటించాలి. గర్భంలోని శిశువు ఎదుగుదల ఆరోగ్యంగా ఉండే విధంగా మీ లైఫ్ స్టయిల్ లో మార్పులను చేసుకోవాలి. స్మోకింగ్ లేదా డ్రింకింగ్ హ్యాబిట్స్ వలన ప్రీటెర్మ్ లేబర్ కి గురయ్యే ప్రమాదం ఉంది. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా ప్రీమెచ్యూర్ లేబర్ కి దారితీసే ప్రమాదం ఉంది. అందువలన, మీ పార్ట్నర్ కూడా లైఫ్ స్టయిల్ హేబిట్స్ ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

English summary

What causes premature birth?

There are few deliveries that happen before the due date. There are several causes for the same. More than 7 percent of pregnant mothers will develop preeclampsia during their pregnancy. It commonly develops after the 4th month or the 20th week. This symptom can lead to high blood pressure and a high protein content.
Story first published: Monday, May 7, 2018, 15:30 [IST]