ఐవిఎఫ్ లో ఏం జరుగుతుంది?

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఏదో ఒక సందర్భంలో పిల్లలు కావాలనే ఆత్రం ప్రతీ దంపతులకు కలుగుతుంది.కొన్ని రోజుల క్రితం దాకా ప్రకృతి సహజమైన పద్ధతి తప్ప పిల్లలని కనడానికి వేరే మార్గం ఉండేది కాదు.భార్య, భర్త ఎవరికైతే పిల్లలు కావాలనే తాపత్రయం ఉండేదో, వాళ్ళు తమ పూర్వీకులని మెప్పించడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతూ, పూజలు అవి చేసేవారు.

what is IVF

అదృష్టవశాత్తూ,టెక్నాలజీ అభివృద్ది చెందడం వల్ల దంపతులు ఇంక మన కర్మ ఇంతే అని వదిలేయకుండా ఒక మంచి అవకాశం దొరికింది.ఐ వి ఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణ ప్రక్రియ, పిల్లల ప్రేమ పొందడానికి ఉన్న చాలా పద్దతులలో ఒకటి. ఐ వి ఎఫ్ లో ఉన్న ఇంకో ప్రయోజనం ఏంటంటే, మహిళలు ఐ వి ఎఫ్ ద్వారా పిల్లల్ని తమ భర్తలు లేదా ఏ మగవాడి సహకారం లేకుండానే కనచ్చు.

ఐ వి ఎఫ్ అంటే ఏంటి?

ఐ వి ఎఫ్ అంటే ఏంటి?

ఐ వి ఎఫ్ పద్దతిలో మహిళల అండాన్ని తీసేసి ,భర్త కాని లేదా ఎవరైన దాతలు ఇచ్చిన వీర్యంతో డాక్టర్ల సమక్షంలో ప్రయోగశాలలో ఫలదీకరణ చేస్తారు.ఆ ఫలదీకరించిన పిండాన్ని కాబోయే తల్లి గర్భంలో పెడతారు.ఆ పిండం అప్పుడు ఆ తల్లి గర్భంలో బిడ్డ పుట్టే దాకా అభివృద్ధి చెందుతుంది.

ఈరోజు మనం ఈ ఐ వి ఎఫ్ లో ఉన్న పలు విధానాలని, ఐ వి ఎఫ్ అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం....

ఐ వి ఎఫ్ తీసుకోడానికి సరైన వ్యక్తా కాదా?

ఐ వి ఎఫ్ తీసుకోడానికి సరైన వ్యక్తా కాదా?

ఐ వి ఎఫ్ తీసుకోడానికి మొదటి అడుగు, మీరు దానికి అర్హులా కాదా అని తెలుసుకోవడం.మీరు ఒకవేళ అర్హులు కాకపోతే, మీరు ఈ చికిత్సని పొందలేరు మరియు వేరే విధానాల ద్వారా పిల్లల్ని ప్రయత్నించాల్సిందే. ఐ వి ఎఫ్ ప్రయత్నించడానికి కావాల్సిన అర్హత ఏంటంటే:తక్కువ వీర్య కణాలున్న పురుషులు.

ఐ వి ఎఫ్ నుంచి ఎవరు ఉపసంహరించుకోవచ్చు

చాల మంది దంపతులకి ఐ వి ఎఫ్ విజయవంతమైన విధానం కాకపోవచ్చు.

మీరు దాతల అండాలు వాడటం ఇష్టపడకపోతే మరియు మీ అండాలు అనారోగ్యకరమైనవి అయితే, ఐ వి ఎఫ్లో మీరు వైఫల్యం పొందచ్చు.

ఒకవేళ మీరు 37 ఏళ్ళకంటే ఎక్కువ వయస్సువారు అయ్యుంటే, ఐ వి ఎఫ్ ద్వారా విజయం అందుకోవడానికి కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహిళలలో 40 సంవత్సరాలు దాటాక ఆండోత్పత్తి తగ్గిపోతుంది.

మీరు 40 లేదా 40 ఏళ్ళ పైబడ్డాక గర్భం దాల్చినా, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కణితులు, అసాధారణ హార్మోన్ స్థాయిలు, అండాశయం పనిచేయకపోవడం,గర్భాశయం యొక్క అసాధారణతలు తదితర అంశాలు ఉన్నవారు ఐ వి ఎఫ్ ద్వారా విజయం పొందే అవకాశాలు తగ్గిస్తాయి.

ప్రకృతి సహజమైన పద్దతిని రెండేళ్ళకి పైగా ప్రయత్నించి విఫలమైన దంపతులు.

కృత్రిమ గర్భధారణ ప్రయత్నించి విఫలమైన దంపతులు.

