స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు శరీరంలో ఇతర అవయవాలకి ఏం జరుగుతుందో తెలుసా?

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మనం ఎవరైనా గర్భవతిగా ఉన్నవారిని చూసినప్పుడు వారి ముందుకు పెరిగిన పెద్ద కడుపు మరియు ఆమె ముఖంపై గర్భం వలన వచ్చిన కాంతి తప్పక గమనిస్తాం. కానీ ఆమె శరీరంలో లోపల ఏం జరుగుతుండచ్చో అని ఒక్కసారి కూడా ఊహించము. ఒక స్త్రీ శరీరం అద్భుతాలకు నిలయం.

కడుపుతో ఉన్నప్పుడు ఆమె శరీరం శారీరకంగా, మానసికంగా మరియు భావనాపరంగా అనేక పెద్ద మార్పులకు గురవుతుంది. శరీరంలో ప్రతి భాగం, అవయవం ఏదో ఒక రకంగా ప్రభావితం అవుతాయి – కొన్ని మిగతావాటికంటే ఎక్కువగా అవుతాయి.

What Happens To Your Organs During Pregnancy

గర్భసమయంలో అన్నిటికన్నా ఎక్కువ కష్టమైన భాగం పురుటి నెప్పులు, బిడ్డ పుట్టటమేనని మీరు అనుకోవచ్చు. కానీ నిజం ఏమిటంటే గర్భవతిగా ఉన్న 9 నెలల సమయం మొత్తం కడుపుతో ఉన్న స్త్రీ శరీరం పై పెద్ద ప్రభావమే కలిగిస్తుంది.

ఈ ప్రక్రియలో అవయవాలు, లోపలివి మరియు బయటవి రెండూ చాలా అలసిపోతాయి. ముఖ్యంగా ఛాతీ భాగంలోని అవయవాలు నెప్పితో సన్నని శబ్దాలు చేస్తూ మరియు మీరు ఊహించలేనంత,అసాధ్యం అనుకునే స్థాయిలో మెలికలు పడుతూ మామూలు రూపం నుంచి కొత్త ఆకారం పొందుతాయి.

ఈరోజు, మనం గర్భవతుల్లో చాలా ప్రభావితమయ్యే ఈ అవయవాలకి ఏ మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం. అలాగే బిడ్డ పుట్టేసాక,తిరిగి స్వస్థత పొందే క్రమంలో ఈ మార్పులను మానేజ్ చేసుకోటానికి మీకు ఉపయోగపడే చిట్కాలను కూడా చర్చిద్దాం.

డెలివరీ తర్వాత ఈ అవయవాలు తిరిగి తమ అసలు స్థితికు ఎలా వస్తాయో కూడా చూద్దాం.

చర్మం

చర్మం

చర్మం శరీరం లోపలి అవయవం కాకపోవచ్చు;కానీ అది కూడా ప్రెగ్నెన్సీ వల్ల అంతే ప్రభావితమవుతుంది. శరీరంలో చర్మం అతిపెద్ద అవయవం మరియు బయట వాతావరణాన్ని ఎదుర్కొనే మొదటి అవయవం కూడా చర్మమే.చాలా కేసుల్లో, గర్భం దాల్చినప్పుడు మార్పులు ప్రస్ఫుటంగా కన్పించే మొదటి శరీర భాగం చర్మమే.

స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు చర్మంపై ఎలాంటి హార్మోన్ ప్రభావాలు కన్పిస్తాయో, ఇప్పుడు కూడా అలానే కన్పిస్తాయి. కాకపోతే ప్రెగ్నెన్సీ సమయపు హార్మోన్లు తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. గర్భసమయంలో చర్మం పాడయినట్టు కన్పించచ్చు లేదా ఇంకా కాంతిగా మెరిసిపోవచ్చు.

గర్భవతిగా ఉన్నప్పుడు చర్మం రంగుతో మచ్చలలాగా కూడా కన్పించవచ్చు. బిడ్డ పుట్టేసాక చాలామంది స్త్రీలలో మొటిమలు వస్తాయి,పైగా తొందరగా పోకుండా బాధిస్తాయి.చర్మంపై మచ్చలు లేదా స్ట్రెచ్ మార్క్స్ కూడా నెలలు నిండుతున్నకొద్దీ పెరుగుతాయి.

చిట్కా ; చర్మాన్ని అన్నివేళలా తేమగా మాయిశ్చరైజ్ చేసుకుని ఉంచటం వలన కడుపుతో ఉన్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్ మరియు మొటిమలు రాకుండా ఉంటుంది. బాగా నీరు తాగుతూ ఉండండి.

మూత్రాశయం

మూత్రాశయం

మానవ శరీరంలో ఎక్కువ ప్రభావితమయ్యే మరో అవయవం మూత్రాశయం. ఇంతకు ముందు పిల్లల్ని కన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కడుపుతో ఉన్నప్పుడు పదేపదే బాత్ రూంకి వెళ్ళాల్సి రావటం,పదినిమిషాలకోసారి ఆ ఫీలింగ్ కలగటం జరుగుతుందని.

