For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమయంలో తలైతే ఆస్త్మా గురించి తెలుసుకోవలసిన విషయాలు

|

చాలా మంది గర్భిణీలు ముఖ్యంగా మొదటి లేదా మూడవ ట్రైమిస్టర్ దశలోని వారు శ్వాసకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆస్త్మా(క్రానిక్ లంగ్ డిసీజ్) అనేది అటువంటి బ్రీతింగ్ ప్రాబ్లెమ్స్ లో ఒకటి. గతంలో ఆస్త్మా ఎటాక్స్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ గర్భం దాల్చిన తరువాత ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ ఆర్టికల్ లో ప్రెగ్నెన్సీ సమయంలో తలైత్తే ఆస్త్మా గురించి తెలుసుకుందాం. ఆ తరువాత వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

లక్షణాలు అలాగే చిహ్నాలు:

ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే ఆస్త్మా లక్షణాలు సాధారణంగా తలెత్తే ఆస్త్మా లక్షణాల లాగానే ఉంటాయి. చెస్ట్ లో టైట్ నెస్ తో వీజింగ్ ను గర్భిణీలు ఎక్స్పీరియన్స్ చేసే ఆస్కారం ఉంది. శ్వాస సరిగ్గా అందకపోవడం జరుగుతుంది. అందువలన, గర్భిణీలు ఎక్కువగా అలసిపోయే ఆస్కారం ఉంది. గర్భిణీలలో ఇంతటి అలసట వారి ఆరోగ్యానికి మంచిది కాదు.

మరింత తీవ్రమైన సందర్భాలలో శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి. అప్పుడు, వారు తీవ్రమైన దగ్గుతో బాధపడతారు. అలాగే, ఆస్త్మా లక్షణాలనేవి అందరిలో ఒకేలా ఉండవు. ఒకవేళ, మీరు గతంలో ఆస్త్మాకు సంబంధించిన ఇబ్బందులెదురుకున్నట్లైతే మీరు ఇంహేలర్ తో పాటు మెడికేషన్ ను కొనసాగించవచ్చు. అయితే, ఈ విషయాన్ని మీ వైద్యునికి కచ్చితంగా తెలపండి.

ఇలా ఎందుకు జరుగుతుంది?

ఇలా ఎందుకు జరుగుతుంది?

ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరోన్ అనే హార్మోన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈస్ట్రోజెన్ అనేది ముక్కు దిబ్బడకు అలాగే సైనస్ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు నిర్ధారించారు.

అదే విధంగా, శ్వాసలో ఇబ్బందులనేవి ప్రొజెస్టెరాన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కూడా ఏర్పడుతాయి. ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ అనే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ యాక్టివ్ గా ఉత్పత్తి అవడం వలన ఆస్త్మా అనేది మరింత కాంప్లికేటెడ్ గా మారుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే ఆస్త్మా వలన గర్భస్థ శిశువుకు ప్రమాదమా?

ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే ఆస్త్మా వలన గర్భస్థ శిశువుకు ప్రమాదమా?

గర్భం దాల్చిన తరువాత శరీరం అనేక మార్పులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆస్త్మా అనేది గర్భిణీతో పాటు గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతుంది. ఆస్త్మా వలన గర్భిణీల రక్తపోటుపై ప్రభావం ఉండటంలో హైపెర్టెన్షన్ సమస్య తలెత్తి ప్రీఎక్లెమ్ప్సియాకి గురయ్యే ప్రమాదం ఉంది.

ప్రీ ఏక్లంప్సియా అనే ఈ అరుదైన కండిషన్ లో గర్భిణీల రక్తపోటు అధికమవుతుంది. దాంతో, గర్భస్థ శిశువు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపబడుతుంది. అంతేకాక, ఆస్త్మా వలన మార్నింగ్ సిక్ నెస్ సమస్య మొదటి ట్రైమిస్టర్ లో తలెత్తుతుంది. అలాగే, ప్రీ ఎక్లెమ్ప్సియా వలన లాస్ట్ ట్రైమిస్టర్ లో ప్రీటెర్మ్ లేబర్ బారిన పడే ప్రమాదం ఉంది.

కాబట్టి, ఆస్త్మాతో ఇబ్బంది పడే గర్భిణీలు తమ గర్భస్థ శిశువుకు ఆక్సిజన్ తగిన మోతాదులో అందుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఆస్త్మాతో గర్భిణీ ఇబ్బంది పడుతుందంటే గర్భస్థ శిశువుకు ఆక్సిజన్ సరిగ్గా అందటం లేదని అర్థం. ఇందువలన, తక్కువ బరువుతో పుట్టడం, నియోనాల్ హైపోక్సియా మరియు పేరినటల్ మోర్టాలిటీ ఇష్యూస్ వంటి సమస్యలు ఎదురవవచ్చు.

చికిత్స:

చికిత్స:

మొదటగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే నియంత్రణలో ఉన్న ఆస్త్మా అటు గర్భిణీలకు అలాగే ఇటు గర్భస్థ శిశువుకు ఏమాత్రం ఇబ్బందికరం కాదు. ఆ దశకు చేరుకునేందుకు వైద్యులు రెండు రకాల మెడికేషన్స్ ను సూచిస్తారు.

మొదటిది ప్రివెంటివ్ మెడికేషన్.

మొదటిది ప్రివెంటివ్ మెడికేషన్.

మొదటిది ప్రివెంటివ్ మెడికేషన్. ఇది ఆస్త్మా అటాక్స్ ని తగ్గించేందుకు గర్భిణీలకు ఇచ్చే మెడికేషన్. ఇంకొకటి రెస్క్యూ మెడికేషన్. ఆస్త్మా అటాక్స్ వచ్చినప్పుడు ఇబ్బందిని అధిగమించేందుకు ఇచ్చే మెడికేషన్.

ట్రీట్మెంట్ మెజర్ కింద గర్భిణీలకు తమ గర్భస్థ శిశువుల యాక్టివిటీస్ ను కనుగొనే విధంగా సూచనలు ఇస్తారు. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా వారు వెంటనే వైద్యులని సంప్రదించవచ్చు.

English summary

Pregnancy Induced Asthma: Symptoms and Tretament

One of the most common problems that pregnant women experience is asthma, which is seen to affect those women who do not have any history of asthma attacks. The feeling of shortness of breath may be experienced due to increased respiratory drive caused by progesterone. Proventil, ventolin and other types of albuterol are safe for use during most pregnancies.
Story first published: Thursday, September 6, 2018, 10:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more