ఆర్గాస్మిక్ చైల్డ్ బర్త్ అంటే ఏమిటి?

Subscribe to Boldsky

ఒక జీవికి ప్రాణం పోసి ఈ భూమి మీద అడుగుపెట్టేటట్టు చేయడం అనేది ఒక ఉత్కృష్టమైన అనుభవమని ప్రతి స్త్రీ అంగీకరిస్తుంది. ఎంతోమంది కఠినతరమైన ప్రసవవేదనను ఓర్చి ఒక బిడ్డకు జన్మనిచ్చినా గాని అది ఒక ఆనందకరమైన అనుభూతి.

బిడ్డ జన్మనివ్వడమనేది రెండు పరస్పర వైరుధ్యం కలిగిన భావనల సమాహారం. ఎంతో నొప్పిని దిగమింగి ఆనందాన్ని ఆహ్వానించే ఘట్టం అది. మీరు ఆర్గాస్మిక్ చైల్డ్ బర్త్ ను గురించి వినే ఉంటారు.కానీ అదేమిటో మీకు ఖచ్చితంగా తెలుసా? అది అనుభవంలోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా?

ప్రసవవేదన సమయంలో స్వయంతృప్తి నెరపటం మీకు, మీ బిడ్డకు చేటు కలిగిస్తుందా లేక ఆ సమయంలో భావప్రాప్తిని పొందటం మీ శరీరానికి విశ్రాంతిని ఇచ్చి స్వాంతన చేకూరుస్తుందా?

మీ ప్రసవాన్ని సంతోషకరమైన క్షణాలుగా ఎల్లప్పటికి నిలిచిపోయేలా మలుచుకోవలనుకుంటే ఆర్గాస్మిక్ చైల్డ్ బర్త్ గురించి తెలుసుకోండి.

childbirth

ఆర్గాస్మిక్ చైల్డ్ బర్త్ అంటే ఏమిటి?

ప్రసవమనేది భరించలేని నొప్పి, గంటల కొద్దీ నిరీక్షణ మరియు అంతులేని బాధతో కూడుకుని ఉంటుంది. కానీ ఇవే జన్మనిచ్చే క్షణాలను అన్నందోద్వేగపూరితంగా మారిపోతే?మీ ప్రసవాన్ని కూడా ఉల్లాసభరితంగా మలచుకోవాలనుకుంటే మీరు ఆర్గాస్మిక్ చైల్డ్ బర్త్ ను ఎంచుకోండి.

తల్లి జన్మనివ్వబోయే ముందు, శరీరంలో అధిక మొత్తంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇలా జరగడం వలన మాయ బయటపడే సమయంలో కొద్ది మొత్తంలోనే రక్తాన్ని కోల్పోతారు. స్త్రీలలో బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు, పాలు ఇచ్చేటప్పుడు మరియు కామోద్రేకం పొందేటప్పుడు ఆక్సిటోసిన్ స్థాయిలు అధికమవుతాయి.

ఆక్సిటోసిన్ ను "లవ్ హార్మోన్" అని కూడా పిలుస్తారు. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి అధిక భావోద్వేగాలకు లోనవుతుంది. ఇది శరీరంలో ఒక్కసారిగా ఆక్సిటోసిన్ విడుదల అవ్వటం వలన జరుగుతుంది. అదే విధంగా, శృంగారంలో పాల్గొనేటప్పుడు భావప్రాప్తి సమయంలో కలిగే అధికోద్వేగం కూడా ఆక్సిటోసిన్ వల్లనే.

ఆర్గాస్మిక్ బర్త్ ఎలా పొందాలి:

జననం మరియు భావప్రాప్తి పొందటం ఒకేలాంటి పరిస్థితుల్లో జరుగుతాయి. ఇది "లవ్ హార్మోన్" ప్రభావమే!

మీ భాగస్వామితో మీరు ఇతరులకు దూరంగా సన్నిహిత క్షణాలు గడిపేటప్పుడు ఆక్సిటోసిన్ స్ధాయి అధికమవుతుంది. కనుక దీనిని "షై హార్మోన్" అని కూడా అంటారు.

ప్రకాశవంతమైన లైట్ల సమక్షంలో ఆక్సిటోసిన్ స్థాయిలు తగ్గుతాయి. మసక వెలుతురులో అధికమవుతాయి. కనుక మీరు ఆర్గాస్మిక్ బర్త్ పద్ధతిలో కనుక జన్మనివ్వాలనుకుంటే మీ పరిసరాలు ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా విశ్రాంతి పొందటానికి అనుగుణంగా ఉండాలి. మీరు హాస్పిటల్ లో ఉన్నట్లయితే డాక్టర్లు, నర్సుల కోలాహలం మధ్య మీరు స్వయంతృప్తి పొందటానికి గాని లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా మెలగటానికి గాని ఇబ్బందిగా ఉంటుంది.