ఇది ఎందుకంటే గర్భాశయంలో మీ బేబీ ఉండటం వలన స్థలం సరిపోక మీ మూత్రాశయం కొంచెం వత్తబడినట్లవుతుంది. తక్కువ స్థలం ఉండటంలో తక్కువ మూత్రమే ఉండగలదు, అందుకని మీరు వెంటవెంటే బాత్ రూంకి వెళ్ళాల్సి ఉంటుంది.

చెడ్డ విషయం ఏంటంటే బ్లాడర్ పై నియంత్రణ తగ్గటం. నెలలు నిండే సమయంలో తల్లి మరీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా కొంచెం పెద్దగా నవ్వినప్పుడు కూడా తెలీకుండానే కొంచెం యూరిన్ పాస్ చేస్తుంది.

చిట్కాః మీరు అన్నివేళలా బాత్రూం కి తిరగకుండా నీళ్ళు తక్కువ తాగాలని అన్పించవచ్చు కానీ మీకూ, మీ బేబీకి సరిపడా నీరు తాగటం చాలా అవసరం గుర్తుంచుకోండి.

పేగులు

పేగులు

పేగులు కడుపు కింద, బ్లాడర్ పైన ఉండే పైపులలాంటి ఒక నెట్ వర్క్. ఇవి పొట్టలో కదలకుండా అమర్చబడి ఉంటాయి. గర్భాశయ సైజు పెరుగుతున్నప్పుడు, పేగులు వెనక్కి నెట్టబడి కొంచెం పైకి జరుగుతాయి. ఆ కదలికల్లో వచ్చే సన్నని శబ్దాలు, కదలికలు టాయిలెట్ వెళ్ళటంలో సమస్యలు కలిగించవచ్చు.

ప్రతి స్త్రీ మరియు ఆమె డైట్ ను అనుసరించే పద్దతిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా మలబద్ధకం నుంచి డయేరియా వరకు ఏమైనా ఎదుర్కోవలసి రావచ్చు.

చిట్కా; చాలా పీచు ఉండే ఆహారపదార్థాలు ఎక్కువ తీసుకోండి. దీనివల్ల టాయిలెట్ కు సులభంగా వెళ్ళగలరు. మలం సులభంగా పేగుల్లో కదలటానికి సాయపడుతుంది. మీరు మలబద్ధకాన్ని తగ్గించే విరోచనం మందులు కూడా తీసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో ఏ మందు వాడినా ముందు డాక్టర్ సలహా తీసుకోండి.

ఊపిరితిత్తులు

ఊపిరితిత్తులు

ప్రతి మనిషికి ఊపిరితిత్తులు చాలా ముఖ్యం. కానీ కడుపుతో ఉన్నప్పుడు ఊపిరితిత్తులకి కూడా వ్యాకోచించే గర్భాశయం మరియు బేబీ కదలికల వలన తక్కువ స్థలమే దొరుకుతుంది. పొట్టి స్త్రీలకు మరింత సమస్యగా ఉంటుంది ఎందుకంటే వారి ఛాతీలో తక్కువ స్థలం ఉంటుంది. అందుకే చిన్న చిన్న పనులకి కూడా కడుపుతో ఉన్నవారు ఆయాసపడుతుంటారు. రాత్రిపూట నిద్రలేమి మరియు శ్వాస అందకపోవటం కూడా సాధారణమే. డాక్టర్ తో మీ సమస్యలు చర్చించండి.

చిట్కా ; సరైన విశ్రాంతి తీసుకుని అతిగా ఏ పనీ చేయవద్దు.

జీర్ణాశయం

జీర్ణాశయం

ఈ అవయవం మీ ఆహారాన్ని జీర్ణం చేసే స్థలం. ప్రెగ్నెన్సీ జీర్ణాశయాన్ని కూడా కుచించేలా చేస్తుంది. స్థలం తక్కువగా లభించటం వలన వికారం, అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కడుపులోని స్పింక్టర్ కండరాలు ప్రెగ్నెన్సీ హార్మోన్ల వలన వదులవుతాయి. దీని వలన ఆహారం వెనక్కి తన్నటం, గుండెల్లో మంట మరియు పొద్దునపూట వికారంతో వచ్చే వాంతులు ఇలాంటివన్నీ కలుగుతాయి.

చిట్కా; తక్కువ మొత్తాల్లో ఆహారం తీసుకోవటం కూడా గుండెల్లో మంటకి దారితీస్తుంది. కడుపులో యాసిడ్లను బ్యాలెన్స్ చేయటానికి సరైనంత నీరు తాగుతుండండి.

కిడ్నీలు

కిడ్నీలు

కిడ్నీలకి కూడా ఎక్కువ స్థలం ఉండదు. కానీ స్థలం లేకపోవటం వల్ల దీనికి సమస్యలు రావు. కిడ్నీలకి ఉండే ఒత్తిడి మీ యొక్క మరియు మీ బేబీ వ్యర్థపదార్థాలు రెండిటినీ వడబోయటం. పని రెట్టింపవటం వలన కిడ్నీలు ఎక్కువ పనిచేసి అలసిపోతాయి.