ఫెలోపియన్ నాళాలు మూసుకుపోయిన , లేదా అసలు లేని మహిళలు. అలాంటి కేసుల్లో ఐ వి ఎఫ్ ఖచ్చితంగా సహాయం చేస్తుంది, ఎందుకంటే అది ఫెలోపియన్ నాళాలను బైపాస్ చేస్తుంది.

సంతానోత్పత్తి సమస్యలైన ఎండోమెట్రియొసిస్ మరియు పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్(పిసివోస్) ఉన్న మహిళలు.

రుతు చక్రం అసాధారణంగా ఉన్న మహిళలు. ఇలాంటి సంధర్భాల్లో అండాల ఉత్పత్తి మరియు ఆరోగ్యకరమైన అండాలని మందులు పంపించి నియంత్రిస్తారు.

అనారోగ్యకరమైన అండాలు ఉన్న మహిళలు, తమ భర్త వీర్య కణాల కలయికలో దాతల అండాలని వాడచ్చు.

ఐ వి ఎఫ్ యొక్క వివరణాత్మక విధానం

ఐ వి ఎఫ్ యొక్క వివరణాత్మక విధానం

ఒక విడత ఐ వి ఎఫ్ చికిత్సని ఐ వి ఎఫ్ చక్రం అంటారు.ఐ వి ఎఫ్ చక్రం మీ ఋతు క్రమం మొదటి రోజు నుంచి మొదలవుతుంది.మీకు సంతానోత్పత్తి ప్రణాళిక ఇవ్వబడుతుంది,దాని ప్రకారంగా మీకు ఋతుక్రమం రాకముందే మందులు ఇస్తారు.

మొదటి రోజు:

మొదటి రోజు:

మీ ఋతు క్రమంలో రోజు మీ చికిత్సకి మొదటి రోజు.ప్రతి శరీరం మందులకి ఒక్కోలాగా స్పందిస్తుంది.మొదటి రోజున మీ పరిస్థితిని తెలుసుకోడానికి వైద్యులు మరియు నర్సులు సహాయం చేస్తారు.

ప్రేరణ దశ:

ప్రేరణ దశ:

మీ మొదటి రోజున ప్రేరణ దశ మొదలవుతుంది.ఈ దశలో మందులు మీ అండాశయాన్నిప్రేరేపించి, గ్రీవములను ఎక్కువ అండాలు పెట్టే విధంగా ఉత్తేజపరుస్తాయి.ఈ మందులు 8-14 రోజుల వరకు ఉండే విధంగా ఇస్తారు.సాధారణమైన ఋతు చక్రంలో, శరీరం నెలకి ఒక ఆండం మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

అవసరాలను బట్టి మందులు మనిషి మనిషికి మారుతాయి.మందులు ఇంజెక్షన్ రూపంలో ఋతు క్రమానికి ఒకటి, రెండు సార్లైన లేక రోజుకు ఒకటి,రెండు సార్లైనా ఇవ్వడం జరుగుతుంది.మీకు ఇంజెక్షన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇవ్వాలో మీ డాక్టరు వివరంగా నేర్పిస్తారు.మీ భర్త కూడా ఈ ప్రక్రియలో పాల్గోవచ్చు.

మీ అండాల పెరుగుదల గురించి మీరు జగ్రత్తగా గమనించబడతారు.మీకు కొన్ని రక్త పరీక్షలు , మరియు కొన్ని అల్ట్రాసౌండ్ స్కాన్ లు చేయించుకోవాల్సి రావచ్చు.

చివరిలో మీకు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తారు.ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అండాలని అండోత్సర్గంకి లేక విడుదలకి తయారుచేస్తుంది.అండోత్సర్గంకి ముందే అండాలని తీసేస్తారు.అండాన్ని తిరిగి తీయడం

అండాన్ని తిరిగి పొందడం లేక అండాన్ని తీసే విధానం ఇంట్లో జరుగుతుంది.ఈ విధానంలో, అండాలని అండాశయం నుంచి తీసేస్తారు.మీకు జన్యుపరమైన మత్తుమందు ఇవ్వడంతో ఒక అరగంట వరకు మీకు స్పృహ ఉండదు.

అల్ట్రాసౌండ్ పద్దతి ద్వారా ఒక సూది ని అండాశయంలోకి పంపించి, అండాలని అండాశయంలోని గ్రీవము నుంచి తీయబడతాయి.ఒకేసారి షుమారు 8-15 అండాల వరకు తీయవచ్చు.

చికిత్స అయిపోయిన తరువాత మీకు ఏ విధమైన నొప్పి ఉండదు మరియు హాస్పిటల్ నుంచి ఇంటికి మీరొక్కరే కూడా వెళ్ళిపోవచ్చు.ఇంటికి వెళ్ళే ముందు ఒక 30 నిమిషాలు విశ్రమించాలి.ఈ చికిత్సకి మీతో పాటు ఇంకొకరు తోడుగా వస్తే ఉత్తమం.