కనుక ఇటువంటి సందర్భంలో మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. మీరు కనుక ఆర్గాస్మిక్ బర్త్ పద్దతిలో బిడ్డను కనాలనుకుంటే ముందుగానే మీ డాక్టర్ కు తెలియజేసి వారి సలహాలు తీసుకోవాలి.

ఆర్గాస్మిక్ చైల్డ్ బర్త్ పద్ధతిలో జన్మనివ్వాలనుకునేవారు పరువుప్రతిష్ఠలనే అవరోధాలను దాటాలా?

ఆర్గాస్మిక్ చైల్డ్ బర్త్ చాలామందికి ఎంతో వివాదాస్పదమైన అంశంగా తోచినప్పటికీ, ఈ పద్ధతిలో ఎదురయ్యే అనుభవాలను గురించి బిడ్డకు జన్మనిచ్చిన మరియు జన్మనివ్వబోయే తల్లులు తప్పక తెలుసుకోవాలి.

ఈ పద్దతిలో ఎన్నో సామాజిక కట్టుబాట్లు ముడిపడి ఉన్నాయి. జన్మనిచ్చే సమయంలో భావప్రాప్తికి లోనవడం తప్పనే భావన సమాజంలో నెలకొని ఉంది. కానీ ఉల్లాసంగా బిడ్డకు జన్మనిచ్చే హక్కు ప్రతి తల్లికి ఉంది. ప్రసవ సమయంలో స్వయంతృప్తి చెందటం వలన మీ వేదనను తగ్గించడమే కాక మీకు మీ భాగస్వామికి ఆనందపూర్వకమైన క్షణాలను అనుభవంలోకి తెస్తుంది.

వివిధ అధ్యయనాల్లో, ప్రపంచ వ్యాప్తంగా కేవలం 0.3 శాతం మంది మహిళలలో మాత్రమే ఆర్గాస్మిక్ చైల్డ్ బర్త్ అనుభవములోకి వచ్చింది. దీనిని బట్టి ప్రపంచ నలుమూలలలో ఇంకా ఈ పద్దతిని నిషిద్దమైనదిగా భావిస్తున్నారని తెలియవస్తోంది.

childbirth

ఆర్గాస్మిక్ చైల్డ్ బర్త్ పద్ధతిలో జన్మనివ్వాలనుకోవడం నిషిద్దమా?

ఈ పద్ధతి తప్పు అన్న భావన మస్తిష్కంలో పాతుకుపోయిన వారిని మనం మార్చలేము. కానీ అటువంటి వారికోసం మీ ప్రసవాన్ని అనాయాసంగా మలచుకునే అవకాశాన్ని కోల్పోవలసిన అవసరం లేదు.

మీరు అటువంటి ఆలోచన ధోరణి ఉన్నవారిని మీ బాల్యం నుండి గమనిస్తూనే ఉండి ఉంటారు. కాలం మారింది. మీపై మీరు నమ్మకం ఉంచండి. మీకు సరైనది అనిపించే పద్ధతిని ఎన్నుకునే స్వేచ్ఛ మీకుంది.

ఆర్గాస్మిక్ చైల్డ్ బర్త్ పద్ధతిలో స్త్రీ ఖచ్చితంగా భావప్రాప్తిని అత్యున్నత స్థాయిలో పొందాలనే నియమం లేదు. దీని వెనుక ప్రసవేదనను మైమరపించి ఆనందకరమైన అనుభూతిని పంచాలనే ఆలోచన మాత్రమే ఉంది.

ఆఖరుగా, ఇది పూర్తిగా మీ సౌకర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మీ శరీరానికి వైద్యపరమైన సహాయం అవసరమా లేదా ఏకాంతంలో మీ భాగస్వామి సాన్నిహిత్యంలో ఉల్లాసభరితంగా క్షణాలలో మీ శరీరాన్ని ప్రసవానికి సిద్ధం చేయాలా అనే నిర్ణయం తీసుకునే అధికారం సంపూర్ణంగా మీకే ఉంది. అన్ని రకాల భావప్రాప్తులను ఒక గాటన కట్టలేము. కనుక మీ మనసు మెచ్చిన దానినే అనుసరించండి

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    What is orgasmic childbirth?

    Have you ever heard of Orgasmic Childbirth? Is masturbating during labour wrong for you and your baby? Does having an orgasm during labour soothe and relax your body? Orgasmic childbirth, also called ecstatic childbirth, is something that every woman who has or will experience childbirth should be aware of. .
    Story first published: Wednesday, March 28, 2018, 12:03 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more