చిట్కా ;కిడ్నీలపై ఎక్కువ వత్తిడి లేకుండా ఎక్కువ నీరు తాగుతుండండి.

గర్భాశయం

గర్భాశయం

కడుపుతో ఉండటం వలన గర్భాశయమే ముఖ్యంగా అనేక మార్పులకి గురవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీ బేబీ మీలో పెరుగుతున్నప్పుడు ఇదే దానికి ఇల్లులాగా మారుతుంది. నిజానికి గర్భాశయం మీ పిడికిలి అంత సైజులోనే ఉన్నా, డెలివరీ అయ్యే సమయానికి అంతకు చాలా రెట్లు పెరిగిపోతుంది. అన్ని నెలలు మీ బిడ్డను మోసిన అంత గొప్ప ఫీట్ తర్వాత గర్భాశయం మళ్ళీ తన అసలైన పరిమాణానికి తిరిగొస్తుంది.

చిట్కా ; బిడ్డ పుట్టేసమయంలో తర్వాత గర్భసంచి యొక్క సంకోచవ్యాకోచాలు చాలా నొప్పిని కలిగిస్తాయి. వాటిని తగ్గించటానికి మీరు గోరువెచ్చని నీరును తాగుతుండవచ్చు.

క్లోమం

క్లోమం

పెరుగుతున్న గర్భసంచికి అడ్డుతొలగాల్సిన అవయవాలలో క్లోమగ్రంధి కూడా ఒకటి. దీనికి ఉన్న అదనపు బాధ్యత ఆహారంలో పిండిపదార్థాలను,చక్కెరలను విడగొట్టడం. కడుపుతో ఉన్నప్పుడు స్త్రీల రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. క్లోమం తన పని తాను సరిగ్గా చేయలేకపోతే, గర్భవతులు ఇన్సులిన్ మందులు తీసుకోవాల్సి వస్తుంది.

చిట్కా ; మీకు రక్తంలో అధిక చక్కెర ఉంటే కడుపుతో ఉన్నప్పుడు చక్కెర మరియు కొవ్వు పదార్థాలు తీసుకోవటం తగ్గించాల్సి ఉంటుంది.

వెన్ను

వెన్ను

వెన్నెముక శరీరం మొత్తాన్ని నిలబెట్టి, నిటారుగా ఆకారాన్ని ఇస్తుంది. దీనిలోని వెన్నుపాము మెదడుకు కూడా సాయపడుతుంది. వెన్నెముక శరీరంలో చాలా ముఖ్యమైన భాగం అని వేరే చెప్పక్కర్లేదు. రోజు వారీ జీవితంలో కూడా వెన్నుమక మనం చేసే పనుల భారాన్ని తనని తాను మలచుకుంటూ భరిస్తుంది.

కానీ కడుపుతో ఉన్న సమయంలో దానిపై కలిగే ఒత్తిడి ఊహించలేనిది. బేబీ బరువు మరియు ఛాతీలో జరిగే ఇతర మార్పులు చాలా తీవ్రంగా దీనిపై పడతాయి. దాని వలన వెన్నెముకను ముందుకు లాగినట్లు అవుతుంది. ఈ కారణంగానే కడుపుతో ఉన్నవారు ఎల్లప్పుడూ నడుంనొప్పని బాధపడతారు.

చిట్కా ; చిన్నపాటి వ్యాయామాలు, యోగా నొప్పి తగ్గటంలో సాయపడతాయి. మీరు కూర్చునే, నిల్చొనే,పడుకునే స్థానాల పట్ల జాగ్రత్తగా ఉండండి. దీనివలన మీ వెన్నెముకకి ఏ అపాయం ఉండదు.

కళ్ళు

కళ్ళు

గర్భసమయంలో కళ్ళపై ఏ ప్రభావం పడదని మీరు అనుకోవచ్చు. కానీ చాలామంది స్త్రీలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తమ చూపులో మార్పు వచ్చిందని చెప్తారు. ఇది ఎందుకంటే కంటిలోని కనుగుడ్డు వంపు ప్రెగ్నెన్సీలో కొంచెం మారుతుంది. ఈ మార్పులు సాధారణంగా బిడ్డ పుట్టగానే మామూలయిపోతాయి. కొన్ని కేసులలో స్త్రీలు కళ్ళజోడులు లేదా అలాంటి చికిత్సలకి వెళ్లాల్సి ఉంటుంది.

చిట్కా ;కంటి వ్యాయామాలు చేయండి, దాని వలన కనుగుడ్లు తమ అసలు స్థితికి సులభంగా తిరిగొచ్చే వెసులుబాటు ఉంటుంది. ఇంకా నీటి శాతం శరీరంలో తగ్గనివ్వద్దు.

English summary

What Happens To Your Organs During Pregnancy

What Happens To Your Organs During Pregnancy,During the 9 months of pregnancy, there are several body changes that occur. Little did we know the organs, especially in the torso of the woman, are squished and contorted beyond what you might think possible
Story first published: Wednesday, January 24, 2018, 8:30 [IST]
Subscribe Newsletter