వీర్యకణాన్ని తీయడం

వీర్యకణాన్ని తీయడం

మీ భర్త వీర్యాన్ని ఉత్పత్తి చేసి, అండాన్ని తీసుకున్న రోజే హాస్పిటల్లో ఇచ్చేయాలి.ఒకవేళ మీరు దాతలు ఇచ్చిన వీర్యాన్ని వాడాలనుకుంటే, హాస్పిటల్ వాళ్ళ దగ్గర ఘనీభవించిన వీర్య కణాలు ఉంటాయి.

ఈ వీర్య కణాలన్నీ వాటి నాణ్యత బట్టి శ్రేణీకృతం చేస్తారు.తరువాత ఆ వీర్య కణాలన్నీ ఒక ప్రత్యేకమైన మిశ్రమంతో కడుగుతారు.ఇది వీర్య కణాల యొక్క వేగం తగ్గిస్తుంది.ఇలా చేయడం వలన డాక్టర్ కి ఆరోగ్యకరమైన వీర్య కణం కనుక్కోడానికి వీలవుతుంది.అప్పుడు అవి తీసి అండాల కోసం పక్కన పెడతారు.

ఫలదీకరణం

ఫలదీకరణం

ఈ వీర్య కణాన్ని మరియు అండాన్ని ఒక పెట్రీ గిన్నెలో పెడతారు.ఇక్కడ, సహజంగా జరిగే విధంగానే వీర్యకణం ,అండాన్ని వెతుక్కుంటుంది.ఈ పద్దతిని ఫలదీకరణం అంటారు.

పిండం అభివృద్ది చెందడం

పిండం అభివృద్ది చెందడం

ఫలదీకరణం విజయవంతంగా జరిగితే, పిండం ఉత్పత్తి అవుతుంది.అప్పుడు డాక్టర్ ఆ పిండాన్ని ఇంక్యుబేటర్లో ఎదుగుదలకి వాంఛనీయ పరిస్థితులలో పెడతారు.పిండాలు అక్కడ 5-6 రోజుల దాక పెడతారు.డాక్టరు రెండో రోజు 2-4 కణాల పిండం మరియు మూడో రోజు 6-8 కణాల పిండం కోసం చూస్తారు.

ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని పిండాలు ఈ దశ దాకా రాకపోవచ్చు.

పిండాన్ని ప్రతిష్ఠించుట

పిండాన్ని ప్రతిష్ఠించుట

ఒకవేళ పిండం ప్రయొగశాలలో అభివృద్ది చెందితే, అవి గర్భంలో ప్రతిష్ఠించటానికి తయారైపోయినవి. మీ డాక్టర్ మీకు పిండాలు తీసుకోడానికి ఎలా తయారవ్వాలో ముందే చెప్తాడు.చికిత్సా విధానం ముందు మూత్రాశయం మొత్తం నిండడానికి చాలా నీళ్ళు తాగాలి.అల్ట్రాసౌండ్ టెక్నాలజి వాడి పిండ ప్రతిష్ఠ కి సరైన స్థానాన్ని కనుక్కుంటారు.

ప్రతిష్ఠ 5 నిమిషాల కంటే తీసుకోదు.మత్తుమందు ఏమి ఇవ్వరు, ప్రతిష్ఠ అయిపోయిన వెంటనే లేచి నిలబడచ్చు కూడా.మీరు నడిచినా, బాత్ రూంకి వెళ్ళినా పిండం బయట పడటం లేదా పక్కకి జరగడం లాంటివి జరగవు.

పిండాన్ని కాథెటర్లో ఉంచి, సెర్విక్స్ ద్వారా మీ గర్భాశయంలో పెట్టబడుటుంది.అప్పుడు గర్భసంచి లో అది ఎంపిక చేసుకున్న స్థానం లో పెడతారు.

రక్త పరీక్ష

రక్త పరీక్ష

పిండం పెట్టాక రెండు వారాలు ఆగమంటారు.రెండు వారాలయ్యాక హెచ్ సి జి స్థాయిలు చూడటం కోసం రక్త పరీక్ష చేయిస్తారు.హెచ్ సి జి గనుక మీ రక్తంలో ఉంటే మీరు మీ బిడ్డతో గర్భిణి అయినట్టే.

English summary

what is IVF | step by step process of IVF | who should opt for IVF

Today, the technology has advanced so much that a couple need not resolve to their fate and can give it a good challenge. IVF, or in vitro fertilization, is one of the many options that a couple can make use of to finally feel a baby's love.
Story first published: Friday, January 5, 2018, 16:30 [IST]